Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Vk Pandian Quits Acitve Politics In Odisha
ఒడిశా: పాలిటిక్స్‌కు వీకే పాండియన్‌ గుడ్‌బై

భువనేశ్వర్‌: సాధారణ ఎన్నికల ఫలితాలు ఒడిశా రాజకీయాల్లో పెను మార్పులకు కారణమవుతున్నాయి. మాజీ సీఎం నవీన్‌పట్నాయక్ ఆంతరంగికుడు, బిజూ జనతాదళ్‌(బీజేడీ) కీలక నేత వీకే పాండియన్‌ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఆదివారం(జూన్‌9) ఆయన ఒక వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో వీకే మాట్లాడుతూ ‘క్రియాశీలక రాజకీయాల్లో నుంచి నేను తప్పుకుంటున్నా. నా ఈ ప్రయాణంలో ఎవరినైనా గాయపరిస్తే సారీ. నాపై జరిగిన ప్రచారం వల్లే పార్టీ ఓడిపోతే క్షమించండి. నేను చాలా చిన్న గ్రామం నుంచి వచ్చాను. ఐఏఎస్‌ అయి ప్రజలకు సేవ చేయడం చిన్నతనం నుంచే నాకల.పూరీ జగన్నాథుని ఆశీస్సులతో అది సాధించగలిగాను. మా కుటుంబం ఒడిశాలోని కేంద్రపరకు చెందినది కావడం వల్లే ఒడిశాకు వచ్చాను. నేను ఒడిశాలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇక్కడి ప్రజల కోసం కష్టపడి పనిచేశా’అని చెబుతూ వీకే పాండియన్‌ భావోద్వేగానికి గురయ్యారు.

T20 World Cup 2024: Scattered Rain May Wash Out India Vs Pakistan Match At Nassau County
T20 World Cup 2024 IND VS PAK: క్రికెట్‌ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఇవాళ (జూన్‌ 9) మహాసంగ్రామం జరగాల్సి ఉంది. న్యూయార్క్‌ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌ కోసం ఇరు దేశాల అభిమానులతో పాటు యావత్‌ క్రికెట్‌ ప్రపంచం మొత్తం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది. అయితే ఈ బిగ్‌ ఫైట్‌కు ముందు వరుణ దేవుడు క్రికెట్‌ అభిమానులను కలవరపెడుతున్నాడు.మ్యాచ్‌ ప్రారంభ సమయానికి (భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలు) వర్షం పడే సూచనలు ఉన్నట్లు న్యూయార్క్‌ వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షం కారణంగా టాస్‌ కూడా నిర్ణీత సమయంలో పడకపోవచ్చని అంచనా. అయితే సమయం గడిచే కొద్ది వరుణుడు శాంతించవచ్చని సమాచారం. ఒకవేళ వరుణుడు మ్యాచ్‌ ప్రారంభానికి ఆటంకం కలిగించినా ఓవర్ల కుదింపుతో మ్యాచ్‌ సాధ్యపడే అవకాశం ఉంది.మ్యాచ్‌ ప్రారంభానికి రెండున్నర గంటల ముందు అక్కడి వాతావరణం మేఘావృతమై ఉంది. ఒక వేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దైతే భారత్‌, పాక్‌లకు చెరో పాయింట్ లభిస్తుంది.మరోపక్క ఈ మ్యాచ్‌కు కేటాయించబడిన పిచ్‌ ఆటగాళ్లను ఆందోళనకు గురి చేస్తుంది. ఈ డ్రాప్‌ ఇన్‌ వికెట్‌ క్యూరేటర్లకు సైతం అంతుచిక్కని విధంగా ఉంది. అనూహ్య బౌన్స్ కార‌ణంగా బ్యాట‌ర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాటర్ల పాలిట ఈ పిచ్‌ సింహస్వప్నంలా మారింది. ఇప్పటివరకు ఇక్కడ జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు సార్లు మాత్రమే 100కు పైగా స్కోర్లు నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్దమవుతుంది.

Berth To Jp Nadda In Modi Third Cabinet
కేంద్ర కేబినెట్‌లోకి నడ్డా

న్యూఢిల్లీ: బీజేపీ జాతీయఅధ్యక్షుడు జేపీ నడ్డాకు కేంద్ర మంత్రి పదవి ఖరారైంది. నడ్డాను కేబినెట్‌లోకి తీసుకోవాలని నరేంద్ర మోదీ నిర్ణయించారు. మోదీతో పాటు నడ్డా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఖాళీ అవనుంది. ఈ పదవిని బీజేపీ అగ్రనేత, మాజీ కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌కు ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కేబినెట్‌ మంత్రి పదవి ఖరారావడంతో ప్రమాణస్వీకారానికి ముందు ప్రధాని నివాసంలో జరిగిన కాబోయే మంత్రుల చాయ్‌ భేటీకి నడ్డా హాజరయ్యారు.ఎన్సీపీకి నో చాన్స్‌కేంద్ర కేబినెట్ పదవుల్లో ఎన్సీపీకి షాక్‌ తగిలింది. కేంద్ర కేబినెట్‌లో అజిత్‌ పవార్‌ వర్గానికి చాన్స్‌ దక్కలేదు. ఎన్సీపీ నేతప్రపూల్‌ పటేల్‌కు కేంద్ర సహాయమంత్రి పదవిని ఆఫర్‌ చేయగా, ఆయన దాన్ని తిరస్కరించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కేబినెట్‌ మంత్రిగా పని చేసిన తనకు సహాయ మంత్రి ఆఫర్‌ చేయడాన్ని తప్పుపట్టారు. ఇది తనను అవమానించడమేనన్నారు.

Remove 100 Percent Fruit Juice Label And Ads Says FSSAI
ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు కీలక సూచన.. ఇకపై..

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI).. అన్ని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు తమ ఉత్పత్తుల మీద '100% ఫ్రూట్ జ్యూస్' అనే లేబుల్స్, అడ్వర్టైజ్‌మెంట్‌లను తీసేయాలని ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబరు 1లోపు ఇప్పటికే ఉన్న అన్ని ప్రీ-ప్రింటెడ్ ప్యాకేజింగ్ మెటీరియల్‌లను ఎగ్జాస్ట్ చేయమని కూడా సూచించింది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.జ్యూస్ కవర్ మీద 100 శాతం నేచురల్.. తక్కువ చక్కెర కంటెంట్ అని రాసి ఉంటుంది. కానీ ఇలాంటి వాటిలో వంద శాతం ఫ్రూట్ జ్యూస్ ఉండదు. తప్పుడు సమాచారంతో కంపెనీలు ప్రజలను మోసం చేస్తున్నారు. ఫ్రెష్ జ్యూస్ చేసుకోవడం కష్టమని.. చాలామంది రెడిమేడ్ జ్యూస్‌లను కొనుగోలు చేస్తూ.. ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. ఈ కారణంగానే కంపెనీలన్నీ తమ ఉత్పత్తుల మీద లేబుల్స్, అడ్వర్టైజ్‌మెంట్‌లను తొలగించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది.ఎఫ్ఎస్ఎస్ఏఐ కొత్త రూల్స్ ప్రకారం.. కిలో జ్యూస్‌లో 15 గ్రాముల కంటే ఎక్కువ చక్కర ఉంటె స్వీట్ జ్యూస్ అని లేబుల్ వేయాలి. తాజా పండ్ల రసం కాకూండా.. ప్రాసెస్ చేసిన జ్యూస్ ఆరోగ్యానికి చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఇది క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. బరువు పెరగడం, గుండె జబ్బులు వంటి వివిధ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Sania Mirza Will Star in Her Biopic if These Bollywood Heroes Part Of It
నా బయోపిక్‌లో ఈ హీరోల్లో ఎవరు నటించినా ఓకే.. నేను కూడా..

భారత టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా తాజాగా ద గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షోకు హాజరైంది. బాక్సర్‌ మేరీ కోమ్‌, బ్యాడ్మింటన్‌ సైనా నెహ్వాల్‌, షార్ప్‌ షూటర్‌ సిఫ్త్‌ కౌర్‌తో కలిసి ఈ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా కపిల్‌ శర్మ సానియాను ఆసక్తికర ప్రశ్న అడిగాడు. ప్రియాంక చోప్రా మేరీ కోమ్‌ బయోపిక్‌లో నటించింది. ప్రియాంక కజిన్‌ పరిణతి చోప్రా.. సైనా నెహ్వాల్‌ బయోపిక్‌లో మెరిసింది. మంచి నటీనటులు ఎందరో..మరి మీ జీవిత చరిత్ర కథ సంగతేంటి? అని ఆరా తీశాడు. అందుకు సైనా నవ్వుతూ.. మన దేశంలో చాలామంది మంచి యాక్టర్స్‌ ఉన్నారు. ఎవరు నటించినా నాకు ఓకే.. లేదంటే నా పాత్రలో నేనే నటిస్తాను అని చెప్పుకొచ్చింది. దీంతో వెంటనే కపిల్‌ శర్మ.. నువ్వు ‍ప్రేమించే వ్యక్తి పాత్రలో నటించాలనుందని గతంలో షారుక్‌ ఖాన్‌ చెప్పాడని గుర్తు చేశాడు. అందుకు సానియా.. అలాగైతే ముందు నేనెవర్నైనా ప్రేమించాలి కదా! అని బదులిచ్చింది.ఆ హీరోలైతేనే..షారుక్‌ ఖాన్‌ లేదా అక్షయ్‌ కుమార్‌ నా బయోపిక్‌లో నటిస్తానంటే కచ్చితంగా నా పాత్రలో నేనే నటిస్తాను అని చెప్పుకొచ్చింది. కాగా సానియా మీర్జా- షోయబ్‌ మాలిక్‌ ఇటీవలే విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే! సానియాకు విడాకులిచ్చిన వెంటనే షోయబ్‌ పాకిస్తాన్‌ నటి సనా జావెద్‌ను మూడో పెళ్లి చేసుకున్నాడు.చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!

Full list of Cabinet Ministers in Narendra Modi Government
కేంద్ర కేబినెట్‌: మోదీ 3.0 మంత్రులు వీరే..

సాక్షి, ఢిల్లీ: కేంద్ర కేబినెట్‌ ఖరారైంది. ఆదివారం ఉదయం నరేంద్ర మోదీ తన నివాసంలో కొత్త మంత్రులకు తేనీటి విందు ఇచ్చారు. ప్రధాని కార్యాలయం నుంచి ఆహ్వానం అందుకున్న 50 మంది ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాబోయే మంత్రుల సమావేశంలో.. వంద రోజుల యాక్షన్ ప్లాన్ గురించి మోదీ వివరించినట్లు తెలుస్తోంది. అలాగే.. వికసిత భారత్ ఎజెండా పై కొత్త మంత్రులకు మోదీ బ్రీఫ్ చేసినట్లు సమాచారం. బీజేపీ అగ్రనేతలు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీలకు మరోసారి కేబినెట్‌ పదవులు దక్కాయి. వాళ్లకు పాత శాఖల్నే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక.. కీలక శాఖల్ని కూడా బీజేపీ తన వద్దే ఉంచుకోనున్నట్లు సమాచారం. నిర్మలా సీతారామన్‌, జైశంకర్‌, పాత కేబినెట్‌లో ఉన్న తదితరులు మళ్లీ కేబినెట్‌లో చోటు దక్కించుకోబోతున్నారు. మాజీ సీఎంలు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, మనోహర్‌లాల్‌ ఖట్టర్‌లకు కేబినెట్‌లో చోటు దక్కింది.రాష్ట్రపతి భవన్‌లో ఈరోజు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసిన జవహర్‌లాల్‌ నెహ్రూ రికార్డును సమం చేయనున్నారు. బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రాగా... మిత్రపక్షాలతో కలిపి ఎన్డీయే 293 సీట్లతో మెజారిటీ సాధించింది. సంకీర్ణ సర్కార్‌ కేబినెట్‌లో భాగస్వామ్య పార్టీల ఎంపీలు కూడా భాగం కానున్నారు.కేబినెట్‌లో బీజేపీ నుంచి రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మన్సుక్ మండవియ,రావు ఇంద్రజిత్ సింగ్‌లకు చోటు దక్కింది. తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తంగా ఐదుగురికి కేబినెట్‌లో స్థానం లభించింది. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి వర్గంలోకి కిషన్ రెడ్డి, బండి సంజయ్‌కు చోటు దక్కింది. ఒకే వాహనంలో ఈ ఇద్దరూ మోదీ నివాసానికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి నర్సాపూర్ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు కేబినెట్‌ బెర్త్‌ దక్కింది. మోదీ నివాసంలో తేనీటి విందుకు ఈయన కూడా హాజరయ్యారు. రామ్మోహన్ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్(టీడీపీ), కుమార స్వామి (జేడీఎస్‌), లలన్ సింగ్(జేడీయూ), సహాయ మంత్రిగా రామ్ నాత్ ఠాకూర్(జేడీయూ), జితిన్ రామ్ మాంజీ( హిందూస్తాన్ ఆవం మోర్చా), జయంత్ చౌదరి(ఆర్‌ఎల్‌డీ) ప్రతాప్ రావ్ జాదవ్(శివసేన), ప్రఫుల్ పటేల్(అజిత్‌ పవార్‌ ఎన్‌సీపీ), అనుప్రియా పాటిల్(అప్నాదళ్), రామ్దాస్ అత్వాలే(ఆర్పీఐ)లకు చోటు దక్కింది. సాయంత్రం కల్లా కేంద్ర కేబినెట్‌పై.. వాళ్ల వాళ్ల శాఖలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ 50 మంది మోదీతో పాటే ప్రమాణం చేస్తారని సమాచారం.నరేంద్ర మోదీ(ప్రధాన మంత్రి)అమిత్ షారాజ్‌నాథ్ సింగ్నితిన్ గడ్కరీఎస్ జైశంకర్పీయూష్ గోయల్ప్రహ్లాద్ జోషిజయంత్ చౌదరిజితన్ రామ్ మాంఝీరామ్‌నాథ్ ఠాకూర్చిరాగ్ పాశ్వాన్హెచ్‌డీ కుమారస్వామిజ్యోతిరాదిత్య సింధియాఅర్జున్ రామ్ మేఘవాల్ప్రతాప్ రావ్ జాదవ్రక్షా ఖడ్సేజితేంద్ర సింగ్రాందాస్ అథవాలేకిరణ్ రిజుజురావ్ ఇంద్రజీత్ సింగ్శంతను ఠాకూర్మన్సుఖ్ మాండవియాఅశ్విని వైష్ణవ్బండి సంజయ్జి కిషన్ రెడ్డిహర్దీప్ సింగ్ పూరిబి ఎల్ వర్మశివరాజ్ సింగ్ చౌహాన్శోభా కరంద్లాజేరవ్‌నీత్ సింగ్ బిట్టుసర్బానంద సోనోవాల్అన్నపూర్ణా దేవిజితిన్ ప్రసాద్మనోహర్ లాల్ ఖట్టర్హర్ష్ మల్హోత్రానిత్యానంద రాయ్అనుప్రియా పటేల్అజయ్ తమ్తాధర్మేంద్ర ప్రధాన్నిర్మలా సీతారామన్సావిత్రి ఠాకూర్రామ్ మోహన్ నాయుడు కింజరాపుచంద్రశేఖర్ పెమ్మసానిమురళీధర్ మొహల్కృష్ణపాల్ గుర్జర్గిరిరాజ్ సింగ్గజేంద్ర సింగ్ షెకావత్శ్రీపాద్ నాయక్సి.ఆర్.పాటిల్

Who was Arnon Zamora
ఇజ్రాయెల్‌ హీరో? ఎవరీ అర్నాన్ జమోరా

హమాస్‌ చెరలో బంధీలుగా ఉన్న నలుగురు ఇజ్రాయెల్‌ పౌరులు సురక్షితంగా బయటపడ్డారు. అయితే ఈ కఠినమైన ఆపరేషన్‌ను విజయవంతం చేసేందుకు ఐడీఎఫ్‌ కమాండర్‌ అర్నాన్ జమోరా ప్రాణాల్ని ఫణంగా పెట్టారు. హమాస్‌ మెరుపు దాడుల నుంచి విరోచిత పోరాటం చేసి ప్రాణాలొదిన అర్నాన్‌ జమెరాను ఇజ్రాయెల్‌ ప్రభుత్వంతో పాటు ఆ దేశ పౌరులు హీరోగా కీర్తిస్తున్నారు. శనివారం హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న నావో అర్గమణి, అల్మోగ్‌ మీర్‌ జాన్‌, ఆండ్రీ కోజ్లోవ్‌, ష్లోమి జివ్‌లను ఇజ్రాయెల్‌ నేషనల్‌ కౌంటర్‌ టెర్రరిజం యూనిట్‌ (యమమ్)కమాండర్‌, టాటికల్‌ ఆపరేటర్‌ అర్నాన్ జమోరా నుసిరత్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్లు చేపట్టి వారిని రక్షించారు. ఈ తరుణంలో ప్రత్యర్ధుల దాడిలో కమాండర్‌ అర్నాన్‌ జమెరా ప్రాణాలొదారు. తాజాగా, ఆయన మరణంపై ఇజ్రాయెల్‌ మరణంపై విదేశాంగ మంత్రిత్వ శాఖ విచారం వ్యక్తం చేసింది.Behind every rescue mission, are Israeli men and women who risk their lives. We are devastated to share that Chief Inspector Arnon Zamora, commander and tactical operator in the Yamam (National Police Counter-Terrorism Unit), who was critically wounded in the operation to… pic.twitter.com/4P3qRre7Ia— Israel Foreign Ministry (@IsraelMFA) June 8, 2024బాధకలిగించిందిప్రతి రెస్క్యూ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్‌ సైనికులు తమ ప్రాణాల్ని ఫణంగా పెడుతున్నారు. హమాస్‌ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్‌ పౌరుల్ని రక్షించే క్రమంలో తీవ్రంగా గాయపడిన యమమ్ (నేషనల్ పోలీస్ కౌంటర్-టెర్రరిజం యూనిట్)లో కమాండర్,టాక్టికల్ ఆపరేటర్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆర్నాన్ జమోరా ప్రాణాలొదలడం బాధకలిగించిందని ఇజ్రాయెల్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ట్వీట్‌లో పేర్కొంది.అర్నాన్ జమోరా ఎవరు?ఇజ్రాయెల్‌ మీడియా సంస్థ హారెట్జ్ ప్రకారం..ఇజ్రాయెల్ నగరం స్డెరోట్ సమీపంలో జమోరా స్డే డేవిడ్ గ్రామానికి చెందిన వారు. ఆయనకు భార్య మిచాల్‌ ఇద్దరు పిల్లలు, అతని తల్లిదండ్రులు రూవెన్ రూతీలతో కలిసి ఉంటున్నారు.ఇక జమెరా గతేడాది అక్టోబర్ 7 న యాద్ మొర్దెచాయ్ ప్రాంతంలో అనేక మంది హమాస్‌ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గల్లంట్ జామెరా ధైర్య సహాసాల్ని గుర్తు చేసుకున్నారు. గాజాలో హమాస్ చేతిలో ఉన్న 4 మంది బందీలను రక్షించడానికి సాహసోపేతమైన ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన అర్నాన్‌ జమోరా మృతిపై విచారం వ్యక్తం చేశారు.

Britain's Sark Island Prison Is The Smallest In The World
ప్రపంచంలోనే అతిచిన్న జైలు.. ఖైదీలు ఎందరో తెలుసా?

ఇది ప్రపంచంలోనే అతిచిన్న చెరసాల. ఇద్దరు ఖైదీల సామర్థ్యం మాత్రమే గల ఈ జైలు బ్రిటన్‌లోని సార్క్‌ దీవిలో ఉంది. ఇంగ్లండ్, ఫ్రాన్స్‌ దేశాల మధ్య ఇంగ్లిష్‌ చానల్‌లోని చానల్‌ దీవుల ద్వీపసమూహంలో ఒకటైన సార్క్‌ దీవి విస్తీర్ణం 5.4 చదరపు కిలోమీటర్లు మాత్రమే! ఈ దీవి జనాభా 562 మంది.ఈ దీవిలో 1856లో ఈ జైలును నిర్మించారు. చెక్కపీపాను దీనికి పైకప్పుగా ఏర్పాటు చేయడం ఇందులోని మరో విశేషం. తొలిరోజుల్లో ఈ జైలుకు విద్యుత్‌ సౌకర్యం కూడా ఉండేది కాదు. జైలు నిర్మించిన దాదాపు శతాబ్దం తర్వాత మాత్రమే దీనికి విద్యుత్తు సౌకర్యం వచ్చింది. ఇందులో ఇద్దరు ఖైదీల కోసం రెండు గదులు, రెండు గదుల మధ్య సన్నని నడవ మాత్రమే ఉంటాయి. ఈ జైలు ఇప్పటికీ వినియోగంలో ఉండటం విశేషం.అయితే, ఈ జైలులో ఖైదీలను ఎక్కువకాలం నిర్బంధంలో ఉంచరు. ఏదైనా నేరారోపణతో పట్టుబడిన నిందితులను ఈ జైలులో రెండు రోజుల వరకు ఉంచుతారు. కోర్టులో హాజరుపరచిన తర్వాత ఇక్కడి నుంచి గ్రంజీ దీవిలోని పెద్ద జైలుకు తరలిస్తారు. సార్క్‌ దీవి అధికార యంత్రాంగానికి బ్రిటిష్‌ రాచరికం పరిమితంగా మాత్రమే న్యాయవిచారణ అధికారాలను ఇచ్చింది.ఇక్కడ పట్టుబడిన ఖైదీలను రెండు రోజులకు మించి నిర్బంధించరాదని, అంతకు మించిన శిక్ష విధించాల్సిన నేరానికి పాల్పడినట్లయితే వారిని గ్రంజీ జైలుకు తరలించాలని 1583లో అప్పటి బ్రిటిష్‌ రాచరికం ఆదేశాలు జారీచేసింది. ఆనాటి ఆదేశాలే ఇక్కడ ఈనాటికీ అమలులో ఉన్నాయి. అయితే, ఈ జైలుకు తరచు ఖైదీల రాక ఉండదు. తక్కువ జనాభా గల ఈ దీవిలో నేరాలు కూడా చాలా తక్కువ.ఇవి చదవండి: 'అపార్ట్‌మెంట్‌ 66బి’ గురించి.. కనీసం మాట్లాడాలన్నా ధైర్యం చాలదు!

Differences Between Pithapuram Tdp And Jana Sena
టీడీపీ Vs జనసేన.. పిఠాపురంలో మరో రచ్చ..

సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం టీడీపీ-జనసేన మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. తాటిపర్తి గ్రామంలో ఆ పార్టీల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. అపర్ణ దేవి అమ్మవారి ఆలయ బాధ్యతలను గత పాలక కమిటీ జనసేన నాయకులకు అప్పగించింది. ఆలయ బాధ్యతల కోసం జనసేన-టీడీపీ పార్టీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పవన్ గెలుపు కోసం పని చేసిన మమ్మల్ని జనసేన నీచంగా చూస్తుందంటూ టీడీపీ నేతలు ఆవేదన వ్యక్త చేస్తున్నారు. జనసేన దుశ్చర్యలను జనం చూస్తున్నారని మండిపడ్డారు. ఆలయ తాళాలు గ్రామ కమిటికి ఇవ్వాలని టీడీపీ డిమాండ్‌ చేస్తోంది.ఇదిలా ఉండగా, పిఠాపురం టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్‌ వర్మపై జనసేన కార్యకర్తలు దాడికి దిగిన సంగతి తెలిసిందే.. రాళ్లు, కొబ్బరికాయలతో దాడి చేయడంతో ఆయన కారు అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలో వర్మతో సహా పలువురికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో స్థానిక సర్పంచ్‌తో మంతనాలు జరిపేందుకు వర్మ వెళ్లారు.ఈ విషయం తెలుసుకున్న ఆ గ్రామ జనసేన నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడకు వచ్చి వర్మను అడ్డుకున్నారు. ‘మాకు తెలియకుండా మా గ్రామం ఎందుకు వచ్చారు.. మాకు తెలియకుండా మా గ్రామంలో ఇతర పారీ్టల వాళ్లను ఎందుకు కలుస్తున్నారు’ అంటూ వర్మను నిలదీశారు. మీకు చెప్పాల్సిన పని లేదంటూ వర్మ వారికి బదులివ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన జనసేన నేతలు, కార్యకర్తలు ఒక్కసారిగా ఆయనపై దాడికి దిగారు.

Sakshi Editorial On results in evms
‘బలి’ కోరుతున్న సాంకేతిక విజయం!

