శుభోదయం: ఈరోజు దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధనలాభం

Today Horoscope 13 09 2022 - Sakshi

సూర్యోదయం :    5.50
సూర్యాస్తమయం    :  6.04
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం.
తిథి: బ.తదియ ప.12.33 వరకు, తదుపరి చవితి
నక్షత్రం: రేవతి ఉ.9.24 వరకు, తదుపరి అశ్వని,

వర్జ్యం: తె.5.44 నుండి 7.22 వరకు (తెల్లవారితే బుధవారం),
దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.04 వరకు, తదుపరి రా.10.44 నుండి 11.33 వరకు

అమృతఘడియలు: ఉ.7.01 నుండి 8.36 వరకు.

మేషం: ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. అనుకోని ప్రయాణాలు.  వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.ఆరోగ్యసమస్యలు.

వృషభం: అనుకోని ధనలాభం. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వాహనయోగం. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో మరింత ఆదరణ.

మిథునం: నూతన వరిచయాలు. శుభకార్యాల నిర్వహణ. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆలయాలు దర్శిస్తారు. సంఘంలో విశేష గౌరవం. విద్యావకాశాలు.

కర్కాటకం: అదనపు ఖర్చులు. దూరప్రయాణాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు ముందుకు సాగవు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

సింహం: బంధువులతో స్వల్ప తగాదాలు. దూరప్రయాణాలు. అనుకున్న పనులలో ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని చికాకులు. ఆలయాల సందర్శనం. బంధువుల కలయిక.

కన్య: సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. వృత్తి,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి.

తుల: చేపట్టిన పనులలో విజయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విందువినోదాలు. సోదరులతో వివాదాలు తీరతాయి. శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

వృశ్చికం: కొన్ని కార్యక్రమాలను వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మార్పులకు అవకాశం. దైవచింతన.

ధనుస్సు: వ్యవహారాలలో  కొన్ని ఆటంకాలు. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య,కుటుంబసమస్యలు. ఆలయాల సందర్శనం.

మకరం: వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. వృత్తి,వ్యాపారాలు పుంజుకుంటాయి. సన్నిహితులు సాయం అందిస్తారు. నిరుద్యోగుల యత్నాలు సఫలం. వాహనయోగం.

కుంభం: కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. పనులు ముందుకు సాగవు.ఆర్థికంగా కొంత ఇబ్బంది. ఆస్తులపై ఒత్తిడులు. వ్యాపారాలు సామాన్యమే. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

మీనం: విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాభివృద్ధి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top