Today Horoscope: ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం

Today Horoscope 20-05-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి బ.పంచమి రా.10.23 వరకు, తదుపరి షష్ఠి నక్షత్రం పూర్వాషాఢ ఉ.7.51 వరకు, తదుపరి ఉత్తరాషాఢ వర్జ్యం ప.3.17 నుండి 4.46 వరకు, దుర్ముహూర్తం ఉ.8.04 నుండి 8.54 వరకు, తదుపరి ప.12.20 నుండి 1.11 వరకు అమృతఘడియలు... రా.12.15 నుండి 1.43 వరకు.

సూర్యోదయం :    5.31
సూర్యాస్తమయం  :  6.21
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు
 

మేషం...ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. పనులు ముందుకు సాగవు. వృత్తి, వ్యాపారాలలో ఆటుపోట్లు.

వృషభం....మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగమార్పులు.

మిథునం...చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. కార్యసిద్ధి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వృత్తి, వ్యాపారాలలో పురోభివృద్ధి.

కర్కాటకం...ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

సింహం...మిత్రులతో అకారణ వైరం. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

కన్య...కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా ఉంటాయి.

తుల..వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. భూలాభాలు. వృత్తి, వ్యాపారాలలో ఉత్సాహం.

వృశ్చికం.....పనుల్లో ఆటంకాలు. ఆదాయానికి మించిన ఖర్చులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.

ధనుస్సు..శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో ఆదరణ. నూతన పరిచయాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి.

మకరం.....పనుల్లో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

కుంభం..రుణాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.

మీనం....కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. మిత్రుల కలయిక. వృత్తి,వ్యాపారాలలో పైచేయి సాధిస్తారు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top