
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి శు.నవమి ప.1.10 వరకు, తదుపరి దశమి నక్షత్రం చిత్త ఉ.8.09 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం ప.1.34 నుండి 3.07 వరకు, దుర్ముహూర్తం ఉ.8.10 నుండి 9.04 వరకు తదుపరి ప.12.29 నుండి 1.21 వరకు అమృతఘడియలు... రా.10.54 నుండి 12.28 వరకు.
సూర్యోదయం : 5.34
సూర్యాస్తమయం : 6.35
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు
మేషం: నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. విద్యా, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు.
వృషభం: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలించే సమయం.
మిథునం: పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
కర్కాటకం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. «దనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
సింహం: కార్యజయం. శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.
కన్య: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. వ్యాపార, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.
తుల: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. సేవలకు గుర్తింపు రాగలదు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.
వృశ్చికం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆర్థిక ఇబ్బందులు. ఇంటాబయటా చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.
ధనుస్సు: యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అరుదైన సన్మానాలు అందుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు.
మకరం: పనుల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకూల పరిస్థితి.
కుంభం: వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. సోదరులు, మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగులకు మార్పులు.
మీనం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు వాయిదా పడతాయి. ఆనారోగ్యం. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు విధుల్లో కొద్దిపాటి చికాకులు.