
వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపట్టింపులు
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు.అష్టమి రా.11.24 వరకు, తదుపరి నవమి నక్షత్రం స్వాతి ప.3.28 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం రా.8.54 నుండి 10.23 వరకు, దుర్ముహూర్తం ఉ.8.15 నుండి 9.08 వరకు తదుపరి ప.12.30 నుండి 1.23 వరకు అమృతఘడియలు... ఉ.6.54 నుండి 8.26 వరకు, వరలక్ష్మీ వ్రతం.
సూర్యోదయం : 5.42
సూర్యాస్తమయం : 6.29
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం : ప.3.00 నుంచి 4.30 వరకు
మేషం: అనుకున్న వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. ధనలాభం. మిత్రులతో వివాదాలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత మెరుగ్గా ఉంటాయి.
వృషభం: ఆస్తి వివాదాల నుండి గట్టెక్కుతారు. ఆత్మీయుల ద్వారా శుభవార్తలు. వాహనాలు కొంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
మిథునం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. సన్నిహితులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి.
కర్కాటకం: మిత్రులే శత్రువులుగా మారతారు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్పదు. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.
సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సమావేశాలకు హాజరవుతారు. ఆర్థికంగా బలపడతారు. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
కన్య: కుటుంబంలో ఒత్తిడులు. పనుల్లో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా మారుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.
తుల: శుభవర్తమానాలు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. మిత్రుల నుండి కీలక సందేశం. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
వృశ్చికం: రుణదాతలు ఒత్తిడులు తెస్తారు. ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో కొంత జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.
ధనుస్సు: బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ముఖ్యమైన పనులు సజావుగా సాగుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.
మకరం: కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. చర్చలు సఫలం. కీలక నిర్ణయాలు. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.
కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.
మీనం: అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.