ప్రముఖ సింగర్‌పై రూమర్స్‌.. నాలుగో భర్తకు కూడా..! | Jennifer Lopez And Ben Affleck Put Marital House On Sale Amid Divorce Rumours, Details Inside | Sakshi
Sakshi News home page

Jennifer Lopez: ఖరీదైన ఇంటిని అమ్మకానికి పెట్టిన హాలీవుడ్ భామ.. ఊపందుకున్న రూమర్స్!

Jun 9 2024 8:10 PM | Updated on Jun 10 2024 10:36 AM

Jennifer Lopez Ben Affleck put marital house on sale amid divorce rumours

హాలీవుడ్ ప్రముఖ నటి, సింగర్‌ జెన్నిఫర్ లోపెజ్ విడిపోతున్నట్లు వార్తలొస్తున్నాయి. 2022లో బెన్ అఫ్లెక్‌ను పెళ్లాడిన నటి త్వరలోనే తమ బంధానికి గుడ్‌ బై చెప్పనున్నట్లు హాలీవుడ్‌లో లేటేస్ట్‌ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ జంట బెవర్లీ హిల్స్‌లోని ఖరీదైన బంగ్లాలో నివసిస్తున్నారు. తాజాగా ఈ భవనాన్ని అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. కేవలం ఏడాది క్రితమే కొనుగోలు చేసిన బంగ్లా అమ్మకానికి పెట్టడంతో ఈ జంట డైవర్స్‌ తీసుకోబోతున్నట్లు రూమర్స్‌ వినిపిస్తున్నాయి.

కాగా.. ఇప్పటికే జెన్నిఫర్‌ లోపెజ్ ముగ్గురి పెళ్లి చేసుకుని వారితో విడాకులు తీసుకున్నారు. బెన్ అఫ్లెక్ ఆమెకు నాలుగో భర్త కాగా.. ఈ బంధానికి ఎండ్‌ కార్డ్‌ పడడం ఖాయంగా కనిపిస్తోంది. 2021లో డేటింగ్‌ ప్రారంభించిన వీరిద్దరు.. ఆ తర్వాత 2022లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. దీంతో ఈ జంట కేవలం రెండేళ్లలోనే తమ వివాహాబంధానికి ముగింపు పలకనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల  గత నెల రోజులుగా ఈ జంటపై విడాకుల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య గొడవలు తలెత్తినట్లు సమాచారం. బిజీ షెడ్యూల్‌ కారణంగానే వీరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

 

Advertisement
 
Advertisement
Advertisement