
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి పౌర్ణమి ఉ.7.36 వరకు, తదుపరి బ.పాడ్యమి తె.5.34 వరకు(తెల్లవారితే శనివారం), నక్షత్రం ధనిష్ఠ తె.4.07 వరకు(తెల్లవారితే శనివారం), వర్జ్యం ఉ.9.15 నుండి 10.47 వరకు దుర్ముహూర్తం ఉ.8.16 నుండి 9.07 వరకు, తదుపరి ప.12.31 నుండి 1.22 వరకు, అమృతఘడియలు... సా.6.18 నుండి 10.46 వరకు.
సూర్యోదయం : 5.45
సూర్యాస్తమయం : 6.26
రాహుకాలం : ఉ. 10.30 నుంచి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు
మేషం: పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆర్థిక ప్రగతి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
వృషభం: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆస్తి తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.
మిథునం: బాధ్యతలు పెరుగుతాయి. సోదరులు, సోదరీలతో విభేదాలు. ఖర్చులు అధికం. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
కర్కాటకం: సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. విందువినోదాలు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
సింహం: కుటుంబంలో వేడుకలు. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
కన్య: ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆస్తి తగాదాలు. సోదరులతో కలహాలు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
తుల: శ్రమాధిక్యం. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. బంధువుల నుండి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
వృశ్చికం: కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
ధనుస్సు: బంధువులతో వైరం. అనారోగ్యం. ఏ వ్యవహారమైనా ముందుకు సాగదు. మానసిక అశాంతి. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
మకరం: శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తులు సహాయపడతారు. ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగుతాయి.
కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో ఆటంకాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
మీనం: దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తులు దగ్గరవుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.