
ఈ రాశివారు మంచి వార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. ఇంకా..
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం,
సూర్యోదయం : 6.09
సూర్యాస్తమయం : 5.21
తిథి: బ.దశమి పూర్తి (24గంటలు),
నక్షత్రం: పుబ్బ రా.8.30 వరకు, తదుపరి ఉత్తర,
వర్జ్యం: తె.4.03 నుండి 5.44 వరకు (తెల్లవారితే శనివారం),
దుర్ముహూర్తం: ఉ.8.22 నుండి 9.07 వరకు
తదుపరి ప.12.06 నుండి 12.51 వరకు,
అమృతఘడియలు: ప.1.34 నుండి 3.20 వర కు.
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు
మేషం: ఆర్థిక లావాదేవీలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. ఆరోగ్య సమస్యలు.ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
వృషభం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలలో చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సాధారణ పరిస్థితి.
మిథునం: రుణబాధలు, కుటుంబసమస్యలు తీరతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో హోదాలు.
కర్కాటకం: శ్రమ మరింత పెరుగుతుంది. అనుకున్న పనుల్లో అవాంతరాలు. ఆరోగ్య సమస్యలు. ఆకస్మిక ప్రయాణ సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
సింహం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కన్య: పనులు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.
తుల: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.
వృశ్చికం: ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రముఖుల నుండి ముఖ్య సందేశం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
ధనుస్సు: ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. పనుల్లో ప్రతిబంధకాలు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
మకరం: శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. బంధువులతో తగాదాలు. వ్యవహారాలలో ప్రతిబంధకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కుంభం: నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ ఊహలు నిజం కాగలవు.
మీనం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.