Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

TDP Attacks YSRCP Cadre AP Govt Properties Updates
ఏపీలో టీడీపీ తాలిబన్లు

అటు కౌంటింగ్‌ పూర్తి కాగానే.. ఇటు అటాకింగ్‌ మొదలుపెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులు, ఆఖరికి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జెండాలు మోసిన వాళ్లను లక్ష్యంగా చేసుకుని టీడీపీ మూకుమ్మడి దాడులు చేస్తోంది. శ్రీకాకుళం టూ చిత్తూరు వరకు ఈ దమనకాండ కొనసాగుతోంది. రాజకీయ ప్రతీకారంతో.. రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మారుస్తోంది.రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల వైఎస్సార్‌సీపీ లక్ష్యంగా టీడీపీ శ్రేణులు దాడులకు దిగుతున్నాయి. కత్తులతో, కర్రలతో పచ్చ మూక రెచ్చిపోతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ దాడులను పోలీసులు చూసి చూడనట్లు వదిలేస్తుండడం మరింత విమర్శలకు తావిస్తోంది ఇప్పుడు.➡️ ఏలూరు జిల్లా నూజివీడులో వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ కౌన్సిలర్‌ నడుకుదుటి గిరీష్‌పై టీడీపీ కార్యకర్తలు కత్తులతో దాడికి దిగారు. స్థానికులు ఆయన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి సమయంలో అక్కడే ఉన్న పోలీసులు కనీసం అడ్డుకునే యత్నం కూడా చేయలేదు.➡️అనంతపురం కళ్యాణదుర్గంలో వైఎస్సార్ సీపీ నేత ఉమామహేశ్వర నాయుడు ఇంటిపై టీడీపీ నేతల దాడికి దిగారు. ఈ దాడిలో రెండు కార్లు, ఎన్నికల ప్రచార వాహనం ధ్వంసం అయ్యాయి. ఇంటి కిటికి అద్దాలు పగలకొట్టారు. ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులపై టీడీపీ నేతల రౌడీయిజం ప్రదర్శించారు. ఏకంగా కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాస్ ను బెదిరించారు. దీంతో.. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు వర్గీయులపై పోలీసులకు ఉమామహేశ్వరనాయుడు ఫిర్యాదు చేశారు.➡️కర్నూలు జిల్లా ఆదోని మండలం అలసంద గుత్తిలో టీడీపీ శ్రేణులు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై రాళ్లు విసిరాయి. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవాళ్లలో స్థానిక ఎస్సై కూడా ఉన్నట్లు తెలుస్తోంది.➡️నంద్యాల బనగానపల్లె పట్టణం GM టాకీస్ వద్ద కొండపేట వైఎస్సార్‌సీపీ కార్యకర్త అబ్దుల్ సుకూర్ పై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. తలకు బలమైన గాయాలు కావడంతో ఆయన్ని బనగానపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.➡️కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులో వైఎస్సార్‌సీపీ నేత కొమ్మా కోట్లు ఇంటిపై గత అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. అపార్ట్మెంట్ కింద ఉన్న ఆయన కారు అద్దాలు ధ్వంసం చేశారు. ➡️చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పై కొనసాగుతున్న టీడిపి నేతలు దాడులు. చిత్తూరు నగరంలోని బోడిగుట్ట చెందిన ఖాధర్ను సాయంత్రం 6 గంటలకు కిడ్నాప్ చేసిన టీడీపీ జనసేన కార్యకర్తలు. బీరు బాటిల్ - రాడ్ తో దాడి చేసిన వైనం.ప్రభుత్వ ఆస్తులపైనా..కేవలం వైఎస్సార్‌సీపీ శ్రేణుల్ని, వైఎస్సార్‌సీపీ జెండా.. దిమ్మెల్ని మాత్రమే కాదు.. జగన్‌ సంక్షేమ పాలనకు కేంద్రాలుగా నిలిచిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్‌లు, స్కూల్స్‌.. ఇలా దేని వదలకుండా టీడీపీ శ్రేణులు దాడులకు తెగపడుతున్నాయి. ➡️గుంటూరు దుగ్గిరాల మండలం ఈమని గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రంపై టీడీపీ నేతలకు దాడికి దిగారు. బోర్డులు తొలగించి ఫర్నిచర్ ధ్వంసం చేశారు.➡️పల్నాడు జిల్లా గురజాల మండలం పులిపాడు గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రంపై దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు.. సచివాలయంలోని వైయస్ జగన్‌ చిత్రపటాన్ని ధ్వంసం చేశారు.➡️ నంద్యాల అవుకు మండలం సంఘపట్నం గ్రామంలో టీడీపీ కార్యకర్తలు హల్‌ చల్‌ చేశారు. ప్రభుత్వ గ్రామ సచివాలయం భవన ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిచిన బీసీ జనార్దన్ రెడ్డి సమీప బంధువు I.V పక్కిరారెడ్డి సొంత గ్రామం ఇది.వలంటీర్లను వదలడం లేదుజగన్‌ ఆలోచనల నుంచి పుట్టి.. ప్రజల కోసం ఐదేళ్ల పాటు నిర్విరామంగా పని చేసిన వలంటీర్‌ వ్యవస్థను దెబ్బ తీసేందుకు టీడీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. వాళ్లపై ప్రతీకార చర్యలకు దిగుతోంది. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో టీడీపీ నేతలు అరాచకాలకు దిగారు. శ్రీకాళహస్తి రూరల్ మండలం వాగివేడు హరిజన వాడ లో వలంటీర్లు పృథ్వీ , మహేశ్వరి ఇళ్లపై దాడులు చేస్తున్నారు. మూడు రోజులు నుంచి వాళ్లను ఇంటినుంచి బయటకు వెళ్ళకుండా అడ్డుకుంటున్నారు. వాళ్ల ఇంటి ముందు రోడ్డుపై కంచె వేశారు. ఇది తమ దృష్టికి వచ్చినా.. స్థానిక పోలీసులు కనీసం పట్టించుకోవడం లేదు.ఏం లేదు... ఉరికే ఆ కారు మీద YCP అని రాసి ఉంది అంట అంతే .. ఆ కారులో ఉన్నది ఎవరో కూడా వాళ్ళకి తేలియదు.. తెలుగుదేశం జనసేన చెప్పిన డెవలప్మెంట్ వచ్చేసింది .. #tdp_jsp_gundaraj pic.twitter.com/6681BZajph— Surya Bhagath (@SuryaBhagat7) June 6, 2024ఐదేళ్లు.. ప్రశాంతంగా ఉన్న ఏపీలో ఇప్పుడు అల్లకల్లోం రేగుతోంది. శాంతిభద్రతలు అదుపు తప్పే దిశగా పయనిస్తున్నాయి. రాష్ట్రంలో ఫలితాలు వెలువడ్డాక దాడులు జరగొచ్చని, కౌంటింగ్‌ జరిగాక కూడా అప్రమత్తంగా ఉండాలన్న నిఘా వర్గాలు పోలీసులను ఇది వరకే హెచ్చరించాయి. అయినా కూడా పోలీసులు ఆ హెచ్చరికలను ఏమాత్రం పట్టించుకోకపోవడం.. టీడీపీ శ్రేణుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తుండడం .. ఏపీ అంతటా కనిపిస్తున్నాయి.

