
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి శు.తదియ రా.9.10 వరకు, తదుపరి చవితి నక్షత్రం ఆరుద్ర ప.1.46 వరకు, తదుపరి పునర్వసు వర్జ్యం రా.3.05 నుండి 4.50 వరకు, దుర్ముహూర్తం ఉ.9.46 నుండి 10.40 వరకు, తదుపరి ప.2.58 నుండి 3.50 వరకు అమృతఘడియలు... లేవు.
సూర్యోదయం : 5.28
సూర్యాస్తమయం : 6.27
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు
మేషం: కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది. వస్తులాభాలు. విద్యావకాశాలు. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారులు లాభాలపై సంతృప్తి చెందుతారు. ఉద్యోగులకు ఒక సమాచారం ఊరటనిస్తుంది.
వృషభం: స్నేహితులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. శారీరక రుగ్మతలు. కార్యక్రమాలలో అవాంతరాలు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులకు మార్పులుసంభవం.
మిథునం: పలుకుబడి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం. విందులువినోదాలు, వేడుకల్లో పాల్గొంటారు. రావలసిన సొమ్ము అందుతుంది. కార్యజయం. వ్యాపారులకు అధికలాభాలు. ఉద్యోగులకు శుభవర్తమానాలు.
కర్కాటకం: కుటుంబంలో వివాదాలు. రాబడి ఆశించిన విధంగా ఉండదు. శారీరక రుగ్మతలు. దేవాలయాలు సందర్శిస్తారు. దూర ప్రయాణాలు ఉంటాయి. వ్యాపారులకు కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.
సింహం: చిరకాల స్నేహితులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు మంచి గుర్తింపు.
కన్య: నూతన ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగస్తుల సేవలు గుర్తింపు పొందుతారు.
తుల: ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. బంధువులతో లేనిపోని తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రుణదాతల ఒత్తిడులు. వ్యాపారులకు నిరుత్సాహం. ఉద్యోగులకు శ్రమాధిక్యం.
వృశ్చికం: కుటుంబసమస్యలు. ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువర్గంతో తగాదాలు. అనారోగ్యం. వ్యాపారులకు అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.
ధనుస్సు: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు. ఉద్యోగులకు పదోన్నతులు.
మకరం: ఆదాయం సంతప్తినిస్తుంది. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. వాహనసౌఖ్యం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు లక్ష్యాలు సాధిస్తారు.
కుంభం: అప్పులు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు. బంధువులు,స్నేహితులతో విభేదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారులకు నిరుత్సాహం. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది.
మీనం: రాబడికి మించిన ఖర్చులు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఒక సమాచారం గందరగోళపరుస్తుంది. దూరప్రయాణాలు. స్నేహితులతో తగాదాలు. శారీరక రుగ్మతలు. వ్యాపారులకు బదిలీలు. ఉద్యోగులకు అదనపు పనిభారం.