
శ్రీశుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి: బ.చవితి రా.2.43 వరకు, తదుపరి పంచమి నక్షత్రం: కృత్తిక రా.7.27 వరకు, తదుపరి రోహిణి వర్జ్యం: ఉ.6.48 నుండి 8.31 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.48 నుండి 10.35 వరకు, తదుపరి ప.2.31 నుండి 3.16 వరకు అమృతఘడియలు: సా.4.55 నుండి 6.35 వరకు.
సూర్యోదయం : 5.55
సూర్యాస్తమయం : 5.38
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు
మేషం: పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.
వృషభం: శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. భూలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
మిథునం: వ్యయప్రయాసలతో గడుపుతారు. ప్రయాణాలను మార్చుకుంటారు. సోదరులు,మిత్రులు విభేదిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
కర్కాటకం: శ్రమ ఫలిస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో కీలక మార్పులు.
సింహం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. మీ ఆలోచనలకు పదునుపెడతారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకోని మార్పులు.
కన్య: వ్యవహారాలలో అవాంతరాలు. దుబారా ఖర్చులు. బాధ్యతలు మరింత పెరుగుతాయి. ప్రయాణాలు రద్దు కాగలవు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
తుల: కొన్ని పనులు వాయిదా వేస్తారు. శ్రమ పెరిగినా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొన సాగుతాయి.
వృశ్చికం: నూతన వ్యక్తులతో పరిచయాలు. ఆధ్యాత్మిక చింతన. పనులు చకచకా సాగుతాయి. ఉద్యోగ, వివాహయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
ధనుస్సు: మిత్రుల చేయూత లభిస్తుంది. అనుకున్న వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. శుభవార్తలు ఉత్సాహపరుస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.
మకరం: కొన్ని కార్యక్రమాలను విరమిస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.
కుంభం: రాబడి కొంత నిరాశ పరుస్తుంది. అనుకోని ప్రయాణాలు. భూముల ఒప్పందాలు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
మీనం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. మీ శ్రమ ఫలించే సమయం. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని పురోగతి.