breaking news
sorrow
-
నాకే ఇన్ని కష్టాలా...? అంతా మన వల్లే.. !
భక్తుడు తన జీవితంలో అనేక పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది!!... భగవంతుడు తనకు సన్నిహితంగా ఉన్నవారిని అనేక రకాలుగా పరీక్షిస్తుంటాడు!!... ’కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, అవమానాలు... ఇవన్నీ ఆ పరీక్షలో భాగాలే! వాటిని ఒకటి తరువాత మరొకటి ఇస్తూ ఉంటాడు ‘నన్ను అట్టే అంటిపెట్టుకుని ఉంటాడా! లేదా విసుగుతో నన్ను దూరం చేసుకుంటాడా?’ అని అయన చూస్తూ ఉంటాడు!!... ఒకసారి పరీక్షలో ఉత్తీర్ణులం అయ్యాక మరొక పరీక్ష ఉండటం... లేకపోవడం ఆయన ఇష్టం...!కానీ ఒకసారి విఫలం అయ్యాక మాత్రం మళ్ళీ పరీక్ష పెట్టడం జరగదు! ఎందుకంటే అప్పటికే మన సామర్థ్యం అయనకు తెలిసిపోతుంది కనుక, ఈ విషయం మనం చక్కగా గ్రహించి కష్ట నష్టాలు వచ్చినపుడు దైవాన్ని నిందించక, మరువక, విడువక ఆయనపై విశ్వాసంతో సహనం వహించాలి. అప్పుడే అయన తన అనుగ్రహాన్ని పుష్కలంగా అందిస్తాడు!!...ఎలా వచ్చిన కష్ట నష్టాలు అలా పోతాయి. అయితే మన విశ్వాసం, సహనం ఎలా ఉండాలంటే పరీక్ష పెట్టీ పెట్టీ ఆయనే విసుగు చెందిపోవాలి...అంతేకానీ నేను రోజూ పూజలు, అభిషేకాలు చేస్తున్నాను, నాకు ఈ పని కావాలి, ఆ పని జరగాలి, లేకపోతే ఎందుకు అని అనుకోరాదు. అంతా బాగున్నప్పుడు అదంతా మన వల్లే అనుకుని పొంగిపోయి, సౌఖ్యాలు కలుగనపుడు మాత్రం దైవాన్ని నిందించటం తగదు, దానికంటె మనలో విశ్వాస లోపం ఎక్కడైనా ఉందేమో చూసుకోవాలి. ఇదీ చదవండి: ప్రేమించే వ్యక్తి.. ఆలోచించే వ్యక్తికన్న వెయ్యిరెట్లు ఉత్తమం! ఎలా?కొన్నిసార్లు అంతా బాగానే ఉన్నట్లు అనిపించవచ్చును, కానీ ఎక్కడో ఏదో మూలన చిన్న సందేహం మిగిలిపోయిందేమో అని చూసుకోవాలి. పాత్రలో నీరంతా బయటకు పోవడానికి పాత్రంత రంధ్రం అవసరం లేదు... చిన్న రంధ్రం ఉంటే చాలు పాత్రలో నీరంతా బయటకు పోవడానికి, కనుక ఆ చిన్న రంధ్రం ఎక్కడుందో కనుక్కుని దానిని మూసివేయడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని నిందిస్తూ కూర్చోకూడదు. దైవనింద వల్ల మరింత పాపం చుట్టుకుంటుంది తప్ప సమస్యలు తీరిపోవు! విశ్వాసమే అసలైన పరిష్కారాన్ని ఇస్తుంది.చదవండి: Bakrid 2025 త్యాగాల పండుగ : ‘తఖ్వా’ అంటే.. -
ఎవడు వివేకి? ఎవడు అవివేకి?
వివేకి లోక విషయాల్లోని దోషాన్ని గ్రహిస్తాడు. అలౌకికాన్ని ఆరాధిస్తాడు. అవివేకి అజ్ఞానంతో లౌకిక విషయాసక్తుడై అలౌకిక సత్యాన్ని ఆలోచించలేడు. పైగా లౌకిక విషయ సుఖమే సత్యంగా భావించి దాన్ని అనుభవిస్తూండటం వివేకమనుకుంటాడు. అటువంటి వారు అతితెలివితో భ్రాంతచిత్తులయి తమాషాగా ప్రవర్తిస్తారు. అలాంటి కథ ఇది:మిక్కిలి తెలివి గల ఒక రాజు ఉన్నాడు. మనిషి మంచివాడే. కాక పోతే కొంచెం వక్రంగా ఆలోచిస్తాడు. అందుకే అందరికంటే వివేక హీనుడెవడో చూచి వాడికి సన్మానం చేయాలనుకుంటాడు. అటువంటివాడిని తీసుకురమ్మని సేవకులను రాజ్యం నలుమూలలకూ పంపాడు. అతి కష్టం మీద రాజసేవకులు ఏ పనీ చేయని, ఎవరి తోనూ మాట్లాడని, చింపిరి గుడ్డలు కట్టుకొని ఆకులు అలములుతింటూ తిరుగాడేవాడిని తీసుకొస్తారు. రాజు కూడా అవివేకి ఇతడే అని సంతోషించి సన్మానంలో ఒక వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని అతనికి బహూకరించాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఆ రాజుకు తీవ్రమైన రోగం వచ్చింది. ఎవరూ వైద్యం చేయలేమని చేతులెత్తేసిన సమయంలో అవి వేకిగా సన్మానితుడైన మనిషి వచ్చి రాజు రోగాన్ని నయం చేస్తానన్నాడు. చదవండి: Ashtavakra అష్టావక్ర సందేశంఅయితే వైద్యం ప్రారంభించే ముందు... ‘ఓ రాజా! మీరింతవరకూ సుఖాలెన్నో అనుభవిస్తూ వచ్చారు. మరి మీరు చనిపోతే మీ శరీరం ఈ సుఖభోగాల ననుభవించలేదు కదా! అందువల్ల మర ణించే ముందైనా, ఇప్పటినుంచే ఆ భోగాలన్నింటినీ వదిలిపెట్టి ఉండగలరా చెప్పండి?’ అన్నాడు. ‘ఇంతవరకు అలవాటు పడిన ఈ భోగాలను వదలి ఉండలేను’ అని సమాధానం చెప్పాడు రాజు. ‘రాజా! నేను ఆకులలములు తింటూ ఏవో గుడ్డ పీలికలు కట్టుకొని, కటిక నేలపై పడుకొంటూ ఇప్పటికీ సుఖంగానే ఉన్నాను. మరి నాకు కష్టం, సుఖం వేరుగా కనబడలేదు. నాకెంతో తృప్తిగా ఉంది. కానీ మీరు, ప్రాణాంతకమైన రోగం వచ్చినా రక్షించలేని ఈ సుఖాలను, కొంతకాలమైనా వదిలి పెట్టలేకపోతున్నారు. అన్నీ ఉన్నా మీకు తృప్తిలేదు. విషయ సుఖలాలసత ఇంకా కోరుతున్న మీరు, సిసలైన అవివేకులు. కనుక మీరు నాకిచ్చిన వజ్రపుటుంగరం తిరిగి మీకే ఇస్తున్నాను తీసుకోండి’ అని ఉంగరం ఇస్తూ తన యోగదృష్టి పాతంతోనే రాజుకు పరిపూర్ణమైన ఆరోగ్య భాగ్యాన్ని ప్రసాదించాడాయన.చదవండి: అశ్వినీ దేవతలు ఎవరు?ఆయన ఎవరో కాదు. సర్వసిద్ధులూ కలిగిన ’అవధూత’. ‘విరతి రాత్మరతి శ్చేతి వివేకస్య పరమం లక్షణమ్’. విషయసుఖాలపై వైరాగ్యముండటం, సర్వదా ఆత్మానుసంధానంతో ఉండటమూ వివేకానికి లక్షణమని అర్థం. అవధూత స్థితి ఇలాంటిది. కనుక గురూపదేశంతో ప్రతి ఒక్కరూ సుఖదుఃఖ సమభావన సాధించాలి.-శ్రీ గణపతిసచ్చిదానందస్వామి -
ఎడారిలో ఆకలికేకలు..