We Will Bounce Back YS Jagan With YSRCP Leaders
పార్టీ శ్రేణులకు అండగా నిలవండి: వైఎస్‌ జగన్‌

గుంటూరు, సాక్షి: ప్రజలకు మంచి చేశాం.. కచ్చితంగా పార్టీ ఫునర్వైభవం సాధించి తీరుతుందని పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వద్ద నమ్మకం వ్యక్తం చేశారు వైఎస్సార్‌సీపీ నేతలు. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, పోటీచేసిన అభ్యర్థులు గురువారం సాయంత్రం తాడేపల్లికి వెళ్లి వైఎస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా టీడీపీ దాడుల గురించి నేతలు ప్రస్తావించగా.. పార్టీ తరఫున న్యాయపరమైన చర్యలకు వెళ్తున్నామని, ఈ టైంలో పార్ట శ్రేణులకు అండగా నిలవాలంటూ నేతలకు వైఎస్‌ జగన్‌ సూచించారు.వైఎస్‌ జగన్‌తో పార్టీ నేతలు.. ‘‘ప్రజలకు మంచి చేశాం, కచ్చితంగా పార్టీ పునర్‌ వైభవం సాధిస్తుందనే నమ్మకం మాకుంది. రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో జీవన ప్రమాణాలు పెంచడానికి మీరు(జగన్‌ను ఉద్దేశించి) చేసిన విశేష కృషి కచ్చితంగా ప్రజల మనసుల్లో నిలిచిపోయింది. వ్యవసాయం, విద్య, వైద్యం తదితర రంగాల్లో తీసుకొచ్చిన గణనీయమైన మార్పులు ప్రజల జీవితాలను మార్చేదిశగా గొప్ప అడుగులుగా నిలిచిపోతాయి. .. ఈవీఎం మేనేజ్‌మెంట్‌ అనుమానాలు, ఈసీ–కొంతమంది పోలీసు అధికారుల కుట్రల నేపథ్యంలో కూడా సీట్లు గణనీయంగా తగ్గిపోయాయి. అయినా కూడా 40శాతం ఓటింగ్‌ వచ్చిందంటే సంక్షేమ పథకాలే కారణం. గడచిన ఐదేళ్లలో అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధి ప్రజల కళ్లముందే ఉన్నాయి.. ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తాం. గడచిన ఐదేళ్లు సుపరిపాలనకు ఒక గీటురాయిలా నిలిచిపోతుంది. .. కొన్నిరోజుల్లో రానున్న కొత్త ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలుపై కచ్చితంగా ప్రజల దృష్టిఉంటుంది. ఈ ఐదేళ్లపాలనతో కచ్చితంగా బేరీజు వేసుకుంటారు. మాటమీద నిలబడి, ఇచ్చిన హామీలను నెరవేర్చిన విశ్వసనీయ పార్టీగా వైఎస్సార్‌సీపీకి ప్రజల మనసులో చోటు ఉంది. పార్టీ పునర్వైభవానికి గట్టి పునాది కూడా ఇదే. .. ఎన్నికలు జరిగిన తీరుపై అనే సందేహాలున్నాయి. మన పార్టీ అనుకూల గ్రామాల్లో కూడా ఓట్లు రాకపోవడంపైనా అనుమానాలు ఉన్నాయి. ఈవీఎంల వ్యవహారంపై ఒక పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. కూటమి ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో అక్రమాలకు తెర తీశారు. ఎన్నికల సంఘం కూటమి అనుకూల అధికారులు, పోలీసు అధికారుల మధ్య కుమ్మక్కు నడిచింది. వైఎస్సార్‌సీపీ నాయకుల్ని, కార్యకర్తలను ఉద్దేశ పూర్వకంగా భయభ్రాంతులకు గురిచేశారు. పోలింగ్‌ సమయంలో భయానక పరిస్థితులు సృష్టించారు’’ అని నేతలు పార్టీ అధినేత వద్ద ప్రస్తావించారు.రాష్ట్రవ్యాప్తంగా దాడులు:కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాకముందే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ దాడులపై పార్టీ నాయకులు, వైఎస్‌ జగన్‌ వద్ద తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్మాదంతో స్వైరవిహారం చేస్తున్నారని, ఎక్కడికక్కడ దాడులకు దిగుతున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ నాయకులు, కార్యకర్తల ప్రాణాలకు హాని తలపెట్టడమే కాకుండా ఆస్తుల విధ్వంసాలకు దిగుతున్నారు. పార్టీ నాయకులతో వైఎస్‌ జగన్‌.. పార్టీ శ్రేణులకు అండగా నిలవండి. వారికి తోడుగా నిలిచి భరోసా ఇవ్వండి. న్యాయపరంగా తీసుకోవాల్సిన వాటిపై పార్టీపరంగా చర్యలు తీసుకుంటున్నాం. గవర్నర్‌కు కూడా పార్టీ తరఫున ఫిర్యాదు చేశాం.👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

kangana Ranaut Responds On CISF Conistable Slapped her In Airport
ఎయిర్‌పోర్ట్‌లో కంగనాపై దాడి.. స్పందించిన నటి!

బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్‌పై సీఐఎస్‌ఎఫ్‌ మహిళ కానిస్టేబుల్‌ దాడికి పాల్పడింది. చండీఘర్‌ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న ఆమెపై సెక్యూరిటీ చెకప్ సమయంలో కంగనాను చెంపదెబ్బ కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరల్‌గా మారింది. రైతుల ధర్నాపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే కంగనాపై చేయి చేసుకున్నట్లు తెలుస్తోంది.అయితే తాజాగా ఈ సంఘటనపై కంగనా స్పందించింది. తనపై దాడి నిజంగానే జరిగినట్లు వెల్లడించింది. దీనిపై మీడియాతో పాటు చాలామంది నుంచి నాకు ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయని పేర్కొంది. అయితే ప్రస్తుతం తాను సేఫ్‌గానే ఉన్నట్లు తెలిపింది. చండీఘర్‌ విమానాశ్రయంలో సెక్యూరిటీ స్టాఫ్‌ నాపై చేయి చేసుకున్నారు. నా లగేజీ చెకప్ తర్వాత లోపలికి వెళ్తుండగా.. అక్కడే ఉన్న ఇద్దరు మహిళా సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరు నా చెంపపై కొట్టడంతో పాటు అసభ్యంగా మాట్లాడారు. దీనిపై వారిని ప్రశ్నించగా.. రైతుల ధర్నాకు మద్దతుగానే తనపై దాడి చేసినట్లు చెప్పారని కంగనా తెలిపింది. అయితే ప్రస్తుతానికి తాను సురక్షితంగానే ఉన్నానని.. కానీ పంజాబ్‌లో ఉగ్రవాదం పెద్దఎత్తున పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది.కాగా.. కంగనాపై చెయ్యి చేసుకున్న సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ను కుల్వీందర్‌ కౌర్‌గా గుర్తించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్‌ ప్రదేశ్‌ మండి స్థానం నుంచి కంగనా గెలుపొందిన సంగతి తెలిసిందే. తాజా దాడి ఘటనపై బీజేపీ నేతలు, సానుభూతి పరులు సోషల్‌ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Shocking rise in terror and violence in Punjab…. pic.twitter.com/7aefpp4blQ— Kangana Ranaut (Modi Ka Parivar) (@KanganaTeam) June 6, 2024

Modi 3.0: BJP Likely To Keep Top Ministries Allies Push For More
కేంద్ర మంత్రివర్గ కూర్పుపై కసరత్తు.. ఆ శాఖలన్నీ బీజేపీ వద్దనే!

