ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం, శుభవార్త అందుతుంది

Today Horoscope 12-02-2023 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.సప్తమి తె.5.12 వరకు (తెల్లవారితే సోమవారం), తదుపరి అష్టమి, నక్షత్రం: స్వాతి రా.10.34 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం: తె.4.08 నుండి 5.43 వరకు (తెల్లవారితే సోమవారం), దుర్ముహూర్తం: సా.4.25 నుండి 5.11 వరకు, అమృతఘడియలు: ప.1.43 నుండి 3.23 వరకు.

సూర్యోదయం        :  6.33
సూర్యాస్తమయం    :  5.56
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: శుభవార్తలు వింటారు. పనుల్లో విజయం. వాహనయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

వృషభం: నిరుద్యోగులకు అనుకూలం. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. శ్రమ ఫలిస్తుంది.

మిథునం: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. కొత్త రుణాలు చేస్తారు. శ్రమకు ఫలితం కనిపించదు. భూవివాదాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ.

కర్కాటకం: మిత్రులతో కలహాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.

సింహం: ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులు ఇబ్బందుల నుండి గట్టెక్కుతారు.

కన్య: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ పెరుగుతుంది. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

తుల: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక లాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. దైవదర్శనాలు. ఉద్యోగులకు మంచి గుర్తింపు.

వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. శ్రమా«ధిక్యం. అనారోగ్యం. బంధువులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. కుటుంబంలో ఒత్తిడులు.

ధనుస్సు: యత్నకార్యసిద్ధి.  మిత్రులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

మకరం: కొత్త వ్యక్తుల పరిచయం. ఆకస్మిక ధనలాభం. బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కుంభం: రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు చికాకు పరుస్తాయి.

మీనం: కుటుంబసమస్యలు. అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగాలలో కొంత  గందరగోళం.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top