Daily Horoscope Telugu: Today Horoscope 19-05-2022 - Sakshi
Sakshi News home page

Today Horoscope: ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు

May 19 2022 6:04 AM | Updated on May 19 2022 8:33 AM

Today Horoscope 19-05-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి బ.చవితి రా.12.50 వరకు, తదుపరి పంచమి నక్షత్రం  మూల ఉ.9.32 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం ఉ.8.03 నుండి 9.32 వరకు, తిరిగి సా.6.25 నుండి 7.55 వరకు దుర్ముహూర్తం ఉ.9.46 నుండి 10.38 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.46 వరకు, అమృతఘడియలు... రా.3.23 నుండి 4.53 వరకు.

సూర్యోదయం :    5.31
సూర్యాస్తమయం    :  6.21
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు
 

మేషం: దూరప్రయాణాలు. చర్చల్లో ప్రతిష్ఠంభన. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో  చికాకులు. ఇంటాబయటా ఒత్తిడులు.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. కీలక నిర్ణయాలు. పనులు చకచకా పూర్తి కాగలవు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

మిథునం: వివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. కాంట్రాక్టర్లకు అనుకూలం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

కర్కాటకం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో కలహాలు. దైవచింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. 

సింహం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలోచనలు కలసిరావు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం.

కన్య: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీసత్తా నిరూపించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. విందువినోదాలు. కార్యజయం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

తుల: వ్యవహారాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆరోగ్యభంగం.

వృశ్చికం: పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తులు సలహాలు పాటిస్తారు. వస్తులాభాలు.  ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

ధనుస్సు: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు సంభవం.

మకరం: ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి.

కుంభం: కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాలు పరిష్కారం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

మీనం: వ్యయప్రయాసలు. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement