ఈ రాశివారికి అన్నింటా సక్సెస్‌, మీదే పైచేయి..

Today Horoscope 26 10 2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.పాడ్యమి ప.3.24 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: స్వాతి ప.2.58 వరకు తదుపరి విశాఖ, వర్జ్యం: రా.8.24 నుండి 9.58 వరకు దుర్ముహూర్తం: తె.5.44 నుండి  6.23 వరకు (తెల్లవారితే గురువారం).

సూర్యోదయం :    6.00
సూర్యాస్తమయం    :  5.30
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: ఆకస్మిక ధనలబ్ధి. అనుకున్న కారక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు దగ్గరవుతారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో విధులు తేలికవుతాయి.

వృషభం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. భూములు కొనుగోలు చేసే వీలుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయి.

మిథునం: నిరుద్యోగులు కొంత నిరాశ చెందుతారు. పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఒడిదుడుకులు.

కర్కాటకం: రుణదాతల ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

సింహం: పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి. విందు వినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కన్య: చిన్ననాటి మిత్రులతో చర్చిస్తారు. పనులు నత్తనడకన సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు.

తుల: దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృశ్చికం: వ్యయప్రయాసలతో గడుస్తుంది. పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు సాగిస్తారు. బంధువులతో తగాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

ధనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. భూలాభాలు. ఉద్యోగాన్వేషణలో విజయం. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో పరిస్థితులు చక్కబడతాయి.

మకరం: శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అప్రయత్న కార్యసిద్ధి. ముఖ్య నిర్ణయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. బాధ్యతలు అధికమవుతాయి. ఆలోచనలు నిలకడగా సాగవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top