
భీం విగ్రహ ఏర్పాటుకు ఎమ్మెల్యే ఆర్థికసాయం
ఇంద్రవెల్లి: మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఎదుట ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేయనున్న కుమురంభీం విగ్రహ ఏర్పాటుకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ రూ.లక్ష ఆర్థికసాయం అందజేశారు. ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఆదివాసీ రాయిసెంటర్ సార్‌మెడీలకు లక్ష రూపాయల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయిసెంటర్ సార్‌మెడీలు మెస్రం వెంకట్‌రావ్, దుర్గు, దేవ్‌షావ్, ఆదివాసీ సంఘాల నాయకులు దేవ్‌రావ్, కొట్నాక్ బారిక్‌రావ్, మెస్రం ఆనంద్‌రావ్, కోసేరావ్, తదితరులు పాల్గొన్నారు.