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది బీజేపీ. ఎన్డీయే కూటమిలో భాగాస్వామ్యమైన, టీడీపీ, జేడీయూ, లోక్ జనశక్తి పార్టీ(రామ్‌ విలాస్‌), శివసేన(ఏక్‌నాథ్‌ షిండే) సహాకారంతో మూడోసారి ప్రధానిగా మోదీ జూన్‌ 9 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం కేంద్ర మంత్రి వర్గం కూడా కొలువుదీరనుంది.ప్రమాణ స్వీకారానికి తేదీ దగ్గరపడుతుండటంతో కేంద్ర మంత్రివర్గ కూర్పు, శాఖల కేటాయింపుపై కసరత్తు ప్రారంభమైంది. బీజేపీ నుంచి ఎవరెవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రణాళికలు రచిస్తున్నారు. కేంద్ర పదవుల కోసం ఎన్డీయే మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూ బేరసారాలు ప్రారంభించాయి ఈ ఎన్నికల్లో కింగ్‌ మేకర్‌లుగా అవతరించిన చంద్రబాబు నాయుడు, నితీష్‌ కుమార్‌ కేంద్ర మంత్రి పదవుల్లో కీలక శాఖలను డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది.అయితే కీలక మంత్రిత్వ శాఖలు బీజేపీ వద్దనే ఉండే అవకాశం ఉంది. మిత్రపక్షమైన టీడీపీ లోక్‌సభ స్పీకర్‌ పదవిని కోరగా..దీనిని ఇచ్చే ప్రస్తకే లేదని కాషాయ పార్టీ తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో టీడీపీకి డిప్యూటీ స్పీకర్‌ పదవిని ఆఫర్‌ చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అటు జేడీయూకి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవులు ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.ఇక హోంశాఖ, రక్షణ, విదేశాంగ ,ఆర్ధిక,రోడ్లు , రైల్వే.. వంటి నాలుగు కీలక మంత్రిత్వ శాఖలను బీజేపీ తమ వద్దనే ఉంచుకోనుంది. వీటిని మిత్ర పక్షాలకు ఇచ్చేందుకు కాషాయపార్టీ విముఖత వ్యక్తం చేస్తోంది. అంతేగాక రోడ్డు రవాణా, జాతీయ రహదారులు, వ్యవసాయం, మౌలిక వసతులు, సంక్షేమ రంగాలపై పట్టు వదులుకోకూడదని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణాభివృద్ధి శాఖ, పౌర విమానయాన శాఖ, ఉక్కు శాఖ టీడీపీకి దక్కే అవకాశం ఉంది.గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖలు జేడీయూకి ఇచ్చే అవకాశం ఉంది. భారీ పరిశ్రమల శాఖ శివసేనకు, వ్యవసాయ శాఖ జేడీఎస్‌కు ఇచ్చే ఛాన్స్‌ ఉంది. ఇక టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, జనసేన నుంచి బాలశౌరి, ఏపీ బీజేపీ నుంచి పురందేశ్వరికి మంత్రి పదవులు వరించనున్నట్లు సమాచారం. ఆహార ప్రాసెసింగ్‌, భారీ పరిశ్రమలు, టూరిజం, స్కిల్‌ డెవెలప్‌మెంట్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎర్త్‌ సైన్సెస్‌ వంటి తక్కు ప్రాధాన్యత కలిగిన పోర్ట్‌ఫోలియోలను మిత్రపక్షాలకు అప్పగించేందుకు బీజేపీ యోచిస్తోంది. వీటితోపాటు ఆర్థిక, రక్షణ వంటి పెద్ద- మంత్రిత్వ శాఖలలో రాష్ట్ర మంత్రి పదవులు కట్టబెట్టాలని చూస్తోంది.

UK Woman With Rare Disorder Shops In Her Sleep
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్‌ చేయడమా..?

కొందరికీ షాపింగ్‌ అంటే మహా ఇష్టం. చూసిందల్లా కొంటుంటారు. పాపం బడ్జెట్‌ని దృష్టిలో పెట్టుకుని కొందామన్నా సాధ్యం కాదు కొందరికీ. ఎంతలా కంట్రోల్‌గా ఉందామన్న ఆ వస్తువు కొనేదాక నిద్రపట్టని వాళ్ల గురించిn కూడా విన్నాం. కానీ నిద్రలో షాపింగ్‌ చేసే వ్యాధి గురించి విన్నారా? ఔను..! ఈ వ్యక్తులు నిద్రలోనే తెలియకుండానే షాపింగ్‌ చేస్తుంటారు. మెలుకవ వచ్చాక గానీ అసలు విషయం తెలియదంట. వామ్మో.. ఇదేం వ్యాది!. ఇలాంటివి కూడా ఉంటాయా అనుకోకండి. అలాంటి అరుదైన వ్యాధితోనే బాధపడుతోంది ఓ మహిళ.యూకేకి చెందిన 42 ఏళ్ల కెల్లీ నైప్స్‌ పారాసోమ్నియా ఇలాంటి అరుదైన వ్యాధితో బాధపడుతోంది. దీన్ని అరుదైన పారాసోమ్నియా స్లీపింగ్‌ డిజార్డర్‌గా పిలుస్తారు. ఈ డిజార్డర్‌ కారణంగా ఆమె నిద్రలోనే ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసేస్తుందట. ఏకంగా పిల్లలకు సంబంధించిన ఆట వస్తువులు దగ్గర నుంచి ఫ్రిడ్జ్‌ వంటి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్‌ వస్తువులు కూడా కొనుగోలు చేసేస్తుంది. వాటి బిల్లను కూడా క్రెడిట్‌ కార్డులతో చెల్లించేస్తుందట. మేలుకువ వచ్చాక మొబైల్‌ చూసుకుంటే గానీ తెలియదంట. తన అకౌంట్‌లో డబ్బు కట్‌ అయ్యాక గానీ అసలు విషయం తెలుసుకులేకతున్నాని చెబుతుంది. ఇలా నిద్రలో తనకు తెలియకుండానే షాపింగ్‌ చేసి లక్షల్లో డబ్బుల పోగొట్టుకున్నానని చెబుతోంది. దీంతో ఆమెకు ప్రతి రాత్రి భయానకంగా మారిపోయింది. "తన జీవితంలో ప్రతి రాత్రి ఓ పీడకల మాదిరిగా అయిపోతోందని బాధపడుతోంది. తన క్రెడిట్‌, డెబిట్‌ కార్డు వివరాలన్నీఫోన్‌లోనే సేవ్‌ అయ్యి ఉంటాయట. ఐతే ఈ మాయదారి జబ్బు కారణంగా తన బ్యాంక్‌ వివరాన్ని సైబర్‌ నేరాగాళ్లకు చెప్పేయడం కూడా జరిగిందంట. దీంతో వాళ్లు ఆమె ఖాతా నుంచి సుమారు రూ. 20 వేలకు పైగా తస్కరించారట కూడా. అయితే ఈలోగా తాను తన బ్యాంక్‌ లావాదేవీలను లాక్‌ చేసేయడంతో కొద్ది మొత్తంలోనే డబ్బును కోల్పోయానని అంటోంది." కెల్లీ. ఇక సమస్య నుంచి బయటపడేందుకు ముక్కుకి శ్వాస సంబధ సమస్యల నిమిత్తం అమర్చుకునే పరికరాన్ని ధరించి పడుకుంటుంది. ఈ డివైజ్‌ ముక్కు నుంచి హెడ్‌ వరకు కదలకుండా అటాచ్‌ అయ్యేలా డివైజ్‌ ఉంటుంది. కాబట్టి నిద్రలోనే తనకు తెలయకుండా చేసే విచిత్రమైన పనుల నుంచి ఉపశమనం పొందొచ్చనేది కెల్లీ ఆశ. అయితే కెల్లీ సమస్య నుంచి బయటపడలేదు సరికదా..!ఈ పరికరాన్ని కూడా నిద్రలో తనకు తెలియకుండానే తీసేస్తుందంట. ఈ సమస్య కారణంగా తాను అప్పులు పాలవ్వుతున్నానని కెల్లీ ఆవేదనగా చెప్పుకొచ్చింది. అయితే దీనికి చికిత్స లేదు. తనకు తానుగా బయటపడాలని సంకల్పించుకుంటేనే సాధ్యమని చెబుతున్నారు వైద్య నిపుణులు.పారాసోమ్నియా స్లీపింగ్‌ డిజార్డర్ అంటే..ఈ సమస్యతో బాధపడుతున్న వ్యక్తి నిద్రలోనే నడవడం /మాట్లాడటం / తినడం/ ఏమైన ఇతర కార్యకలాపాల్లో పాల్గొనడం వంటివి ఏ మాత్రం పూర్తి అవగాహనతో చేయరు. ఆ టైంలో వారికి మెదడు పాక్షికంగా మేల్కొని ఉంటుంది. ఎవరైనా ఆ వ్యక్తులను గమనించి గట్టిగా అదిలిస్తే తిరిగి స్ప్రుహలోకి వస్తారు. ఇలాంటివన్నీ రాత్రి మొదటి జామునే జరుగుతాయట. చిన్నారుల్లోనూ, కొందరూ పెద్దల్లోనూ నిద్రలోనే నడవడం/మాట్లాడటం వంటి సాధారణ లక్షణాలు ఉంటాయి. అయితే ఈ డిజార్డర్‌ తీవ్రంగా ఉంటేనే ఇలా సమస్యలు ఫేస్‌ చేస్తుంటారని నిపుణులు చెబుతున్నారు. (చదవండి: అనారోగ్యంలోనూ... నీట్‌ టాపర్‌గా!)

Telangana Graduate MLC Results 2024  June 06 Updates
గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఫలితం.. కౌంటింగ్‌లో హైడ్రామా

నల్లగొండ, సాక్షి: నల్లగొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ అప్‌డేట్స్‌ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు18,565 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న నవీన్(మల్లన్న)మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న)122813 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన నవీన్( మల్లన్న)బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 104248 ఓట్లుబీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43313 ఓట్లుస్వతంత్ర అభ్యర్థి అశోక్ 29697 ఓట్లుగెలుపు కోటా 155095 గా నిర్ణయంమొత్తం చెల్లిన ఓట్లు 310189చెల్లని ఓట్లు 25824మొత్తం పోలైన ఓట్లు 336013చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న) గెలుపుకు కావాల్సిన రెండో ప్రాధాన్యత ఓట్లు 32282బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి గెలుపుకి కావాల్సిన రెండో ప్రాధాన్యత ఓట్లు 50847మరికాసేపట్లో ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం100 నుంచి 500 ఓట్ల ఎలిమినేషన్ చేయడానికి సుమారు 4 గంటల సమయం: అధికారులు నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ లో అవకతవకలపై సీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లీగల్ టీంకౌంటింగ్ లో అవకతవకలు జరుగుతున్నాయని వెంటనే ఆర్వో ఆదేశాలు జారీ చేయాలని కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా చేయాలని ఫిర్యాదు చేసిన కౌశిక్ రెడ్డిముందు నుంచి రిటర్నింగ్ ఆఫీసర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపణతమకు వచ్చిన ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి చూపిస్తున్నారని ఆగ్రహంనల్లగొండముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు18,565 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న నవిన్(మల్లన్న)మొదటి స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న)122813 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన నవీన్( మల్లన్న)బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి 104248 ఓట్లుబీజేపీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డికి 43313 ఓట్లుస్వతంత్ర అభ్యర్థి అశోక్ 29697 ఓట్లు కాసేపట్లో సీఈఓ వికాస్ రాజ్ ను కలవనున్న బీ ఆర్ ఎస్ నేతలు.నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక కౌంటింగ్ ఆపాలని, అక్కడ జరుగుతున్న కౌంటింగ్ లో అవకతవకలపై ఫిర్యాదు చేయనున్న నేతలు.కౌంటింగ్ అధికారులు కౌంటింగ్ సక్రమంగా చేయటం లేదని ఫిర్యాదు చేయనున్న ఎంఎల్ఏ కౌశిక్ రెడ్డి, ఇతర బీ ఆర్ ఎస్ నేతలు నల్లగొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో నిన్నటి నుండి గోల్ మాల్ జరిగిందిమూడో రౌండ్ లో కాంగ్రెస్ కు మూడు వేలు ఆధిక్యం వస్తే నాలుగు వేలకు పైగా ఆధిక్యం వచ్చినట్లు ప్రకటించారుమేం అభ్యంతరం చెప్పినా ఆర్వో పట్టించుకోవడం లేదుమూడో రౌండ్ నుంచి అనుమానం ఉందని చెప్పినా కనీస స్పందన లేదుఎన్నికల ఫలితాలు తారుమారు చేస్తే కౌంటింగ్ బైకాట్ చేస్తాంఎన్నికల సంఘం స్పందించాలిరిటర్నింగ్ అధికారిపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాంఅధికారుల తీరు ఫలితాలను తారుమారు చేసేలా ఉందితమ అభ్యంతరాలకు వివరణ ఇచ్చాకే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కంపు జరపాలి నల్లగొండ జిల్లాఎమ్మెల్సీ ఉప ఎన్నికల నాలుగో రౌండ్ ఫలితాల వెల్లడిలో తీవ్ర జాప్యంనాలుగో రౌండ్ తొలి ప్రాధాన్యత ఓట్లు లెక్కింపు పూర్తై మూడు గంటలుఅయినా ఫలితాలు వెల్లడించని అధికారులు👉ముగిసి‌‌న నాలుగో రౌండ్ తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుఅధికారికంగా వెలువడాల్సిన ఫలితాలు 👉నాల్గో రౌండ్‌లో చెల్లని ఓట్లను తొలగించి గెలుపుకు కావాల్సిన కోటాను తేల్చనున్న అధికారులుఇప్పటి వరకు ఎవరికీ యాభై శాతం ఓట్లు రాకపోవడంతో కీలకంగా మారిన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుసాయంత్రం ఆరు గంటల తర్వాత ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభం👉మూడో రౌండ్‌ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తైంది. మూడో రౌండ్‌లోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి చింతపండు నవీన్‌(తీన్మార్‌ మల్లన్న) లీడ్‌లో ఉన్నారు. అయితే.. మూడో రౌండ్‌లో 4,207 ఓట్ల ఆధిక్యం రాగా, ఓవరాల్‌గా 18,878 ఓట్ల ఆధిక్యంలో మల్లన్న కొనసాగుతున్నారు. మొత్తంగా ఇప్పటి వరకు 2 లక్షల 88 వేల ఓట్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. మరో 48013 ఓట్ల లెక్కింపు చేస్తున్నారు అధికారులు. లీడ్‌ జాబితా.. ఎవరెవరికి ఎన్ని ఓట్లంటే..చింతపండు నవీన్( తీన్మార్ మల్లన్న కాంగ్రెస్) 1,06,234రాకేష్ రెడ్డి (బీఆర్ఎస్) 87,356ప్రేమేందర్ రెడ్డి( బీజేపీ) 34,516అశోక్ (స్వతంత్ర) 27,49318,878 ఓట్ల ఆధిక్యం లో తీన్మార్ మల్లన్నచెల్లిన ఓట్లు 2,64,216చెల్లని ఓట్లు: 23,784

Sunil Gavaskar lauds Hardik Pandya for impressive show against Ireland
ఐర్లాండ్‌పై అద్బుత ప్రదర్శన.. హార్దిక్‌పై గవాస్కర్ ప్రశంసలు

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన ఫామ్‌ను తిరిగి పొందాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ సారథిగా దారుణ ప్రదర్శన కనబరిచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న హార్దిక్.. ఇప్పుడు టీ20 వరల్డ్‌కప్‌-2024లో సత్తాచాటుతున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా బుధవారం న్యూయర్క్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా అదరగొట్టాడు. బ్యాటింగ్‌ చేసే అవకాశం రానప్పటకి బౌలింగ్‌లో మాత్రం హార్దిక్‌ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో హార్దిక్‌ పాండ్యాపై భారత క్రికెట్‌ దిగ్గజం సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. పాండ్యా అద్భుతమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చాడని గవాస్కర్ కొనియాడాడు."హార్దిక్‌ పాండ్యా తిరిగి తన రిథమ్‌ను పొందడం చాలా సంతోషంగా ఉంది. హార్దిక్‌ తన బౌలింగ్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. హార్దిక్‌ గతంలో రెండు ఓవర్లు వేసి బ్రేక్‌ తీసుకునే వాడు.కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం వరుసగా తన నాలుగు ఓవర్ల కోటాను పూర్తి చేసి ఔరా అనిపించుకున్నాడు. హార్దిక్‌కు ఐపీఎల్‌ తర్వాత వరల్డ్‌కప్‌ అనేది ఒక పరీక్ష వంటి. నా వరకు అయితే ఈ పరీక్షలో హార్దిక్‌ పాసైడని నేను భావిస్తున్నాని స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గవాస్కర్ పేర్కొన్నాడు.

Actor Suresh Gopi Tragedy and Victory in June Month
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!

గెలుపోటములు సాధారణం.. కానీ కొన్ని విజయాలు చరిత్రలో నిలిచిపోతాయి.. చరిత్రనే తిరగరాస్తాయి. అలా తన సక్సెస్‌తో అందరి దృష్టినీ ఆకర్షించాడు నటుడు సురేశ్‌ గోపి. అవును మరి! 1952లో లోక్‌సభ ఎన్నికలు మొదలయ్యాయి. ఇప్పటివరకు 18 సార్లు ఎన్నికలు జరగ్గా ఒక్కసారి కూడా కేరళలో బీజేపీ గెలిచిందే లేదు. ఇంతకాలంగా అసాధ్యమనుకున్న కమలం విజయాన్ని తన గెలుపుతో సుసాధ్యం చేసి చూపించాడు.ప్రాణం కాపాడుఈ సక్సెస్‌తో సురేశ్‌ గోపీ గుండెలోని భారం కొంతైనా దిగుతుందేమో! కూతురిపై పెట్టుకున్న బెంగ కాస్తయినా తగ్గుతుందేమో! 1992 జూన్‌ 6న భార్యాబిడ్డతో ప్రయాణిస్తున్న అతడి కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. స్పృహలోకి వచ్చేసరికి ఆస్పత్రి బెడ్‌ మీద ఉన్నాడు. కళ్లు తెరుస్తూనే కంటతడి పెట్టుకున్నాడు. నా ప్రాణం కాపాడు స్వామీ అంటూ దేవుడికి మొక్కుకున్నాడు. ఇక్కడ తన ప్రాణం అంటే ఆయన కూతురు లక్ష్మి. గుండెలో గూడు కట్టుకున్న బాధగాయాలు బాధిస్తున్నా ఎలాగోలా సత్తువ కూడదీసుకుని ఏడాదిన్నర వయసున్న కూతురిని చూసేందుకు ఐసీయూలోకి వెళ్లాడు. కొనప్రాణంతో కూతుర్ని చూసి తల్లడిల్లిపోయాడు. అతడి కన్నీరు చూసి భగవంతుడు చలించలేదు. ఆమెను తనతో పాటు తీసుకెళ్లిపోయాడు. అందుకే జూన్‌ మాసం అంటేనే ఆయనకు భయం, అయిష్టత! ఈ నెలలో వర్షాలు పడి వాతావరణం మారే సమయంలో తన గాయాలు సైతం నొప్పులు లేస్తాయట!జూన్‌ నెలలోనే..అయినా ఆ నొప్పి భరించడం తనకిష్టమేనంటాడు. అదే తన కూతురితో ఉన్న చివరి జ్ఞాపకాలని జీవం లేని నవ్వు విసురుతాడు. నలుగురు పిల్లలున్నా సరే లక్ష్మి లేని లోటును ఎవరూ పూడ్చలేడంటాడు. విధి ఎంత విచిత్రమో కదా! జూన్‌ నెలలో అతడి కూతుర్ని తీసుకెళ్లిపోయింది. సరిగ్గా 32 ఏళ్ల తర్వాత ఇదే నెలలో అతడికి ఊహించని విజయాన్ని అందించింది.రాజకీయ నేపథ్యం..సురేశ్‌ గోపి 2016లో రాష్ట్రపతి ద్వారా రాజ్యసభకు నామినేట్‌ అయ్యాడు. తర్వాత బీజేపీలో చేరాడు. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి మూడో స్థానానికే పరిమితమయ్యాడు. 2021 కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్‌లో పోటీ చేసినా విజయం వరించలేదు. నిరాశతో వెనుదిరగలేదు. ముచ్చటగా మూడోసారి పోటీ చేసి త్రిసూర్‌ ఎంపీగా గెలిచాడు. నటుడిగా వందల సినిమాలు చేసిన సురేశ్‌ గోపి తెలుగులో అంతిమ తీర్పు, ఆ ఒక్కడు, ఐ వంటి చిత్రాలతో మెప్పించాడు.చదవండి: ఐదేళ్ల క్రితమే సీక్రెట్‌గా పెళ్లి- విడాకులు.. ఇన్నాళ్లకు నోరు విప్పిన బ్యూటీ

YSRCP Leaders Complaint To Governor On TDP Attacks After Counting
వైఎస్సార్‌సీపీ జెండా మోసిన వాళ్లపై టీడీపీ దాడులు: పేర్ని నాని

సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులనే లక్ష్యంగా టీడీపీ దాడులు జరుపుతోందని అన్నారు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ అరాచక చేష్టలకు దిగింది. దీంతో వైఎస్సార్‌సీపీ నేతలు గురువారం సాయంత్రం గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసి.. ఆయన దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. గవర్నర్‌ నజీర్‌ను కలిసిన అనంతరం వైఎస్సార్‌సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులే టార్గెట్‌గా టీడీపీ దాడులు జరిపిందన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. బిహార్‌ తరహాలో ఏపీలో టీడీపీ దాడులకు తెగబడిందని మండిపడ్డారు. బిహార్‌ సంస్కృతిని టీడీపీ ఆచరిస్తోందన్నారు. టీడీపీ గూండాలు వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లపై కిరాతకంగా దాడులు చేశారని అన్నారు. టీడీపీ నేతలు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్‌సీపీ జెండా మోసిన వారిపై దాడులకు తెగబడుతున్నారు.నూజివీడులో పట్టపగలే కత్తులతో దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్నారు పేర్ని నాని. ఇళ్లలోకి చొరబడి ఆస్తులను ధ్వసం చేస్తున్నారని మండ్డారు. టీడీపీ దాడులు చూసి గవర్నర్‌ కూడా ఆశ్చర్యపోయారని తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఉన్నట్టా? లేనట్టా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కార్యకర్తలను కాపాడుకోవడానికి కమిటీలు వేశామని, 26 జిల్లాల్లోనూ మా లీగల్‌ టీమ్‌లు యాక్టివేట్‌ అయ్యాయని తెలిపారు. బాధితులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు. టీడీపీ గుండాల దాడులతోపాటు.. పోలీసుల తీరుపై కూడా గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.వైఎస్సార్‌సీపీ నేతల బృందానికి రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నేతృత్వం వహించారు. గవర్నర్‌ను కలిసిన వాళ్లలో తాజా ఎంపీలు గురుమూర్తి, తనుజా, ఎమ్మెల్యేలు శివప్రసాద్, మత్యలింగం, విశ్వేశ్వర రాజు, పర్చూర్‌ నేత బాలాజీ ఉన్నారు.

How to Make Correction in Name, KYC and Other Details
ఈపీఎఫ్‌ అకౌంట్‍లో తప్పులున్నాయా? ఇలా సులభంగా మార్చుకోండి..

సాధారణంగా ఉద్యోగం చేసేవారికి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్​ (EPF) అకౌంట్ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఈ అకౌంట్ వివరాల్లో ఏవైనా తప్పులు ఉండే అవకాశం ఉంటుంది. గతంలో ఉద్యోగులు తమ జాయింట్ డిక్లరేషన్ ఫారంను నింపి, దానిని ఈపీఎఫ్ఓ కార్యాలయంలో ఇచ్చేవారు. ఇప్పుడు ఏవైనా మార్పులు చేసుకోవాలనుంటే.. ఫిజికల్ ఫారమ్‌తో పనిలేకుండా.. ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. ఈ కథనంలో ఈపీఎఫ్ చందాదారులు ఆన్​లైన్​లో తమకు చెందిన 11 వ్యక్తిగత వివరాలను ఎలా మార్చుకోవాలో వివరంగా తెలుసుకుందాం.ఆన్​లైన్​లో మార్చుకోగలిన 11 వ్యక్తిగత వివరాలుపేరుజెండర్పుట్టిన తేదీతండ్రి / తల్లి పేరురిలేషన్​షిప్వైవాహిక స్థితిజాయినింగ్ డేట్రీజన్ ఫర్ క్విట్టింగ్ డేట్ ఆఫ్ క్విట్టింగ్నేషనాలిటీఆధార్ఆన్​లైన్​లో ఎలా మార్చుకోవాలంటే?👉ఉద్యోగి ముందుగా ఈపీఎఫ్ఓ అధికారికి వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి👉హోమ్ పేజీలో మొదట కనిపించే 'సర్వీస్' ట్యాబ్ మీద క్లిక్ చేసిన తరువాత 'ఫర్ ఎంప్లాయిస్' అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.👉ఆ తరువాత సర్వీస్ సెక్షన్ కింద కనిపించే 'మెంబర్ యూఏఎన్ / ఆన్‌లైన్ సర్వీస్' ఆప్షన్స్ మీద క్లిక్ చేయాలి.👉ఆలా క్లిక్ చేయగానే మీకు ఓ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.👉కొత్త పేజీలో కుడివైపు కనిపించే బాక్సులలో 'యూఏఎన్, పాస్​వర్డ్‌, క్యాప్చా' వంటి వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. 👉ఇవన్నీ పూర్తి చేసిన తరువాత అసలైన ఈపీఎఫ్ఓ అకౌంట్ పేజీ ఓపెన్ అవుతుంది.👉ఈపీఎఫ్ఓ అకౌంట్ పేజీ ఓపెన్ అయినా తరువాత స్క్రీన్ మీద కనిపించే.. 'మేనేజ్' ఆప్షన్ ఎంచుకోవాలి. ఇక్కడ జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీ మెంబర్ ఐడీ ఎంటర్ చేసిన తరువాత.. ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో.. వాటిని ఎంటర్ చేసుకోవాలి.👉అవసరమైన అన్ని డాక్యుమెంట్స్ అప్​లోడ్‌ చేసిన తరువాత సబ్మిట్ చేయాలి.👉అన్ని సరిగ్గా అప్​లోడ్‌ చేసి సబ్మిట్ చేసిన తరువాత రిక్వెస్ట్ యాక్సెప్ట్ అవుతుంది. ఆ తరువాత వివరాలు మీకు అందుతాయి.ఎంప్లాయర్ చేయాల్సింది..👉ఎంప్లాయ్ వివరాలను అందుకున్న తరువాత ఎంప్లాయర్.. ఈపీఎఫ్ఓ అధికారికి వెబ్‌సైట్‌లో ఎంప్లాయర్ ఐడీతో ఎంటర్ అవ్వాలి. 👉మెంబర్ ట్యాబ్‌ మీద క్లిక్ చేసి.. జాయింట్ డిక్లరేషన్ చేంజ్ రిక్వెస్ట్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి.👉ఉద్యోగి అభ్యర్థను చెక్ చేసిన తరువాత ఎంప్లాయర్ అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు.👉ఎంప్లాయర్ ఉద్యోగి రిక్వెస్ట్ అంగీకరిస్తే.. అది ఈపీఎఫ్ఓకు చేరుతుంది.

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement