
వరకట్న వేధింపులపై కేసు నమోదు
ఒంటిమిట్ట : మండలంలోని కొత్తమాధవరం గ్రామం అంకాలమ్మ గుడి వద్ద నివాసం ఉంటున్న చొప్పా జానకీ ప్రసన్న (21)ను వరకట్నం కోసం వేధిస్తున్నారని బుధవారం ఒంటిమిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. చొప్పా జానకీ ప్రసన్నకు ఏడు నెలల క్రితం చొప్పా సురేష్ అనే వ్యక్తితో ప్రేమ వివాహమైంది. వివాహం అయిన కొంతకాలం వరకు తన భర్త సురేష్ తనతో సఖ్యతగా ఉండేవాడని, కానీ మూడు నెలల నుంచి రూ. 5 లక్షలు కట్నం తీసుకురావాలని తన భర్త సురేష్, అత్త లక్షుమ్మ, మామ వెంకట సుబ్బయ్య, ఆడబిడ్డ మౌనిక వేధిస్తున్నారని తెలిపారు. ఈ వేధింపులు తాళలేక ఆమె నిద్రమాత్రలు మింగడంతో కడప రిమ్స్‌కు తరలించారు. అక్కడ ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఒంటిమిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.
ఒంటిమిట్ట రామయ్యను దర్శించుకున్న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయాన్ని బుధవారం తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కనగంటి విజయ్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆలయ ప్రదక్షిణ గావించి గర్భాలయంలో ఉన్న మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెంచిన వేతనాలు ఇవ్వాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప రిమ్స్ మెడికల్ కళాశాలలో దినసరి వేతనం కింద పనిచేస్తున్న వారికి పెంచిన వేతనాలను ఇవ్వాలని జిల్లా కార్మికశాఖ అధికారి ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్కిల్, సెమీ స్కిల్డ్, అన్‌స్కిల్డ్ కార్మికులుగా నిర్ణయించిన మేరకు వేతనాలను ఇవ్వాలని సూపర్‌వైజర్ ఎస్వీ సాయికృష్ణారెడ్డిని ఆదేశించారు.

వరకట్న వేధింపులపై కేసు నమోదు

వరకట్న వేధింపులపై కేసు నమోదు