ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం, వ్యవహారాలలో విజయం

Today Horoscope 1-10-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం, తిథి: శు.షష్ఠి రా.8.39 వరకు తదుపరి సప్తమి, నక్షత్రం: జ్యేష్ఠ తె.4.01 వరకు (తెల్లవారితే ఆదివారం), తదుపరి మూల, వర్జ్యం: ఉ.10.39 నుండి 12.10 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.55 నుండి 7.30 వరకు అమృతఘడియలు: రా.7.41 నుండి 9.11 వరకు.

సూర్యోదయం :    5.53
సూర్యాస్తమయం    :  5.49
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

మేషం: రుణయత్నాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

వృషభం: సన్నిహితుల సాయం అందుతుంది. విద్యార్థులకు శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. నూతన పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మిథునం: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనులు చకచకా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

కర్కాటకం: ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. పనులు మందకొడిగా సాగుతాయి. అనుకోనిసంఘటనలు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం.

సింహం: మిత్రులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. పనులు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు.

కన్య: పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. వస్తు, వస్త్రలాభాలు. ఇంటర్వ్యూలు అందుతాయి. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

తుల: పనుల్లో ఆటంకాలు. వ్యవహారాలు ముందుకు సాగవు. మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

వృశ్చికం: నూతన పరిచయాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ధనుస్సు: పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ముఖ్య నిర్ణయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మకరం: బంధువులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం: సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మీనం: వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. మిత్రులు, బంధువులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం.
 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top