సిమ్రాన్, అవినాష్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం | Simran Choudhary New Upcoming Movie Update, Deets Inside | Sakshi
Sakshi News home page

సిమ్రాన్, అవినాష్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం

Jun 9 2024 6:08 PM | Updated on Jun 9 2024 7:19 PM

Simran Choudhary New Movie Telugu Latest

అవినాష్‌ తిరువీధుల, సిమ్రాన్‌ చౌదరి హీరోహీరోయిన్లుగా కొత్త సినిమా ప్రారంభమైంది. కార్తి దర్శకుడు కాగా... శాంత నూపతి, ఆలపాటి రాజా, అవినాష్‌ బుయాని, అంకిత్‌రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ సినిమాస్ ఎల్ఎల్‌పీ ప్రొడక్షన్‌ నెం.1గా తీస్తున్న ఈ మూవీ.. హైదరాబాద్‌లోని సారధి స్టూడియోలో పూజా కార్యక్రమాలతో మొదలైంది. తొలి సన్నివేశానికి ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేయగా, ప్రముఖ దర్శకుడు బాబీ ఫస్ట్‌ షాట్‌కు దర్శకత్వం వహించారు. హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమీషనర్‌ శ్రీనివాసరెడ్డి క్లాప్‌ కొట్టారు.

(ఇదీ చదవండి: నటి ఇంట్లో చోరీ.. 10 తులాల బంగారం, డబ్బు దొంగతనం)

మంచి సినిమా తీయాలనే కోరికతో అమెరికా నుంచి వచ్చాము. దాదాపు 4 సంవత్సరాలకుపైగా ప్రయత్నం చేస్తున్నాం. మధ్యలో కరోనా వల్ల చాలా టైం వేస్ట్‌ అయ్యింది. దాదాపు 30 కథలు దాకా విన్నాము. మా రైటర్‌ విశ్వజిత్‌ చెప్పిన ఈ లైన్‌ బాగా నచ్చింది. దీనికి తోడు సాయిమాధవ్‌ బుర్రాగారు మా సినిమాకు డైలాగ్స్‌ రాయడం మరింత ప్లస్‌ అవుతుంది. మంచి హిట్‌ సినిమాకు కావాల్సినవి అన్నీ ఇందులో ఉన్నాయి. మంచి టెక్నీషియన్స్‌ కుదిరారు అన్నారు.

(ఇదీ చదవండి: కోట్ల రూపాయల కారు గిఫ్ట్‌.. ఎలుకల వల్ల నష్టపోయానన్న హీరో!)

Advertisement
 
Advertisement
Advertisement