
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి: బ.అష్టమి తె.4.10 వరకు (తెల్లవారితే గురువారం) తదుపరి నవమి, నక్షత్రం: ఆశ్లేష సా.4.31 వరకు తదుపరి మఖ, వర్జ్యం: తె.5.36 నుండి 7.21 వరకు (లె ల్లవారితే గురువారం), దుర్ముహూర్తం: ప.11.21 నుండి 12.06 వరకు అమృతఘడియలు: ప.2.46 నుండి 4.31 వరకు.
సూర్యోదయం : 6.09
సూర్యాస్తమయం : 5.21
రాహుకాలం : ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుంచి 9.00 వరకు
మేషం: ఆదాయం కంటే ఖర్చులు అధికం. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సోదరులు, మిత్రులతో విభేదాలు. వ్యాపారులకు లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగులకు అనుకోని మార్పులు సంభవం.
వృషభం: కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. బంధువుల నుంచి ధనలాభ సూచనలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగాల్లో పైహోదాలు.
మిథునం: మిత్రులతో అకారణంగా తగాదాలు. కొన్ని పనులు మధ్యలోనే విరమిస్తారు. కాంట్రాక్టులు చేజారి నిరాశ చెందుతారు. రాబడి అంతగా ఉండదు. ఉద్యోగాల్లో పనిభారం. వ్యాపారులకు సామాన్యలాభాలు.
కర్కాటకం: కార్యజయం. మొండిబాకీలు వసూలవుతాయి. సోదరులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
సింహం: కుటుంబంలో చికాకులు. రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు. అనారోగ్య సూచనలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు పెట్టుబడుల్లో ఆటంకాలు. ఉద్యోగులకు స్థానచలనం.
కన్య: పనులు సకాలంలో పూర్తి కాగలవు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు సంతోషకరంగా ఉంటుంది.
తుల: పనుల్లో విజయం సాధిస్తారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు. పాత మిత్రుల కలయిక. రాబడి ఆశాజనకం. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు కీలక మార్పులు.
వృశ్చికం: పనుల్లో అవాంతరాలు. కుటుంబంలో సమస్యలు వేధిస్తాయి. బంధువులతో అకారణంగా తగాదాలు. శారీరక రుగ్మతలు. రాబడి తగ్గే సూచనలు. వ్యాపారులకు అంచనాలు తప్పుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
ధనుస్సు: ముఖ్య పనులు మందకొడిగా సాగుతాయి. వివాదాలు చికాకు పరుస్తాయి. కష్టానికి ఫలితం దక్కదు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారుల యత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు చిక్కులు.
మకరం: దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు రాగలవు. ఉద్యోగులకు మరింత అనుకూలం.
కుంభం: ఉత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. అనుకోని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారులకు అనుకున్న లాభాలు లభిస్తాయి. ఉద్యోగులు విధులు సమర్ధవంతంగా నిర్వర్తిస్తారు.
మీనం: ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు వేధిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. రాబడి అంతగా కనిపించదు. వ్యాపారులకు అధికారుల రీత్యా ఒత్తిడులు. ఉద్యోగులకు అనుకోని మరింత పనిభారం.