
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: బ.నవమి రా.10.44 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: హస్త పూర్తి (24గంటలు), వర్జ్యం: ప.2.13 నుండి 3.55 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.27 నుండి 7.55 వరకు వరకు, అమృతఘడియలు: రా.8.53 నుండి 10.22 వరకు; రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు; సూర్యోదయం 6.31; సూర్యాస్తమయం 5.28.
మేషం: ఆకస్మిక ధనలాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పూర్వవైభవం.
వృషభం : సన్నిహితులతో విభేదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమాధిక్యం. పనులలో తొందరపాటు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.
మిథునం: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
కర్కాటకం: కొత్త విషయాలు తెలుస్తాయి. పాతమిత్రులను కలుసుకుంటారు. ధనలాభం. ఆస్తులు కొనుగోలులో పురోగతి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి.
సింహం: పరిస్థితులు అనుకూలించవు. బాధ్యతలు అధికమవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణస్థాయిలో ఉంటాయి.
కన్య: ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త మార్పులు.
తుల: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
వృశ్చికం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ధన, వస్తులాభాలు. మిత్రుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
ధనుస్సు: నూతన ఉద్యోగప్రాప్తి. సోదరులతో సఖ్యత. చర్చలు సఫలం. విందువినోదాలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
మకరం: ముఖ్య పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. బాధ్యతలు అధికమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
కుంభం: ఆస్తుల వివాదాలు చికాకు పరుస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు. మానసిక అశాంతి. ధనవ్యయం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
మీనం: దూరప్రాంతాల నుండి శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పనుల్లో విజయం. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.