పొట్ట చేతపట్టుకుని దేశందాటి వెళ్లారు.. కష్టం చేసి ఎదుగుదామనుకున్నారు. కాని తాము దిగిన కంపెనీలో జరుగుతున్న మోసాన్ని చూసి తట్టుకోలేక ప్రశ్నించారు. దీంతో సదరు కంపెనీ మీ బాధ్యత మాది కాదంటూ చేతులెత్తేయడంతో దిక్కులేని స్థితిలో పడ్డారు. తిండి లేదు.. డబ్బులేదు. దిక్కతోచని స్థితిలో దుబాయ్‌లోనే కాలం వెళ్లదీస్తున్నారు. దుబాయ్‌లోని షార్జాలో సుమారు 70మందికి పైగా గల్ఫ్ బాధితుల దీన గాథ ఇది. కామారెడ్డి క్రైం : కామారెడ్డి, చుట్టుపక్కల జిల్లాల నుంచి దుబాయ్‌లోని షార్జా అలీముసా ప్రాంతానికి గడిచిన ఏడాది కాలంలో 70 మంది వరకు ఉపాధి కోసం కంపెనీ వీసాలపై వెళ్లారు. వారిలో 90 శాతం మందిని పంపింది కామారెడ్డిలోని ఓ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ తేలికైన పని చక్కని ఉద్యోగమంటూ గ్రామీణ ప్రాంతంలోని అమాయకులకు గాలం వేశారు. ఒక్కొక్కరి వద్ద నుంచి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేసి దుబాయ్ పంపించారు. వెళ్లిన వారితో గొడ్డు చాకిరీ చేయించారు. వెళ్లిన మరుసటి రోజే తాము మోసపోయామని తెలుసుకున్నారు. చేసేది ఏమి లేక చెప్పిన పనిచేశారు. కంపెనీ ప్రతినిధులు నెలలు గడుస్తున్నా జీతాలు సరిగా ఇవ్వలేదు. ఇదేమిటని ప్రశ్నించినవారిని టార్గెట్ చేసి అర్థరాత్రి తర్వాత వీదేశీయులచేత కొట్టించేవారు. కనీసం నీళ్లు విద్యుత్ సౌకర్యాలం లేని క్యాంప్ గదుల్లో ఉంచారు. దీంతో అందరూ కలిసి కంపెనీ మోసాలపై తిరగబడ్డారు. ఈ నెల 3వ తేదీన షార్జా అలీమూసాలో రోడ్డుపై కంపెనీ తీరుకు నిరసనగా న్యాయం చేయాలంటూ ర్యాలీ తీశారు. ర్యాలీ తీసినవారిని అక్కడి పోలీసులు, మిలిటరీ అదుపులోకి తీసుకుంది. మీరంతా ఏ కంపెనీలో పనిచేస్తున్నారని ప్రశ్నించి కంపెనీ ప్రతినిధులను పిలిపించారు. అక్కడ కంపెనీ పేరుతో లేబర్ వ్యాపారాలు చేస్తున్న మన ప్రాంతానికే చెందిన కంపెనీ ప్రతినిధులు చేరుకుని పోలీసులతో మాట్లాడారు. వీళ్లందరికి సంబంధించిన వ్యవహరాలు స్వయంగా చూసుకుంటామని, డబ్బులు ఇప్పించి స్వస్థలాలకు పంపిస్తామని పోలీసుల ముందు హామీ ఇచ్చి అందరిని తీసుకుని వెళ్లారు. మాకు వ్యతిరేకంగా ధర్నా చేస్తారంటూ క్యాంప్‌నకు వెళ్లిన తర్వాత చాలా మందిని చీకటి గదుల్లో వేసి హింసించారని మూడు రోజుల క్రితం కామారెడ్డికి వచ్చిన 14 మంది బాధితులు తెలిపారు. మిగితావారు క్యాంప్‌ల్లోనే మిగిలిపోయారు. పోలీసులు క్యాంపు దాటి వెళ్లవద్దని ఆంక్షలు పెట్టడంతో వేరే పనిచూసుకోలేక, తిరిగి రాలేక తిండిలేక అక్కడాఇక్కడా తింటూ సతమతమవుతున్నారు. అక్కడి పరిస్థితిని ఎప్పటికప్పుడు కొంతమంది ఎస్ఎంఎస్ల ద్వారా ఇటీవల ఇక్కడికి చేరుకున్న తోటివారికి సమాచారం చేర వేస్తున్నారు. పంపేందుకు ప్రశ్నలెన్నో.. జిల్లాకు చెందిన కొందరు బడాబాబుల బంధువులు షార్జా అలీమూసాలో ఎంఎన్ఆర్, ఎస్ఎల్వీఆర్ పేరుతో కార్మికులను సప్లయ్ చేసే లేబర్ కంపెనీలను తెరిచారు. కామారెడ్డిలోని ఓ గల్ఫ్ ఏజెంట్ ద్వారా ఇక్కడి నుంచి ఉద్యోగాల పేరుతో కంపెనీ వీసాలపై 70 మందిని తెప్పించుకున్నారు. కాని వారికి జీతాలివ్వక తిప్పలు పెట్టి ప్రశ్నించినందుకు ధర్నా చేస్తే పోలీసులకు తాము సెటిల్ చేసుకుంటామని కంపెనీ వాళ్లు చెప్పి తిరిగి వారిని హింసించడం చేతులెత్తేశారు. కరెంట్, నీళ్లు, ఆహారం లేక నాలుగు రోజులకు పైగా పస్తులున్నామని చెప్తున్నారు. నెలకు ఇద్దరి చొప్పున మాత్రమే స్వస్థలాలకు పంపిస్తామని అంటున్నారని, బెదిరిస్తున్నారని వారు వాపోయారు. న్యాయం చేయాలి నేనుకూడా షార్జాఅలీమూసాలోని కంపెనీ బాధితుల్లో ఒకడినే. మేము 14 మంది మూడు రోజుల క్రితం దుబాయ్ నుండి వచ్చేశాం. ఇంకా 60 మంది వరకు మాతోటి వారు అక్కడే ఉన్నారు. కంపెనీ వారు నీళ్లు, కరెంట్ లేని క్యాంపు గదిలో ఉంచారు. జీతాలు ఇవ్వలేదు. గల్ఫ్ ఏజెంట్ల మాటలకు మోసపోయాం. నాలుగైదు రోజుల నుంచి తిండి లేకుండా అలమటిస్తున్నారు. వారందరిని ఇక్కడికి రప్పించాలి. ఆర్థికంగా నష్టపోయిన వారికి న్యాయం చేయాలి. – శంకర్, గల్ఫ్ బాధితుడు, గౌరారం -
ఆనంద బాష్పాల అంతుచిక్కిందా?!
బాధాకరమైన సందర్భంలో, మనసుకు కష్టం కలిగినప్పుడే కాదు... అత్యంత ఆనందకరమైన సమయంలో కూడా వచ్చేది కన్నీరే. వీటినే మనం ఆనంద బాష్పాలుగా చెప్పుకొంటాం. సాధారణంగా పెళ్లిళ్లలో కూతురిని సాగనంపినప్పుడు, క్రీడాకారులు ఒక గొప్ప ఫీట్‌ను సాధించినప్పుడు, ఏ వ్యక్తి అయినా జీవిత సాఫల్యతను సాధించానని భావించినప్పుడు... కళ్లు వర్షిస్తాయి. మరి ఎందుకలా... అనే అంశం గురించి పరిశోధన నిర్వహించారు యేల్ విశ్వవిద్యాలయం వాళ్లు. అలా ఎందుకు జరుగుతుందనే అంశం గురించి కొంత వివరణ కూడా ఇచ్చారు... సంతోషకరమైన సమయాల్లో కన్నీరు పెట్టుకోవడం ఒకింత అసంకల్పిత ప్రతీకార చర్యగానే అభివర్ణించారు. భావోద్వేగ సమతుల్యత సాధించడానికే ఇలా కన్నీరు పెట్టుకోవడం జరుగుతుందని వారు అభిప్రాయపడ్డారు. ఒక్కసారిగా కలిగే ఆనందాన్ని తట్టుకోలేని సమయంలో... ఇలా కన్నీరు పెట్టుకోవడం ద్వారా మనసు కొంత వరకూ తేలికపడుతుందని వివరించారు. ఆనందకరమైన సమయాల్లో కన్నీరు రావడం అంటే అది భావోద్వేగం తీవ్ర స్థాయికి చేరిందనడానికి నిదర్శనమని తెలిపారు. అంతే కాదు... మనిషి అసహాయ స్థితిలో, బాగా నిరాశ పడ్డ సమయంలో కూడా ఒక నవ్వు నవ్వుతాడు. దాన్ని వెర్రినవ్వుగా చెప్పుకొంటాం. సంతోషకరమైన స్థితిలో కన్నీరు రావడం, నిస్సహాయ స్థితిలో నవ్వడం.. ఈ రెండూ కూడా పరస్పర భిన్నమైన భావాలు, భావోద్వేగ సమతుల్యత కోసం మనసు అంతర్గత స్పందనకు ఇవి నిదర్శనాలు అని యేల్ పరిశోధకులు వివరించారు. -
ఆడపడుచులు ఇంటికొస్తే చాలు...
