ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం, విందు వినోదాల్లో పాల్గొంటారు

Today Horoscope 04-02-2023 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: శు.చతుర్దశి రా.9.04 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం: పునర్వసు ఉ.9.22 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: సా.6.14 నుండి 7.58 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.35 నుండి 8.06 వరకు, అమృతఘడియలు: ఉ.6.39 నుండి 8.24 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 6.35, సూర్యాస్తమయం: 5.52. 

మేషం: అనుకున్న కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. ఆప్తులతో కలహాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణస్థాయిలో ఉంటాయి.

వృషభం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మీ అంచనాల మేరకు నడుస్తాయి.

మిథునం: చిన్ననాటి మిత్రుల కలయిక. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

కర్కాటకం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

సింహం: దూరప్రయాణాలు. ఆస్తుల విక్రయాలు విరమించడం మంచిది. సోదరులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. పుణ్యక్షేత్రాలు సందర్శనం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

కన్య: బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

తుల: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ఆప్తుల నుండి ధనప్రాప్తి. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలు అనూహ్యంగా మెరుగుపడతాయి.

వృశ్చికం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులో కలహాలు. ఎంత కష్టించినా ఫలితం శూన్యం. నారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.

ధనుస్సు: బంధువుల ద్వారా విమర్శలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ధనవ్యయం. కుటుంబంలో కొన్ని సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

మకరం: శుభవార్తా శ్రవణం. ఆప్తుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ధన, వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కుంభం: సన్నిహితులతో సత్సంబంధాలు. కుటుంబంలో సమస్యలు తీరే సమయం. ఆర్థికంగా మెరుగైన పరిస్థితి ఉంటుంది. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతోషం కలిగిస్తాయి.

మీనం: కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగక ఇబ్బందిపడతారు.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top