widow
-
కెప్టెన్ అన్షుమన్ సతీమణిపై వివాదాస్పద పోస్టు.. నెటిజన్‌పై కేసు
న్యూఢిల్లీ: కీర్తి చక్ర అవార్డు గ్రహీత దివంగత కెప్టెన్ అన్షుమన్‌సింగ్ సతీమణి స్మృతిసింగ్‌పై వివాదాస్పద పోస్టు పెట్టినందుకుగాను ఢిల్లీ పోలీసులు ఓ నెటిజన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఫిర్యాదు మేరకు నిందితునిపై ఇటీవలే అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్ 2024)సెక్షన్ 79, ఐటీ చట్టం సెక్షన్ 67 కింద కేసులు పెట్టారు. స్మృతిసింగ్‌పై సోషల్‌మీడియాలో వివాదాస్పద పోస్టు పెట్టిన వ్యక్తిని వెంటనే అరెస్టు చేయాలని ఎన్సీడబ్ల్యూ ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు ఒక లేఖ కూడా రాసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.గతేడాది సైన్యంలో విధి నిర్వహణలో ఉండగా సియాచిన్‌లో జరిగిన ఒక అగ్నిప్రమాదంలో అన్షుమన్ ప్రాణాలు కోల్పోయారు. చనిపోయే ముందు తన సహచరులను కాపాడినందుకుగాను అన్షుమన్‌కు కేంద్ర ప్రభుత్వం కీర్తి చక్ర పతకం ప్రకటించింది. ఈ పతకాన్ని ఈ మధ్యే జులై 5న రాష్ట్రపతి చేతుల మీదుగా అన్షుమన్ సతీమణి, మాతృమూర్తులు అందుకున్నారు. కాగా అన్షుమన్‌కు వివాహం జరిగిన తర్వాత కేవలం 5 నెలలకే ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలిచివేసింది. -
ఓ వృద్ధ మహిళ కోసం యూకేలో పోరాటం!
ఒక భారతీయ వృద్ధ మహిళ కోసం యూకేలో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతోంది. ఆమెను బ్రిటన్‌లోను ఉంచాలని పట్టుబడుతూ వేలాది మంది పోరాడుతున్నారు. ఆనైలైన్‌లో సైతం ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు వెల్లవలా వచ్చింది. ఆమె బ్రిటన్‌లోనే ఉండేందుకు అన్ని విధాల అర్హురాలని అంటూ ఓ మద్దతుదారుడు ఆమె తరుఫున పోరాడుతున్నాడు. ఇంతకీ ఎవరీ మహిళ? ఎందుకంతా క్రేజ్ అంటే.. అసలేం జరిగిందంటే..78 ఏళ్ల గుర్మిత్ కౌర్ 2009లో యూకేకి వచ్చారు. అప్పటి నుంచి స్మెత్విక్లోనే ఆమె నివాసం ఉంటోంది. బ్రిటన్ ఆమెను బహిష్కరించడంతో వందలాది మంది బిట్రన్ సిక్కు కమ్యూనిటీలు ఆమె కోసం గట్టిగా పోరాడుతున్నారు. జూలై 2020 నుంచి ప్రారంభమైన ఈ పోరాటానికి ఆన్లైన్లో సుమారు 65 వేల మందిదాక ఆ వృద్ధ మహిళకే మద్దతు తెలపడం విశేషం. యూకే ఆ మహాళను బహిష్కరించడానికి కారణం.. గుర్మిత్ కౌర్ తొలిసారిగా 2009లో ఒక వివాహానికి హాజరయ్యేందుకు యూకే వెళ్లింది. మొదట్లో తన కొడుకుతో కలిసి ఉండేది. క్రమంగా ఆమె తన కొడుకు కుటుంబం నుంచి దూరమయ్యాక అపరిచిత వ్యక్తుల దయపై ఆధారపడి జీవించేది. ఆ తర్వాత స్థానిక సిక్కు కమ్యూనిటీకి చెందిన స్వచ్ఛంద సంస్థ స్మెత్‌విక్‌లో పనిచేస్తూ అక్కడే ఆశ్రయం పొందింది. క్రమంగా ఆ స్వచ్ఛంద సంస్థ ఆమె నివాసంగా మారిపోయింది. ఆ మహిళకు ఎలాగో కుటుంబం లేదు అలాగే ఆమె సొంత గడ్డ భారతలోని పంజాబ్‌లో కూడా కుటుంబం లేదని ఆ స్వచ్ఛంద సంస్థ ఆమెను దత్తత తీసుకుంది. దీంతో గుర్మిత్ కౌర్ తాను ఇక్కడే ఉండేలా యూకే హోం కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. అందుకు యూకే హోం కార్యాలయం తిరస్కరించింది. ఆమెకు ఇక్కడ యూకేలో కుటుంబం లేదు అలాగే ఆమె సొంత గడ్డ పంజాబ్‌లోనూ కుటుంబం లేదు కానీ అక్కడ ఆమె ఇల్లు ఉంది. అక్కడ స్థానికులతో ఆఎ ఇంకా టచ్‌లోనే ఉన్నారు కాబట్టి ఆమె మళ్లీ అక్కడే తన జీవితాన్ని మొదలు పెట్టగలదు కావున ఇక్కడే తన మిగతా జీవితం గడపాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. 2019లో తొలిసారిగా వెలుగులోకి వచ్చిన ఈ కేసు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. కనివినీ ఎరుగని రీతిలో గుర్మిత్ కౌర్‌ని ఇక్కడ ఉండేలా అనుమతివ్వాలంటూ పలువురు స్థానికులు పెద్ద ఎత్తున ఆమెకు మద్దతు ఇస్తూ పోరాడారు. "ఆమె చాలా మంచి వ్యక్తిత్వం గలది. దయార్థహృదయం గలది ఇలా సడెన్‌గా ఆమెను ఇండియాకు పంపించేస్తే ఎలా బతుకుంది. చాలా ఏళ్ల నుంచి ఇక్కడ ఉండటంతో పంజాబ్‌లోని ఆమె ఇల్లు పాడుబడిపోయి ఉంటుంది. పైగా ఆమె వృద్ధరాలు ఈ వయసులో పనిచేయలేదు. వండుకుని తినడం కూడా కష్టం కాబట్టి ఆ స్వచ్ఛంద సంస్థలోనే ఆశ్రయం పొంది తన శేష జీవితాన్ని గడుపుతుందని ఇమ్మిగ్రేషన్ సలహాదారు సల్మాన్ మీర్జా పిటిషన్ వేసి ఆమె తరుఫున పోరాడుతున్నారు. ఆమెకు వీసా లభించేలా సాయం చేస్తున్న వారిలో అతను ఒకరు అంతేగాదు ఆమెకు అనూహ్యంగా ఆన్లైన్లో కూడా విశేషమైన మద్దతు లభించింది. వారంతా ఆమె బ్రిటన్‌లోనే ఉండేలా వీసా జారీ చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒక సాధారణ వితంతు సిక్కు మహిళకు విశేషమైన ప్రజాధరణ లభించడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారి తెగ వైరల్ అవుతోంది. అంతేగాదు వెస్ట్మిడ్లాండ్స్లోని కొందరూ మద్దతుదారులు ఆమె బహిష్కరణపై యూకే హోం కార్యాలయంపై గట్టిగా పోరాడుతున్నారు. (చదవండి: అమ్మ ఎక్కడైనా అమ్మే) -
అది ‘వితంతువుల గ్రామం’.. పురుషుల అకాల మృతికి కారణమిదే..!
