ఈ రాశివారికి ధనవ్యయం.. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

Today Horoscope 09-10-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం తిథి: పౌర్ణమి రా.2.23 వరకు, తదుపరి బ. పాడ్యమి, నక్షత్రం: ఉత్తరాభాద్ర సా.5.16 వరకు, తదుపరి రేవతి వర్జ్యం: లేదు దుర్ముహూర్తం: సా.4.05 నుండి 4.53 వరకు 

సూర్యోదయం        :  5.55
సూర్యాస్తమయం    :  5.41
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు
 

మేషం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఎంత శ్రమించినా ఫలితం ఉండదు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

వృషభం: గతం గుర్తుకు వస్తుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ చూరగొంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మిథునం: నూతన ఉద్యోగాలలో చేరతారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కర్కాటకం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణబాధలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

సింహం: సన్నిహితులతో విభేదిస్తారు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కన్య: కొన్ని వివాదాల నుండి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పాతమిత్రుల కలయిక. బాకీలు వసూలవుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

తుల: రుణ విముక్తి లభిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి.

వృశ్చికం: బాధ్యతలు మరింత  పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు రద్దు చేస్తారు. సోదరులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

ధనుస్సు: ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. పనులు వాయిదా పడతాయి. ఆరోగ్యం సహకరించదు. రుణబాధలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు. 

మకరం: అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు రాగలవు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ధనప్రాప్తి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కుంభం: పరిచయాలు మరింత పెరుగుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యావకాశాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మీనం: వ్యవహారాలు నిదానిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. శ్రమ తప్పదు. ఆరోగ్యం మందగిస్తుంది. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top