
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: బ.దశమి రా.10.46 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: హస్త ఉ.6.31 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం: ప.2.43 నుండి 4.19 వరకు, దుర్ముహూర్తం: సా.3.56 నుండి 4.40 వరకు, అమృతఘడియలు: రా.12.54
నుండి 1.44 వరకు.
సూర్యోదయం : 6.28
సూర్యాస్తమయం : 5.25
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం.
వృషభం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. సోదరుల నుండి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాఇయ.
మిథునం: సన్నిహితుల నుండి సమస్యలు. కుటుంబంలో చికాకులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కర్కాటకం: పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. కార్యజయం. ఆస్తులు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమర్థత చాటుకుంటారు.
సింహం: పనుల్లో ప్రతిబంధకాలు. ఇంటాబయటా సమస్యలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మీ ఆలోచనలు నిలకడగా సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
కన్య : సమస్యల నుండి బయటపడతారు. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. దైవదర్శనాలు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
తుల: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థికంగా కొన్ని సమస్యలు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.
వృశ్చికం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.
ధనుస్సు: ఇంటర్వ్యూలు అందుకుంటారు. ఎంతటి పనినైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో చిరు మార్పులు.
మకరం: వ్యవహారాలలో అవాంతరాలు. బంధుమిత్రులతో తగాదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
కుంభం: కొన్ని పనులలో జాప్యం. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి. కుటుంబబాద్యతలు పెరుగుతాయి. నిరుద్యోగులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉండవచ్చు.
మీనం: శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పాతమిత్రులను కలుసుకుంటారు. కార్యజయం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.