
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: పౌర్ణమి రా.11.12 వరకు తదుపరి బ.పాడ్యమి, నక్షత్రం: పుష్యమి
ఉ.11.56 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: రా.2.08 నుండి 3.55 వరకు, దుర్ముహూర్తం: సా.4.23 నుండి 5.06 వరకు, అమృతఘడియలు: రా.12.44 నుండి 2.30 వరకు, మాఘ పౌర్ణమి.
సూర్యోదయం : 6.35
సూర్యాస్తమయం : 5.53
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం: వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆప్తులతో అకారణంగా విరోధాలు. శ్రమ తప్పదు. బాధ్యతలతో సతమతం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
వృషభం: సోదరుల నుండి శుభవార్తలు. వాహనాలు కొంటారు. కొన్ని వివాదాల నుండి గట్టెక్కుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించిన స్థాయిలో సాగుతాయి.
మిథునం: వ్యయప్రయాసలతో గడుపుతారు. దూరప్రయాణాలు ఆరోగ్య సమస్యలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.
కర్కాటకం: సన్నిహితులు, సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. మీ కృషి ఫలిస్తుంది. నిర్ణయాలపై అందరూ హర్షిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అడుగు ముందుకు వేస్తారు.
సింహం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. ఎంత కష్టించినా ఫలితం శూన్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
కన్య: సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ప్రముఖుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
తుల: పరిస్థితులు చక్కబడతాయి. ఆప్తులు మరింత దగ్గరవుతారు. ధనానికి లోటు రాదు. మీ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
వృశ్చికం: రుణభారాలు. ఆకస్మిక ప్రయాణాలు. విలువైన వస్తువులు జాగ్రత్తపర్చుకోండి. నిర్ణయాలలో తొందరవద్దు. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
ధనుస్సు: కష్టం మీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. సన్నిహితులతో వైరం. ఆస్తి వివాదాలు. అనారోగ్యం. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిత్రమైన మార్పులు.
మకరం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తులు సమకూరతాయి. వాహనాలు కొంటారు. కొన్ని బాకీలు కూడా వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.
కుంభం: ఊహించని రీతిలో ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభను చాటుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.
మీనం: శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహవంతంగా సాగుతాయి.