Today Horoscope: ఈ రాశి వారికి పనులు విజయవంతంగా సాగుతాయి

Today Horoscope 16-05-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి పౌర్ణమి ఉ.10.06 వరకు, తదుపరి బ.పాడ్యమి నక్షత్రం విశాఖ ప.2.04 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం సా.5.53 నుండి 7.21 వరకు, దుర్ముహూర్తం ప.12.20 నుండి 1.11 వరకు తదుపరి ప.2.54 నుండి 3.45 వరకు, అమృతఘడియలు... ఉ.5.40 నుండి 7.12 వరకు, తిరిగి రా.2.55 నుండి 4.23 వరకు.

సూర్యోదయం :    5.32
సూర్యాస్తమయం    :  6.20
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం....సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి, ధనలాభాలు. పరిచయాలు విస్తృతమవుతాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.

వృషభం...పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మిథునం....రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనులలో తొందరపాటు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కర్కాటకం...ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

సింహం...సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనుల్లో విజయం. బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ఉన్నతస్థితి.

కన్య....కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో స్వల్ప అవాంతరాలు. ఉద్యోగాలలో మార్పులు.

తుల.... పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు రాగలవు. చిత్రమైన సంఘటనలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోగతి.

వృశ్చికం....దూరప్రయాణాలు. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు నిదానిస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు మరింత పెరుగుతాయి.

ధనుస్సు...ఆస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. యత్నకార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

మకరం....కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి కీలక సందేశం. విందువినోదాలు. కొత్త నిర్ణయాలు. భూ, వాహనయోగాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు.

కుంభం...సభలు,సమావేశాలలో పాల్గొంటారు. రుణదాతల ఒత్తిడులు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మీనం....వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top