మన దేశంలోని రాజస్థాన్‌లోగల ఒక గ్రామం ‘వితంతువుల గ్రామం’గా పేరొందింది. ఈ గ్రామానికి చెందిన మగవారు అకాలంగా మృత్యువాత పడుతుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడి వితంతువులు కుటుంబాన్ని పోషించేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. రోజుకు 10 గంటల పాటు బండరాళ్లను పగులగొట్టే పనులు చేస్తూ ఎంతోకొంత సంపాదిస్తుంటారు. సరైన సమయంలో చికిత్స అందకపోవడంతో.. రాజస్థాన్‌లోని బూందీ జిల్లాలోని బుధ్‌పూర్ గ్రామంలో వితంతువులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఈ గ్రామంలో పురుషులు త్వరగా మృతి చెందడానికి గల కారణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ప్రాంతంలోని గనులలో పనిచేస్తున్న పురుషులు సిలికోసిస్ అనే అత్యంత ప్రమాదకర వ్యాధి బారిన పడుతున్నారు. సరైన సమయంలో వారికి తగిన చికిత్స అందకపోవడంతో అకాల మరణానికి గురవుతున్నారు. చిన్నారుల బాల్యం బుగ్గిపాలు ఇంటికి పెద్దదిక్కు మరణించడంతో ఆ ఇంటిలోని మహిళలపై కుటుంబ పోషణభారం పడుతుంది. బాధిత కుటుంబాల్లోని పిల్లలు కూడా తల్లికి చేదోడువాదోడుగా ఉంటారు. ఫలితంగా వారి బాల్యం బుగ్గిపాలవుతున్నదనే వాదనలు వినిపిస్తుంటాయి. ఈ ప్రాంతంలో వ్యాధి బారినపడిన పురుషులకు ఆ విషయం 50 శాతం వ్యాధి ముదిరాక తెలుస్తోంది. దీంతో చికిత్స పూర్తిస్థాయిలో అందేలోగానే వారు కన్నుమూస్తున్నారు. ఇక్కడి గనుల్లో పనిచేసే కూలీలకు ఆయా గనుల యజమానులు తగిన రక్షణ పరికరాలు కూడా అందించడం లేదనే వాదన వినిపిస్తుంటుంది. కార్మికుడు ఎవరైనా చనిపోయినా బాధిత కుటుంబాన్ని యజమానులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది కూడా చదవండి: పిల్లల ఫేమస్ కోసం తల్లి తాపత్రయం.. ఊహకందని చేదు అనుభవం ఎదురయ్యేసరికి.. -
వితంతువుతో వివాహేతర సంబంధం.. ఉల్లాసంగా గడిపారు.. చివరికి షాకింగ్ ట్విస్ట్
వేలూరు(తమిళనాడు): వివాహేతర సంబంధం కొనసాగించేందుకు నిరాకరించిందని వితంతు మహిళను హత్య చేసిన ఘటన వేలూరు జిల్లాలో జరిగింది. అనకట్టు తాలుకా వాయపందల్ గ్రామానికి చెందిన మలర్(28) భర్త వినోద్‌కుమార్ కొద్ది నెలల క్రితం మృతిచెందాడు. ఐదేళ్ల కుమారుడితో కలిసి అదే ప్రాంతంలో ఉంటోంది. ఈ నెల 17వ తేదీ వితంతు పింఛన్ కోసం వెళ్లిన మలర్ తిరిగి ఇంటికి రాలేదు. బుధవారం సాయంత్రం అటవీ ప్రాంతంలో మృతదేహంగా కనిపించింది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అనకట్టు పోలీసులు విచారణ చేపట్టారు. హత్య కేసులో అదే గ్రామానికి చెందిన షణ్ముగం(30)ను అరెస్ట్ చేసి విచారణ జరిపారు. అందులో షణ్ముగంకు భార్య, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మలర్ భర్త మృతి చెందడంతో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఉల్లాస జీవితాన్ని అనుభవించారు. ఈ విషయం గ్రామంలో తెలియడంతో గ్రామ పెద్దలు ఇద్దరిని హెచ్చరించి పంపారు. అయినా షణ్ముగం మలర్‌ను వదలకుండా వేధింపులకు గురిచేసినట్లు తెలుస్తోంది. ఈనెల 17వ తేదీ దారిలో వస్తున్న మలర్‌ను రమ్మని పిలవడంతో ఆమె నిరాకరించారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. షణ్ముగం పక్కనే ఉన్న రాతిని మలర్ తలపై వేసి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి వేలూరు సెంట్రల్ జైలుకు తరలించారు. చదవండి: వివాహేతర సంబంధం.. ఆ టైంలో గడిపిన వీడియోను ఆమె భర్తకు పంపి.. -
కోరిక తీరిస్తే.. అండగా ఉంటా!
అనంతపురం క్రైం: ఓ వితంతువుపై ట్రాన్స్‌కో ఉద్యోగి కన్నేశాడు. తన కోరిక తీరిస్తే కుటుంబానికి అండగా ఉంటానంటూ వెంటపడుతున్నాడు. తాను కష్టపడి సంపాదించిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించుకుంటానే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగే ప్రసక్తే లేదని ఆమె తెగేసి చెప్పింది. అయినా ఆ ఉద్యోగి వేధింపులు ఆపడం లేదు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలను అనంతపురం టూటౌన్ సీఐ రాఘవన్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. శారదనగర్‌లో ఉంటున్న ఓ మహిళ భర్త ఆరేళ్ల క్రితం మృతి చెందాడు. ఈమెకు ముగ్గురు ఆడ పిల్లలు సంతానం. భర్త మరణానంతరం కుటుంబ భారం ఆమెపై పడింది. అప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి వారికి సపర్యలు చేసి.. వచ్చే సంపాదనతో పిల్లలను పోషించుకుంటోంది. నడిమివంక ప్రాంతంలో నివాసముంటున్న వితంతు తల్లికి నాలుగోరోడ్డులో నివాసముంటున్న ట్రాన్స్‌కో కార్యాలయ అటెండర్ అబ్దుల్ నబీసాబ్ పరిచయముంది. అలా అన్ని విషయాలూ తెలుసుకున్న ఇతడు వితంతువుపై మోజుపడ్డాడు. తన కోరిక తీరిస్తే ఆమె కుటుంబ బాగోగులు చూసుకుంటానని నమ్మబలికాడు. ఇందుకు వితంతువును ఒప్పించే విషయంలో తల్లి కూడా ఒత్తిడి తీసుకొచ్చింది. అయితే ఇందుకు వితంతువు ససేమిరా ఒప్పుకోలేదు. నెల రోజుల క్రితం అబ్దుల్ నబీసాబ్ వితంతువు ఇంటికి వెళ్లి ఒప్పుకోవాలంటూ బలవంతపెట్టాడు. ఆమె ఈసారి ఘాటుగానే సమాధానమిచ్చింది. తాను ఇళ్లల్లో పని చేసుకునైనా పిల్లలను పోషించుకుంటాను తప్ప నీలాంటి వాడితో ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. మరోసారి వెంటపడి వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. అయినా అతడిలో మార్పు రాలేదు. మళ్లీ వేధింపులకు దిగుతుండటంతో వితంతువు టూటౌన్ పోలీస్ స్టేషన్ సీఐ రాఘవన్‌కు ఫిర్యాదు చేశారు. సీఐ ఆదేశాల మేరకు ఎస్ఐ అల్లా బకాష్ విచారణ చేపట్టిన అనంతరం ట్రాన్స్‌కో ఉద్యోగి అబ్దుల్ నబీసాబ్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వితంతు తల్లిపైనా కేసు నమోదు చేశారు. (చదవండి: ఆహార భద్రత చట్టం అమలు బాధ్యత అధికారులదే..) -
వితంతువులపై గ్రామ పంచాయితీ సంచలన తీర్మానం.. దేశంలోనే తొలి గ్రామంగా
ముంబై: భర్త చనిపోయిన వితంతు మహిళలు కూడా గౌరవంగా జీవించేలా ప్రభుత్వాలు కొత్తగా చట్టాలు తీసుకురావాలని రాష్ట్రంలోని మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విధవరాళ్లకు చేసే ఆచారాలను వ్యతిరేకిస్తూ ఇటీవల కొల్హాపూర్ జిల్లాలోని హెర్వాడ్ గ్రామం చేసిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని వితంతు మహిళలు కూడా గౌరవంగా జీవించే హక్కును కల్పించేలా కొత్తగా చట్టాన్ని తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా వితంతు తిరోగమన పద్ధతులకు స్వస్తి పలకాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వితంతు మహిళల పట్ల తిరోగమన ఆచారాలకు వ్యతిరేకంగా ఇటీవల కొల్హాపూర్ జిల్లాలోని హెర్వాడ్ గ్రామంలో ఈనెల 4న చేసిన తీర్మానానికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు ఇదేవిధమైన తీర్మానాలు తీసుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. హెర్వాడ్ మోడల్ ను రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు ఆదర్శంగా తీసుకోవాలని ఆ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. వింతతు మహిళల పట్ల చేసే ఆచార వ్యవహారాలైన గాజుల విరగ్గొట్టడం, వాటిని తీసివేయడం, మరెప్పుడూ ధరించకుండా నిషేధించడం, బొట్టు (సింధూరాన్ని) తీసివేయడం, మంగళసూత్రాన్ని తెంచివేయడం, కాలి మెట్టెల్ని తీసివేయడం వంటి ఆచారాల్ని ఇకపై పాటించకుండా షిరోల్ తాలూకాలోని హెర్వాడ్ గ్రామ పంచాయతీ తీర్మానించింది. వివాహ వేడుకలు, శుభకార్యాలు, మతపరమైన వేడుకలు, సామూహిక వేడుకల్లో పాల్గొనకూడదనే సంప్రదాయాన్ని హెర్వాడ్ పంచాయతీ తీర్మానంలో తీవ్రంగా వ్యతిరేకించింది. ఇకపై అటువంటి ఆచారాలను వితంతు మహిళలెవరూ గ్రామంలో ఎవరూ పాటించనవసరంలేదని తేల్చిచెప్పింది. ఆదర్శంగా నిలిచిన గ్రామ పంచాయతీ తీర్మానం ఈ గ్రామ పంచాయతీ తీసుకున్న తీర్మానం వితంతు మహిళలు మరింత గౌరవంగా జీవించే హక్కును కల్పించడంతో పాటుగా ఇతర గ్రామ పంచాయతీలకు, రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. హెర్వాడ్ గ్రామ పంచాయతీ తీసుకున్న తీర్మానం వెనుక షోలాపూర్ జిల్లాలలోని సంఘ సంస్కర్త మహాత్మ పూలే సామాజిక సంక్షేమ సంస్థకు చెందిన ప్రతినిధి ప్రమోద్ జింజాడే చాలా కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ...వితంతు మహిళలు గౌరవంగా జీవించాలని నిర్ణయం తీసుకున్న తొలి గ్రామంగా దేశ చరిత్రలోనే హెర్వాడ్ గ్రామం నిలిచిందని జింజాడే పేర్కొన్నారు. ఈ తీర్మానాన్ని మరో ఏడు గ్రామ పంచాయతీలు అనుసరించినట్లు ఆయన తెలిపారు. అయితే ఇటువంటి తీర్మానాలు కూడా దురాచారాలను రూపుమాపలేవని, వీటిని పూర్తిగా నిర్మూలించేందుకు చట్టాలు చేసి వాటిని పటిష్టంగా అమలు చేయడమే సమస్యకు అసలు పరిష్కారమని ఆయన తెలిపారు. దీనిపై చట్టాన్ని చేసేందుకు మండలి డిప్యూటీ చైర్పర్సన్ నీలం గొర్హెతో సమావేశమైనట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ విషయాన్ని అసెంబ్లీలోని రెండు సభల్లోనూ జూలైలో జరిగే వర్షాకాల సమావేశాల్లో చర్చకు పెట్టేలా చూస్తాననని ఆమె హామీనిచ్చినట్లు ప్రమోద్ జింజాడే తెలిపారు. చదవండి: రూ.లక్షకి రెండు లక్షలు.. అట్లుంటది మనతోని.. అయితే ఈ విషయానికి సంబంధించి కొత్త చట్టం చేయాలా లేదా పాత చట్టాల ద్వారానే అమలు చేయవచ్చా అనే అంశాన్ని న్యాయ విభాగం ఒకసారి పరిశీలించాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. వితంతు మహిళలపట్ల ఈ విధమైన దురాచారాలకు పాల్పడే గ్రామస్తులు, బయటవారిపై ఏడాది పాటు జైలు శిక్షను, రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించాలని ప్రమోద్ జింజాడే మండలి డిప్యూటీ చైర్మన్ గొర్హెకు ప్రతిపాదించారు. అదే బంధువులైతే 15 రోజుల నుంచి నెలరోజుల పాటు జైలు శిక్ష, రూ.5వేల నుంచి రూ.50వేలకు వరకు జరిమానా విధించా లని ఆయన ప్రతిపాదించారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో ఒక పర్యవేక్షణ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఆ కమిటీలో 50 శాతం మహిళలే ఉండాలని, అందులో సగంమంది వితంతువులు ఉండాలని పేర్కొన్నారు. -
బ్లాక్ ఫిలిం ఉంటే బుక్కైపోతారు జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: నిబంధనల ప్రకారం కారు అద్దాలకు ఎలాంటి తెరలు ఏర్పాటు చేసినా, అద్దాలకు టింటెడ్ ఫిలింను ఏర్పాటు చేసుకున్నా కఠిన చర్యలు తప్పవని జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ కె.ముత్తు హెచ్చరించారు. నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ చెక్‌పోస్టులో ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి కారు అద్దాలకు టింటెడ్ ఫిలిం అమర్చుకొని వెళ్తున్న వాహనదారులకు జరిమానాలు విధించి అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలింలను ఆయన తొలగింపజేశారు. కారులో ఎవరు వెళ్తున్నారు, ఎంత మంది వెళ్తున్నారు అనే దృశ్యాలు స్పష్టంగా కనిపించాలనే నిబంధన ఉన్నప్పటికీ కొంత మంది అవేవి పట్టించుకోకుండా నల్ల తెరలను ఏర్పాటు చేసుకొని యథేచ్ఛగా తిరుగుతున్నారని అలాంటి వారిని ఉపేక్షించమని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా శనివారం 93, ఆదివారం 82 వాహనాలను ఆపి బ్లాక్ ఫిలింలు తొలగింపజేశారు. ఆరు వాహనాలకు ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండగా వాటిని తొలగించారు. మీడియాకు సంబంధం లేకుండా ఆరు స్కూటర్లకు ప్రెస్ ఆని రాసి ఉందని వాటిని తొలగించామని తెలిపారు. (క్లిక్: ఐటీ కారిడార్లలో వజ్ర పరుగులు.. చార్జీలు ఎంతంటే?) -
నేను బతికే ఉన్నా! నా పింఛన్ నాకు ఇప్పియిండ్రి...
సాక్షి,పెద్దపల్లి(కరీంనగర్): నేను బతికే ఉన్నా నాకు ఇదివరకు ఇచ్చినట్టే వితంతు పింఛన్ ఇప్పియిండ్రి.. అంటూ పెద్దపల్లి మండలం అప్పన్నపేటకు చెందిన దాడిలక్ష్మి వితంతు మహిళ అధికారులను వేడుకుంటోంది. రూ.వెయ్యి పింఛన్ ప్రతినెలా ఇచ్చిన అధికారులు పింఛన్ మొత్తం రూ. 2016కు పెంచినప్పట్నుంచి ఆపేశారని వాపోయింది. చనిపోయినట్లుగా రికార్డుల్లో తప్పుగా నమోదుచేశారని తెలిపింది. ఈ క్రమంలో.. పింఛన్ నిలిచిపోయిందని యథావిధిగా తనకు పింఛన్ అందేలా అధికారులు చొరవతీసుకోవాలని వేడుకుంటోంది. ఆఫీసు ల చుట్టూ, కార్యదర్శి చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయానని, అయినా అధికారులు జాలిచూపడం లేదని దాడిలక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. -
దారుణం: లిఫ్టు అడిగినందుకు వితంతువుకు గుండు చేయించారు
అహ్మదాబాద్: ఓ వితంతువు.. వివాహితుడైన వ్యక్తిని లిఫ్టు అడిగి బైక్ మీద అతనితో ప్రయాణించినందుకు ఆరుగురు వ్యక్తులు ఆమెపై దాడికి పాల్పడ్డారు. అనంతరం గ్రామంలోకి తీసుకువెళ్లి శిరోముండనం చేశారు. ఈ దారుణమైన ఘటన గత శుక్రవారం గుజరాత్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సబర్కాంత జిల్లాలోని సంచేరి గ్రామానికి చెందిన ఓ వితంతు మహిళ.. తన ఇద్దరు కుమారులకు సంబంధించిన ఆధార్ కార్డులను బ్యాంక్ ఇవ్వడానికి హిమ్మత్ నగర్ పట్టణానికి వెళ్లారు. పని ముగించుకున్న ఆమె తిరిగి సంచేరి గ్రామానికి బయలుదేరారు. అయితే మార్గ మధ్యలో అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ఆమె లిఫ్టు అడిగింది. తెలిసిన మహిళ కావటంతో అతను ఆమెకు లిఫ్టు ఇచ్చాడు. గ్రామానికి వస్తున్న క్రమంలో రాయ్‌గడ్ గ్రామం వద్ద ఆరుగురు వ్యక్తులు ఒక్కసారిగా బైక్‌ను అడ్డగించి మహిళపై దాడిచేశారు. ఆమె దుస్తులు చించేశారు. తర్వాత వారిని గ్రామంలోకి తీసుకోవచ్చి.. ఆ వితంతు మహిళకు శిరోముండనం చేశారు. ఆమె సదరు వ్యక్తితో రహస్య సంబంధం పెట్టుకుందని ఆగ్రహంతో దాడిచేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. అందులో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళల ఉన్నారు. ఆ మహిళకు లిఫ్టు ఇచ్చిన వ్యక్తి.. నిందితుల్లోని ఓ మహిళ సోదరికి భర్త అని పోలీసులు గుర్తించారు. -
అమానవీయం: మహిళకు లిఫ్ట్ ఇచ్చినందుకు.. ఎంత పనిచేశారు..
గాంధీనగర్: గుజరాత్లో అమానవీయ సంఘటన చోటుచేసుకుంది. తెలిసిన వ్యక్తి.. మోటర్ బైక్ ఎక్కినందుకు ఆ మహిళను సదరు గ్రామస్థులు సూటిపోటి మాటలతో వేధించారు. అంతటితో ఆగకుండా.. ఆమెకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కూడా అంటగట్టారు. ఈ సంఘటన సబర్కాంత జిల్లాలోని సాంచేరీ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. హిమ్మత్ నగర్ పట్టణానికి సమీపంలోని సాంచేరీ గ్రామంలో 30 ఏళ్ల మహిళ జీవిస్తోంది. ఆమెకు నలుగురు పిల్లలు. కాగా, ఆమె భర్త అనారోగ్యం కారణంగా మృతి చెందారు. దీంతో కుటుంబ భారాన్ని తానే మోస్తుంది. ఈ క్రమంలో ఆమె.. గత నెల జులై 30న హిమ్మత్‌నగర్ పట్టణానికి బ్యాంక్ పని మీద వెళ్లింది. ఆ తర్వాత సాయంత్రం తన గ్రామానికి వెళ్తుంది. ఆ సమయంలో ఆమెకు తెలిసిన ఒక వ్యక్తి.. తన మోటర్ బైక్ ఎక్కాల్సిందిగా కోరాడు. దీంతో ఆమె తెలిసిన వ్యక్తి అని ఎక్కింది. కాగా, వారిద్దరు కలిసి సాంచేరీ గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో కొంత మంది వారిద్దరిని చూసి దూశించారు. సభ్యసమాజం తలదించుకునేలా వ్యవహరించారు. పాపం.. భర్త చనిపోయిన మహిళ అని కూడా జాలీలేకుండా విచక్షణ రహితంగా అవమానించారు. దీంతో బాధిత మహిళ తీవ్రంగా కుమిలిపోయింది. ఆరోపణలు చేసిన వారికి సరైన గుణపాఠం చెప్పాలనుకుంది. దీంతో ఆమె గ్రామంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అకారణంగా తనకు వివాహేతర సంబంధం అంటగట్టినందుకు వారిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీంతో, స్థానిక పోలీసులు.. వేదాంశి చౌహన్, రాజుజీ చౌహన్, కలుసిన్హ్ చౌహన్, రాకేంన్షి చౌహన్, సురేఖ చౌహన్, సోనాల్ చౌహన్ లను అదుపులోనికి తీసుకున్నారు. నిందితులో నలుగురు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
71వ ఏట రెండో పెళ్లి.. కూతురు కామెంట్స్ వైరల్
ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో.. తోడుగా మరో మనిషి ఉంటే బాగుండు అనిపిస్తుంది. ముఖ్యంగా జీవిత చరమాంకంలో మనిషికి తోడు ఎంతో అవసరం. బాధ్యతలు తీరి.. సంతానం వారి జీవితాల్లో బిజీగా ఉన్న వేళ భార్యభర్తలిద్దరు ఒకరికి ఒకరు తోడునీడగా నిలుస్తారు. మలి సంధ్యవేళ దంపతుల్లో ఎవరు ముందుగా ఈ లోకం వీడినా మిగతా వారి జీవితం శూన్యం అయిపోతుంది. ఆ వెలితిని ఎవరూ పూడ్చలేరు.. ఒక్క జీవిత భాగస్వామి తప్ప. ఒకప్పుడు అంటే మధ్యవయసులో పునర్వివాహం గురించి ఆలోచించాలంటే సమాజానికి జడిసి ఊరుకునేవారు. కానీ నేడు పరిస్థితులు మారాయి. వయసుతో సంబంధం లేకుండా రెండో వివాహానికి సిద్ధపడుతున్నారు. సమాజం సంగతి ఎలా ఉన్న కుటుంబ సభ్యులు మాత్రం వీరికి మద్దతిస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. భార్య చనిపోయిన 71 ఏళ్ల వృద్ధుడు.. ఓ వితంతు మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోని సదరు వృద్దుడి కుమార్తె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరలవుతోంది. నెటిజనులు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సదరు వృద్ధుడి భార్య ఐదు సంవత్సరాల క్రితం మృతి చెందింది. అప్పటి నుంచి అతడు ఒంటరిగానే జీవిస్తున్నాడు. ఈ క్రమంలో వృద్ధుడి కుమార్తె అదితి తన తండ్రిని మళ్లీ పెళ్లి చేసుకోమని చాలా సార్లు కోరింది. మొదట్లో దాటవేస్తూ వచ్చిన సదరు వృద్ధుడు చివరకు ఐదు సంవత్సరాల తర్వాత రెండో వివాహానికి అంగీకరించాడు. మరో వితంతు స్త్రీని పెళ్లి చేసుకున్నాడు. ఈ నెల 27న వీరి వివాహం జరిగింది. ఈ సందర్భంగా అదితి తన తండ్రి రెండో వివాహానికి సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ.. ‘‘ఇది చాలా క్లిష్టమైన అంశం. పునర్విహానికి సంబంధించి మన దేశంలో నిర్దుష్ట చట్టాలు ఏం లేవు. కొందరు మహిళలు మా నాన్న వెంట పడి డబ్బు కోసం దెయ్యాలాగా పీడించడం చూశాను. చివరకు ఆయన పునర్వివాహం చేసుకున్నారు. సమాజం వారిని ఆశీర్వదించి.. అక్కున చేర్చుకుంటుందా.. లేదా అనేది తెలియదు. కానీ నా తండ్రి ఒంటరిగా ఉండటం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు’’ అంటూ ట్వీట్ చేసింది. దీనిపై నెటిజనలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ‘‘చివరి దశలో ఉన్నప్పుడు తోడు చాలా అవసరం. మీరు చాలా మంచి పని చేశారు. కంగ్రాట్స్’’.. ‘‘ఇంత మంచి న్యూస్ షేర్ చేసినందుకు ధన్యవాదాలు’’.. ‘‘కొత్త ఇంటికి మీ అమ్మను ఆహ్వానించండి. వారిద్దరు ఒకరికొకరు కొత్త జీవితాన్ని ఇచ్చుకున్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థ ప్రకారం వివాహం అంటే కేవలం శృంగారం మాత్రమే కాదు.. అంతకు మించి ఎంతో విలువైనది. వీరిద్దరు ఒకరినొకరు చూసుకుంటారు.. తోడు, నీడగా నిలుస్తారు’’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు నెటిజనులు. చదవండి: తండ్రి రెండో పెళ్లిని కూతురు ప్రశ్నించొచ్చు: హై కోర్టు -
‘నష్ట పరిహారం అడిగితే అత్యాచారం చేశారు’
జార్ఖండ్‌లో 50 ఏళ్ల వితంతువుపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ అఘాయిత్యాన్ని మహిళ ప్రతిఘటించటంతో ఆమెను శారీరకంగా చిత్రహింసలు పెట్టి పైశాచిక ఆనందం పొందారు. జనవరి 7న(గురువార) జరిగిన ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన మహిళను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. తాజాగా ఆస్పత్రిలో చికిత్స తీసుకొని బాధితురాలు ఆదివారం డిశ్చార్జి అయ్యింది. ఈ క్రమంలో పోలీసులు బాధితురాలి స్టేట్మెంట్ను రికార్డు చేశారు. తన మేకను కొట్టినందుకు నష్ట పరిహారం ఇవ్వాలని కోరినందుకు నిందితులు తనపై అత్యాచారం చేశారని మహిళ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొంది. ఈ మేరకు ఎస్పీ రిషబ్ ఝా మాట్లాడుతూ.. అత్యాచార కేసులో మహిళ స్టేట్మెంట్ తీసుకున్నామని, దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చదవండి: ఆరేళ్ల చిన్నారిపై విద్య వలంటీర్ అఘాయిత్యం కాగా చత్రా జిల్లాలోని హంటర్ గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో 50 ఏళ్ల వితంతువు తన కుటుంబ సభ్యులతో జీవిస్తోంది. గురువారం రాత్రి సమయంలో బహిర్భూమికి వెళ్ళటానికి ఇంటికి కొంత దూరంలోని బహిరంగ ప్రదేశానికి వచ్చింది. ఆ సమయంలో అక్కడ ఉన్నముగ్గురు యువకులు వితంతువుపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె వారినుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో వారు ఆమెను హింసించి.. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి పారిపోయారు. బహిర్భూమికి వెళ్లిన మహిళ ఎంత సేపటికి రాక పోయేసరికి కుటుంబ సభ్యులు ఆమెకోసం గాలించారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను బహిరంగ ప్రదేశంలో గుర్తించారు. వెంటనే ఆమెను సమీపంలోని హంటర్ గంజ్ ప్రభుత్వాసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ఆమెకు ప్రాధమిక చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం బీహార్, గయలోని అనుగ్రా నారాయణ్ మగధ్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొంది ఆదివారం డిశ్చార్జి అయ్యింది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరోక వ్యక్తి పరారీలో ఉన్నాడు. -
అక్రమ సంబంధం.. వితంతువుపై దాడి
రాంచీ : వివాహేతర సంబంధాలు పెట్టుకొని మహిళలను హింసిస్తున్నారని ఆరోపిస్తూ ఓ వితంతువుపై 10 మంది గ్రామస్తులు దాడి చేసిన ఘటన జార్ఖండ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సెరైకేలా-ఖర్సావన్ జిల్లాలోని గెరాబెరా గ్రామానికి చెందిన ఓ వితంతువు అంగన్వాడీ వర్కర్‌గా పని చేస్తున్నారు. గత సోమవారం రాత్రి అదే గ్రామానికి చెందిన 10 మంది ఆమెపై దాడి చేశారు. ఇంట్లో ఉన్న వితంతువును ముగ్గురు మహిళలు బయటకు లాక్కెళ్లారు. అనంతరం మరో ఏడుగురితో కలిసి ఆమెపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టడమే కాకుండా.. ఉద్యోగం మానేసి గ్రామం నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. అనంతరం ఆమెను రోడ్డుపైనే వదిలేసి వెళ్లిపోయారు. కాగా, మంగళవారం ఉదయం వితంతువు పోలీసులను సంప్రదించి తనపై దాడి చేసి పది మందిపై ఫిర్యాదు చేశారు. టినేజ్ వయసున్న కొడుకుతో తాను గత కొన్నేళ్లుగా అదే గ్రామంలో నివసిస్తున్నానని, కొంతమంది తనపై కుట్రపన్ని దాడి చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అయితే గ్రామస్తులు మాత్రం ఆమె ప్రవర్తన చెడుగా ఉందని, పెళ్లైన వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకొని మహిళలను హింసిస్తున్నారని ఆరోపించారు. ఆమె ప్రవర్తన వల్ల ఓ మహిళ రెండు సార్లు ఆత్మహత్నాయత్నం చేసుకున్నారని అందుకే ఆమెపై దాడి చేశారని పేర్కొన్నారు. వితంతువు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తీవ్ర గాయాలైన ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మహిళ, యువకుడిని స్థంభానికి కట్టేసి..
ఉదయ్‌పూర్ : వితంతు మహిళతో పాటు ఆమె ప్రియుడిగా అనుమానిస్తూ ఓ యువకుడిని కరెంటు స్థంబానికి కట్టేసి మూడు గంటల పాటు దారుణంగా హింసించిన ఘటన రాజస్తాన్‌లో వెలుగుచూసింది. చిత్తోర్‌గఢ్ సమీపంలోని దుంగ్లా గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరు బాధితుల దుస్తులు చించివేసిన నిందితులు వారిని తీవ్రంగా గాయపరిచారు. ఘటన సమాచారం వెల్లడైన అనంతరం ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను బన్సీలాల్, సన్వ్రా, భగ్‌వాన్‌లుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుంగ్లాలో 3 ఏళ్ల కుమారుడితో కలిసి బాధిత మహిళ నివసిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఆమె ఇంటికి ఓ వ్యక్తి నిత్యావసరాలు అందించేందుకు రాగా, ఆ యువకుడితో ఆమెకు సంబంధం ఉందని అనుమానించిన గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. మహిళ ఇంటి నుంచి ఆమెను, యువకుడిని బయటకు లాక్కునివచ్చిన గ్రామస్తులు కరెంటు స్థంబానికి వారిని కట్టేసి దారుణంగా హింసించారు. నిందితులు మహిళ దుస్తులను చించారు. ఇక వీరిని నిందితులు తీవ్రంగా హింసిస్తున్నా చుట్టూ చేరిన వంద మంది మౌనం దాల్చారు. కొందరు గ్రామస్తులు నిందితులను వారించినా వారు వినలేదని స్ధానికులు తెలిపారు. స్ధానికులు కొందరు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. ఎస్పీ ఆదేశాలతో దుంగ్లా ఎస్హెచ్ఓ కేసు నమోదు చేసి బాధితులను వైద్య పరీక్షలకు పంపారు. ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చదవండి : వివాహితపై సామూహిక అత్యాచారం -
అమరవీరుల భార్యలకు అండగా!
ఒక సైనికుడు దేశం కోసం ప్రాణాలర్పించినప్పుడు దేశం అతడిని గౌరవిస్తుంది. ప్రజలు అతని జ్ఞాపకార్థం కొవ్వొత్తులను వెలిగించి, సంతాపం తెలియజేస్తారు. అంతటి వారి బాధ్యత తీరిపోతుంది. కానీ, యుద్ధ విషాదాన్ని ఆ సైనికుడి కుటుంబం జీవితాంతం భరిస్తుంది. తను భర్తను కోల్పోయిన దుఃఖాన్ని మర్చిపోయి అమరవీరుల భార్యల కష్టాన్ని తొలగించడానికి సిద్ధపడింది సుభాషిణి వసంత్. అమరవీరుల భార్యలతో ఒక ప్రాజెక్ట్‌లో భాగంగా నిధులు సేకరించడానికి సుభాషిణి వసంత్ బెంగళూరులోని ఓ కార్పొరేట్ కంపెనీకి వెళ్లింది. యునైటెడ్ బ్రూవరీస్ గ్రూపులోని ఒక అధికారి మాట్లాడుతూ ‘మమ్మల్ని బీరు వడ్డించమంటారా?!’ అని అడిగారు. ఆ మాటతో ఆమె అక్కడనుంచి నిశ్శబ్దంగా బయటకు వచ్చేసింది. దక్షిణ భారతదేశంలో అమరవీరుల భార్యల పట్ల అవగాహన ఎంత తక్కువగా ఉందో ఆమె ఆలోచించింది. తమ దేశం కోసం ప్రాణాలను అర్పించిన ఆ అమరవీరుల భార్యలు పొందవలసిన గౌరవం ఎక్కడా లభించదని అర్ధమైంది. దీంతో సుభాషిని అమరవీరుల వితంతువుల కోసం పనిచేయాలని నిర్ణయించుకుంది. ఈ ఆలోచనతోనే ‘ఆర్మీ వైవ్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ను ప్రారంభించింది. కర్ణాటక గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న జవాన్ల వితంతువులకు సహాయం చేయడానికి ఈ సంస్థ ఏర్పడింది. 31 జూలై 2007 న జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులతో పోరాడుతున్నప్పుడు సుభాషిని భర్త కల్నల్ వసంత వేణుగోపాల్ అమరుడయ్యాడు. భర్త మరణించిన మూడు నెలల తరువాత అమరవీరుల వితంతువుల జీవితాలకు కొత్త మార్గాన్ని ఇవ్వడమే ముఖ్య ఉద్దేశంగా సుభాషిని ‘వసంతరత్న ఫౌండేషన్ ఫర్ ఆర్ట్స్’ కు పునాది వేసింది. నిధుల కోసం నాటక ప్రదర్శన ఫౌండేషన్ ఏర్పాటుకు డబ్బు సేకరణ ఎలా చేయాలో మొదట అర్థం కాలేదు సుభాషికి. కొన్ని రోజుల మధనం తర్వాత ‘ది సైలెంట్ ఫ్రంట్’ అనే నాటకాన్ని రాసి ఢిల్లీ, బెంగళూరులో ప్రదర్శించింది. ఆ ప్రదర్శనకు వచ్చిన మొత్తాన్ని ఫౌండేషన్‌కి కేటాయించింది. కళలకు సంబంధించిన కార్యక్రమాలను రూపొందిస్తూ అమరవీరుల వితంతువులకు సుభాషిణి ఆశాకిరణంగా మారింది. అమర వీరుల భార్యలకు ఆర్థిక సహాయం చేయడంతో పాటు, వారు తమను తాము నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించింది. అందుకు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవడానికి ఈ సంస్థ సభ్యులు మహిళలకు సహాయం చేస్తుంటారు. సైనికులకు నివాళిగా! బెంగళూరులో క్లాసికల్ డాన్సర్‌గా సుభాషినికి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. వసంత వేణుగోపాల్‌తో పెళ్లయ్యాక 15 సంవత్సరాలలో ఎక్కువ భాగం సదాశివ్‌నగర్‌లో గడిపింది. ఆర్మీలో కీలకమైన పోస్టు కావడంతో దాదాపు ఏడేళ్లు భర్త నుంచి దూరంగానే ఉంది. ఈ సమయంలో తన కుటుంబాన్ని కలుసుకోవడం కూడా కష్టంగానే ఉండేది. అలాంటి పరిస్థితిలో కర్ణాటకలోని ఒక గ్రామీణ ప్రాంతానికి చెందిన 30 ఆర్మీ ఉద్యోగుల కుటుంబాలను కలిసింది సుభాషిని.. ‘అమర జవాన్ల ఇళ్లకు వెళ్లినప్పుడు వారి భార్యలకు సహకారం అవసరమని గ్రహించాను. అప్పుడే సైనికులకు నివాళిగా సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించాను. సైనికుల భార్యలకు న్యాయ, ఆర్థిక సహాయం అందాలన్నదే నా ఆశయం. ఆ తర్వాత పెగసాస్ ఇనిస్టిట్యూట్ తో కలిసి బెంగళూరు శివార్లలో మూడు రోజుల శిబిరాన్ని ఏర్పాటు చేశాను. ఇందులో ఆర్థిక, న్యాయ, మానసిక సలహాలు అందేలా ప్రణాళికలు రూపొందించాను’ అని తెలిపిన సుభాషిణి కృషికి 2016లో ‘నీరజ్ భనోట్’ అవార్డు లభించింది సాధారణ మహిళల మాదిరిగానే జవాన్ల భార్యలూ భర్తతో కలిసి ఇంట్లో అన్ని బాధ్యతలను నెరవేరుస్తారు. ఆ ఇంటి జీవితమే వారి ప్రపంచం. అటువంటి పరిస్థితిలో భర్త అమరవీరుడయ్యాక ఆమె ఒంటరిగా ఉన్నప్పుడు జీవితంలో శూన్యత ఏర్పడుతుంది. ఆ శూన్యతను పూరించడమే నా ప్రయత్నం’ అంటూ తన కార్యాకలాపాలను యధావిధిగా నిర్వరిస్తున్నారు సుభాషిణి వసంత్. -
వితంతువు పెళ్లికి ఒప్పుకోలేదని ఆమె ముందే..
భోపాల్ : వితంతువు పెళ్లికి నిరాకరించిందని ఆమె ముందే తుపాకీతో కాల్చుకొని చనిపోయాడో యువకుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో శనివారం జరిగింది. వివరాలు.. స్థానికంగా నివాసముండే ఓ మహిళ, భర్త చనిపోవడంతో తన కూతురితో అత్తమామల వద్ద ఉంటోంది. చిన్న వయసులోనే కొడుకు చనిపోవడంతో కోడలికి మరో పెళ్లి చేయాలని అత్తామామలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఛత్తార్పూర్కి చెందిన జితేంద్ర అనే యువకుడు ఆమెను ప్రేమిస్తూ, పెళ్లి చేసుకుంటానంటూ వెంటపడేవాడు. కానీ ఆమెకు ఇష్టం లేకపోవడంతో అతని పెళ్లి ప్రతిపాదనను తిరస్కరిస్తూ వచ్చింది. తిరస్కారాన్ని తట్టుకోలేకపోయిన జితేంద్ర ఆఖరుసారిగా అడిగి చూద్దామని శనివారం ఉదయం ఆమె ఉంటున్న ఇంట్లోకి వెళ్లి మళ్లీ పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. అయితే ఎప్పటిలాగే ఆమె తిరస్కరించడంతో కోపోద్రిక్తుడైన జితేంద్ర తన వద్దనున్న తుపాకితో కణతకు గురిపెట్టి కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తుపాకి శబ్దం విన్న స్థానికులు ఇంట్లోకి వచ్చి చూసేసరికి జితేంద్ర విగత జీవిగా పడిఉన్నాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు.అనంతరం స్థానికుల వాంగ్మూలం తీసుకున్న పోలీసులు వితంతు మహిళకు మాత్రం ఎలాంటి క్లీన్చిట్ ఇవ్వలేదు. కాగా, యువకుడి వన్ సైడ్ లవ్వే ఈ ఘటనకు కారణమని స్థానికులు పేర్కొన్నారు. -
ఆవిడకు 60.. అతడికి 15.. ఇద్దరికి పెళ్లి!!
సాక్షి, గుహవాటి: పదిహేనేళ్ల బాలుడు చిలిపిగా చేసిన రాంగ్ కాల్ అతడి జీవితాన్నే తారుమారు చేసింది. అస్సాంలోని గోల్‌పాడా జిల్లాకు చెందిన కుర్రాడు చదువు మధ్యలోనే ఆపేసి కార్మికుడిగా మారాడు. ఓ రోజు టైమ్‌పాస్ కాక రాంగ్ కాల్ చేశాడు. అవతలి నుంచి మాట్లాడింది ఆడ గొంతు కావడంతో డబుల్ హ్యాపీగా ఫీలయ్యాడు. ఇక ఇద్దరి మధ్య మాటలు కలిశాయి. రోజుకొకసారైనా మాట్లాడుకోంది ఇద్దరూ ఉండలేని పరిస్థితికి వచ్చారు. అలా నెలరోజులగా ఆమెతో ఫోన్ మాట్లాడటంతో నిండా ప్రేమలో మునిగిపోయాడు. ఇక ఆగలేక కచ్చితంగా ఆమెను కలవాలని ఆమె చెప్పిన ఆడ్రస్‌కు వెళ్లాడు. సీన్ కట్ చేస్తే స్టోరీ రివర్సయింది. అలా ఆమె చెప్పిన అడ్రస్‌కు వెళ్లి ఒకరినొకరు చూసుకోగా ఇద్దరూ షాక్‌కు గురయ్యారు. ఆమె బార్పేట జిల్లా సుఖూవాజార్కు చెందిన 60 ఏళ్ల వితంతువు. నెలరోజులుగా మాట్లాడుకున్నా ఇద్దరూ వయసుల గురించి మాట్లాడుకోకపోవడం గమనార్హం. ఈ వ్యవహారం తెలిసిన మహిళ బంధువులు, సన్నిహితులు, పొరుగింటివారు బలవంతంగా ఆ ఇద్దరికీ వివాహం చేశారు. తమకు ఇష్టం లేకుండా వివాహం చేశారని ఇరువురూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పిల్లల హక్కుల కమిషన్ దీనిపై విచారణకు ఆదేశించింది. అబ్బాయి మైనర్ అయివుంటే.. బలవంతంగా వివాహం చేసినవారిపై చట్టపరమైన శిక్షలు ఉంటాయని కమిషన్ పేర్కొంది. ఇక ఈ గొడవపై స్పందించిన గోల్‌పాడా డిప్యూటీ కమిషనర్ వార్నాలి డెకా.. ఆ ఇద్దరి పెళ్లి గురించి ఇప్పటివరకు తమ దృష్టికి రాలేదని, కానీ ఎవరైన దీనిపై విచారణ కోరితే దర్యాప్తు చేసి దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
బదిర మహిళపై జవాన్ల ఘాతుకం
పూణే : బదిర మహిళపై నలుగురు జవాన్లు దారుణానికి ఒడిగట్టిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. తనపై నలుగురు సైనిక సిబ్బంది పూణే ఆస్పత్రిలో లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితురాలు ఆరోపించారు. వితంతువైన బాధిత మహిళ ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు బాధితురాలిని బ్లాక్ మెయిల్ చేస్తూ నాలుగేళ్ల పాటు ఆమెపై లైంగిక దాడి కొనసాగించారని ఎఫ్ఐఆర్ పేర్కొంది. పూణేలోని ఖడ్కి మిలటరీ ఆస్పత్రి వద్ద విధుల్లో ఉన్న నలుగురు సైనిక సిబ్బందిపై ఆస్పత్రి ఆవరణలో బదిర మహిళపై లైంగిక దాడి, వేధింపులకు గురిచేసినందుకు కేసు నమోదు చేశారు. ఓ ఎన్జీవో సాయంతో బాధిత మహిళ ఇండోర్‌లో ఫిర్యాదు చేసి కేంద్ర రక్షణ మంత్రి, ఆర్మీ చీఫ్‌కు లేఖ రాశారు. నిందితుల్లో ఇద్దరు జవాన్లు బాధితురాలిపై లైంగిక దాడి దృశ్యాలతో కూడిన వీడియో క్లిప్ తయారుచేసి దాన్ని చూపి మహిళను బ్లాక్మెయిల్ చేశారని పోలీస్ అధికారి వెల్లడించారు. ఆస్పత్రి వర్గాలకు బాధితురాలు చేసిన ఫిర్యాదులను ఎవరూ పట్టించుకోలేదన్నారు. -
మహిళ దారుణ హత్య
బషీరాబాద్(తాండూరు) : కట్టుకున్నవాడు కాలం చేయడంతో పదిహేనేళ్లుగా ఒంటరిగా నివసిస్తున్న ఓ ఒంటరి మహిళ దారుణ హత్యకు గురైంది. హత్యకు ఒక రోజు ముందు బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరైన ఆమె.. అక్కా, చెళ్లెళ్లు బంధుమిత్రులతో సరదాగా గడిపారు. మర్నాడు సొంతూరికి రాగా.. అదే రోజు రాత్రి హత్యకు గురికావడం కలకలం రేపింది. ఈ ఘటన బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జీవన్గీ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. బషీరాబాద్ మండలంలో సంచలనం సృస్టించిన ఈ హత్యకు సంబంధించి తాండూరు గ్రామీణ సీఐ సైదిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. జీవన్గీ గ్రామానికి చెందిన కుర్వ లక్ష్మీ(35)కి 2000 సంవత్సరంలో యాలాల మండలం కిష్టపూర్ గ్రామానికి చెందిన బీరప్పతో వివాహం జరిగింది. అయితే అన్నదమ్ముల గొడవలో 2004లో బీరప్ప హత్యకు గురయ్యాడు. దీంతో లక్ష్మీ కొడుకు మహేష్‌తో కలిసి పుట్టింటికి వచ్చింది. జీవన్గీ గ్రామంలోని బర్కాల్ కాలనీలో ఓ చిన్న ఇంట్లో ఉంటూ కూలీ పని చేస్తూ జీవనం సాగిస్తుంది. కొడుకు మహేష్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. అయితే రెండు రోజుల కిందట కొడంగల్ మండలం రేగడి మైలారం గ్రామంలో జరిగిన బంధువుల శుభకార్యానికి కొడుకుతో కలిసి వెళ్లింది. బంధువులు, అక్కాచెల్లెళ్లతో సరదాగా గడిపింది. తిరిగి ఈ నెల 25న(బుధవారం)కొడుకును బంధువుల దగ్గర పెట్టి జీవన్గీకి ఒంటరిగా వచ్చింది. అయితే తెల్లవారి చూసేసరికి లక్ష్మీ శవమై కనిపించింది. తల వెనుక భాగంలో గాయమై పడిఉంది. ఒంటిపైనున్న ఆభరణాలు, ఇంట్లో ఉన్న ఇనుప పెట్టె తీసి వస్తువులు, బట్టలు చిందరవందరగా పడి ఉన్నాయి. రంగంలోకి దిగిన క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్ హత్య విషయం తెలుసుకున్న బషీరాబాద్ ఎస్సై లక్ష్మయ్య తన సిబ్బందితో కలిసి హుటాహుటిన జీవన్గీ చేరుకున్నాడు. సమాచారం అందుకున్న తాండూరు డీఎస్పీ రామచంద్రుడు, గ్రామీణ సీఐ సైదిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. హత్య మిస్టరీగా మారడంతో పోలీసులు వికారాబాద్ నుంచి క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్లను రప్పించారు. ఇంట్లో వస్తువులపై ఉన్న వేలిముద్రలను సేకరించారు. డాగ్ స్క్వాడ్ గ్రామంలోని హతురాలి ఇంటి ముందు, ఓ హోటల్లోకి వెళ్లింది. కానీ ఎలాంటి క్లూ ఇవ్వలేకపోయింది. హత్యపై అనుమానాలు.. భర్త మరణానంతరం ఒంటరిగా జీవిస్తున్న లక్ష్మీ హత్య అనేక అనుమానాలకు తావిస్తోంది. జీవన్గీ బర్కాల్‌లో నివసించే ఆమె.. అదే కాలనీలో నివసించే సేవ్యానాయక్ అనే వ్యక్తితో సన్నిహితంగా ఉంటోంది. చాలా కాలంగా వీరిద్దరూ సహజీవనం సాగిస్తున్నారు. అయితే ప్రియురాలు లక్ష్మీ ప్రవర్తన పట్ల అనుమానం పెంచుకున్న సేవ్యానాయక్ ఆమెను తరచూ కొట్టేవాడని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఇదిలా ఉంటే లక్ష్మీ హత్య జరిగిన విషయాన్ని మొదట సేవ్యానాయక్ చూసి గ్రామస్తులకు తెలిపాడు. ప్రియుడు హత్య చేస్తే గ్రామస్తులకు ఎందుకు సమాచారం ఇస్తాడన్న ప్రశ్నలు తలెత్తాయి. దీంతోపాటు మృతురాలి శరీరంపై ఉన్న ఆభరణాలు దొంగిలించబడ్డాయి. ఇది దోపిడీ దొంగల పనా లేక తెలిసిన వారెవరైనా చేసిన హత్యా.. అనే కోణంలోను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడే హంతకుడు? మృతురాలి తండ్రి బాలప్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు లక్ష్మీ ప్రియుడు సేవ్యానాయక్‌కు సీఐ సైదిరెడ్డి అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ప్రియుడే హత్యచేసి ఉంటాడని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ప్రియురాలిపై అనుమానంతో తరచూ ఆమెను హింసిస్తూ కొట్టేవాడని ఈ క్రమంలోనే బుధవారం రాత్రి గొడవ పడ్డారని, తోపులాటలో తలకు గాయమై చనిపోయి ఉండవచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఫిర్యాదులో సేవ్యానాయక్ భార్య తిప్పి భాయి పేరును కూడా చేర్చారు. ఒకట్రెండు రోజుల్లో కేసును ఛేదించి పూర్తి వివరాలు మీడియాకు వెల్లడిస్తామని సీఐ పైదిరెడ్డి తెలిపారు. -
వదినతో పెళ్లి.. ఆపై ఆత్మహత్య
సాక్షి, పట్నా : పెళ్లయిన రెండు రోజులకే పెళ్లి కుమారుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బీహార్‌లో కలకలం రేపుతోంది. ఈ ఆత్మహత్య గురించి భిన్న కథనాలు వినవస్తున్నా.. వదినను పెళ్లి చేసుకోవడంఇష్టంలేక.. అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. బీహార్‌లోని వినోబా నగర్లో 9వ తరగతి చదవుతున్న 15 ఏళ్ల మహదేవ కుమార్ బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. తనకన్నా వయసులో పదేళ్లు పెద్దదయిన వదిన రూబీ దేవి(25)తో మూడు రోజుల కిందట మహదేవ్ కుమార్‌కు పెద్దలు వివాహం చేశారు. ఇది వరకే రూబీ దేవికి మహదేవ కుమార్ అన్న సంతోష్ కుమార్‌దాస్‌తో వివాహం జరిగింది. సంతోష్‌కుమార్ దాస్ 2013 కరెంట్ షాక్‌తగిలి మరణించడంతో.. మహదేవ్ కుమార్, రేబీ దేవికి మూడు రోజుల కిందట పెళ్లి చేశారు. వదినను పెళ్లి చేసుకోవడం మహదేవ కుమార్‌కు ఏ మాత్రం ఇష్టం లేదని తెలిసింది. ఈ పెళ్లికి సమీప బంధువులు, గ్రామంలోని కొంత అభ్యంతరం వ్యక్తం చేసినా.. మహదేవ కుమార్ తల్లిదండ్రులు, రూబీ దేవి కుటుంబ సభ్యులు బలవంతంగా వివాహం జరిపించారు. ఇదిలా ఉండగా రూబీ దేవిని మహదేవ్ కుమార్ తన తల్లిలా భావించేవాడని అతని మిత్రులు చెబుతున్నారు. ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ వివాహం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. సంతోష్ కుమార్ కరెంట్ షాక్‌తో చనిపోయినపుడు.. అతని కుటుంబానికి ప్రభుత్వం రూ. 80 వేలను ఇచ్చింది. ఈ మొత్తం తమకే కావాలని.. రూబీ దేవి కోరింది. అయితే సంతోష్ కుమార్దాస్ తండ్రి అయిన చండేశ్వర్‌దాస్ మాత్రం రూ. 27 వేలను ఇచ్చారు. ఈ క్రమంలోనే తన చిన్న కొడుకు అయిన మహదేవ్ కుమార్-రూబీ దేవిల పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదనను అందరూ అంగీకరించడంతో.. మూడు రోజులు కిందట ఇద్దరికీ పెళ్లి చేశారు. మహదేవ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
‘మోదీ కానుక’ పుకార్లతో పరుగులు
వాకాడు: వితంతువులకు ప్రధాని మోదీ రూ.20 వేలు మంజూరు చేస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తుండడంతో మండలంలోని వితంతువులు దరఖాస్తులు చేత పట్టుకుని రెవెన్యూ కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు. ఇటీవల ఎవరో ఆకతాయిలు ‘నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్’ ద్వారా భర్త చనిపోయిన మహిళల బ్యాంక్ అకౌంట్లలో ప్రధాని మోదీ రూ.20 వేలు జమ చేస్తున్నారని వాట్సప్‌లో మెస్సేజ్ చేశారు. అనంతరం దీన్ని ఆసరాగా తీసుకున్న పలు జెరాక్స్ సెంటర్ల నిర్వాహకులు దరఖాస్తులు తయారు చేసి, విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ క్రమంలో భర్తను కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన మహిళలు ఆశగా ‘మోదీ కానుక’ దరఖాస్తును తీసుకుని, దానికి సంబంధిత ధ్రువీకరణ పత్రాలు జత చేసి, తహసీల్దార్ కార్యాలయానికి పరుగులు తీస్తున్నారు. అక్కడ వీఆర్వోలు సైతం వీటిపై సంతకాలు చేసి, తహసీల్దార్‌కు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో విషయం తెలియని వాకాడు తహసీల్దార్ లావణ్య తొలుత దరఖాస్తులు తీసుకున్నారు. అనంతరం ఉన్నతధికారుల ద్వారా విషయం తెలుసుకున్న ఆమె ‘ఇదంతా బోగస్, దీనిపై మాకు ఎలాంటి జీఓ లేదు’ అని చెప్పి దరఖాస్తులను తిరస్కరించారు. దీంతో విషయం పూర్తిగా తెలుసుకోకుండా రెవెన్యూ అధికారులు తమను ఇబ్బంది పెట్టారని బాధితులు మండిపడ్డారు. తమ పనులు సైతం మానుకుని ఒక్కో దరఖాస్తుకు రూ.వంద ఖర్చు చేశామని వాపోయారు. -
వితంతువులకు గౌరవం వద్దా?
న్యూఢిల్లీ: ఆవాస కేంద్రాల్లోని నిరుపేద వితంతువులకు తగిన గౌరవం దక్కడంలేదని సుప్రీం కోర్టు శుక్రవారం ఆవేదన వ్యక్తం చేసింది. బృందావన్ అయినా దేశంలో మరెక్కడైనా పరిస్థితి ఇలాగే ఉందని పేర్కొంది. అసలు వారికి సమాజంలో గౌరవంగా జీవించే హక్కు రద్దయిపోయినట్లు మనం ప్రవర్తిస్తున్నామని విస్మయం వ్యక్తం చేసింది. వితంతు పునర్వివాహం ఓ ఆశాకిరణంలా కనిపిస్తోందని జస్టిస్ మదన్ బి.లోకూర్, జస్టిస్ దీపక్ మిశ్రాల బెంచ్ అభిప్రాయపడింది. వితంతువులపై మూస ఆలోచనా ధోరణులకు వారి పునర్వివాహాలతో అడ్డుకట్టవేయొచ్చంది. వితంతువుల పరిస్థితిపై కోర్టుకు చేరిన పలు నివేదికలను అధ్యయనం చేసి, ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక సూచించాలని ఆదేశిస్తూ ఆరుగురు సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటుచేసింది. బలహీనవర్గాలతో సమానం.. తన రాజ్యాంగ విధుల్లో భాగంగానే నిర్భాగ్య వితంతువుల సమస్యల్లో జోక్యం చేసుకోవాల్సి వస్తోందని కోర్టు పేర్కొంది. ‘పిటిషన్ ప్రయోజనమేంటంటే ఆర్థికంగా బలహీన వర్గాల వారికి న్యాయం చేయడమే కాదు, సామాజిక వివక్షకు గురవుతున్న వారికి సాధికారత కల్పించడమూ. బృందావన్‌లో, దేశంలో ఇతర ఆవాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారంతా మన సమాజంలో బలహీన వర్గాల కిందికే వస్తారు. ఇతరులు వారిని చూస్తున్న తీరు చాలా బాధాకరంగా ఉంది’ అని పేర్కొంది. -
ఇక గ్రామస్థాయిలోనూ షీటీమ్స్
వితంతువులతో పాటు మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు రాష్ట్ర స్థాయి వితంతువుల మహాసభలో హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: వితంతువులపై సమాజంలో ఎక్కువవుతున్న వేధింపులను అరికట్టేందుకు గ్రామస్థాయిలోనూ షీటీమ్స్‌ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో వితంతువులను భాగస్వాములను చేస్తామని, వారు కీడు అని భావిస్తున్న సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు వారితోనే కొబ్బరికాయలు కొట్టిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో బాలవికాస, వితంతు ఉద్యమ సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి వితంతువుల మహాసభలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వితంతువులందరూ ఎదుర్కొంటున్న సమస్యలపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో లోతైన చర్చ చేపడతామని, వితంతువులు అంటే కీడు కాదు మంచి అనే సందేశం గ్రామస్థాయి వరకు వెళ్లేలా కృషి చేస్తామన్నారు. ఇంటా, బయటా వేధింపులు ఎదుర్కొంటున్న వితంతువుల విషయంలో కఠిన చట్టాలు తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తామని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళతామని చెప్పారు. వితంతువులంటే వివక్ష చూపే వాళ్ల మెదడుకు పట్టిన బూజును తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఇక్కడకు వచ్చిన వితంతువుల్లో ఎక్కువ మంది బాల్యవివాహాలు చేసుకున్నవారు ఉన్నారు. చిన్న వయసులోనే భర్తలు చనిపోయారని చాలా మంది చెప్పారు. గ్రామాల్లో గుడుంబా సేవించి ఆనారోగ్యం పాలై చిన్నతనంలోనే ఎక్కువ మంది చనిపోతున్నారు. ఈ విషయాన్ని గుర్తించే గుడుంబా రహిత గ్రామాల కోసం మా ప్రభుత్వం కృషి చేస్తోంది. అలాగే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆడపిల్ల కుటుంబ సభ్యులకు ఆర్థిక చేయూతనివ్వడమే అనుకుంటున్నారు. ఇది బాల్యవివాహాలను అరికట్టేందుకు ప్రభుత్వం దూరదృష్టితో తీసుకున్న నిర్ణయం’అని హరీశ్‌రావు వివరించారు. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి బాలవికాస సంస్థ తరఫున శౌరిరెడ్డి మాట్లాడుతూ.. ‘దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ ఎన్నో పథకాలను ప్రారంభించి.. ఎన్నో కార్యక్రమాలకు కొబ్బరికాయ కొట్టారు. అదే మన గ్రామంలో శుభకార్యాలను కానీ, ఇతర కార్యక్రమాలను కానీ వితంతువులతో చేయిస్తే కీడు జరుగుతుందన్న అపోహ ఉంది. వితంతువుల ఆత్మగౌరవం, సమాన అవకాశాలను తీసుకొచ్చేందుకు అందరూ కలసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఢిల్లీ, గుజరాత్ నుంచి కూడా వితంతువులు హాజరుకావడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది’అని అన్నారు. వితంతువుల కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. వితంతువులతోనే కొబ్బరికాయ కొట్టిస్తా.. వితంతువు పిల్లల చదువు కోసం ప్రధానంగా తల్లి, తండ్రి లేని పిల్లలకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్రంలో 21 ఇంగ్లిష్ మీడియం అర్బన్ రెసిడెన్సీ స్కూల్స్‌ను ప్రారంభించామన్నారు. తన నియోజక వర్గంలో ఎలాంటి కార్యక్రమం నిర్వహిం చినా మొదట వితంతువులతోనే కొబ్బరి కాయ కొట్టిస్తానని చెప్పారు. వితంతు వుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్న బాల వికాస స్వచ్ఛంద సంస్థకు మంత్రి హరీశ్ తన నెల జీతాన్ని విరాళంగా ప్రకటించా రు. శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ.. వితంతువుల పిల్లలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. నా భర్త మరణిస్తే నేను తప్పు చేసినట్టా.. మాది వరంగల్ జిల్లాలోని వెంకటాపురం. 18 ఏళ్ల వయసులోనే పెళ్లైంది. ఒక బాబు, పాప ఉన్నారు. నా భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆయన చనిపోయి ఐదురోజులు గడవకముందే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి నన్ను మా పుట్టింటికి వెళ్లిపోమన్నారు. గత ఏడేళ్ల నుంచి తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నా. పిల్లలను చదివించేందుకు నానా కష్టాలు పడుతున్నా. నా భర్త ప్రమాదంలో మరణిస్తే నేను చేసిన తప్పేంటో అర్థం కావడం లేదు. భర్త లేకపోవడంతో ఇతర మగవాళ్లు మరోరకంగా చూస్తుండటంతో ఇబ్బందవుతోంది. ఇలాంటి వారి లైంగిక వేధింపులు తట్టుకోలేక ఒక దశలో చనిపోవాలనుకున్నా. – ఉమ, వితంతువు చులకన బాధ కలిగిస్తోంది మాది మహబూబాబాద్ దంతాలపల్లి గ్రామం. పదమూడేళ్ల వయసులోనే పెళ్లైంది. ఏడు నెలల బాబు ఉన్న సమయంలో భర్త మరణించాడు. అప్పటినుంచి కష్టాలు చుట్టుముట్టాయి. ఎక్కడికి వెళ్లినా లైంగిక వేధింపులు ఎదురవుతున్నాయి. బంధువులు శుభకార్యాలకు పిలిచినా.. అక్కడ అన్ని విషయాల్లోనూ మమ్మల్ని చులకన చేసి వెనక పెడుతున్నారు. బతుకుదెరువు కోసం కుట్టుమెషీన్ నడుపుతున్నా గిరాకీ రావడం లేదు. నాతో బట్టలు కుట్టించుకుంటే వాళ్లకేదో కీడు జరుగుతుందని అనుకుంటున్నారు. చనిపోయినవారి ఇళ్లలో దుస్తులు కుట్టేందుకు మాత్రం మా తలుపు తడుతున్నారు. – అహల్య, వితంతువు -
వితంతు పింఛన్ రద్దు చేస్తూ సిఫార్సు
వితంతు పింఛన్ అని ఆమెకు తెలియదట! l సొమ్ము వెనక్కి ఇచ్చేసిన సత్యవతి కాకినాడ : ‘పదవి పదిలం–పింఛన్ కోసం మరణం’ శీర్షికన ఈ నెల 9న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి నగరపాలక సంస్థ కమిషనర్ ఆలీమ్‌బాషా స్పందించారు. 32వ డివిజన్ జన్మభూమి కమిటీ సభ్యుడు మేడిశెట్టి అప్పలరాజు తన భార్యపేరిట వితంతు పింఛన్ మంజూరు చేయించుకున్న అంశంపై సంబంధిత విభాగాన్ని విచారణకు ఆదేశించారు. దీంతో టీపీఆర్వో భాస్కరరా వు, కింది స్థాయి సిబ్బంది అసలా పింఛన్ ఎలా మంజూ రైంది? భర్త ఉండగానే ఆమె పేరిట వితంతు పింఛన్ ఎలా విడుదలైంది? ఆన్లైన్లో ఎలా పంపారు? అనే అంశాలపై విచారణ జరిపారు. అందులో భాగంగా పింఛ న్ పొందిన మేడిశెట్టి సత్యవతిని కార్పొరేషన్ కార్యాల యానికి పిలిపించి మాట్లాడారు. వితంతు పింఛన్ తీసుకున్న వ్యవహారం వివాదం కావడంతో ఆమె కార్పొరేషన్‌కు లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చుకున్నారు. తనకు పింఛన్ మంజూరైందన్న సమాచారం రావడంతో Ðð ళ్లి తీసుకున్నానని, అది వితంతు పింఛన్ అని తనకు తెలి యదని చెప్పారు. తన భర్త అడిగితే రేషన్‌కార్డు, ఆధార్ జిరాక్స్ గతంలో ఎప్పుడో ఇచ్చానని, ఆ పింఛన్ ఎలా మంజూరైందో తనకు తెలియదన్నారు. పొరపాటు జరి గిందని, అందువల్ల పింఛన్ వెనక్కి ఇచ్చేస్తున్నానంటూ రూ.వెయ్యి నగదు కార్పొరేషన్ అధికారులకు అప్పగించారు. ప్రభుత్వానికి నివేదిక జన్మభూమి కమిటీ సభ్యుడు అప్పలరాజు భార్య వితంతు పింఛన్ వ్యవహారం బయటపడడంతో సదరు పింఛన్ రద్దు చేస్తూ ప్రభుత్వానికి నివేధించనున్నట్టు టీపీఆర్వో భాస్కరరావు చెప్పారు. ఈ సొమ్మును బ్యాంక్‌లో జమ చేస్తామని, వచ్చేనెల నుంచి ఆ పింఛన్ నిలుపుచేస్తారని తెలి పారు. సంఘటనకు సంబంధించి మరింత సమాచారం కోసం విచారణ చేస్తున్నామన్నారు. బాధ్యులపై చర్యలేవి? వితంతు పింఛన్ వ్యవహారం ఆధారాలతో బయటపడినప్పటికీ బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో కార్పొరేషన్ అధికారులు వెనకడుగు వేస్తున్నారు. కేవలం పింఛన్ తీసుకున్న సత్యవతి నుంచి లేఖ తీసుకుని, పింఛన్ రద్దు చేసేందుకు సిఫార్సు చేస్తామని నిర్ణయం తీసుకున్నారు. పింఛన్ మంజూరు వెనుక ఉన్న ఆమె భర్త, జన్మభూమి కమిటీ సభ్యుడు అప్పలరాజు పాత్ర, పింఛను మంజూరుకు సహకరించిన కార్పొరేషన్‌లోని సంబంధిత సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడంలేదు. అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి కావడం వల్లే ఈ వ్యవహారాన్ని అక్కడితో ముగింపు పలకాలని అధికారులు నిర్ణయించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
వితంతువుపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నం
రఘునాథపల్లి : వితంతువుపై ఓ ఆటోడ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని కంచనపల్లిలో ఆదివారం రాత్రి జరిగింది. ఎస్సై రంజిత్‌రావు కథనం ప్రకారం .. మండలంలోని కంచనపల్లికి చెందిన ఓ వితంతువు తన పిల్లలు హాస్టల్లో చదువుతుండగా వారిని చూసేందుకు వెళ్లి తిరిగి రఘునాథపల్లికి చేరుకుంది. స్వగ్రామానికి వెళ్లేందుకు కంచనపల్లి రోడ్డుపై వాహనాల కోసం ఎదురు చూస్తుండగా అదే గ్రామానికి చెందిన మేడ అనిల్ తాను గ్రామానికే వెళుతున్నానని చెప్పి తన ఆటోలో మహిళను ఎక్కించుకున్నాడు. పిట్టలగూడెం సమీపంలోకి వెళ్లగానే అనిల్‌్ ఆటోలో ఉన్న మహిళను కిందకు లాగి చెట్ల పొదల్లో లాక్కెళ్లి అత్యాచారానికి యత్నించాడు. బాధిత మహిళ ప్రతిఘటించడంతో తప్పయిందని చెప్పి మహిళను ఆటోలో ఎక్కించుకొని గ్రామం వైపు బయల్దేరాడు. కానీ కంచనపల్లిలో ఆటో నిలపకుండా అతి వేగంగా గబ్బెట రహదారి వైపు తీసుకెళ్తుండడంతో బాధిత మహిళ ఆపాలని బతిమిలాడింది. అయిన అతడు వినకపోవడంతో కిందికి దూకడంతో కుడిచేతికి గాయమైంది. గాయంతోనే గ్రామ పెద్దలకు విషయం చెప్పి సోమవారం పోలీస్‌స్టేషన్‌లో అనిల్‌పై ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.