ఈ రాశి వారికి జెట్‌ స్పీడ్‌తో పనులు పూర్తి, ధన లాభం

Today Horoscope 22-08-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణమాసం, తిథి: బ.ఏకాదశి పూర్తి (24గంటలు) నక్షత్రం: మృగశిర ఉ.9.07 వరకు, తదుపరి ఆరుద్ర వర్జ్యం: సా.6.21 నుండి 8.10 వరకు, దుర్ముహూర్తం: ప.12.27 నుండి 1.19 వరకు, తదుపరి ప.2.58 నుండి 3.48 వరకు అమృతఘడియలు: రా.12.32 నుండి 2.20 వరకు. 

సూర్యోదయం :    5.47
సూర్యాస్తమయం    :  6.20
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం: వ్యవహారాలు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం లభిస్తుంది. మీరు పడ్డ శ్రమ ఫలిస్తుంది. నూతన విద్య. ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృషభం: బాధ్యతలతో సతమతమవుతారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందిగా ఉండవచ్చు.

మిథునం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కర్కాటకం: వ్యవహారాలు మందగిస్తాయి. బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమాధిక్యం. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

సింహం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కన్య: చిన్ననాటి మిత్రులతో సంభాషిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

తుల: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆత్మీయులతో కలహాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో వివాదాలు.

వృశ్చికం: కొన్ని సమస్యలు వేధిస్తాయి. బంధువులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు: పరిస్థితులు అనుకూలిస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం. మిత్రుల చేయూత లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మకరం: మీ శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో చర్చలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం: పనుల్లో ప్రతిబంధకాలు. రుణాలు చేయాల్సిన పరిస్థితి. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం: సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరాశ.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top