
ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో సమస్యలు.
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు.షష్ఠి రా.1.50 వరకు, తదుపరి సప్తమి నక్షత్రం హస్త సా.4.06 వరకు, తదుపరి చిత్త వర్జ్యం రా.12.04 నుండి 1.41 వరకు దుర్ముహూర్తం ప.11.40 నుండి 12.30 వరకు అమృతఘడియలు... ఉ.10.01 నుండి 11.37 వరకు.
సూర్యోదయం : 5.42
సూర్యాస్తమయం : 6.29
రాహుకాలం : ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుంచి 9.00 వరకు
మేషం: నూతన ఉద్యోగాలు సంపాదిస్తారు. ప్రముఖ వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనసౌఖ్యం. వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉపశమనం లభిస్తుంది.
వృషభం: వ్యయప్రయాసలు. బంధువులు, స్నేహితులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో ఒత్తిళ్లు. వ్యాపారులు కొంత నిదానం పాటించాలి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
మిథునం: అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. శారీరక రుగ్మతలు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. మానసిక అశాంతి. వ్యాపారులకు లాభాలు అనుమానమే. ఉద్యోగులకు పనిఒత్తిడులు.
కర్కాటకం: పలుకుబడి మరింత పెరుగుతుంది. కీలక సమాచారం రాగలదు. సోదరులు, స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు అనుకున్న హోదాలు సంపాదిస్తారు.
సింహం: సన్నిహితులు, స్నేహితులతో విభేదాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు వేధిస్తాయి. ముఖ్య కార్యక్రమాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగులకు పనిఒత్తిడులు.
కన్య: ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అందరిలోనూ గుర్తింపు రాగలదు. వాహనయోగం. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు.
తుల: కార్యక్రమాలలో వెనుకబాటు. ఆదాయం అంతగా కనిపించదు. దూరప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిళ్లు. వ్యాపారులు నిరాశ చెందుతారు. ఉద్యోగులకు బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
వృశ్చికం: రుణవిముక్తి లభిస్తుంది. ప్రముఖవ్యక్తులు పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారులకు ప్రోత్సాహం. ఉద్యోగులకు హోదాలు.
ధనుస్సు: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతాలు. బంధువుల నుంచి శుభవర్తమానాలు. అదనపు ఆదాయం సమకూరుతుంది. వస్తులాభాలు. వ్యాపారులకు లాభాలు తథ్యం. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి.
మకరం: ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారులకు పెట్టుబడుల్లో చిక్కులు. ఉద్యోగులు అదనపు విధులు చేపట్టాల్సి వస్తుంది.
కుంభం: స్నేహితులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యుల నుంచి మాటపడతారు. కార్యక్రమాలలో ఆటంకాలు. వ్యాపారులకు చికాకులు. ఉద్యోగులకు మార్పులు .
మీనం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.