Today Horoscope: ఈ రాశి వారు శుభవార్తలు వింటారు

Today Horoscope 24 08 2022 - Sakshi

శ్రీ శుభకృత్‌నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణమాసం, తిథి: బ.ద్వాదశి ఉ.7.55 వరకు, తదుపరి త్రయోదశి నక్షత్రం: పునర్వసు ప.2.16 వరకు, తదుపరి పుష్యమి 

వర్జ్యం: రా.11.03 నుంచి 12.48 వరకు,
దుర్ముహూర్తం: ప.11.36 నుంచి 12.28 వరకు, 
అమృతఘడియలు: ప.11.37 నుంచి 1.22 వరకు.
 

సూర్యోదయం :    5.47
సూర్యాస్తమయం    :  6.18
రాహుకాలం :  ప.12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు కూడా చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.

వృషభం: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

మిథునం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. దైవదర్శనాలు.

కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. నూతనోత్సాహంతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

సింహం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. అనారోగ్యం.  ఉద్యోగయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.

కన్య: మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

తుల: బంధుమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

వృశ్చికం: పనులు మధ్యలో విరమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు.

ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ధనవ్యయం. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. ఆలయ దర్శనాలు.

మకరం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కుంభం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో ఆదరణ. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.

మీనం: రుణయత్నాలు సాగిస్తారు. మిత్రులతో మాటపట్టింపులు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top