మనోగతం మాటా మాటా పెరిగి ‘విడాకులు తీసుకుందాం’ అనే వరకు వచ్చింది వ్యవహారం. మా ఆవిడ ప్రవర్తన ఏ విషయంలోనూ తప్పు పట్టలేనంత గొప్పగా ఉండేది. ఒకే ఒక విషయంలో మాత్రం ఆమె ప్రవర్తన చికాకు పరిచేది. బాధ కలిగించేది కోపం తెప్పించేది. మా అక్క, చెల్లి ఎప్పుడైనా ఒకసారి ఇంటికి వస్తే, మా ఆవిడ వారితో ఆప్యాయంగా మాట్లాడినట్లు నటించేది. వాళ్లు వెళ్లిన తరువాత మాత్రం నాకు నరకం చూపించేది. ‘‘ఎంత డబ్బు ఇచ్చేరు వాళ్లకు?’’ అని అడిగేది. ‘‘డబ్బు ఏమిటి?’’ అని ఆశ్చర్యంగా అడిగితే- ‘‘నేనేమీ అమాయకురాలిని కాదు. నాకు అన్నీ తెలుసు’’ అన్నది. ‘‘తెలివి తక్కువగా మాట్లాడకుండా అసలు విషయం చెప్పు’’ అని అడిగేసరికి- ‘‘మీ అక్క చెల్లెళ్లకు డబ్బులు ఇస్తే, పిల్లల సంగతి ఏమిటి? అనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకిలా చేస్తున్నారు’’ అనేది కన్నీళ్లు తుడుచుకుంటూ. ‘‘నా డబ్బుల మీద ఆధారపడాల్సి అవసరం వారికి లేదు. ఒకవేళ నేను వారికి డబ్బు ఇచ్చినా అదేమీ తప్పు కాదని అనుకుంటున్నాను’’ అన్నాను గట్టిగా. దీంతో మాటా మాటా పెరిగి ‘విడాకులు తీసుకుందాం’ అనే వరకు వచ్చింది వ్యవహారం. అదృష్టవశాత్తూ మా అత్తా మామలు మంచివారు. విషయం తెలిసి కౌన్సెలింగ్ చేశారు. కళ్లు తెరిపించారు. ‘‘నన్ను క్షమించండి’’ అంది ఆమె కళ్ల నీళ్లు పెట్టుకుండూ. ‘‘నేను ఆవేశపడ్డాను. నన్ను కూడా నువ్వు క్షమించాలి. ఓకేనా’’ అన్నాను. ఇద్దరం నవ్వుకున్నాం. ఆరోజు నుంచి ఇప్పటివరకు మేము వరకు గొడవ పడలేదు. -సిఆర్, నెల్లూరు టౌన్ -
రాత్రి 11.40
నిజాలు దేవుడికెరుక బాధతో చనిపోయిన మనిషి దెయ్యమై తిరుగాడుతాడని చాలామంది అంటారు. అయితే ఇది నిజం కాదని కొందరు వాదిస్తుంటారు. అలాంటి వాళ్లందరూ 'ఒకికు' గాథ వింటే ఏమంటారో! మనసు వికలమై తనువు చాలించిన ఈ పద్దెనిమిదేళ్ల అమ్మాయి ఆత్మ... ప్రపంచానికి సవాలు విసిరింది. దెయ్యాలు లేవు అనేవారి ఆలోచనల్ని కొత్త దారిలోకి మళ్లించింది! జపాన్... 17వ శతాబ్దం. సమయం రాత్రి పదకొండూ నలభై కావస్తోంది. అరుగు మీద కూచుని ఉన్నాడు మకిహికో. ఆ రోజు సాయం త్రమే తన చిన్నాన్న ఇంటికి వచ్చాడు. కాసేపు పిచ్చాపాటీ మాట్లాడి, విందు ఆరగించాడు. పదయ్యేసరికే మంచమెక్కాడు కానీ కొత్త ప్రదేశం కావడం వల్ల ఎంతకీ కంటిమీదికి కునుకు రాలేదు. దాంతో కాసేపు అటూ ఇటూ దొర్లి... ఇక లాభం లేదని బయటకు వచ్చాడు. వేసవి కావడంతో చెట్లు అలక బూనినట్టుగా బిగుసుకుపోయాయి. కాకపోతే ఇంట్లో కంటే బయట కాస్త చల్లగా అనిపించడంతో అరుగుమీద కూచున్నాడు. కాసేపయ్యాక అరుగుమీదే ఒరిగాడు. ఆకాశంలోకి చూస్తూ తారల వెలుగుల్ని, మబ్బుల మనోహరత్వాన్నీ ఆస్వాదిస్తున్నాడు. ఉన్నట్టుండి ఎక్కడో నీళ్ల చప్పుడు అయ్యింది. దగ్గరో కొలను కానీ, నది కానీ లేవు. మరి నీళ్లు కదిలిన శబ్దమెక్కడినుంచి వచ్చిందో అనుకుంటూ చుట్టూ చూశాడు. వెన్నెల వెలుగులో కాస్త దూరంగా ఓ బావి కనిపించింది. కానీ అక్కడెవ్వరూ నీళ్లు తోడటం లేదు. మరి నీళ్ల సవ్వడి ఎందుకొచ్చింది, బరువైన వస్తువేదైనా అందులో పడిందా అనుకున్నాడు. ఓ క్షణం ఆలోచించి, మళ్లీ పడుకున్నాడు. క్షణం తరువాత మళ్లీ అదే నీళ్ల శబ్దం. వెంటనే లేచి కూచున్నాడు మకిహికో. బావివైపు దృష్టి సారించాడు. అంతే... అతడి వెన్ను జలదరించింది. నూతిలోంచి ఓ అమ్మాయి బయటకు వస్తోంది. మకిహికో ఒళ్లు ఝల్లుమంది. గుండె గుభేలుమంది. ఆ అమ్మాయి బయటికొచ్చి నేలమీద దిగింది. ఎదురుగా ఉన్న భవంతివైపు కదులుతోంది. పాదాలు కనిపించనంత పొడవైన తెల్లని గౌను వేసుకుంది. నల్లని కురులు వీపంతా ఆక్రమించాయి. చక్రాల బండి మీద ఉన్నట్టు అలా అలా అలవోకగా సాగిపోతోంది. క్షణంలో ఆమె ఆ భవనంలోకి వెళ్లిపోయింది. ఒళ్లంతా చెమటలు పోశాయి మకిహికోకి. ఎవరా అమ్మాయి? నూతిలోంచి వచ్చిందేమిటి? అసలు మనిషేనా? లేక దెయ్యమా? తన ఆలోచనకి తనే ఉలిక్కిపడ్డాడు. గబగబా లేచి ఇంట్లోకి వెళ్లి తలుపు బిగించాడు. ఇంట్లోవాళ్లని లేపుదామా అనుకున్నాడు. కానీ అందరూ మత్తుగా నిద్రపోతున్నారు. దాంతో వెళ్లి తన పడకమీద పడుకున్నాడు. భయంతో ముఖం కూడా బయట లేకుండా నిలువునా దుప్పటి కప్పేసుకున్నాడు. తను చూసిన దృశ్యం పదే పదే కళ్లముందు కనిపిస్తోంది. దాన్ని మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నాడు. అంతలో సన్నగా ఏడుపు వినిపించింది. ఆమె ఏడుస్తోంది. హృదయవిదారకంగా వెక్కి వెక్కి ఏడుస్తోంది. గుండెల్ని పిండేసేలా రోదిస్తోంది. ఎవరిదా రోదన? ఆమెదేనా? ఎందుకేడుస్తోంది? అసలామె మనిషేనా? దెయ్యమా? దెయ్యమైతే ఎందు కేడుస్తుంది? కాసేపటికి ఆ ఏడుపు ఆగిపోయింది. అంతా నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం కూడా మకిహికోని భయపెట్టింది. ఆ రాత్రంతా నిదుర లేకుండా చేసింది. ఉదయం లేస్తూనే రాత్రి జరిగింది తన చిన్నాన్నకి చెప్పాడు మకిహికో. కానీ అతడి చిన్నాన్న పెద్దగా రియాక్టవ్వలేదు. ''ఓ అదా... అది మామూలేలే. మాకు అలవాటైపోయింది'' అన్నాడు కూల్‌గా. ''అలవాటైపోయిందా? అంటే రోజూ ఇలా జరుగుతుందా?'' అన్నాడు మకిహికో మరింత ఆశ్చర్యంగా. ''ఇప్పుడేంటి... కొన్ని దశాబ్దాలుగా ఇలానే జరుగుతోందట.'' ''దశాబ్దాలుగా జరుగుతోందా? అంటే ఆమె... దె... దె... దెదె దెయ్యమా?'' అన్నాడు వణుకుతూ. ''అవును.'' మకిహికో పై ప్రాణాలు పైనే పోయాయి. ''దెయ్యమా? ఆ విషయం ఇంత సింపుల్‌గా చెబుతున్నావేంటి చిన్నాన్నా? దెయ్యమని తెలిసి కూడా ఇక్కడ ఎలా ఉంటున్నారు? భయం లేదా మీకు?'' అన్నాడు కంగారుపడుతూ. ''లేదురా. ఆమె కథ తెలిస్తే భయం కాదు... జాలి వేస్తుంది. తను ఎవరినీ ఏమీ చేయదు. ఆమె మనసులో ఎవరిమీదా కోపం లేదు... వేదన తప్ప.'' ''వేదనా? ఎందుకు?'' మకిహికోకి ఆమె కథ చెప్పాడు చిన్నాన్న. అంతే... అతడి మనసంతా జాలితో నిండిపోయింది. ‘‘అయ్యో పాపం’’ అన్నాడు మకిహికో బాధగా. అతడే కాదు. ఆమె కథ విన్నవాళ్లు, ఆమె వ్యథ తెలిసినవాళ్లెవరి మనసులైనా కరిగి నీరవుతాయి. జపాన్లోకి కోబ్ ప్రాంతంలో ఉంది హినెజీ క్యాజిల్. దాని యజమాని ఒయామా నావికుడు. ఆరు నెలలు సముద్రం మీద ఉంటే, ఆరు నెలలు ఇంటి దగ్గర ఉంటాడు. అతడికి కుటుంబం లేదు. నలుగురైదుగురు పనివాళ్లు అన్ని పనులూ చేసి పెడుతుంటారు. వంటపని చేసేందుకు ఒక మహిళ ఉంది. ఆమె చాలా యేళ్లుగా పనిచేస్తోంది. అయితే ఈసారి ఒయామా వచ్చేసరికి ఆమెకి సుస్తీ చేయడంతో, తన దూరపు బంధువైన ఒకికుని పనిలో పెట్టి తాను వెళ్లిపోయింది. ఒకికుకి పద్దెనిమిదేళ్లుంటాయి. భలే చలాకీ అయిన పిల్ల. వంట చేయడానికే వచ్చినా ఆ ఒక్కటీ చేసి ఊరుకోదు. అన్ని పనులూ దగ్గరుండి చూసుకుంటుంది. దానికి తోడు మహా అందగత్తె కూడా. పైడిబొమ్మలా ఉంటుంది. తీగలాంటి ఒళ్లు, తేనెకళ్లు, నల్లగా నిగనిగలాడే ఒత్తయిన జుత్తు, ముట్టుకుంటే మాసిపోయే లేతదనం, చకచక కదిలే చలాకీతనం... ఆమెని చూసి ముచ్చటపడనివాళ్లుండరు. చాలామంది అయితే ఆమె పనిమనిషి అంటే నమ్మరు. అంత బాగుంటుంది. అదే ఆమె పాలిట శాపమయ్యింది. ఒయామా ఒకికు మీద కన్నేశాడు. కాదంటే కన్నెర్రజేశాడు. బెదిరించాడు. ఎలాగైనా తన కోరిక తీర్చుకోవాలని పన్నాగాలు పన్నాడు. కానీ ఒకికు లొంగలేదు. దాంతో పగ పెంచుకున్నాడు ఒయామా. ఎలాగైనా ఒకికుకి బుద్ధి చెప్పాలనుకున్నాడు. అందుకోసం కుట్ర పన్నాడు. తన ఇంట్లో ఖరీదైన సెరామిక్ ప్లేట్లు పది ఉన్నాయి. వాటిలో ఒకటి తీసి దాచేశాడు. దానికోసం వెతికినట్టు నటించాడు. చివరికి ఒకికుయే దొంగిలించి ఉంటుందన్నాడు. పోలీసులకు పట్టిస్తానన్నాడు. అలా అయినా ఆమె తన మాట వింటుందని అతడి ఉద్దేశం. ఒకికు కుమిలిపోయింది. తానే పాపం ఎరుగనని ఏడ్చింది. కానీ కరిగిపోయేంత సున్నిత మనస్కుడు కాదు ఒయామా. వదిలేది లేదన్నాడు. దాంతో అవమాన భారాన్ని మోయలేక, అతనికి లొంగనూలేక పెరట్లో ఉన్న బావిలో దూకి మరణించింది ఒకికు. అక్కడితో ఆమె కథ ముగిసిందనుకున్నారంతా. కానీ మరో కొత్త కథకి తెర లేచింది. చనిపోయిన మర్నాడు అర్ధరాత్రి ఒయామా ఇంట్లో ఒకికు ఆత్మ ప్రత్యక్షమైంది. ఇల్లంతా తిరుగుతూ దేనికోసమో వెతికింది. తర్వాత పెద్ద పెట్టున ఏడ్చింది. ఆ పైన నూతి దగ్గరకు వెళ్లి మాయమైంది. అప్పట్నుంచీ ప్రతిరోజూ అర్ధరాత్రి అయ్యేసరికి ఆమె నూతి నుంచి వస్తూనే ఉంది. ఇల్లంతా వెతికి, ఏడ్చి మాయమౌతూనే ఉంది. ఆమె వెతుకుతోంది మాయమైన పదో సెరామిక్ ప్లేట్ కోసమని అందరికీ అర్థమైంది. దొంగతనం చేసిందన్న అపవాదును భరించలేక చనిపోయిన ఆమె, ఆ అపనిందను తుడిపేసుకోవడానికే ఇలా ప్రయత్నిస్తోందని తెలిసొచ్చింది. ఒయామా హడలిపోయాడు. తను చేసిన పాపం బయటపడుతుందేమోనని భయపడ్డాడు. ఆ ఒత్తిడి అతడి నరాల్ని పిండేసింది. పక్షవాతం వచ్చింది. మంచాన పడి నరక యాతన అనుభవించి మరణించాడు. ఆ తర్వాత ఆ బంగ్లా ఒయామా దూరపు బంధువుల చేతికి వెళ్లింది. కానీ ఎవ్వరికీ అక్కడ ఉండేందుకు ధైర్యం చాలలేదు. ప్రతిరాత్రీ ఒకికు వస్తుంటే భయమేసి పారిపోయారు. కొన్నాళ్లకు ఇక ఆ ఇంటివైపు రావడమే మానేశారంతా. కానీ ఒకికు మాత్రం తన వెతుకులాట ఆపలేదు. నిర్దోషినని నిరూపించుకోవాలన్న ఆమె ఆరాటం ఆగనూలేదు. ఇది ఒకికు కథ. అయితే కాలం గడిచేకొద్దీ ఈ కథకు అనేక వెర్షన్లు పుట్టుకొచ్చాయి. ఒకికుని ఒయామాయే చంపి నూతిలో పడేశాడని కొందరు అన్నారు. ఇంకొందరయితే... ఒయామా ఆమె మీద ఆశపడలేదని, ఆమె సెరామిక్ ప్లేట్ పగులగొట్టడంతో కోపోద్రిక్తుడై కొట్టాడని, అనుకోకుండా ఒయామా మరణించిందని అన్నారు. రచయితలు రకరకాల మలుపులతో ఒకికు కథను రాశారు. సినిమావాళ్లు ఆ కథకు మరిన్ని రంగులద్దారు. ఏది ఏమైతేనేం.. ఒయామా చేతిలో ఒకికు బలైపోయిందన్నది వాస్తవం. ఓ అమాయకురాలు... దురహంకారి, దుష్టుడైన యజమాని కారణంగా ప్రాణాలు కోల్పోయింది. చేయని తప్పుకు పడిన నిందను తుడిచేసుకోవడానికి, తన అమాయకత్వాన్ని నిరూపించుకోవడానికి శతాబ్దాలుగా ప్రయత్నిస్తోంది. ఆమె ఏ పాపం చేయలేదని, ఆమెకు అన్యాయం జరిగిందని ప్రపంచమంతా అర్థం చేసుకుంది. కానీ ప్రపంచం తనను అర్థం చేసుకుందన్న విషయం ఒకికుకి ఇంకా అర్థం కాలేదు. అందుకే ఇప్పటికీ ఆమె ఆత్మ... హినెజీ క్యాజిల్‌లో తిరుగాడుతూనే ఉంది! -సమీర నేలపూడి