ఇవాళ్టి దినఫలం: ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకం.. మిగతా రాశులవారికి ఎలాగ ఉందంటే..

Today Horoscope 09 12 2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్రవారం
సూర్యోదయం 6.22; సూర్యాస్తమయం 5.22. 

తిథి: బ.పాడ్యమి ఉ.9.34 వరకు, తదుపరి విదియ, నక్షత్రం: మృగశిర ప.1.54 వరకు, తదుపరి ఆరుద్ర,
వర్జ్యం: రా.11.04 నుండి 12.51 వరకు,
దుర్ముహూర్తం: ఉ.8.34 నుండి 9.16 వరకు,
తదుపరి ప.12.14 నుండి 12.56 వరకు,

అమృతఘడియలు: తె.5.13 నుండి 6.57 వరకు (తెల్లవారితే శనివారం);
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు,
యమగండం : ప.3.00 నుండి 4.30 వరకు;

మేషం: కీలక నిర్ణయాలు. విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వివాదాల పరిష్కారం. వాహనయోగం. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు అధిగమిస్తారు.

వృషభం: పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. విందువినోదాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.

మిథునం: ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కర్కాటకం: కుటుంబసభ్యులతో అకారణ వైరం. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో గందరగోళం.

సింహం: ఆర్థిక విషయాలలో పురోగతి. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు. ఉద్యోగాన్వేషణలో విజయం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో  అనుకూల పరిస్థితి.

కన్య: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పొందుతారు.

తుల: పనులు మధ్యలో వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని ఆటంకాలు.

వృశ్చికం: పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువిరోధాలు. దూరప్రయాణాలు. అనుకోని ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో బాధ్యతలు.

ధనుస్సు: కుటుంబసభ్యులతో సఖ్యత. విందువినోదాలు. బంధువుల కలయిక. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు.

మకరం: ఆర్థిక లాభాలు. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

కుంభం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. బంధువుల నుంచి సమస్యలు. పనులు వాయిదా. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు.

మీనం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. పనులలో ఆటంకాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top