‘ది హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ గోల్‌ గురించి క్రీడా ప్రియులందరూ వినే ఉంటారు. 1986 ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ సందర్భంగా అర్జెంటీనా – ఇంగ్లండ్‌ మ్యాచ్‌లో డీగో మారడోనా చేసిన తొలి గోల్‌ వివాదాస్పదమైంది. డీగో చేసిన హెడర్‌ గోల్‌ను వాస్తవానికి చేత్తో నెట్టాడని ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రికార్డింగ్‌ సౌకర్యం లేకపోవడం వల్ల రెఫరీ దాన్ని గోల్‌గానే ప్రకటించాడు. తర్వాత నాలుగు నిమిషాలకే ‘గోల్‌ ఆఫ్‌ ది సెంచరీ’ని కొట్టిన మారడోనా, అదే ఊపులో వరల్డ్‌ కప్‌ను గెలుచుకోవడమే గాక ఫుట్‌బాల్‌ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించారు. వివాదాస్పద గోల్‌పై ఆ తర్వాత స్పందించిన మారడోనా అది ‘సగం మారడోనా హెడ్, సగం హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ ఫలితమని ప్రకటించాడు.దుబాయ్‌లో ఇటీవల కురిపించిన కృత్రిమ వర్షం ఎంత బీభత్సాన్ని సృష్టించిందో ప్రపంచమంతా చూసింది. క్లౌడ్‌ సీడింగ్‌ ఓవర్‌డోస్‌కు వాతావరణ మార్పులు కూడా తోడైన ఫలితంగా రెండేళ్లలో కురవాల్సిన వర్షమంతా ఒకేరోజు కురిసి ఎమిరేట్‌ను అతలాకుతలం చేసింది.ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి జరిగిన ఎన్నికల ఫలితాలను చూస్తుంటే ఏదో ‘అదృశ్య హస్తం’ (హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌) పనిచేసినట్టుగా, కృత్రిమ ఓట్ల వర్షం కురిపించినట్టుగా అనిపించక మానదు. లేదంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇటువంటి ఫలితాలు రావాలంటే రష్యా నాయకుడు పుతిన్‌ లేదా తుర్కియే పాలకుడు ఎర్డోగాన్‌ లేదా మయన్మార్‌ మిలిటరీ జుంటా ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగి ఉండాలి. అలా జరగలేదు కాబట్టి ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ ప్రమేయం ఉండాలి. ఎవరా గాడ్‌? కేంద్ర ప్రభుత్వమా? ఎన్నికల సంఘమా... ఎవరు? కృత్రిమ ఓట్ల వర్షానికి క్లౌడ్‌ సీడింగ్‌ ఎవరు చేశారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ జనసామాన్యం మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి.ఎలక్ట్రానిక్‌ వోటింగ్‌ మెషిన్‌లను ట్యాంపరింగ్‌ చేయడం ద్వారా ఫలితాలను తారుమారు చేయడం సాధ్యమేనని స్వయంగా చంద్రబాబే పలుమార్లు ప్రకటించారు. ఆయన అభిమాని వేమూరి రవి ఇంకొంచెం ముందుకెళ్లి ఈవీఎమ్‌లను ఎలా హ్యాక్‌ చేయవచ్చో మీడియా సమక్షంలోనే ప్రదర్శించి చూపెట్టారు. అందువల్ల ఈవీఎమ్‌ల ట్యాంపరింగ్‌ అనే ఆర్ట్‌పై కూటమికి స్పష్టమైన అవగాహన ఉన్నది.రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రం 5 గంటలకు 68 శాతం ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. కానీ తుది వివరాలను ప్రకటించడానికి దాదాపు మూడు రోజుల సమయాన్ని తీసుకున్నది. ఈ అసాధారణ జాప్యంపై సందేహాలను లేవనెత్తుతూ ‘టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా’ పత్రిక సైతం కథనాన్ని ప్రచురించింది. ఆ గడువు ముగిసిన తర్వాత పోలయిన ఓట్ల సంఖ్య కూడా అనుమానాలను రేకెత్తించే విధంగానే ఉన్నది.తుది పోలింగ్‌ శాతాన్ని సుమారు 81గా నిర్ధారిస్తూ మూడు రోజుల తర్వాత ఈసీ తాపీగా ప్రకటన విడుదల చేసింది. మామూలుగా పోలింగ్‌ సమయం ముగిసిన తర్వాత పోలింగ్‌ కేంద్రం ఆవరణలో నిలబడి ఉన్నవారికి స్లిప్స్‌ పంపిణీ చేస్తారు. వారికి మాత్రమే ఓటువేసే అవకాశం కల్పిస్తారు. అలా నిలబడిన వారికి ఈసారి ఎందుకనో స్లిప్స్‌ లేదా టోకెన్లు పంపిణీ చేయలేదనే వార్తలు వినవస్తున్నాయి. ఇది అనుమానించదగ్గ అంశం.పోలింగ్‌ గడువు ముగిసిన తర్వాత ప్రాంగణంలో నిలబడి ఉన్నవారి సంఖ్య మనకున్న సమాచారం మేరకు ఎక్కడా యాభై నుంచి వంద దాటలేదు. వీరు ఓట్లు వేయడానికి ఇంకో రెండు, మూడు గంటలు చాలు. అంటే తొమ్మిది గంటలకల్లా పోలింగ్‌ పూర్తి కావాలి. కానీ అర్ధరాత్రి దాటిందాకా పోలింగ్‌ జరుగుతూనే ఉందట! అంటే ఆ యాభైమందే అంతసేపూ సైక్లింగ్‌ చేస్తున్నారా? వేలాది పోలింగ్‌ బూత్‌లలో గడువు ముగిసే సమయానికి 65 నుంచి 70 శాతం మధ్యనున్న పోలింగ్‌ శాతం తుది ప్రకటన వచ్చేసరికి 85 నుంచి 95 శాతం దాకా ఎగబాకింది.పోలింగ్‌కు ముందు జరిగిన రాజకీయ పరిణామాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. ఎన్డీఏ కూటమిలో చేరడం కోసం చంద్రబాబు పడిన పాట్లు, భరించిన అవమానాలు తెలిసినవే. కూటమిగా కుదురుకున్న తర్వాత వారు ‘ఎలక్షనీరింగ్‌’ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. అనేక ప్రాంతాల్లోని ప్రభుత్వాధికారులను బదిలీ చేశారు. కనీవినీ ఎరుగని విధంగా ఏ ప్రాంతంలో ఏ అధికారిని నియమించాలో కూడా ఎన్నికల సంఘానికి సూచించారు. ఈసీ కూడా కూటమి కోర్కెలన్నింటినీ మారుమాట్లాడకుండా నెరవేర్చింది. సాధారణంగా తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడూ తొలి ఫేజ్‌లోనే ఉంటూ వచ్చాయి. కానీ కూటమి కోరిక మేరకు ఈసారి నాలుగో ఫేజ్‌కు నెట్టివేశారు.మొదటి మూడు దశల పోలింగ్‌ తర్వాత జాతీయ స్థాయిలో ఎన్డీఏలో అభద్రతా భావం మొదలైందట. పోలింగ్‌ సరళి తమకు అనుకూలంగా లేదనే నిర్ధారణకు ఎన్డీఏ పెద్దలు వచ్చారు. నాలుగో దశకు ఎన్నికలను వాయిదా వేయించుకున్న చంద్రబాబు అదనంగా లభించిన సుమారు నెల రోజుల సమయాన్ని ప్రత్యేక ‘ఏర్పాట్ల’ కోసం ఉపయోగించుకున్నారు. ఈ ఏర్పాట్లకు ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ పూర్తిగా సహకరించింది. దేశవ్యాప్తంగా 19 లక్షల ఈవీఎమ్‌ల మిస్సింగ్‌పై ఇప్పటికీ కేంద్రం నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదు. ఇవెక్కడున్నాయి? ఏ పనికి వినియోగిస్తున్నారు? ఎవరి సేవల కోసం ‘హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌’ వీటిని వినియోగిస్తున్నారో తేలవలసి ఉన్నది.గడచిన ఐదేళ్లుగా ప్రత్యర్థులపై లేని దాడులను ఉన్నట్లుగా చూపించి గగ్గోలు పెట్టినవారు పోలింగ్‌ రోజు సాయంత్రం, మరునాడు – మళ్లీ కౌంటింగ్‌ రోజు నుంచి గత నాలుగు రోజులుగా జరిగిన హింసాకాండపై మౌనం వహించారు. ఈ హింసాకాండ కూడా అప్పటికప్పుడు ఆవేశంతో చెలరేగినట్టు లేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఒక క్రమం కనిపిస్తున్నది. కృత్రిమ ఓట్ల వర్షం కురిసే సమయానికి ఎవరూ పోలింగ్‌ కేంద్రాల వైపు వెళ్లకుండా బెదరగొట్టేందుకు దాడులు జరిగాయి. మరుసటి రోజు కూడా చాలాచోట్ల ఇవి కొనసాగాయి. మళ్లీ కౌంటింగ్‌ పూర్తవుతున్న సమయం నుంచి నాలుగు రోజులుగా యథేచ్ఛగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి. అసాధారణమైన ఓటింగ్‌ సరళిని సమీక్షించడానికి ప్రత్యర్థులు గ్రామాల్లో పర్యటించే అవకాశం లేకుండా బెదరగొట్టడానికి ఈ దాడులు జరిగాయి. పోలీసు యంత్రాంగం పూర్తిగా కూటమి వ్యూహానికి తోడుగా నిలబడింది.