
ఈ రాశి వారికి దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు సఫలం.
సూర్యోదయం : 5.55
సూర్యాస్తమయం : 5.38
రాహుకాలం : ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుంచి 9.00 వరకు
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం, తిథి: బ.తదియ రా.1.53 వరకు..
తదుపరి చవితి
నక్షత్రం: భరణి సా.6.10 వరకు
తదుపరి కృత్తిక,
వర్జ్యం: లేదు,
దుర్ముహూర్తం: ప.11.24 నుండి 12.10 వరకు,
అమృతఘడియలు: ప.1.11 నుండి 2.54 వరకు అట్లతదియ.
మేషం: ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. స్థిరాస్తిలాభం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
వృషభం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యం సహకరించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
మిథునం: ఆప్తులతో కలహాలు. పనులు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.
కర్కాటకం: సన్నిహితులతో సఖ్యత. విచిత్ర సంఘటనలు. వస్తు, వస్త్రలాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త హోదాలు.
సింహం: కొన్ని వ్యవహారాలు శ్రమానంతరం పూర్తి. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు తప్పవు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
కన్య: మీరంటే కుటుంబంలో వ్యతిరేకత ఉంటుంది. అనుకోని ఖర్చులు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
తుల: పనులలో ఆటంకాలు తొలగుతాయి. సోదరులతో వివాదాలు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
వృశ్చికం: దూరప్రాంతాల నుండి శుభవార్తలు. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో కీలక మార్పులు.
ధనుస్సు: సన్నిహితుల నుండి సమస్యలు. దూరప్రయాణాలు. తీర్థయాత్రలు చేస్తారు. కాంట్రాక్టులు చేజారతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
మకరం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యసమస్యలు. విద్యార్థులకు నిరాశ. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
కుంభం: కొత్త వ్యక్తుల పరిచయాలు. సంఘంలో ఆదరణ. యత్నకార్యసిద్ధి. కొన్ని చర్చలు సఫలం. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మీ అంచనాల మేరకు నడుస్తాయి.
మీనం: వ్యవహారాలు కొన్ని నత్తనడకన సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సామాన్యం. ప్రయాణాలలో అవాంతరాలు. ఒప్పందాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు.