ఇవాళ్టి దినఫలం: ఈ రాశివారికి ఆకస్మిక ధనలాభం.. ఇంకా మిగతా రాశులవారికి ఎలాగ ఉందంటే..

Today Horoscope 08 12 2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, గురువారం
సూర్యోదయం 6.22; సూర్యాస్తమయం 5.22.

తిథి: పౌర్ణమి ఉ.8.10 వరకు, తదుపరి బ.పాడ్యమి,
నక్షత్రం: రోహిణి ఉ.11.55 వరకు, తదుపరి మృగశిర,
వర్జ్యం: సా.5.56 నుండి 7.41 వరకు,
దుర్ముహూర్తం: ఉ.10.01 నుండి 10.44 వరకు
తదుపరి ప.2.25 నుండి 3.10 వరకు,
అమృతఘడియలు: ఉ.8.27 నుండి 10.10 వరకు ;
రాహుకాలం : ప.1.30 నుండి 3.00 వరకు,
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు;  

మేషం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. కొత్తగా రుణయత్నాలు. ఇంటాబయటా చికాకులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు. అనారోగ్యం.

వృషభం: పనులు సాఫీగా పూర్తి కాగలవు. ఆర్థిక ప్రగతి. రుణబాధలు తొలగుతాయి. వస్తు, వస్త్రలాభాలు. దైవదర్శనాలు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి.

మిథునం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు. ఆస్తి తగాదాలు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు బదిలీలు.

కర్కాటకం: ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. ఆహ్వానాలు అందుతాయి. కార్యజయం. విందువినోదాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం: నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు సకాలంలో పూర్తి. వ్యాపారాలు ఉత్సాహంగా  సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.

కన్య: వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆ«ధ్యాత్మిక చింతన. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు మార్పులు.

తుల: కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు చికాకులు.

వృశ్చికం: నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. కొత్త పనులకు శ్రీకారం. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు సేవలకు గుర్తింపు.

ధనుస్సు: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఇంటర్వ్యూలు అందుతాయి. ఆస్తిలాభం. కొన్ని నిర్ణయాలు  తీసుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి.

మకరం: వ్యయప్రయాసలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శ్రమ పెరుగుతుంది. దూరప్రయాణాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు చిక్కులు.

కుంభం: బంధువర్గంతో తగాదాలు. వృథా ఖర్చులు. పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

మీనం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. ఆస్తిలాభం. వ్యాపార విస్తరణయత్నాలు .. ఉద్యోగులకు అనుకూల మార్పులు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top