విచక్షణారహితంగా జరుగుతున్న ఈ దాడులు మన ప్రజాస్వామ్య భవిష్యత్తు మీద ప్రశ్నార్థకాన్ని రచిస్తున్నాయి. ఈ దాడులను ఖండించకపోగా ‘వైఎస్సార్‌సీపీ కవ్వింపు చర్యలకు రెచ్చిపోకండ’ని ముఖ్యమంత్రి కాబోయే చంద్రబాబు ట్వీట్‌ చేశారు. గత రెండేళ్లుగా లోకేశ్‌ ఒక రెడ్‌బుక్‌ను సభల్లో ప్రదర్శిస్తూ హెచ్చరికలు జారీ చేసేవారు. తాను రెడ్‌బుక్‌లో పేర్లు ఎక్కించిన వారి సంగతి అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తానని చెప్పేవారు. ఇప్పుడా రెడ్‌బుక్‌ హోర్డింగ్‌లను కూడళ్లలో ఏర్పాటు చేశారు. దాని సందేశమేమిటో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు.సందేశం గూండాతండాలకు స్పష్టంగానే అర్థమైంది. టీడీపీ వారికి చాలాచోట్ల జనసైనికులు కూడా తోడయ్యారు. ప్రత్యర్థులపై దాడులు చేస్తున్న సందర్భాల్లో పోలీసులు మౌన ప్రేక్షక పాత్రను పోషించారు. కొన్నిచోట్ల పారిపోతూ కనిపించారు. ఇప్పటివరకు బయటకొచ్చిన వీడియోల్లో ఇటువంటి దృశ్యాలెన్నో కలవరం కలిగించాయి.నూజివీడులో వైసీపీకి చెందిన ముసినిపల్‌ కౌన్సిలర్‌ను వెంబడించి కత్తులతో పొడుస్తున్న దృశ్యం పిండారీల దండయాత్రను తలపించింది. ఒక హాస్టల్‌ నిర్వాహకుడి ఇంటిపై దాడిచేసి గృహాన్ని ఛిద్రం చేసి, ఆ పెద్దమనిషిని మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్లు పట్టించుకున్న పైశాచికత్వం భయానకంగా కనిపించింది. రాళ్ల దాడులు, కర్రలతో దాడులు, కత్తులతో దాడులు, కిడ్నాప్‌లు... ఎన్నెన్ని దృశ్యాలు? వైసీపీకి చెందిన వారి కార్యాలయాలను పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. వాహనాలను తగులబెట్టారు. జెండా దిమ్మెలను సుత్తులతో పగులగొట్టారు. శంకుస్థాపన ఫలకాలను ధ్వంసం చేశారు. గ్రామ సచివాలయాల మీద దాడులు చేశారు. వైఎస్సార్‌ విగ్రహాలను తొలగించి ఈడ్చుకుంటూ అవమానించారు.వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయంపై వైఎస్సార్‌ అక్షరాలు తొలగించారు. ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్‌ల వంటి విప్లవాత్మక కార్యక్రమాలను ప్రారంభించిన వైఎస్సార్‌ పేరు ఆరోగ్య విశ్వవిద్యాలయానికి బాగుంటుందని భావించిన ప్రభుత్వం చట్టసవరణ ద్వారా ఎన్టీఆర్‌ పేరును మార్చి వైఎస్సార్‌ పేరు పెట్టారు. బదులుగా విజయవాడ కేంద్రంగా ఏర్పడిన కొత్త జిల్లాకు ఎన్టీఆర్‌ పేరును పెట్టారు. ఒక అల్లరిమూక దాడి చేసి ఇప్పుడా అక్షరాలను తొలగించింది..విశ్వవిద్యాలయాల మీద కూడా దాడులకు తెగబడ్డారు. వీసీలు, రిజిస్ట్రార్‌లు తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రభు త్వం మారితే యూనివర్సిటీ పాలకవర్గాలను కూడా మార్చాలనే ఓ కొత్త ఆచారానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు కనిపిస్తున్నది. నామినేటెడ్‌ పదవుల్లో ఉన్నవారు రాజీనామాలు చేయడం సంప్రదాయం కానీ, ఇవి నామినేటెడ్‌ పదవులు కావు. సెర్చ్‌ కమిటీ సిఫారసుల మేరకు గవర్నర్‌ చేసిన నియామకాలు. అయినా సరే తమ పార్టీవాడే వీసీగా కూర్చోవాలనే దుందుడుకుతనం ప్రజాస్వామిక పద్ధతులను దెబ్బతీస్తున్నది.భయానక వాతావరణాన్ని కల్పించడం ద్వారా ప్రతిపక్షాలను కట్టడి చేయాలని కొత్త ప్రభుత్వం భావిస్తే అది నెరవేరే అవకాశం ఉండదు. నాలుగు రోజులు ఆలస్యమైనా సరే ఎన్నికల అవకతవకలపై వారు దృష్టి సారించకుండా ఉండరు. నిజానిజాలు తవ్వితీయకుండా ఉండరు. అలాగే కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం జనంతో కలిసి విపక్షాలు కచ్చితంగా ఉద్యమిస్తాయి. కూటమికి లభించిన విజయం సాంకేతికమైనదే. అయినా సరే, ప్రభుత్వాన్ని అదే ఏర్పాటు చేస్తుంది. అడ్డంకులేమీ ఉండవు. చేసిన హామీలను నెరవేర్చి, ప్రజాస్వామిక వాతావరణాన్ని పునరుద్ధరించితే కొత్త ప్రభుత్వం ప్రజల మన్నన పొందుతుంది.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement