Top Stories
ప్రధాన వార్తలు
చంద్రబాబు చెప్పినా.. ఏపీలో ఆగని టీడీపీ దాష్టీకం
అమరావతి, సాక్షి: నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించినట్లుంది టీడీపీ తీరు. కవ్వింపు చర్యలకు దిగొద్దని చంద్రబాబు నాయుడు చెబుతున్నా.. అదేదో అధిష్టానం ఇచ్చిన మొక్కుబడి హెచ్చరికగా భావిస్తూ రెచ్చిపోతున్నాయి టీడీపీ శ్రేణులు. వైఎస్సార్సీపీ సానుభూతిపరులతో సహా ఎవరినీ వదలకుండా.. దాడులు కొనసాగిస్తున్నాయి. తాజాగా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని పెదవడ్లపూడిలో వైఎస్సార్సీపీ కార్యకర్త పట్ల టీడీపీ నాయకులు దాడి చేసి అమానవీయంగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైఎస్సార్సీపీ కార్యకర్త కృష్ణవేణి భర్త పాలేటి రాజ్‌కుమార్‌ను గ్రామానికి టీడీపీ నాయకుడు జవ్వాది కిరణ్‌చంద్ ఆదివారం తన అనుచరుల ద్వారా ఊరి మధ్యకు రప్పించాడు. అందరూ చూస్తుండగా దారుణంగా దాడి చేశారు. ఒంటిపై దుస్తులు విప్పి మరీ చితకబాదారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు లోకేశ్ ఫొటో ఉన్న ఫ్లెక్సీ చేత్తో పట్టుకోగా, విలపిస్తున్న రాజ్‌కుమార్‌ను దాని ఎదురుగా మోకాళ్లపై కూర్చోబెట్టారు. ‘నన్ను క్షమించండి.. చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, ఇతరుల గురించి ఏరోజూ ఏం మాట్లాడను’ అని చెప్పించారు. అనంతరం రాజ్‌కుమార్.. తనను మన్నించమని టీడీపీ నేత కిరణ్‌చంద్ కాళ్లు పట్టుకున్నాడు. అయితే తన కాళ్లు కాదని.. ఫ్లెక్సీలో లోకేశ్ కాళ్లు కూడా పట్టుకోమని ఆ టీడీపీ నేత ఆదేశించాడు. బాధితుడు వారు చెప్పినట్లే చేశాడు. తన కుటుంబాన్ని క్షమించాలని పదే పదే విజ్ఞప్తి చేశాడు. పెద్దవడ్లపూడి నుంచి ఐదు వాహనాల్లో బొప్పుడి గ్రామానికి వెళ్లి ఆ భార్యాభర్తల పై దాడి చేసింది జవ్వాది కిరణ్ కుమార్, అతని అనుచరులుగా స్పష్టంగా తేలింది. అంతేకాదు.. బలవంతంగా కారులో ఎక్కించుకుని రాత్రంతా రాజకుమార్ పైన దాడి చేస్తూ తెల్లవారుజామున బోయిపాలెం రోడ్ లో వదిలేసి వెళ్లిపోయారు తెలుగుదేశం నాయకులు. తీవ్రంగా గాయపడిన రాజ్ కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు. ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయినప్పటికీ పోలీసుల నుంచి ఎలాంటి చర్యలూ లేకపోవడం గమనార్హం. అంతేకాదు రాజ్‌కుమార్ గతంలో చేసిన పోస్టులంటూ కొన్నింటిని వైరల్ చేస్తూ.. దాడిని సమర్థిస్తున్నారు టీడీపీ సానుభూతిపరులు.This is the situation in Andhra Pradesh!Heart-wrenching visuals from Mangalagiri, Andhra Pradesh.@JaiTDP leaders are targeting Dalits in the state who raise their voices against them. They are literally threatening the lives of Dalits, forcing them to apologize to @naralokesh… pic.twitter.com/6Id1s8Lwxt— YSR Congress Party (@YSRCParty) June 9, 2024
T20 WC 2024 IND VS PAK: మ్యాచ్ రూపురేఖల్ని మార్చేసిన బుమ్రా
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా పాకిస్తాన్‌తో నిన్న (జూన్ 9) జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా 6 పరుగుల స్వల్ప తేడాతో అద్భుత విజయం సాధించింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో బుమ్రా తన ప్రతాపాన్ని చూపి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైన వికెట్లు (బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్) తీశాడు. భారత్ విజయావకాశాలు పూర్తిగా అడుగంటిన వేళ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ మ్యాచ్ రూపురేఖల్నే మార్చేసింది. ఆ ఓవర్లో బుమ్రా కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రమాదకారిగా కనిపించిన ఇఫ్తికార్ అహ్మద్‌ను ఔట్ చేశాడు. తన మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ కారణంగా బుమ్రా వరుసగా రెండో మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాను గెలిపించాడు. పాక్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో భారత బౌలర్లు ఆదిలో విఫలమయ్యారు. 4 ఓవర్లలో పాక్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసి లక్ష్యంగా దిశగా సాగుతుండింది. ఈ దశలో (ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో) బుమ్రా తన అనుభవాన్నంతా రంగరించి పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను ఔట్ చేశాడు. అనంతరం ఇన్నింగ్స్ 15వ ఓవర్లో మరోసారి బంతిని అందుకున్న బుమ్రా ఈ సారి అప్పటికే క్రీజ్‌లో సెట్ అయిపోయిన రిజ్వాన్‌ను ఔట్‌ను చేసి భారత శిబిరంలో గెలుపుపై ఆశలకు బీజం పోశాడు. ఈ మధ్యలో హార్దిక్ పాండ్యా (4-0-24-2) రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను రక్తి కట్టించగా.. బుమ్రా 19వ ఓవర్లో మరోసారి తన ప్రతాపాన్ని చూపాడు. పాక్ గెలుపు ఖాయమనుకున్న వేళ బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలకమైన ఇఫ్తికార్ వికెట్ తీసి పాక్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. పాక్ గెలుపుకు చివరి ఓవర్లో 18 పరుగులు అవసరం కాగా.. అర్ష్‌దీప్ ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. చివరి ఓవర్ నాలుగు, ఐదు బంతులకు నసీం షా బౌండరీలు బాదినప్పటికీ పాక్ ఓటమి అప్పటికే ఖరారైపోయింది. బుమ్రా ప్రదర్శన కారణంగా ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించి, సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకుంది. టీ20ల్లో భారత్ డిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోర్ (120), టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో ఏ జట్టైనా డిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోర్ ఇదే కావడం విశేషం. పాక్‌పై ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో దాయాదిపై తమ రికార్డును (7-1) మరింత మెరుగుపర్చుకుంది. గతేడాది చివర్లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లోనూ బుమ్రా పాక్‌పై ఇలాంటి మ్యాచ్ విన్నింగ్స్ పెర్ఫార్మెన్సే (2/19) కనబర్చి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో బుమ్రాతో పాటు హార్దిక్ చూపిన పట్టుదలకు క్రికెట్ ప్రపంచం మొత్తం జేజేలు పలుకుతుంది. గెలుపు సునాయాసమనుకున్న మ్యాచ్‌లో ఓడటంతో పాక్ ఆటగాళ్లు, అభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు. పాక్‌పై గెలుపు అనంతరం న్యూయార్క్ మైదానంలో భారత అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. పాక్ పేసర్లు చెలరేగడంతో 19 ఓవర్లలో 119 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం భారత పేసర్లు సైతం విజృంభించి పాక్‌కు సాధ్యమైంది తమకెందుకు సాధ్యం కాదన్న రీతిలో ప్రతిఘటించి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించారు. భారత బౌలర్ల దెబ్బకు పాక్ నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసినప్పటికీ లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు చేతిలో ఇంకా 3 వికెట్లు ఉన్నాయి. బుమ్రా, హార్దిక్‌తో పాటు సిరాజ్ (4-0-19-0), అర్ష్‌దీప్ (4-0-31-1), అక్షర్ (2-0-11-1) కూడా రాణించారు. పాక్ ఇన్నింగ్స్‌లో రిజ్వాన్ (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు పంత్ (42) రాణించడంతో భారత్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. పాక్ బౌలర్లలో నసీం షా, హరీస్ రౌఫ్ తలో 3 వికెట్లు, మొహమ్మద్ ఆమిర్ 2, షాహిన్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో ప్రస్తుత ప్రపంచకప్‌లో పాక్ సూపర్-8 అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే.
పాత మోదీపై ‘కొత్త మోదీ’ నెగ్గగలరా?
నరేంద్ర మోదీ నిస్సందేహంగా తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆయన ఊహించిన దానికి భిన్నమైన నాటకీయ పరిస్థితుల్లో ఆ రావటం అన్నది జరిగింది. కీలకమైన ప్రశ్న ఏమిటంటే – ప్రధాన మంత్రిగా ఇప్పుడు ఎదుర్కొంటున్న పూర్తి భిన్నమైన పరిస్థితులను మోదీ స్వాభావికంగా, మానసికంగా ఎలా సర్దుబాటు చేసుకోగలరన్నదే! సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపేందుకు మిత్రపక్షాలను దగ్గర చేసుకోవటం, తరచూ వారికి లోబడి ఉండటం, నిరంతరం వారిని సంతుష్టులుగా ఉంచటం వంటి వాటికి ఆయన సంసిద్ధతను కలిగి ఉంటారా? గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, భారత ప్రధానిగా 10 సంవత్సరాలు ఆయనకు ఇలా చేసే అవసరం లేకపోయింది. అందుకు భిన్నంగా పాత మోదీ ఇప్పుడు కొత్త మోదీ కాగలరా?మునుపు మీరీ నానుడిని నిస్సందేహంగా విని ఉంటారు. ఎంచేతనంటే ఇదొక కాదనలేని సత్యం. కొరుకుడు పడనివిగా కనిపించే పరిస్థితులను ఓటర్ల సమష్టి విజ్ఞత చక్కబెట్టగలగటమే ప్రజాస్వామ్యంలోని అద్భుతమైన విషయం. 1977లో ఇలా జరిగింది. మళ్లీ ఈ జూన్ 4న ఇది సంభవించింది. ఫలితాల్లో పై విధమైన అద్భుతాన్ని చాలామందే ఆశించినప్పటికీ, నిజానికి కొద్దిమందే అది కార్యరూపం దాల్చుతుందని భావించారు. నరేంద్ర మోదీ నిస్సందేహంగా తిరిగి అధికారంలోకి వచ్చినప్పటికీ, ఆయన ఊహించిన దానికి భిన్నమైన నాటకీయ పరిస్థితుల్లో ఆ రావటం అన్నది జరిగింది. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత దారుణమైన ఫలితాలను ఈ ఎన్నికల్లో బీజేపీ చవి చూసింది. మెజారిటీకి 30కి పైగా తక్కువ సీట్లు వచ్చాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి, విశ్వసనీయత ఎల్లప్పుడూ ప్రశ్నార్థకమైన మిత్ర పక్షాల మద్దతు అవసరం. గతంలో వారు బీజేపీని విడిచి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. వారు మళ్లీ అలా చేస్తారనటాన్ని తోసిపుచ్చలేము. ఇది ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ మూడోసారి పాలనపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇప్పటికైతే వాటికి మన దగ్గర సమాధానాలు లేవు. బహుశా మోదీకి కూడా అవి తెలియక పోవటానికే అవకాశం ఎక్కువ. కానీ ఆ ప్రశ్నలు ఆయన ఎదుర్కొనే సవాలును సూచిస్తాయి. ఆ ప్రశ్నల సమాధానాలు ఆయన గురించి ఎన్నో విషయాలు వెల్లడిస్తాయి. భారతదేశానికి ఎదురవనున్న ప్రమాదాలను, లేదంటే కనీసం సమస్యలను అవి బయటపెడతాయి. బీజేపీ 370 సీట్లు గెలుచుకుంటుందని మోదీ మొదటి నుంచి జోస్యం చెబుతూ వచ్చారు. ఐదో విడత పోలింగ్ అయ్యాక ‘ఎకనమిక్ టైమ్స్’తో మాట్లాడుతూ తమ పార్టీ అప్పటికే 272 మార్కును దాటేసిందని అన్నారు. కానీ, చివరికి అది 240 సీట్లతోనే ముగిసింది. మెజారిటీకి చాలా తక్కువ. కనుక, ఇవాళ ఆయన... కలవరపడే మనిషా లేక దులిపేసుకుని వెళ్లగలిగినంత మొద్దు చర్మం ఉన్నవారా?వారణాసిలో ఆయనకు వచ్చిన ఓట్ల మాటేమిటి? 2019లో ఆయనకు 4 లక్షల 80 వేల మెజారిటీ వచ్చింది. అదిప్పుడు కేవలం లక్షా ఐదు వేలకు పరిమితం అయింది. ‘‘గంగా మేరీ మా హై, ముఝే గంగా నే గోద్ లియా హై’’ (గంగానది నా మాతృమూర్తి. గంగమ్మ తల్లి నన్ను దత్తత తీసుకుంది) అని గత నెలలో చెప్పుకున్న ఒక మనిషి.. పూర్తి వ్యక్తిగతమైన ఈ తిరోగమనాన్ని ఎలా తీసుకుంటారు?ఏదేమైనా కీలకమైన ప్రశ్న ఏమిటంటే – ప్రధాన మంత్రిగా ఇప్పుడు ఎదుర్కొంటున్న పూర్తి భిన్నమైన పరిస్థితులను మోదీ స్వాభావికంగా, మానసికంగా ఎలా సర్దుబాటు చేసుకోగలరు? లేదా, సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపేందుకు మిత్రపక్షాలను దగ్గర చేసుకోవటం, తరచూ వారికి లోబడి ఉండటం, నిరంతరం వారిని సంతుష్టులుగా ఉంచటం వంటి వాటికి ఆయన సంసిద్ధంగా కలిగి ఉన్నారా?గుర్తు చేసుకోండి. గుజరాత్ ముఖ్యమంత్రిగా 13 సంవత్సరాలు, భారత ప్రధానిగా 10 సంవత్సరాలు ఆయనకు ఇలా చేసే అవసరం లేకపోయింది. బదులుగా ఆయన అభీష్టం ప్రతి ఒక్కరికీ ఆదేశం అయింది. ఆయన కేంద్రీకృత ప్రభుత్వాన్ని నడిపారు. ప్రధాని కార్యాలయం కోరినట్లే మంత్రులు నడుచుకున్నారు. ఒక్కరు కూడా ఇదేమిటి అని అడిగే సాహసం చేయలేదు.పార్లమెంటు, జ్యుడీషియరీ, మీడియా వంటి స్వయం ప్రతిపత్తి కలిగిన వ్యవస్థల పట్ల ఆయన వైఖరి గురించి ఏమిటి? శ్రీ ‘పాత మోదీ’ పార్లమెంటును పలుమార్లు విస్మరించారు. న్యాయశాఖలోని నియామకాలను నిలిపివేశారు. మీడియాను తీసిపడేశారు. కానీ ఇప్పుడు శ్రీ ‘బలహీన మోదీ’ మరింతగా ఏకాభిప్రాయ విధానాన్ని అవలంబించవలసిన అవసరం ఉంటుంది. లేదంటే తన మిత్రపక్షాలకు ఆయన కోపం తెప్పించవచ్చు. తన సంకీర్ణాన్ని ప్రమాదంలోకి నెట్టేసుకోవచ్చు. అలా చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటారా? ఇక విమర్శలకు, అసమ్మతికి ఆయన స్పందించే ధోరణి ఒకటి ఉంటుంది. శ్రీ పాత మోదీకి ఆ రెండూ నచ్చవన్నది రహస్యమేం కాదు. కనుక శ్రీ కొత్త మోదీ సహించటాన్ని, సమ్మతించటాన్ని మాత్రమే కాదు... రెండింటితో కలిసి ముందుకు సాగటాన్ని కూడా నేర్చుకోవాలి. అది అంత సులభమేనా?మరికొన్ని ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇటీవల ఆయన చేసిన ప్రకటనలకు సంబంధించినవి. వాటిని ప్రజలు మరిచిపోయి ఉంటారని ఆయన అనుకోవచ్చు. ప్రస్తుతం నెలకొని ఉన్న రాజకీయ వాతావరణంలో కాకపోవచ్చు కానీ, మొత్తానికైతే నేననుకోవటం అవి గుర్తుండే ఉంటాయని! మొదటిగా, ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఆయన కనుక నవ్వటాన్ని, తేలిగ్గా తీసుకోవటాన్ని అలవరచుకోకపోతే అవి ఆయన్ని వెంటాడగలిగినవి. కానీ ఆయన అలా చేయగలరా? తనది దైవాంశ జననం అని ఆయన చెప్పుకోవడంపై అవహేళనలు ఎదురైతే ఆయన నవ్వుతూ, వాటిని పట్టించుకోకుండా ఉండగలరా? నా మాట గుర్తుపెట్టుకోండి. అవహేళనలు ఉంటాయి. అది జరిగినప్పుడు ఆయన కోపం తెచ్చుకుంటారా?మరీ ముఖ్యంగా, ముస్లింలను దయ్యాలుగా చూపించకుండా ఉండలేకపోవటాన్ని నిలువరించుకోగలరా? ముస్లింలను చొరబాటు దారులుగా; ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల నుంచి రిజర్వేషన్లను లాక్కుని లబ్ధి పొందేవారిగా చూపే తదుపరి సందర్భాలలో మిత్రపక్షాలు అందుకు అంగీకరించే అవకాశం లేదు. కానీ అలాంటి భాష తన నుంచి స్వభావసిద్ధంగా బయటికి రాకుండా తనను తాను సంబాళించుకోగలరా? ఇది 2001 నుండి ఆయన వాక్చాతుర్యంలోని ఒక భాగమని గుర్తుంచుకోండి. నిజానికి నేను లేవనెత్తిన ప్రతిదాన్నీ ఒకే ఒక సాధారణ ప్రశ్నగా కుదించవచ్చు: శ్రీ పాత మోదీ ఇప్పుడు శ్రీ కొత్త మోదీ కాగలరా? ఆయన ప్రభుత్వం దాని పైనే ఆధారపడి ఉంటుంది. మన పాలన దానిపైనే ఆధారపడి ఉంటుంది. ఆయన రాజకీయ భవిష్యత్తు కూడా! కానీ ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి? - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్- కరణ్ థాపర్
కశ్మీర్లో ఉగ్ర ఘాతుకం: ప్రధాని మోదీ సహా ఖండించిన నేతలు.. 10కి చేరిన మృతుల సంఖ్య
శ్రీనగర్: జమ్ము-కశ్మీర్ రియాసి జిల్లాలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడిన ఘటనలో 10 మంది మృతి చెందారు. జమ్ములోని రాయసి జిల్లాలో ఉన్న శివఖోడి గుహను సందర్శించుకొని తిగిగి వస్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు ఒక్కసారిగా విచక్షణా రహితంగా కాల్పులు తెగపడ్డారు. ఆదివారం సాయంత్రం 6.10 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనలో 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. 53 మంది యాత్రికులు ఉన్న బస్సు శివ్ ఖోరి నుంచి కాట్రాలోని మాతా వైష్ణోదేవి ఆలయం వైళ్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో డ్రైవర్ గాయపడటంతో బస్సు పదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. గాయపడినవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.#WATCH | Security heightened in Jammu & Kashmir's Reasi.Morning visuals from the area where a bus carrying pilgrims was attacked by terrorists led to the loss of 10 lives. pic.twitter.com/9i93KKbhzc— ANI (@ANI) June 10, 2024 రాజౌరి, పూంచ్న, రియాసి ప్రాంతాల్లో దాగి ఉన్న ఉగ్రవాదులపై దాడి చేసేందుకు.. పోలీసులు, ఇండియన్ ఆర్మీ , సీఆర్పీఎఫ్ జాయింట్ ఆపరేషన్ ఏర్పాటు చేశారు. యాత్రికులపై ఉగ్రవాదుల దాడిన జమ్మూకశ్మీర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ‘ఎక్స్’ వేదికగా తీవ్రంగా ఖండిచారు.‘ప్రధాని మోదీ దాడి ఘటపై స్పందించారు. ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పడు పర్యవేక్షించాలన్నారు. బాధితులు, వారి కుటుంబాలకు సాయం అందిచాలని మోదీ ఆదేశించారు. ఈ దాడికి పాల్పడినవారిపై త్వరలోనే చర్యలు తీసుకుంటాం. గాయపడినవారికి మెడికల్ సాయం అందించాలని ప్రధాని మోదీ ఆదేశించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. మృతి చెందిన వారికి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నా’ అని అన్నారు.దాడిపై స్పందించిన రాష్ట్రపతి‘జమ్ము కశ్మీర్‌లోని రియాసి జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటన నన్ను కలచివేసింది. ఈ ఘటనలో మృతిచెందినవారి కుటుంబాలకు, బాధితులకు నా సానుభూతి తెలియజేస్తున్నా. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎక్స్‌లో స్పందించారు.I am anguished by the terrorist attack on a bus carrying pilgrims in Reasi district of Jammu and Kashmir. This dastardly act is a crime against humanity, and must be condemned in the strongest words. The nation stands with the families of the victims. I pray for the speedy…— President of India (@rashtrapatibhvn) June 9, 2024 కేంద్రమంత్రి అమిత్ షా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ‘జమ్ము కశ్మీర్ ఎల్జీ, డీజీపీ ద్వారా ఉగ్రదాడి పరిస్థితిని తెలుసుకున్నా. ఈ దాడికి పాల్పడినవారిని వదిపెట్టము. వారిపై కచ్చింతంగా చర్యలు తీసుకుంటాం. మృతిచెందినవారి కుటుంబాలుకు సానుభూతి తెలుపుతున్నా’అని అమిత్ షా ‘ఎక్స్’లో పేర్కొన్నారు.ఉగ్రవాద దాడి పరికిపంద చర్య అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా ఖండిచారు. ‘చాలా విషాదకరమైన ఘటన. ఈ దాడితో జమ్ము కశ్మీర్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయే తెలస్తోంది’అని ఎక్స్‌లో స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్రంగా ఖండిచారు.जम्मू-कश्मीर के रियासी ज़िले में, शिवखोड़ी मंदिर से तीर्थयात्रियों को ले जा रही बस पर हुआ कायरतापूर्ण आतंकी हमला अत्यंत दुखद है।यह शर्मनाक घटना जम्मू-कश्मीर के चिंताजनक सुरक्षा हालातों की असली तस्वीर है।मैं सभी शोक संतप्त परिजनों को अपनी गहरी संवेदनाएं व्यक्त करता हूं और…— Rahul Gandhi (@RahulGandhi) June 9, 2024యాత్రికుల బస్సుపై ఉగ్రవాదలు దాడి చేయటం ఇది రెండోసారి. 2017లో అమర్నాథ్ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 7 మంది మృతి చెందగా.. 19 మంది తీవ్రంగా గాయపడ్డారు.
‘పోలీస్’ హ్యాకర్..20 ఏళ్ల విద్యార్థి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పోలీస్‌యాప్‌లు హాక్ఐ, టీఎస్‌కాప్‌లను హ్యాక్ చేసిన నిందితుడిని ఢిల్లీలో శనివారం అరెస్టు చేశారు. నిందితుడు యూపీలోని ఝాన్సీకి చెందిన విద్యార్థి జతిన్‌కుమార్(20) అని డీజీపీ రవిగుప్తా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలీస్ యాప్‌ల హ్యాకింగ్‌తో ఏ వినియోగదారుడికి సంబంధించిన సున్నితమైన, ఆర్థిక పరమైన సమాచారం లీక్ కాలేదని డీజీపీ స్పష్టం చేశారు. నిందితుడిని ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించినట్టు తెలిపారు. హాక్ఐ యాప్ హ్యాక్ అయినట్టు గుర్తించిన వెంటనే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రంగంలోకి దిగిందన్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. హ్యాకర్ పోలీస్ యాప్‌లలోని సమాచారాన్ని పబ్లిక్ ప్లాట్‌పారంలలో అమ్మకానికి పెట్టినట్టు ఉంచిన పోస్టులను ఆధారంగా చేసుకొని దర్యాప్తులో ముందుకు వెళ్లారని, పక్కా సమాచారంతో టీజీసీఎస్బీ అధికారులు ఢిల్లీకి వెళ్లి, అక్కడ హ్యాకర్ జతిన్‌కుమార్‌ను గుర్తించి అరెస్టు చేశారని డీజీపీ తెలిపారు. నిందితుడికి సైబర్ నేరచరిత్ర ఉందని, గతంలో ఇలాంటి హ్యాకింగ్ కేసులో ప్రమేయం ఉందన్నారు.న్యూఢిల్లీలోని స్పెషల్ సెల్ ద్వారక పోలీస్సే్టషన్‌లో క్రైం. నంబర్ 291/2023లో ఇంతకముందు అక్కడి పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. నిందితుడు ఆధార్ కార్డులకు సంబంధించిన డేటా, ఇతర ఏజెన్సీలకు సంబంధించిన క్లిష్టమైన సమాచారాన్ని కూడా లీక్ చేశారని డీజీపీ వెల్లడించారు. తెలంగాణ పోలీస్‌యాప్‌ల డేటా చోరీ కేసులో ప్రమేయమున్న అదనపు నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని డీజీపీ తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో గుర్తింపు హ్యాకింగ్ సమాచారం అందిన వెంటనే టీజీసీఎస్బీ అధికారులు రంగంలోకి దిగారని, అధునాతన సాధనాలను ఉపయోగించి, హ్యాకర్ జాడను విజయవంతంగా తెలుసుకోగలిగారని డీజీపీ రవిగుప్తా తెలిపారు. హ్యాకర్ పోలీస్ యాప్‌ల నుంచి చోరీ చేసిన వివరాలను databreachforum.st లో పోస్ట్ చేశాడని, చోరీ చేసిన డేటాను ు150 డాలర్లకు అమ్మకానికి పెట్టాడని పేర్కొన్నారు. ఆసక్తిగల కొనుగోలుదారులు హాక్ ఐ ,టీఎస్‌కాప్ డేటాను కొనేందుకు తనను సంప్రదించవచ్చని టెలిగ్రామ్ ఐడీలు Adm1nfr1end , Adm1nfr1 ends ఇచ్చాడని తెలిపారు. సోషల్ ఇంజినీరింగ్ పద్ధతులను ఉపయోగించి నిందితుడి వివరాలు తెలుసుకున్నామన్నారు. పౌరుల సమాచారం సురక్షితం హాక్ఐ, టీఎస్‌కాప్ యాప్‌లు హ్యాకింగ్ గురైనా పౌరులందరి సమాచారం సురక్షితంగానే ఉందని, ఎలాంటి ఆందోళన వద్దని డీజీపీ రవిగుప్తా స్పష్టం చేశారు. డేటా లీక్ అయినట్టు మీడియాలో వచ్చిన వార్తలు వాస్తవం కాదని పేర్కొన్నారు. హాక్ఐ యాప్‌లో డేటా రిపోజిటరీలో భాగంగా మొబైల్ నంబర్లు, చిరునామాలు, ఈమెయిల్ ఐడీల వంటి వినియోగదారు సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంటుందని డీజీపీ తెలిపారు. అయితే బలహీనమైన పాస్‌వర్డ్‌ల కారణంగా హ్యాకర్ హాక్ఐ డేటాలోకి యాక్సెస్ పొంది ఉండొచ్చని అనుమానిస్తున్నట్టు తెలిపారు.టీఎస్‌కాప్ యాప్ అనేది పూర్తిగా పోలీస్ విధుల్లో అంతర్గత పనుల కోసం వాడతామని తెలిపారు. ఇందులో సందర్శకులు, హోటళ్ల డేటా సేకరిస్తారన్నది అవాస్తవం అని డీజీపీ తెలిపారు. టీస్‌కాప్ ద్వారా థర్డ్‌పారీ్టలకు డేటా వెళ్లే ఆస్కారమే లేదన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ ఎస్ఎంస్ సర్వర్ యూఆర్ఎల్ విషయంలో, చొరబాటుదారుడి క్లెయిమ్‌లు పూర్తిగా అబద్ధమని, ఈ యూఆర్ఎల్ ఏప్రిల్ 2022 నుంచి పనిచేయలేదని స్పష్టం చేశారు. హ్యాక్ అయినట్టు చెబుతున్న యూఆర్ఎల్ను హైదరాబాద్ సిటీ పోలీసులు చాలా కాలం ముందు నిలిపివేశారని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు అన్ని పోలీసు అంతర్గత, బాహ్య నెట్‌వర్క్‌లు, వెబ్, మొబైల్ అప్లికేషన్లు, క్లౌడ్ , ఎండ్ పాయింట్లలో ఏవైనా సైబర్ సెక్యూరిటీ లోపాలు ఉంటే గుర్తించి పరిష్కరిస్తామని డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ విషయంలో ఎవరైనా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే వారిపై పోలీస్‌శాఖ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని డీజీపీ హెచ్చరించారు. పోలీస్‌యాప్‌ల హ్యాకింగ్ కేసును టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ పర్యవేక్షణలో రికార్డు సమయంలోనే అధికారులు ఛేదించారన్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన ఎస్పీలు భాస్కరన్, విశ్వజిత్ కంపాటి, డీఎస్పీలు, కేవీఎం ప్రసాద్, ఏ.సంపత్, ఇన్స్పెక్టర్ ఆశిషిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సురే‹Ùలను డీజీపీ రవిగుప్తా ప్రత్యేకంగా అభినందించారు.
పాక్-భారత్ మ్యాచ్‌లో అనూహ్య పరిణామం
న్యూయార్క్: దాయాది దేశాల మధ్య పోరులో మరోసారి భారత్‌దే పైచేయి అయ్యింది. న్యూయార్క్ లోని నసావు కౌంటీ స్టేడియంలో జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ టీమిండియా విజయం సాధించింది. అయితే.. మ్యాచ్ కొనసాగుతున్న సమయంలో జరిగిన ఓ అనూహ్య పరిణామం అందరి దృష్టిని ఆకర్షించింది.మ్యాచ్ జరుగుతున్న టైంలో స్టేడియంపై ఓ ఎయిర్‌క్రాఫ్ట్ ఎగిరింది. అది ఓ బ్యానర్ ను ప్రదర్శిస్తూ వెళ్లింది. ఆ బ్యానర్ పై ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయండి (Release Imran Khan) అని రాసి ఉంది. మరోవైపు మ్యాచ్ జరుగుతున్న టైంలో స్టేడియంలో కొందరు ఇమ్రాన్ ఖాన్ ఫొటోలతో జిందాబాద్ నినాదాలు చేయడమూ కనిపించింది.A plane with the message "Release Imran Khan" flies over the stadium during the India vs. Pakistan T20 World Cup match. #Imrankhan #T20WC24 #viral #BreakingPedia pic.twitter.com/OHlCuQUFRZ— Breakingpedia (@breakingpediaBP) June 10, 2024 Credits: Breakingpedia VIDEO CREDITS: TOP POSTఅయితే.. పాక్-భారత్ మ్యాచ్‌కు గట్టి భద్రత ఉంటుందని న్యూయార్క్ పోలీసులు ఇదివరకే ప్రకటించారు. ఈ తరుణంలో ఆ విమానాన్ని స్టేడియం మీద ఎగరడానికి ఎలా అనుమతించారు?. దానిని నడిపిందెవరు?. దీనంతటి వెనుక ఉంది ఎవరు? ఇలాంటి అంశాలపై అక్కడి అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
Rasi Phalalu: ఈ రాశివారికి దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి
శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.చవితి సా.4.48 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: పుష్యమి రా.10.35 వరకు, తదుపరి ఆశ్రేష, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ప.12.25 నుండి 1.17 వరకు, తదుపరి ప.3.02 నుండి 3.54 వరకు, అమృతఘడియలు: ప.3.55 నుండి 5.36 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.29. మేషం: కుటుంబంలో వివాదాలు, సమస్యలు. ధనవ్యయం. శ్రమా«ధిక్యం. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్యభంగం.వృషభం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.మిథునం: మిత్రులతో అకారణంగా వివాదాలు. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఇంటాబయటా చికాకులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.కర్కాటకం: త్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగయత్నాలలో అనుకూలత. ఆలయాలు సందర్శిస్తారు.సింహం: ఆరోగ్యభంగం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. పనుల్లో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.కన్య: పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. ఉద్యోగయోగం. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.తుల: ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తి. సంఘంలో కీర్తి దక్కుతుంది. ఆహ్వానాలు రాగలవు. విలువైన వస్తువులు సేకరిస్తారు. వృత్తి, వ్యాపారాలు సంతృప్తినిస్తాయి.వృశ్చికం: దూరప్రయాణాలు. రుణఒత్తిడులు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. నిర్ణయాలలో మార్చుకుంటారు. అదనపు ఖర్చులు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.ధనుస్సు: శ్రమాధిక్యం. పనులు వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.మకరం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. బంధువులను కలుసుకుంటారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో కొత్త ఆశలు.కుంభం: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాల్లో విజయం. పరిచయాలు పెరుగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మీనం: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
అత్యున్నత ఐదువేలు
దాదాపు నూట నలభై కోట్ల మంది భారతీయుల్లో ఒక పదకొండు వేల మంది తలా వంద రూపాయలు ఇస్తే ఎంతవుతుంది? పోనీ నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల నుంచి, ఐదు కోట్ల మంది ఆంధ్ర ప్రజల నుంచి కలిపి వేయిమంది తలా వంద రూపాయలు ఇస్తే ఎంతవుతుంది? లెక్క తరువాత మాట్లాడుదాం.‘సినిమా రంగంలో రచయితకు అత్యంత తక్కువగా డబ్బు ఇవ్వాలని నిర్మాతకు ఎందుకనిపిస్తుందంటే అతను ఖాళీ చేతులతో వస్తాడు కనుక’ అని రచయిత సౌదా అంటాడు. నిజమే. మేకప్ వేసేవాడు పెద్ద కిట్ తెస్తాడు. విగ్గులకు డబ్బు అడుగుతాడు. కాస్ట్యూమ్ డిజైనర్ బోలెడన్ని బట్టలు కొనాలి కనుక బిల్లు ఎక్కువ. సినిమాటోగ్రాఫర్ కెమెరాలు, లెన్సులు, క్రేన్లు, భారీ పరికరాలు... ఇన్ని వాడుతున్నాడంటే అతనికి ఎంతిచ్చినా తక్కువే. కళా దర్శకుడు వేసే సెట్ కనిపిస్తుంది.మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర వాద్యాల బృందం కనిపిస్తుంది. మరి రచయిత దగ్గరో? ఒక తెల్లకాగితం, పెన్ను. ఐదు రూపాయల పెన్ను జేబులో పెట్టుకుని వచ్చేవాడికి, కాగితం మీద అప్పటికప్పుడు రాసిచ్చి వెళ్లేవాడికి డబ్బు ఇవ్వడం అవసరమా అని నిర్మాతకేం ఖర్మ, ఎవరికైనా అనిపిస్తుంది. చిత్రమేమిటంటే సినిమా ‘సీన్ పేపర్’ నుంచే మొదలవుతుంది. దానిని రచయితే రాయాలి.తన దగ్గరకు వచ్చిన ఆసామీకి టీ ఇచ్చి, అతను తాగి కప్పు దించే లోపలే పాట రాసి ఇచ్చాడట ఆత్రేయ. ‘ఐదు నిమిషాల్లో రాశారు. దీనికింత డబ్బు ఇవ్వడం అవసరమా’ అన్నాడట ఆసామీ లాల్చీ జేబులో చేయి పెట్టి నసుగుతూ. ఆత్రేయ మొహమాటపడక డబ్బు అందుకుని ‘ఈ ఐదు నిమిషాల వెనుక ముప్పై ఏళ్ల తపస్సు ఉంది నాయనా’ అన్నాడట. రచయిత చేతికి పని చెప్పే మెదడు ఉందే, అది రాతకు తయారుగా ఉందే, ఆ మెదడు అలా తయారు కావడానికి రచయిత ఏమేమి చేసి ఉంటాడు? ఎన్ని రాత్రులను పుస్తకాలు చదువుతూ తగలెట్టి ఉంటాడు? ఎన్ని తావుల్లో తిరుగుతూ మనుషుల్లో పాత్రలను వెతుకుతూ వారి చెమట, కన్నీరు, రక్తపు చారికలు పూసుకుని ఉంటాడు? వారి సద్బుద్ధుల చందనంలో, దుర్బుద్ధుల దుర్గంధంలో వారే తానై బతికి ఉంటాడు? ఆ రాత్రి ఉదయించిన సంపూర్ణ చంద్రుడి రంగును సరైన మాటల్లో వర్ణించడానికి ఎన్ని గుప్పుల పొగను తాగి ఊపిరిని నలుపు చేసుకుని ఉంటాడు? ఒక గొప్ప వాక్యం కోసం ఎన్ని వందల కాగితాలను చించి ఉంటాడు? ఒక కావ్యజన్మ కోసం ఎన్ని ఊహా పరిష్వంగాలలో పదేపదే సొమ్మసిల్లి ఉంటాడు?లాల్చీ, పైజామా, జేబులో పెన్నుతో అతడు ఎదురు పడినప్పుడు– అవశ్యం– అతని మేధాశ్రమ ఏదీ కనిపించదు. కనుక కలం పట్టి అతను రాసే రాతకు అత్యల్ప రుసుము ఇవ్వవచ్చనే ఆనవాయితీ ఎవరైనా పాటించవచ్చు. కథకు, కవితకు 500 రూపాయల పారితోషికం ఇవ్వొచ్చు. ఇవ్వక ఎగ్గొట్ట వచ్చు. పదుగురిని అడిగో, పి.ఎఫ్ బద్దలు కొట్టో పుస్తకం వేస్తే అమ్మిన ప్రతుల సొమ్ము అమ్మకందారు ఇవ్వొచ్చు. ఇవ్వక పోవచ్చు. పబ్లిషర్లు ఎవరైనా ఉంటే వారు రాయల్టీ ఇవ్వొచ్చు. ఇవ్వకపోనూవచ్చు. ఒకసారి రచయిత పుస్తకం వేశాక వాట్సప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ తదితరాలలో ఉండే సాహితీ సూక్ష్మక్రిములు అది తమ సొంతంగా భావించి వందలాది పి.డి.ఎఫ్‌లు పంచొచ్చు... పుస్తకం కొనకనే చదువుకోవచ్చు.ఇవన్నీ ఇలాగుంటే తెలుగునాట సాహితీకారులను ప్రోత్సహించడానికి ‘ఐదు వేలు’ అనే అచ్చొచ్చిన నంబర్ ఒకటి ఉంది. పాతిక, ముప్పై ఏళ్ల క్రితం మొదలైన ‘ఐదు వేల రూపాయల’ అవార్డు/బహుమతి తెలుగు సాహితీజాతికి లక్ష్మణరేఖ. నేటికీ, 2024లో కూడా, ‘చార్జీలతో కలిపి 5000 రూపాయల’ అవార్డు ప్రకటిస్తే అదే పదివేలనుకుని భార్యాపిల్లలను వెంటబెట్టుకువెళ్లే దుఃస్థితి తెలుగు రచయితది. తెలుగు నేలన ఎక్కడ పట్టినా నేటికీ ‘మొదటి బహుమతి 5 వేలు, రెండవ బహుమతి 3 వేలు, మూడవ బహుమతి వేయి రూపాయల’ దిక్కుమాలిన కథాపోటీలు. వాటికి రాసే సీనియర్ రచయితలు! సాహితీ అకాడెమీ పురస్కార గ్రహీతలు! వెయ్యి రూపాయల లిస్ట్‌లో వీరి పేర్లు! రూపాయి ఊసెత్తక తలపాగా, ముఖం తుడవను పనికిరాని శాలువాతో ఇచ్చే అవార్డులు కొల్ల. వీటికి తోడు 116 డాలర్లు మొహానకొట్టే ఎన్ .ఆర్.ఐ వితరణశీలత ఏమని చెప్పుట? ఇంటికి చెద పట్టిందని ఫోన్ చేస్తే ఐదు వేలకు తక్కువగా ఎవరూ రావడం లేదు. గంట కార్పెంటర్ పని చేస్తే రెండు వేలు నిలబెట్టి వసూలు చేస్తాడు. ప్లంబర్ వచ్చి వాష్‌బేసిన్ వైపు చూడాలంటే కనీస వెల వెయ్యి. కాని తెలుగు రచయిత మాత్రం తన దశాబ్దాల తపస్సుకు ‘బాబూ... ఒక్క ఐదు వేలు’ అంటున్నాడు. తెలుగు సాహితీవరణంలో నిషేధించాల్సిన ఒకే ఒక నంబర్– ఐదు వేలు!140 కోట్ల భారతీయులలో పదకొండు వేల మంది వంద రూపాయలు ఇస్తే పదకొండు లక్షలు అవుతాయి. అది మన జ్ఞానపీట్అ వార్డు నగదు బహుమతి! 9 కోట్ల తెలుగువారిలో వెయ్యి మంది వంద రూపాయలు ఇస్తే లక్ష అవుతుంది. అది సాహిత్య అకాడెమీ నగదు బహుమతి. జీవితంలో ఒకసారి పొందే వీటి నగదులే ఇలా ఉంటే ఐదు వేల అవార్డుకు వంకలేల అంటారా? ఆ అత్యున్నత అంకెతో అత్యల్పంగా బతికేద్దాం!
అడ్వాన్స్‌డ్‌లో ఏపీ మెరుపులు
సాక్షి, అమరావతి : ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) విద్యా సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ స్థాయి అర్హత పరీక్ష జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఆదివారం ఐఐటీ మద్రాస్ విడుదల చేసిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో టాప్–10లో నలుగురు ఏపీ విద్యార్థులు ర్యాంకులు సాధించారు. వంద ర్యాంకుల్లో 20 మంది తెలుగు రాష్ట్రానికి చెందిన వాళ్లే ఉన్నారు. మొత్తంగా అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన వారిలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు 12 వేల మంది వరకు ఉన్నారు. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం నెహ్రూనగర్‌కు చెందిన భోగలపల్లి సందేశ్ 360కి గాను 338 మార్కులతో జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. అనంతపురం జిల్లాకు చెందిన పుట్టి కుశాల్ కుమార్ 334 మార్కులతో 5వ ర్యాంకు, కర్నూలు జిల్లాకు చెందిన కోడూరు తేజేశ్వర్ 331 మార్కులతో 8వ ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అల్లడబోయిన ఎస్‌ఎస్‌డీబీ సిద్విక్ సుహాస్ 329 మార్కులతో 10వ ర్యాంకుతో మెరిశారు. ఏపీకి చెందిన మత బాలాదిత్య (ఐఐటీ భువనేశ్వర్ జోన్)కు 11వ ర్యాంకు రాగా, ఓబీసీ కేటగిరీలో మొదటి ర్యాంకు సొంతం చేసుకున్నాడు. జేఈఈ అడ్వాన్స్డ్ టాపర్‌గా ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన వేద్ లహోటి 355 మార్కులతో సత్తా చాటాడు. తొలి పది ర్యాంకుల్లో ఐఐటీ రూర్కీ జోన్‌కు ఒకటి, ఐఐటీ ఢిల్లీ జోన్‌కు రెండు, ఐఐటీ బాంబే జోన్‌కు మూడు, అత్యధికంగా ఐఐటీ మద్రాస్ జోన్‌కు నాలుగు ర్యాంకులు దక్కడం విశేషం. ఇక ఐఐటీ బాంబే జోన్‌కు చెందిన ద్విజా ధర్మేష్ కుమార్ పటేల్ జాతీయ స్థాయిలో 332 మార్కులతో 7వ ర్యాంకు సాధించడమే కాకుండా బాలికల విభాగంలో టాపర్‌గా నిలిచింది. గతేడాది తొలి పది స్థానాల్లో ఆరుగురు హైదరాబాద్ జోన్‌కు చెందిన విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది ఆ జాబితాలో చోటు దక్కించుకోలేకపోయారు. పెరిగిన ఉత్తీర్ణత దేశ వ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాలకు సంబంధించి ఏటా 2.50 లక్షల మంది అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు. ఈ ఏడాది 1,86,584 లక్షల మంది అడ్వాన్స్డ్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 1,80,200 మంది పరీక్షకు హాజరవ్వగా 48,248 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇది 2023లో 43,773గా ఉంది. అడ్వాన్స్డ్ ఉత్తీర్ణతలో బాలికల సంఖ్య కూడా పెరిగింది. 2023లో 7,509 మంది ఉంటే తాజాగా 7,964 మంది ఉత్తీర్ణులయ్యారు. 331 మంది ఓవర్సీస్ ఇండియన్స్ పరీక్ష రాస్తే 179 మంది, 158 విదేశీ విద్యార్థులు పరీక్షకు హాజరైతే కేవలం 7 మంది మాత్రమే అర్హత సాధించడం గమనార్హం.నేటి నుంచి జోసా కౌన్సెలింగ్ ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ, జీఎఫ్‌ఐటీలో ప్రవేశాలకు సంబంధించి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) సోమవారం (నేడు) నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది. విద్యార్థులకు అవగాహన నిమిత్తం 17వ తేదీ వరకు మాక్ కౌన్సెలింగ్ నిర్వహించనుంది. మొత్తం ఐదు దశల్లో కౌన్సెలింగ్‌ను పూర్తి చేసేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ను ప్రకటించింది. 18వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు, ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పిస్తోంది. అనంతరం 20న తొలి దశ, 27న రెండో దశ, జూలై 4న మూడో దశ, జూలై 10న నాల్గవ దశ, జూలై 17న తుది విడత సీట్లను కేటాయించనుంది. జూలై 23న మిగిలిన సీట్లు ఉంటే వాటికి కూడా కౌన్సెలింగ్ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించింది.నా లక్ష్యం ఐఏఎస్మాది నంద్యాల జిల్లా గోస్పాడు మండలం నెహ్రూనగర్ గ్రామం. అమ్మ వి.రాజేశ్వరి, నాన్న బి.రామ సుబ్బారెడ్డి.. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. పదో తరగతిలో 10/10 పాయింట్లు వచ్చాయి. ఇంటర్లో 987 మార్కులు సాధించాను. జేఈఈ మెయిన్స్‌లో 99.99 పర్సెంటెల్‌తో ఆల్ ఇండియా లెవెల్లో 252వ ర్యాంకు వచ్చింది. జెఈఈ అడ్వాన్స్‌డ్‌లో 368 మార్కులకు 338 వచ్చాయి. ఓపెన్ క్యాటగిరీలో ఆలిండియాలో 3వ ర్యాంక్, సౌత్ ఇండియాలో మొదటి ర్యాంక్ రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులే నాకు స్ఫూర్తి. ముంబయి ఐఐటీలో కంప్యూటర్ సైన్స్ చదివి, సివిల్స్ పరీక్ష రాసి ఐఏఎస్ కావాలనేది నా లక్ష్యం. – బొగ్గులపల్లి సందేశ్, 3వ ర్యాంకు ముందస్తు ప్రణాళికతో చదివా మాది కర్నూలు జిల్లా కృష్ణగిరి గ్రామం. అమ్మానాన్నలు కృష్ణవేణి, శేఖర్.. ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులు. పదో తరగతిలో 570, ఇంటర్లో 981 మార్కులు వచ్చాయి. జేఈఈ మెయిన్స్‌లో ఆల్ ఇండియా లెవెల్లో 83వ ర్యాంకు వచ్చింది. అడ్వాన్స్‌డ్‌లో ఆల్ ఇండియా లెవెల్లో 8వ ర్యాంకు రావడం పట్ల చాలా సంతోషంగా ఉంది. ఐఐటీ ముంబైలో సీఎస్ఈ చదవాలని ఉంది. ముందస్తు ప్రణాళికతో చదవడం వల్లే ఉత్తమ ర్యాంకు సాధించాను. – కె.తేజేశ్వర్, 8వ ర్యాంకుపెరిగిన కటాఫ్ మార్కులుజేఈఈ అడ్వాన్స్డ్ అర్హులుగా పరిగణనలోకి తీసుకునేందుకు ఈసారి కటాఫ్ మార్కులు పెరిగాయి. గతేడాది జనరల్ ర్యాంకు కటాఫ్ 86 ఉండగా ఇప్పుడు 109కి పెరిగింది. ఓబీసీ 98, ఈడబ్ల్యూఎస్ 98, ఎస్సీ, ఎస్టీ, వివిధ పీడబ్ల్యూడీ విభాగాల్లో 54గా ఉండటం గమనార్హం. 2017 తర్వాత భారీ స్థాయిలో కటాఫ్ మార్కులు పెరిగాయి. సత్తా చాటిన లారీ డ్రైవర్ కుమారుడునరసన్నపేట: ఒక సాధారణ లారీ డ్రైవర్ కుమారుడు జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో 803వ ర్యాంకు, ఓబీసీ విభాగంలో 118 వ ర్యాంకు సాధించాడు. నరసన్నపేట మండలం దూకులపాడుకు చెందిన అల్లు ప్రసాదరావు కుమారుడు రామలింగన్నాయుడు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అదరగొట్టాడు. పేద కుటుంబానికి చెందిన ఈ విద్యార్థి మొదటి నుంచి పట్టుదలతో చదివేవాడు. ఆరో తరగతి నుంచి వెన్నెలవలస నవోదయలో చదువుకున్నాడు. తండ్రి ప్రసాదరావు లారీ డ్రైవర్ అయినప్పటికీ, కుమారుడికి చదువుపై ఉన్న మక్కువను గుర్తించి ప్రోత్సహించారు. విద్యార్థి తల్లి సుగుణ గృహిణి. కోర్సు పూర్తి చేసి సివిల్స్‌కు ప్రిపేర్ అవుతానని రామలింగన్నాయుడు తెలిపారు.
ఆ హీరోతో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న లైగర్ బ్యూటీ
అనుకున్నవన్నీ జరగవు.. అయినా అనుకోవడం మానుకోలేం. అలాగే మనసులోని కోరికను వ్యక్తం చేయడం కూడా తప్పు కాదు. నటి అనన్య పాండే కూడా తన మనసులోని కోరికను ఇలానే వ్యక్తం చేశారు. ప్రస్తుతం గ్లామరస్ నటిగా రాణిస్తున్న బాలీవుడ్ బ్యూటీ ఈమె. ఈమె ఇంతకుముందు స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, కాలీ పీవీ, డ్రీమ్ గర్ల్ 2, తెలుగు చిత్రం లైగర్ తదితర చిత్రాల్లో నటించి గుర్తింపు పొందారు. ప్రస్తుతం హిందీ లో కంట్రోల్ అనే చిత్రంలో నటిస్తున్నారు. సీనియర్ రాజకీయ నాయకుడు, న్యాయవాది సి శంకరన్ నాయర్ బయోపిక్‌లోనూ నటిస్తున్నారు. సహజంగానే ఛాలెంజింగ్ పాత్రల్లో నటించాలని కోరుకునే నటి ఈమె. ఇప్పటికే తెలుగులో లైగర్ చిత్రంలో నటించిన ఈమె ఇప్పుడు కోలీవుడ్ చిత్రాల్లోనూ నటించాలనే ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టీవ్‌గా ఉండే అనన్య పాండే ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ కోలీవుడ్‌లో నటుడు విజయ్ సరసన నటించాలనే కోరిక ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఆమె కోరిక నెరవేరే చాన్సే లేదనిపిస్తోంది. ఎందుకంటే రాజకీయ పార్టీని నెలకొల్పిన నటుడు విజయ్ త్వరలో రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈయన ప్రస్తుతం గోట్ అనే చిత్రంలో నటిస్తున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. దీని తర్వాత తన 69వ చిత్రంలో నటించి ఆ తర్వాత నటనకు స్వస్తి పలకబోతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే విజయ్ నటించే చివరి చిత్రంలో అనన్య పాండే అవకాశాన్ని ఎదురుచూస్తున్నారేమో. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆమె తన మనసులోని కోరికను వ్యక్తం చేశారా? అని అనిపిస్తుంది.
తప్పక చదవండి
- వందేభారత్, జనశతాబ్ధి రైళ్లకు తప్పిన ప్రమాదం
- ఉత్కంఠ పోరులో పాక్‌ను చిత్తు చేసిన భారత్ (ఫోటోలు)
- గుడి కోసం టీడీపీ–జనసేన కుమ్ములాట
- ప్రియుడితో సినీ నటి ప్లాన్.. స్నేహితురాలిని బర్త్‌డే పార్టీకి పిలిచి ఆపై..
- డెలివరీ పార్ట్నర్స్కు శీతల పానీయాలు
- ఒడిశా సీఎంగా సురేశ్ పూజారి?
- పెరిగిన గృహావసరాల వినియోగ వ్యయం
- అడ్వాన్స్‌డ్‌లో ఏపీ మెరుపులు
- కావేరికి గోదావరి.. ఇచ్ఛంపల్లి నుంచి లేనట్లే!
- టెన్షన్.. టెన్షన్!
సినిమా
పెళ్లి చేసుకోబోతున్న హీరామండి నటి.. వరుడు ఎవరంటే?
బాలీవుడ్ భామ, హీరామండి నటి సోనాక్షి సిన్హా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. నటుడు జహీర్ ఇక్బాల్‌ను పెళ్లాడనున్నట్లు తెలుస్తోంది. ఈనెల 23న వివాహాబంధంలోకి అడుగు పెట్టనున్నారు. ముంబయిలోనే వీరిద్దరి వివాహం జరగనుంది. కాగా..కొన్నేళ్లుగా సోనాక్షి, జహీర్ డేటింగ్లో ఉన్నారు. అయితే ఈ జంట తమ రిలేషన్ గురించి ఎక్కడా బయటికి చెప్పకుండా జాగ్రత్తపడ్డారు.ఇటీవల సోనాక్షి సిన్హా బర్త్ డే సందర్భంగా ప్రియుడు జహీర్ ఇక్బాల్ విషెస్ తెలిపారు. ఇన్‌స్టా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరి పెళ్లికి సన్నిహితులు, కుటుంబ సభ్యులతో హాజరు కానున్నారు. వీరితో పాటు హీరామాండి నటీనటులను కూడా వివాహానికి ఆహ్వానించారు. కాగా.. సోనాక్షి సిన్హా చివరిసారిగా సంజయ్ లీలా భాన్సాలి తెరకెక్కించిన వెబ్ సిరీస్ హీరామండిలో కనిపించింది. View this post on Instagram A post shared by Zaheer Iqbal (@iamzahero)
నయన్- విఘ్నేశ్ వివాహ వార్షికోత్సవం.. భర్త ఎమోషనల్ పోస్ట్!
కోలీవుడ్‌లో మోస్ట్ ఫేమ్ ఉన్న ఫేమ్ ఉన్న జంటల్లో నయనతార- విఘ్నేశ్ శివన్ ఒకరు. కొన్నేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు జూన్ 9, 2022లో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఈ జంట సరోగసి పద్ధతిలో కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. తాజాగా ఇవాళ రెండో వివాహా వార్షికోత్సవం సందర్భంగా నయన భర్త విఘ్నేశ్ శివన్ స్పెషల్ పోస్ట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా తన భార్యతో కలిసి చిల్ అవుతోన్న వీడియోను అభిమానులతో పంచుకున్నారు.విఘ్నేశ్ శివన్ తన ఇన్‌స్టాలో రాస్తూ..'పదేళ్ల నయనతార.. రెండేళ్ల విక్కీ-నయన్. ఇవాళ మా రెండో వివాహా వార్షికోత్సవం. నిన్ను పెళ్లి చేసుకోవడం, ఉయిర్ ఉలగం రావడం నా జీవితంలోకి అతి గొప్పవిషయం. నా భార్య తంగమేయిని చాలా ప్రేమిస్తున్నా. నీతో మరెన్నో ఆహ్లాదకరమైన సమయాలు, జ్ఞాపకాలు, విజయవంతమైన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను. ఎలాంటి పరిస్థితుల్లనైనా నీకు తోడుగా ఉంటా. ఆ భగవంతుడు ఎల్లవేళలా మనకు అండగా నిలవాలని కోరుకుంటున్నా. మన ఉయిర్, ఉలగంతో సంతోషంగా ఉండాలనేదే ఆశయం. ఆలాగే మన పెద్ద పెద్ద ఆశయాలు నెరవేరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా.' అంటూ వీడియోను పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. నయన్ గతేడాది జవాన్ మూవీతో సూపర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత ఆమె నటించిన అన్నపూరణి చిత్రం విమర్శల పాలైన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial)
ప్రముఖ సింగర్‌పై రూమర్స్.. నాలుగో భర్తకు కూడా..!
హాలీవుడ్ ప్రముఖ నటి, సింగర్ జెన్నిఫర్ లోపెజ్ విడిపోతున్నట్లు వార్తలొస్తున్నాయి. 2022లో బెన్ అఫ్లెక్‌ను పెళ్లాడిన నటి త్వరలోనే తమ బంధానికి గుడ్ బై చెప్పనున్నట్లు హాలీవుడ్లో లేటేస్ట్ టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ జంట బెవర్లీ హిల్స్‌లోని ఖరీదైన బంగ్లాలో నివసిస్తున్నారు. తాజాగా ఈ భవనాన్ని అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. కేవలం ఏడాది క్రితమే కొనుగోలు చేసిన బంగ్లా అమ్మకానికి పెట్టడంతో ఈ జంట డైవర్స్ తీసుకోబోతున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.కాగా.. ఇప్పటికే జెన్నిఫర్ లోపెజ్ ముగ్గురి పెళ్లి చేసుకుని వారితో విడాకులు తీసుకున్నారు. బెన్ అఫ్లెక్ ఆమెకు నాలుగో భర్త కాగా.. ఈ బంధానికి ఎండ్ కార్డ్ పడడం ఖాయంగా కనిపిస్తోంది. 2021లో డేటింగ్ ప్రారంభించిన వీరిద్దరు.. ఆ తర్వాత 2022లో పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. దీంతో ఈ జంట కేవలం రెండేళ్లలోనే తమ వివాహాబంధానికి ముగింపు పలకనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గత నెల రోజులుగా ఈ జంటపై విడాకుల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య గొడవలు తలెత్తినట్లు సమాచారం. బిజీ షెడ్యూల్ కారణంగానే వీరి మధ్య సంబంధాలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ హీరోయిన్‌కి అరుదైన వ్యాధి.. షాకింగ్ విషయాలు రివీల్
హీరోయిన్లు పైకి అందంగా కనిపిస్తారు. కానీ కొన్నిసార్లు వ్యాధుల బారిన పడుతుంటారు. సమంత కొన్నాళ్ల ముందు మయోసైటిస్ వ్యాధి బారిన పడి ఇప్పుడు మెల్లమెల్లగా బయటపడుతోంది. తాజాగా అదాశర్మ కూడా తనకు ఓ అరుదైన వ్యాధి ఉందని రివీల్ చేసింది. దీని వల్ల ఎంతలా బాధపడాల్సి వస్తుందో ఇప్పుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది.'హార్ట్ ఎటాక్' అనే తెలుగు మూవీతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన అదాశర్మ.. ఆ తర్వాత టాలీవుడ్లో వరస సినిమాలు చేసింది. కానీ పెద్దగా పేరు అయితే రాలేదు. మరోవైపు బాలీవుడ్‌కి షిఫ్ట్ అయిపోయి.. 'ద కేరళ స్టోరీ', 'బస్తర్' లాంటి మూవీస్‌తో కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి ఎవరికీ తెలియని సీక్రెట్ బయటపెట్టింది.(ఇదీ చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!)'కేరళ స్టోరీ మువీలో నటించినప్పుడు కాలేజీ అమ్మాయిలా కనిపించడానికి బరువు తగ్గాల్సి వచ్చింది. ఆ తర్వాత 'బస్తర్' చిత్రంలో నటించినప్పుడు బరువు పెరిగాను. ఎందుకంటే ఆ చిత్రంలో బరువైన గన్స్ మోయాలి కాబట్టి లావుగా కనిపించడంతో పాటు కాస్త బలంగా ఉండటానికి రోజు 10-12 అరటిపళ్లు తిన్నాను. అలానే గింజలు, డ్రై ఫ్రూట్స్, ఫ్లాక్ సీడ్స్ ఉన్న లడ్డూలని నాతో పాటు షూటింగ్‌కి తీసుకెళ్లాను. నిద్రపోయే అరగంట ముందు రెండు లడ్డూలు తినేదాన్ని''కానీ ఇప్పుడు మళ్లీ బరువు తగ్గాల్సి వచ్చింది. ఇలా నెలల వ్యవధిలో బరువు తగ్గడం-పెరగడం వల్ల నా బాడీలో రకరకాల మార్పులు చోట్ చేసుకోవడంతో పాటు ఒత్తిడికి గురయ్యాను. ఇది కాదన్నట్లు ఎండోమెట్రియోసిస్ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు తేలింది. దీని వల్ల పీరియడ్స్ ఆగకుండా వస్తూనే ఉంటాయి. ఈ జబ్బు కారణంగా దాదాపు 48 రోజుల పాటు నాన్ స్టాప్ పీరియడ్స్ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను' అని అదాశర్మ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: నటి ఇంట్లో చోరీ.. 10 తులాల బంగారం, డబ్బు దొంగతనం)
క్రీడలు
T20 WC 2024 IND VS PAK: మ్యాచ్ రూపురేఖల్ని మార్చేసిన బుమ్రా
టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా పాకిస్తాన్‌తో నిన్న (జూన్ 9) జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియా 6 పరుగుల స్వల్ప తేడాతో అద్భుత విజయం సాధించింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్‌లో బుమ్రా తన ప్రతాపాన్ని చూపి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలకమైన వికెట్లు (బాబర్ ఆజమ్, మొహమ్మద్ రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్) తీశాడు. భారత్ విజయావకాశాలు పూర్తిగా అడుగంటిన వేళ బుమ్రా వేసిన ఇన్నింగ్స్ 19వ ఓవర్ మ్యాచ్ రూపురేఖల్నే మార్చేసింది. ఆ ఓవర్లో బుమ్రా కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి ప్రమాదకారిగా కనిపించిన ఇఫ్తికార్ అహ్మద్‌ను ఔట్ చేశాడు. తన మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ కారణంగా బుమ్రా వరుసగా రెండో మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియాను గెలిపించాడు. పాక్‌తో మ్యాచ్ విషయానికొస్తే.. 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో భారత బౌలర్లు ఆదిలో విఫలమయ్యారు. 4 ఓవర్లలో పాక్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసి లక్ష్యంగా దిశగా సాగుతుండింది. ఈ దశలో (ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో) బుమ్రా తన అనుభవాన్నంతా రంగరించి పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్‌ను ఔట్ చేశాడు. అనంతరం ఇన్నింగ్స్ 15వ ఓవర్లో మరోసారి బంతిని అందుకున్న బుమ్రా ఈ సారి అప్పటికే క్రీజ్‌లో సెట్ అయిపోయిన రిజ్వాన్‌ను ఔట్‌ను చేసి భారత శిబిరంలో గెలుపుపై ఆశలకు బీజం పోశాడు. ఈ మధ్యలో హార్దిక్ పాండ్యా (4-0-24-2) రెండు వికెట్లు తీసి మ్యాచ్‌ను రక్తి కట్టించగా.. బుమ్రా 19వ ఓవర్లో మరోసారి తన ప్రతాపాన్ని చూపాడు. పాక్ గెలుపు ఖాయమనుకున్న వేళ బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా కీలకమైన ఇఫ్తికార్ వికెట్ తీసి పాక్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. పాక్ గెలుపుకు చివరి ఓవర్లో 18 పరుగులు అవసరం కాగా.. అర్ష్‌దీప్ ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా బౌలింగ్ చేసి మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. చివరి ఓవర్ నాలుగు, ఐదు బంతులకు నసీం షా బౌండరీలు బాదినప్పటికీ పాక్ ఓటమి అప్పటికే ఖరారైపోయింది. బుమ్రా ప్రదర్శన కారణంగా ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్ వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించి, సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకుంది. టీ20ల్లో భారత్ డిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోర్ (120), టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో ఏ జట్టైనా డిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోర్ ఇదే కావడం విశేషం. పాక్‌పై ఈ మ్యాచ్‌లో గెలుపుతో భారత్ టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో దాయాదిపై తమ రికార్డును (7-1) మరింత మెరుగుపర్చుకుంది. గతేడాది చివర్లో జరిగిన వన్డే వరల్డ్‌కప్‌లోనూ బుమ్రా పాక్‌పై ఇలాంటి మ్యాచ్ విన్నింగ్స్ పెర్ఫార్మెన్సే (2/19) కనబర్చి టీమిండియా గెలుపులో కీలకపాత్ర పోషించాడు. స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో బుమ్రాతో పాటు హార్దిక్ చూపిన పట్టుదలకు క్రికెట్ ప్రపంచం మొత్తం జేజేలు పలుకుతుంది. గెలుపు సునాయాసమనుకున్న మ్యాచ్‌లో ఓడటంతో పాక్ ఆటగాళ్లు, అభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు. పాక్‌పై గెలుపు అనంతరం న్యూయార్క్ మైదానంలో భారత అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. పాక్ పేసర్లు చెలరేగడంతో 19 ఓవర్లలో 119 పరుగులకు చాపచుట్టేసింది. అనంతరం భారత పేసర్లు సైతం విజృంభించి పాక్‌కు సాధ్యమైంది తమకెందుకు సాధ్యం కాదన్న రీతిలో ప్రతిఘటించి టీమిండియాకు చిరస్మరణీయ విజయాన్నందించారు. భారత బౌలర్ల దెబ్బకు పాక్ నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్ చేసినప్పటికీ లక్ష్యానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆ జట్టు చేతిలో ఇంకా 3 వికెట్లు ఉన్నాయి. బుమ్రా, హార్దిక్‌తో పాటు సిరాజ్ (4-0-19-0), అర్ష్‌దీప్ (4-0-31-1), అక్షర్ (2-0-11-1) కూడా రాణించారు. పాక్ ఇన్నింగ్స్‌లో రిజ్వాన్ (31) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు పంత్ (42) రాణించడంతో భారత్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. పాక్ బౌలర్లలో నసీం షా, హరీస్ రౌఫ్ తలో 3 వికెట్లు, మొహమ్మద్ ఆమిర్ 2, షాహిన్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టారు. ఈ ఓటమితో ప్రస్తుత ప్రపంచకప్‌లో పాక్ సూపర్-8 అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే.
పూజా తోమర్ ఘనత
కెంటకీ: భారత్‌కు చెందిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి పూజా తోమర్ చరిత్ర లిఖించింది. అల్టిమేట్ ఫైటింగ్ చాంపియన్íÙప్ (యూఎఫ్‌సీ)లో విజయం అందుకున్న తొలి భారతీయ ఫైటర్‌గా రికార్డు నెలకొల్పింది. లూయిస్‌విలెలో జరిగిన ఈ పోటీల్లో పూజ 52 కేజీల స్ట్రా–వెయిట్ కేటగిరీలో 30–27, 27–30, 29–28తో బ్రెజిల్‌కు చెందిన రేయాన్నెపై గెలిచింది. గట్టి పోటీ ఉండే యూఎఫ్‌సీలో ఇప్పటివరకు మన మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులెవరూ కనీసం ఒకసారి కూడా నెగ్గలేకపోయారు. కానీ ఉత్తరప్రదేశ్‌కు చెందిన 30 ఏళ్ల పూజ గతేడాది యూఎఫ్సీతో కాంట్రాక్టు కుదుర్చుకోవడంతోనే అతిపెద్ద మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్లో పోటీపడే అవకాశం పొందిన తొలి భారత మహిళగా ఘనత వహించింది. గతంలో పురుషుల విభాగంలో భారత్‌కు చెందిన అన్షుల్ జూబ్లీ, భరత్ ప్రపంచ స్థాయి యూఎఫ్‌సీలో పోటీ పడ్డారు.
రసెల్‌కు ‘పోల్ పొజిషన్’
మాంట్రియల్: మెర్సిడెస్ జట్టు డ్రైవర్ జార్జి రసెల్ తన కెరీర్లో రెండోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. ఫార్ములావన్ సీజన్లో భాగంగా తొమ్మిదో రేసు కెనడా గ్రాండ్‌ప్రిని రసెల్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. క్వాలిఫయింగ్ సెషన్లో రసెల్, రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 12 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశారు. అయితే వెర్స్టాపెన్కంటే ముందుగా రసెల్ ఈ సమయాన్ని నమోదు చేయడంతో అతనికి పోల్ పొజిషన్ కేటాయించారు. మూడు క్వాలిఫయింగ్ సెషన్లు కలిపి రసెల్ 26 ల్యాప్‌లు... వెర్స్టాపెన్ 27 ల్యాప్‌లు పూర్తి చేశారు. 2022లో హంగేరి గ్రాండ్‌ప్రిలో తొలిసారి రసెల్ ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించాడు. ఆ తర్వాత రసెల్‌కు మళ్లీ పోల్ పొజిషన్ దక్కలేదు. లాండో నోరిస్ (మెక్లారెన్) మూడో స్థానం నుంచి... ఆస్కార్ పియాస్ట్రి (మెక్లారెన్) నాలుగో స్థానం నుంచి... డానియల్ రికార్డో (హోండా) ఐదో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు ఎనిమిది రేసులు జరగ్గా... తొలి ఏడు రేసుల్లో వెర్స్టాపెన్, ఎనిమిదో రేసులో చార్లెస్ లెక్లెర్క్ పోల్ పొజిషన్లు సాధించారు.
‘ఫ్రెంచ్ కింగ్’ అల్కరాజ్
మట్టి కోర్టులపై కొత్త యువరాజు వచ్చాడు. ఇప్పటికే పచ్చిక కోర్టులపై, హార్డ్ కోర్టులపై గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన స్పెయిన్ యువతార కార్లోస్ అల్కరాజ్ మట్టి కోర్టులపై కూడా తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన తొలిసారే అల్కరాజ్ చాంపియన్‌గా అవతరించాడు. ఈ క్రమంలో పలు రికార్డులు నెలకొల్పాడు. మరోవైపు కెరీర్లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలని ఆశించిన జర్మనీ స్టార్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు రెండోసారీ నిరాశే ఎదురైంది. 2020 యూఎస్ ఓపెన్ ఫైనల్లో ఐదు సెట్లలో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) చేతిలో ఓడిపోయిన జ్వెరెవ్ ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో అల్కరాజ్ చేతిలో ఐదు సెట్ల సమరంలో పరాజయం చవిచూశాడు.పారిస్: అంచనాలకు అనుగుణంగా ఆద్యంతం పట్టుదల కోల్పోకుండా ఆడిన స్పెయిన్ టెన్నిస్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఆదివారం ముగిసిన టెన్నిస్ సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్‌లో 21 ఏళ్ల అల్కరాజ్ చాంపియన్‌గా అవతరించాడు. 4 గంటల 19 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ మూడో ర్యాంకర్ అల్కరాజ్ 6–3, 2–6, 5–7, 6–1, 6–2తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై విజయం సాధించాడు. విజేతగా నిలిచిన అల్కరాజ్కు 24 లక్షల యూరోలు (రూ. 21 కోట్ల 71 లక్షలు), రన్నరప్ జ్వెరెవ్‌కు 12 లక్షల యూరోలు (రూ. 10 కోట్ల 84 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ఫైనల్ చేరిన ఇద్దరు స్టార్ ఆటగాళ్ల మధ్య జరిగిన సమరం హోరాహోరీగా సాగింది. తొలి సెట్లో అల్కరాజ్ పైచేయి సాధించగా... రెండో సెట్లో జ్వెరెవ్ పుంజుకున్నాడు. మూడో సెట్లో ఒకదశలో జ్వెరెవ్ 2–5తో వెనుకబడ్డాడు. అయితే జ్వెరెవ్ సంయమనం కోల్పోకుండా ఆడి వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి సెట్‌ను 7–5తో సొంతం చేసుకొని టైటిల్ దిశగా అడుగు వేశాడు. కానీ నాలుగో సెట్లో అల్కరాజ్ మళ్లీ చెలరేగాడు.జ్వెరెవ్‌కు కేవలం ఒక గేమ్ కోల్పోయి సెట్‌ను గెలిచి మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక ఐదో సెట్లోనూ అల్కరాజ్ తన జోరు కొనసాగించాడు. రెండుసార్లు జ్వెరెవ్ సర్విస్‌ను బ్రేక్ చేసి తన సర్విస్లను నిలబెట్టుకొని ఈ స్పెయిన్ స్టార్ విజయకేతనం ఎగురవేశాడు. » ఓపెన్ శకంలో (1968 తర్వాత) మూడు ఉపరితలాలపై గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన పిన్న వయసు్కడిగా అల్కరాజ్ (21 ఏళ్లు) గుర్తింపు పొందాడు. గతంలో ఈ రికార్డు రాఫెల్ నాదల్ (23 ఏళ్లు) పేరిట ఉంది.హార్డ్ కోర్టులపై 2022 యూఎస్ ఓపెన్ నెగ్గిన అల్కరాజ్, 2023లో పచ్చిక కోర్టులపై వింబుల్డన్ టైటిల్ నెగ్గాడు. » టెన్నిస్‌లోని మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీల (ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్) టైటిల్స్ సాధించిన ఏడో ప్లేయర్‌గా అల్కరాజ్ ఘనత వహించాడు. రాఫెల్ నాదల్ (స్పెయిన్), మాట్స్ విలాండర్ (స్వీడన్), జిమ్మీ కానర్స్ (అమెరికా), రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), జొకోవిచ్ (సెర్బియా), ఆండ్రీ అగస్సీ (అమెరికా) గతంలో ఈ ఘనత సాధించారు. » కెరీర్లో ఫైనల్ చేరిన మొదటి మూడు గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచిన ఏడో ప్లేయర్‌గా అల్కరాజ్ నిలిచాడు. గతంలో గుస్తావో కుయెర్టన్ (బ్రెజిల్), స్టీఫెన్ ఎడ్బర్గ్ (స్వీడన్), జాన్ బోర్గ్ (స్వీడన్), ఫెడరర్, జిమ్మీ కానర్స్, వావ్రింకా (స్విట్జర్లాండ్) ఈ ఘనత సాధించారు. » నాదల్, సాంటానా, గిమెనో, సెర్గీ బ్రుగుయెరా, కార్లోస్ మోయా, అల్బెర్ట్ కోస్టా, కార్లోస్ ఫెరీరో తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన ఎనిమిదో స్పెయిన్ ప్లేయర్‌గా అల్కరాజ్ నిలిచాడు.
బిజినెస్
Indian stock market: భారీ లాభాలకు అవకాశం
ముంబై: దలాల్ స్ట్రీట్ ఈ వారం భారీ కొనుగోళ్లతో కళకళలాడొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటు, కేంద్ర మంత్రుల ప్రమాణ స్వీకారంతో ఆర్థిక సంస్కరణల కొనసాగింపుపై మరింత స్పష్టత రావడంతో బుల్ పరుగులు తీసే వీలుందంటున్నారు. ఇక అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశం నుంచి ఈ వారం మార్కెట్లు సంకేతాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే దేశీయ ద్రవ్యల్బోణ గణాంకాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం ట్రేడింగ్‌ను నిర్దేశిస్తాయని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ, విదేశీ ఇన్వెస్టర్ల క్రయ విక్రయాలు, క్రూడాయిల్ ధరలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. ఇటీవల పబ్లిక్ ఇష్యూ పూర్తి చేసుకున్న క్రోనాక్స్ ల్యాబ్ సైన్సెస్ షేర్లు సోమవారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఇదే రోజున లీ ట్రావెన్యూస్ టెక్నాలజీ ఐపీఓ సోమవారం ప్రారంభమై, బుధవారం ముగుస్తుంది. ఎగ్జిట్ పోల్స్, ఎన్నికల ఫలితాలు, ఆర్బీఐ ద్రవ్య విధాన నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో గతవారం తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతూ లాభ, నష్టాల మధ్య ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 76,795 వద్ద కొత్త రికార్డు నమోదుతో పాటు 2,732 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 23,339 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. మొత్తంగా 759 పాయింట్లు ఆర్జించింది. కళ్లన్నీ ఫెడ్ సమావేశం పైనే..! అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ సమావేశ నిర్ణయాలు గురువారం(జూన్ 13న) విడుదల కానున్నాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా (5.25–5.50 శ్రేణిలో) ఉంచొచ్చని అంచనాలు నెలుకొన్నాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల కోత తర్వాత ఫెడ్ రిజర్వ్ తొలి రేట్ల తగ్గింపు సెపె్టంబర్లోనా.? డిసెంబర్లోనా..? అనే అంశంపై స్పష్టత కోసం మార్కెట్ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. అలాగే ద్రవ్యోల్బణం, ఆర్థిక స్థితిగతులపై ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వ్యాఖ్యలు కీలకం కానున్నాయి. ద్రవ్యోల్బణ డేటాపై దృష్టి దేశీయంగా మే నెల రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి డేటా జూన్ 12న, హోల్‌సేల్ ద్రవ్యోల్బణ గణాంకాలు జూన్ 14న విడుదల కానున్నాయి. రిటైల్ ద్రవ్యల్బోణం ఏప్రిల్‌లో 4.85%, మార్చిలో 4.83 శాతంగా నమోదైంది. ఈసారి మేలో4.8శాతంగా నమోదవ్వొచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఐఐపీ డేటా 4.9% నుంచి 3.9 శాతానికి దిగిరావచ్చని భావిస్తున్నారు.రూ.14,794 కోట్ల అమ్మకాలు దేశీయ ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తొలి వారంలో రూ.14,794 కోట్లను వెనక్కి తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు అంచనాలకు భిన్నంగా రావడం.., అదే సమయంలో చైనా స్టాక్ మార్కెట్ ఆకర్షణీయంగా ఇందుకు ప్రధాన కారణాలు. మరోవైపు డెట్ మార్కెట్లో రూ.4,000 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. ఇక మే నెలలో ఎన్నికల ఫలితాలపై భిన్న అంచనాల కారణంగా రూ.25,586 కోట్లు ఉపసంహరించుకున్నారు. కాగా ఏప్రిల్‌లో రూ.8,700 కోట్లకు పైగా పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు.
బంగారం బంగారమే
కాలంతో పాటే దేశీ కరెన్సీ విలువ తరిగిపోతుంటుంది. కానీ, కాలంతోపాటే విలువ పెంచుకుంటూ వెళ్లే వాటిల్లో బంగారం కూడా ఒకటి. అందుకే ప్రతి ఒక్కరి పెట్టుబడుల్లో బంగారానికి (గోల్డ్) తప్పక చోటు ఇవ్వాలి. ఇటీవలి కాలంలో బంగారంలో మంచి ర్యాలీ చూస్తున్నాం. ప్రతి ఏటా పసిడి ఇదే మాదిరి పరుగు పెట్టుకపోవచ్చు. కానీ, దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇచ్చే విషయంలో నిజంగా ‘బంగారమే’ అని ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. 2017–18 సంవత్సరం సావరీన్ గోల్డ్ బాండ్ (ఎస్జీబీ)లో ఇన్వెస్ట్ చేసినవారికి గడిచిన ఐదేళ్లలో ఏటా 16.5 శాతం రాబడి వచి్చంది. సంప్రదాయ డెట్ సాధనాల కంటే రెట్టింపు రాబడి బంగారంలో రావడం అంటే మామూలు విషయం కాదు. ఈక్విటీల స్థాయిలో బంగారం రాబడి ఇవ్వడం విశేషం. అందుకే దీర్ఘకాల లక్ష్యాల కోసం ఇన్వెస్ట్ చేసే వారు బంగారానికి తప్పక చోటు ఇవ్వాలి. ఏ రూపంలో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ప్రయోజనమో తెలియజేసే కథనమే ఇది.వివిధ సాధనాలు బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఆభరణాలను పెట్టుబడిగా చూడొద్దు. ధరించడానికి కావాల్సినంత వరకే ఆభరణాలకు పరిమితం కావాలి. పెట్టుబడి కోసం అయితే ఎలక్ట్రానిక్ రూపంలో ఎన్నో సాధనాలు ఉన్నాయి. వీటిల్లో తమకు నచి్చన దానిని ఎంపిక చేసుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లు, గోల్డ్ ఫండ్స్, సావరీన్ గోల్డ్ బాండ్స్ (ఎస్‌జీబీలు), డిజిటల్ గోల్డ్ అందుబాటులో ఉన్న పలు రకాల సాధనాలు. వీటన్నింటిలోకి ఎస్‌జీబీలు ఎక్కువ ప్రయోజనకరం. గోల్డ్ ఈటీఎఫ్‌లు స్టాక్స్ మాదిరే స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో నిత్యం ట్రేడ్ అవుతుంటాయి. ఇందులో చార్జీలు, వ్యయాలు చాలా తక్కువ. భౌతిక బంగారం ధరలకు అనుగుణంగానే గోల్డ్ ఈటీఎఫ్ ధర ఏరోజుకారోజు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో మారుతుంటుంది. నచి్చనప్పుడు కొనుగోలు చేసుకుని, అవసరమైనప్పుడు సులభంగా విక్రయించుకోవచ్చు. వీటిల్లో ఎక్స్పెన్స్ రేషియో రూపంలో ఏటా నిర్ణీత మొత్తాన్ని చార్జీగా తీసుకుంటారు. వీటిల్లో ఇన్వెస్ట్ చేయాలంటే డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. ఉదాహరణకు ఎల్ఐసీ గోల్డ్ ఈటీఎఫ్‌లో ఎక్స్పెన్స్ రేషియో 0.41 శాతంగా ఉంది. ఈ ఫండ్‌లో రూ.లక్ష ఇన్వెస్ట్ చేశారనుకోండి. దీనిపై 0.41 శాతం ప్రకారం రూ.410ని ఎక్స్పెన్స్ రేషియో కింద ఎల్ఐసీ మ్యూచువల్ ఫండ్ వసూలు చేస్తుంది. ఇది కూడా సంవత్సరానికి ఒకే విడతగా కాకుండా, ఏ రోజుకారోజు ఇన్వెస్టర్ యూనిట్ల నుంచి తీసుకుంటుంది. పెట్టుబడులను ఉపసంహరించుకుంటే ఎగ్జిట్ లోడ్ ఉండదు. పెట్టుబడులపై వచ్చిన లాభాన్ని వార్షిక ఆదాయానికి చూపించి, తాము ఏ శ్లాబు పరిధిలోకి వస్తే ఆ మేరకు పన్ను చెల్లించాలి. గోల్డ్ ఫండ్స్ ఇన్వెస్టర్ల పెట్టుబడులను తీసుకెళ్లి గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడమే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ చేసే పని. కనుక వీటికి బదులు నేరుగా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోనే పెట్టుబడులు పెట్టుకోవచ్చు. కానీ, కొందరికి గోల్డ్ మ్యూచువల్ ఫండ్సే అనుకూలం. ఎలా అంటే.. గోల్డ్ ఈటీఎఫ్ ఒక యూనిట్ ఒక గ్రాము బంగారం పరిమాణంలో ట్రేడవుతుంటుంది. కనుక ఎంతలేదన్నా ఒక గ్రాము బంగారం స్థాయిలో ఒకే విడత ఇన్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అదే గోల్డ్ మ్యూచువల్ ఫండ్‌లో అయితే రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) రూపంలో గోల్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. గోల్డ్ ఈటీఎఫ్‌లో పెట్టుబడికి డీమ్యాట్ ఖాతా తప్పనిసరి. కొనుగోలు చేసిన యూనిట్లు డీమ్యాట్ ఖాతాకే జమ అవుతాయి. కానీ గోల్డ్ ఫండ్స్‌లో పెట్టుబడులకు డీమ్యాట్ ఖాతా తప్పనిసరి కాదు. కాకపోతే గోల్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకునే వారికి కొంచెం అదనపు భారం పడుతుంది. గోల్డ్ ఈటీఎఫ్‌లలో ఇన్వెస్ట్ చేయడం వల్ల అక్కడ ఎక్స్పెన్స్ రేషియో.. తిరిగి గోల్డ్ మ్యూచువల్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో పేరిట రెండు సార్లు చార్జీ చెల్లించాల్సి వస్తుంది. వీటిల్లో పెట్టుబడులు విక్రయించినప్పుడు వచి్చన లాభాన్ని రిటర్నుల్లో చూపించి, తమ శ్లాబు రేటు ప్రకారం చెల్లించాలి. డిజిటల్ గోల్డ్ ఫోన్‌పే, పేటీఎం, పలు ఫిన్‌టెక్ సంస్థలు డిజిటల్ గోల్డ్ కొనుగోలుకు వీలు కలి్పస్తున్నాయి. రూపాయి నుంచి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు విక్రయించుకోవచ్చు. ఇన్వెస్టర్ కొనుగోలు చేసిన పరిమాణం మేర అసలైన బంగారం ఖజనాల్లో భద్రపరుస్తారు. కొంత మొత్తం సమకూరిన తర్వాత (కనీసం 10 గ్రాములు అంతకుమించి) భౌతిక రూపంలో తీసుకోవచ్చు. లేదా ఎంపిక చేసిన జ్యుయలరీ సంస్థల్లో ఆభరణాల కిందకు మార్చుకోవచ్చు. అవసరం ఏర్పడితే దీనిపై రుణం పొందొచ్చు. ఇందులో కాస్త చార్జీలు ఎక్కువ. ఒక ఇన్వెస్టర్ ఒక ప్లాట్ఫామ్లో గరిష్టంగా రూ.2లక్షలు మించి కొనుగోలు చేయలేరు. ఆర్బీఐ, సెబీ తదితర నియంత్రణ సంస్థల పర్యవేక్షణ వీటిపై ఉండదు. ఇందులో వచ్చే లాభాలు సైతం వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. ఎస్‌జీబీల్లో రాబడి ఇండియా బులియన్‌అండ్ జ్యుయలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) ప్రకటించే 999 స్వచ్ఛత బంగారం (గత మూడు పనిదినాల్లోని సగటు)ధరను ఆర్బీఐ పరిగణనలోకి తీసుకుంటుంది. ఐబీజేఏ ధర మార్కెట్ ఆధారితమే. మొదటి విడత జారీ చేసిన ఎస్జీబీ 2016– సిరీస్1 బాండ్ గడువు ఈ ఏడాది ఫిబ్రవరి 8న ముగసింది. నాడు ఒక గ్రాము బాండ్ రూ.2,600కు విక్రయించారు. గడువు ముగిసిన రోజు ఆర్బీఐ నిర్ణయించిన ధర రూ.6,271. ఇందులో ఇన్వెస్ట్ చేసి చివరి వరకు కొనసాగిన వారికి ఏటా 11% రాబడి వచి్చంది. 2.5% వడ్డీ రాబడిని కలిపి చూస్తే వార్షికంగా 11.63 శాతం చొప్పున నికర రాబడి వచ్చినట్టు. ఇది బంగారం గత 20 ఏళ్ల సగటు రాబడి కంటే ఎక్కువే ఉండడం గమనార్హం. తర్వాత వచ్చిన సిరీస్‌లపై రాబడులు మరింత అధికంగా ఉంటున్నాయి. ఇతర వివరాలు ఎస్‌జీబీలపై వడ్డీని ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇన్వెస్టర్ బ్యాంక్ ఖాతాకు జమ చేస్తారు. చివరి ఆరు నెలల వడ్డీ, మెచ్యూరిటీతో కలిపి ఇస్తారు. ఒక ఇన్వెస్టర్ కనిష్టంగా ఒక గ్రాము, గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 4 కిలోల వరకు కొనుగోలు చేసుకోవచ్చు. ఎస్జీబీలను ఎనిమిదేళ్ల పాటు గడువు పూర్తయ్యే వరకు కొనసాగించినప్పుడే లాభంపై ఎలాంటి పన్ను పడదు. ఒకవేళ ఈ మధ్యలోనే వైదొలిగితే లాభం వార్షిక ఆదాయానికి కలిపి చూపించి పన్ను చెల్లించాల్సి వస్తుంది. ఆన్లైన్లో కొనుగోలు చేసే వారికి ప్రతి గ్రాముపై రూ.50 తగ్గింపు లభిస్తుంది.కేటాయింపులు ఎంత మేర? ఒకరి మొత్తం పెట్టుబడుల్లో కనీసం 5% బంగారంపై ఇన్వెస్ట్ చేసుకోవాలన్నది నిపుణుల సూ చన. గరిష్టంగా 10 వరకు కేటాయించుకోవ చ్చు. మోస్త రు రాబడులు వచ్చినా ఫర్వాలేదు, రిస్క్ వద్దనుకునే ఇన్వెస్టర్లు తమ పోర్ట్‌ఫోలియోలో 15% వరకు కూడా బంగారంపై ఇన్వెస్ట్ చేసుకోవ చ్చు. కానీ, పెట్టుబడి కోసం భౌతిక బంగారం అంత మెరుగైన ఆప్షన్ కాబోదు. ఎందుకంటే అసలు బంగారం ధరకు తోడు, కొనుగోలు ధరపై 3% మేర జీఎస్టీని భరించాల్సి ఉంటుంది. అదే పెట్టుబడి కోసం అని చెప్పి ఆభరణాలు కొనుగోలు చేస్తే దా నిపై తయారీ చార్జీలు, తరుగు భరించాల్సి వ స్తుంది. ఇవన్నీ నికర రాబడులను ప్రభావితం చే స్తాయి. కనుక బంగారంపై పెట్టుబడి ఎప్పుడూ కూ డా డిజిటల్‌గానే ఉంచుకోవడం మంచి ఆప్షన్ అవుతుంది. దీనివల్ల భద్రతాపరమైన రిస్క్ కూడా ఉండదు. బంగారం బాండ్లు భౌతిక బంగారంపై పెట్టుబడుల ఒత్తిడిని తగ్గించేందుకు.. డిజిటల్ రూపంలో బంగారంపై పెట్టుబడులను, పారదర్శకతను ప్రోత్సహించేందుకు కేంద్రం తీసుకొచ్చిన సాధనమే సావరీన్ గోల్డ్ బాండ్స్ పథకం. ప్రతీ ఆర్థిక సంవత్సరంలోనూ ఒకటికి మించిన పర్యాయాలు ఎస్జీబీలను ప్రభుత్వం తరఫున ఆర్బీఐ విక్రయిస్తుంటుంది. ఒక గ్రాము డినామినేషన్ రూపంలో బాండ్లను కొనుగోలు చేసుకోవచ్చు. ఇష్యూ సమయంలో ఒక గ్రాము ధర ఎంతన్నది ఆర్బీఐ ప్రకటిస్తుంటుంది. బ్యాంక్‌లు, బ్రోకరేజీ సంస్థలు, ఎంపిక చేసిన పోస్టాఫీసులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ కొనుగోలుకు అవకాశం కలి్పస్తుంటాయి. ఈ బాండ్ కాల వ్యవధి ఎనిమిదేళ్లు. ఇందులో పెట్టుబడిపై ఏటా 2.5 శాతం చొప్పున ఎనిమిదేళ్లపాటు వడ్డీని ఆర్బీఐ ప్రతి ఆరు నెలలకు ఒకసారి చొప్పున చెల్లిస్తుంది. ఎనిమిదేళ్ల తర్వాత బంగారం మార్కెట్ ధర ప్రకారం ఇన్వెస్టర్‌కు ఆర్బీఐ చెల్లింపులు చేస్తుంది. లాభంపై పన్ను లేకపోవడం, ఏటా 2.5 శాతం రాబడి వల్ల అన్నింటిలోకి ఇది మెరుగైన సాధనం అని చెప్పుకోవాలి. ఇక ఎస్‌జీబీపై ఏటా వచ్చే 2.5 శాతం వడ్డీ రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. రిటర్నుల్లో ‘ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్’లో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఎనిమిదేళ్ల పాటు పెట్టుబడి కొనసాగించినట్టయితే.. వచ్చే మూలధన లాభంపై పన్ను ఉండదు. మధ్యలోనే వైదొలిగితే లాభం పన్ను పరిధిలోకి వస్తుంది. ‘‘ఏడాదిలోపే విక్రయించినప్పుడు వచి్చన లాభాన్ని వార్షిక ఆదాయానికి కలిపి రిటర్నుల్లో చూపించి, పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత విక్రయించేట్టు అయితే లాభంపై 10 శాతం పన్ను చెల్లించాలి. లాభం నుంచి ద్రవ్యోల్బణాన్ని తీసేసే ఇండెక్సేషన్ ఎంపిక చేసుకుంటే కనుక 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది’’అని ఆర్ఎస్ఎం ఇండియా వ్యవస్థాపకుడు సురేష్ సురానా తెలిపారు. ఈ బాండ్‌కు ప్రభుత్వ హామీ ఉంటుంది. రాబడులు బంగారంపై పెట్టుబడి దీర్ఘకాలంలో డెట్ కంటే మెరుగైన రాబడే ఇచి్చనట్టు చారిత్రక గణాంకాలు చెబుతున్నాయి. గడిచిన 20 ఏళ్లలో ఏటా 11 శాతం కాంపౌండెడ్ రాబడిని బంగారం ఇచి్చంది. ముందస్తు ఉపసంహరణ ఎలా? ఎస్జీబీ కాల వ్యవధి ఎనిమిదేళ్లు అయినప్పటికీ.. కోరుకుంటే ఆ లోపు కూడా విక్రయించుకోవచ్చు. కొనుగోలు చేసిన తేదీ నుంచి ఐదేళ్లు ముగిసిన తర్వాత ఆర్బీఐ ముందస్తు ఉపసంహరణకు వీలు కలి్పస్తోంది. ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఈ అవకాశం ఉంటుంది. బంగారం బాండ్‌పై ఆరు నెలలకు ఒకసారి ఆర్బీఐ వడ్డీ చెలిస్తుందని చెప్పుకున్నాం కదా. ఆ వడ్డీ చెల్లింపు తేదీ నుంచి 21 రోజుల ముందు వరకు ఇన్వెస్టర్ తన వద్దనున్న బాండ్‌ను ఆర్బీఐకి ఇచ్చేయాలి. దీనిపై ఎలాంటి చార్జీలు ఉండవు. ఇక ఇన్వెస్ట్ చేసిన తేదీ నుంచి ఐదేళ్లలోపే బాండ్‌ను విక్రయించుకోవాలంటే.. ఉన్న ఏకైక మార్గం స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ లేదా బీఎస్ఈ). కాకపోతే స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో కొనుగోలుదారులు పరిమితంగా ఉంటుంటారు. లిక్విడిటీ తక్కువగా ఉంటుంది. కొనుగోలుదారు అందుబాటులో ఉంటే విక్రయించుకోవచ్చు. కాకపోతే డిమాండ్ తక్కువ కనుక మార్కెట్ రేటు కంటే తక్కువకే ఇక్కడ విక్రయాలు నమోదవుతుంటాయి. బంగారం బాండ్ భౌతిక రూపంలో ఉంటే దాన్ని డీమెటీరియలైజ్ చేసుకున్న తర్వాతే విక్రయించుకోవడం సాధ్యపడుతుంది.
ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం - ఆనంద్ మహీంద్రా ట్వీట్
'నరేంద్ర మోదీ' భారత ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. దీనిని ఉద్దేశించి ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో అతి పెద్ద ఎన్నికలు జరగడం, ఎలాంటి ఆటంకాలు లేకుండా కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం గర్వించదగ్గ విషయం. తమ ముఖ్యమైన ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకున్నందుకు భారతీయ ఓటర్లకు అభినందనలు. మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నరేంద్ర మోదీ జీకి అభినందనలు. అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు.ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. వేల సంఖ్యలో లైక్స్ పొందిన ఈ ట్వీట్ మీద పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తూ.. దేశ ప్రధానికి శుభాకంక్షాలు చెబుతున్నారు.दुनिया के सबसे बड़े लोकतंत्र में इतिहास के सबसे बड़े चुनाव होना और बिना किसी बाधा के नए सरकार का गठन होना गर्व की बात है। भारतीय मतदाताओं को अपने महत्वपूर्ण लोकतांत्रिक अधिकार का प्रयोग करने के लिए बधाई।नरेंद्र मोदी जी को तीसरी बार प्रधानमंत्री बनने पर शुभकामनाएं। आशा है कि… pic.twitter.com/t6ylld6FNM— anand mahindra (@anandmahindra) June 9, 2024
విదేశాల్లో భారతీయ కార్లకు ఫుల్ డిమాండ్!.. గత నాలుగేళ్లలో..
భారతదేశంలో వాహన వినియోగం పెరగటమే కాకుండా.. ఎగుమతులు కూడా పెరిగాయి. గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో ఎగుమతులు ఏకంగా 2,68,000 యూనిట్లకు చేరుకున్నట్లు సమాచారం. ఈ సమయంలోనే మారుతి సుజుకి దాదాపు 70 శాతం షిప్మెంట్లను కలిగి ఉంది.2020-21 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల వాహనాల ఎగుమతులు 4,04,397 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సంఖ్య 2021-22 ఆర్థిక సంవత్సరంలో 577,875 యూనిట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 662,703 యూనిట్లగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో, ఎగుమతులు 672,105 యూనిట్లుగా ఉన్నాయి. ఇది 2020-21 కంటే 2,67,708 యూనిట్లు ఎక్కువ. ఎగుమతుల్లో మారుతి సుజుకి రికార్డ్ క్రియేట్ చేసింది.మారుతీ సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతి మాట్లాడుతూ.. కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తుల మీద పనిచేస్తుంది. అంతే కాకుండా టయోటాతో ఏర్పరచుకున్న భాగస్వామ్యం ప్రపంచ ఎగుమతుల్లో కీలక పాత్ర పోషించడంలో సహాయపడింది.కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా 100 కంటే ఎక్కువ దేశాలకు తమ కార్లను ఎగుమతి చేస్తోందని.. ప్రస్తుతం కంపెనీకి దక్షిణాఫ్రికా, సౌదీ అరేబియా, చిలీ, మెక్సికో, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా దేశాలు ప్రధాన మార్కెట్. భారత్ నుంచి బాలెనొ, డిజైర్, ఎస్-ప్రెస్సో, గ్రాండ్ విటారా, జిమ్నీ, సెలెరియో, ఎర్టిగా వంటి కార్లను మారుతి సుజుకి ఎగుమతి చేస్తోంది.
వీడియోలు
ఎన్నికల ఫలితాలపై జగ్గిరెడ్డి రియాక్షన్
నా విజయానికి కారణం జగనన్నే..
ఓటమిపై కాటసాని రాంభూపాల్ రెడ్డి సంచలన కామెంట్స్
భూపతిరాజు శ్రీనివాస వర్మకు కేంద్ర కేబినెట్ లో చోటు
గల్లీ నుంచి ఢిల్లీకి..
మోదీ కేబినెట్ లో తెలుగు మంత్రులు
బరితెగించి దాడులకు పాల్పడుతున్న టీడీపీ నాయకులు
వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన మోదీ
52 మందితో మోడీ క్యాబినెట్
వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
ఫ్యామిలీ
దృష్టిని బట్టి సృష్టి
ఉత్తర భారత దేశానికి చెందిన ఒక ప్రొఫెసర్ స్వామివారి దర్శనార్థం తిరుపతి వెళ్ళాడు. తనతో పాటు సహాయకుడిగా పరిశోధక విద్యార్థిని కూడా వెంట తీసుకు వచ్చాడు. తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి అలిపిరి గుండా తిరుమలకు కాలినడకన వెళ్ళాలనేది ప్రొఫెసర్ గారి ఆలోచన. అలిపిరికి వెళ్ళి ఎత్తైన శేషాచల శిఖరాన్ని చూశారు. సముద్రమట్టానికి 2800 అడుగుల ఎత్తులో ఉన్న ఏడుకొండల్ని చూసి భక్తి భావంతో దణ్ణం పెట్టుకున్నారు. పాదాల మండపం వద్ద శ్రీవారి లోహ పాదాలను నెత్తిన పెట్టుకుని ప్రదక్షిణ చేస్తూ ఉండగా పరిశోధక విద్యార్థి చిన్నగా ప్రొఫెసర్ని ఇలా అడిగాడు.‘‘దేవుడు నిజంగా ఉన్నాడంటారా?’’ అని. ప్రొఫెసర్ నవ్వి ‘‘దారిలో కనిపిస్తాడు పద!’’ అని చెప్పి కాలినడకకు పురమాయించాడు.అలిపిరినుంచి ఆనంద నిలయుని సన్నిధికి దారి తీసే ఆ పడికట్ల దోవలో ప్రకృతి అందాలను వీక్షిస్తూ నడక ప్రారంభించారు. తలయేరు గుండు, గాలి గోపురం, ఏడవ మైలు ప్రసన్నాంజనేయ స్వామి, అక్కగార్ల గుడి, అవ్వాచారి కోన... దాటి మోకాలి మెట్టు చేరారు. తిరుమల కొండ ‘ఆదిశేషుని అంశ’ అని భక్త జన విశ్వాసం. అందుకే చెప్పులు లేకుండా కొండ ఎక్కుతారు భక్తులు. ఈ కొండను పాదాలతో నడిచి అపవిత్రం చేయకూడదని శ్రీరామానుజులు, హథీరాంజీ బావాజీ మోకాళ్ళ మీద నడిచారని చెబుతారు. అప్పటినుంచి అది మోకాలి మెట్టు అయ్యిందని కూడా తెలుసుకున్నారు. అక్కడ మెట్లు నిలువుగా మోకాలి ఎత్తు ఉండటం వల్ల మోకాళ్ళు పట్టుకు΄ోసాగాయి పరిశోధక విద్యార్థికి. మోకాళ్ళ నొప్పులు ఎక్కువైన ఆ విద్యార్ధి గట్టిగా ‘‘దేవుడు కనిపిస్తున్నాడు!’’ అని చె΄్పాడు.చిన్న నవ్వు నవ్విన ప్రొఫెసర్, ‘‘అనుకున్నది అనుకున్నట్లు ఎవరికీ జరగదు. అలా జరిగితే ఎవ్వరూ చెప్పిన మాట వినరు. తలచినట్లే అన్నీ జరిగితే... మనిషి దేవుడి ఉనికినే ప్రశ్నిస్తాడు. కష్టాలు, కన్నీళ్లు లేకుంటే తనంత గొప్పవాడు లేడని విర్రవీగుతాడు. అహాన్ని తలకి ఎక్కించుకున్నవాడు తనే దేవుడని చెప్పి ఊరేగుతాడు. జీవితం కష్టసుఖాల మయం కాబట్టే, మనిషి ఆ అతీత శక్తిని ఆరాధిస్తున్నాడు! అందుకే అలిపిరి వద్ద నేల మీద నడిచేటప్పుడు నీకు దేవుడి ఉనికి ప్రశ్నార్థకమయ్యింది. మోకాలిమెట్టు దగ్గరికి వచ్చేసరికి దేవుడు ఉన్నాడని అనిపించింది’’ అని చెప్పి గబగబా మెట్లు ఎక్కసాగాడు.‘దృష్టిని బట్టి సృష్టి’ అని తెలుసుకున్న విద్యార్థి గోవింద నామస్మరణ చేస్తూ ప్రొఫెసర్ వెనుకనే నడవసాగాడు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు
పిచ్చుక మీదనా బ్రహ్మాస్త్రం?
‘‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం’’ అనే జాతీయం ఉంది. అతి తక్కువ బలం ఉన్నప్రాణి మీద అనవసరంగా అతి పెద్ద బలప్రయోగం చేయటం అనే అర్థంలో ఉపయోగిస్తారు. ఎంత చిన్నప్రాణి అయినా దాని అస్తిత్వం నిరుపయోగం కాదు. విశ్వంలో, ముఖ్యంగా భూగోళంలో, ప్రధానంగా అది ఉండే ప్రాంతంలో అది పోషించవలసిన పాత్ర ఒకటి ఉండనే ఉంటుంది. పర్యావరణ పరిరక్షణ, తద్వారా పర్యావరణ సమతౌల్యత ఉంటాయి. దానికి భంగం కలిగిస్తే పర్యవసానం అనుభవించ వలసి ఉంటుంది. ఒక పిచ్చుక సంవత్సరంలో 6.5 కిలోల బియ్యం తింటుంది అని చైనాలో ఒకప్పుడు చేపట్టిన సర్వే తెలిపింది. మొత్తం పిచ్చుకలు లేకుండా చేయగలిగితే 60 వేల మందికి ఆహారం లభిస్తుంది అని కూడా తెలిపింది. ఇంకేముంది? అసలే అధిక జనాభా సమస్య ఉన్న చైనా, వీలైనంత మందికి ఆహారం అందించటానికి ఇదొక మార్గం అనుకుని పిచ్చుకల నిర్మూలన కార్యక్రమాన్ని చేపట్టింది. 30 లక్షల పిచ్చుకలని చంపారు. 1958 – 61 సంవత్సరాల మధ్య చైనాలో తీవ్రమైన కరవు వచ్చింది. సుమారుగా నాలుగు కోట్ల యాభై వేల మంది చనిపోయారు. కారణం ఏమై ఉంటుంది అని విచారణ చేస్తే పిచ్చుకలు లేక పోవటం వల్ల అని తేలింది. అదెట్లా? పిచ్చుకలు ధాన్యం తినటంతోపాటు పంటలని నాశనం చేసే పురుగులని కూడా తింటాయి. చీడ పురుగులని తినే పిచ్చుకలు లేక పోవటంతో పంటలకి చీడ పట్టి, తెగులు సోకి ధాన్యం దిగుబడి గణనీయంగా తగ్గింది. అది రాను రాను పెరిగింది. ప్రజలు తిండి లేక చనిపోయారు. దీనికి పరిష్కారం పంటలని నాశనం చేసే తెగుళ్లు కలిగించే పురుగులని రసాయన పదార్థాలు వాడ నవసరం లేకుండా తినేసే పిచ్చుకలు ఉండేట్టు చేయటమే అని నిర్ధారించారు. చేసేది ఏమీ లేక పిచ్చుకలని దిగుమతి చేసుకోవాలనుకున్నారు. రష్యా నుండి పిచ్చుకలని దిగుమతి చేసుకున్నారు. పరిస్థితి అదుపు లోకి వచ్చింది. ఇటువంటి శాస్త్రీయమైన విషయాలని మన దేశంలో ఒక ఆనవాయితీగా, ఆచారంగా చేయటం అలవాటు. భారతదేశంలో, ముఖ్యంగా తెలుగువారు వరికంకులని కుచ్చుగా అల్లి ఇంటి ముందు వేలాడ దీసే వారు. పిచ్చుకలు వచ్చి ఒక్కొక్క వడ్లగింజని తీసుకు వెళ్లేవి. అది రైతు పురుగులని తిని చీడ పీడల నుండి పంటని రక్షించిన పిచ్చుక పట్ల చూపించే కతజ్ఞత. ఇంటి ముందు కొన్ని గింజలు చల్లటం అలవాటు. ఆ అవకాశం ఉన్నా, లేక పోయినా ప్రతి రోజు పక్షులకి, ప్రత్యేకంగా కాకికి తినబోయే ముందు ఒక ముద్ద పెట్టటం అలవాటు. కాకి పరిసరాల్లో ఉన్న చెత్తని, చిన్న చిన్న పురుగులని తిని శుభ్రం చేస్తుంది. దేవాలయాలలో కూడా బలిహరణం అన్న పేరుతో నాలుగు దిక్కుల అన్నం ఉంచటం సంప్రదాయం. ఇంటి చూరులో పిచ్చుక గూడు పెడితే పరమానందం. ఆ గూట్లో పెట్టిన గుడ్లను పిల్లి తినకుండా కాపలా కాయటం ఒక సరదా. అవి ఉండే ప్రదేశాలని మనం ఆక్రమించి, చెట్లని నరికి వాటికి ఆహారం లేకుండా చేసినందుకు ఈ మాత్రం చేయక పోతే కృతఘ్నులం అవుతాం. అలాగని పిల్లులని పూర్తిగా తరమం. పిల్లి తిరుగుతుంటే ఆ వాసనకి ఎలుకలు విజృంభించవు. సృష్టిలో ప్రయోజనం లేని జీవి ఒక్కటి కూడా లేదు. గుర్తించక పోవటం మన లోపం. జాగ్రత్తగా గమనిస్తే ఇతర జీవులని, ప్రకృతిని స్వార్థానికి వాడుకుని ఎవరికీ ఉపయోగ పడని ప్రాణి మానవుడొక్కడే నేమో అనిపిస్తుంది. కనీసం పిచ్చుక పాటి అయినా చేయవద్దా? – డా. ఎన్. అనంత లక్ష్మి
మూత పెట్టకుండా వండుతున్నారా? ఐసీఎంఆర్ స్ట్రాంగ్ వార్నింగ్
మంచి రుచికరంగా వంట చేయడం ఓ కళ. అయితే ఇప్పుడూ చాలా విభిన్నమైన కొత్త కొత్త రుచులు వచ్చేస్తునన్నాయి. అంతా వాటిని ట్రై చేస్తున్నారు కూడా. అయితే రుచికి మాత్రమే కాదు, వండే విధానానికి కూడా ప్రాధాన్యం ఇవ్వమని హెచ్చరిస్తోంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్). వండేటప్పుడూ మూత పెట్టకుండా వండితే ఇక అంతే సంగతులను గట్టి వార్నింగ్ కూడా ఇచ్చింది. దీని వల్ల ఎక్కవసేపు మంటమీద ఉడికించాల్సి రావడమే గాక ఆరోగ్యానికి హనికరమని చెబుతుంది. ఎలా వండితే మంచిదో కూడా వెల్లడించింది. అవేంటో సవివరంగా చూద్దామా..!ఓపెన్ మూత వర్సెస్ క్లోజ్డ్ వంట:మూత పెట్టి కూరలు వండితే సమయం ఆదా అవ్వడమే గాక పోషకాల నష్టం కూడా ఉండదని చెబుతోంది. అదే మూత లేకుండా వండితే..ఎక్కువసేపు పట్టడమేగాక ఆహార పదార్థాలు ఎక్కువ సేపు ఉష్ణోగ్రతలోనే ఉడకటంతో పోషకల నష్టం జరుగుతుందని హెచ్చరిస్తోంది. అలాగే మూత పెట్టి వండే వంటలో త్వరితగతిన వండేయగలం, మంచి పోషకవంతంగా ఉంటుందని చెబుతోంది. ముఖ్యంగా ఆకుపచ్చ కూరలను మూతపెట్టి వండితే కూర రంగు మారి, పోషకాల నష్టాన్ని తగ్గిస్తుందని వెల్లడించింది. ఆరోగ్యకరమైన వంట పద్ధతులు..పప్పు దినులు పోషక నాణ్యత ఉండాలంటే మూత పెట్టి ఉడకించడం లేదా ప్రెజర్ కుక్కర్లో వంట చేయడం ఉత్తమం అని చెబుతోంది. అంటే మూతపెట్టి ప్రెజర్లో తగు మోతాదులో ఉడకించడం వల్ల పోషకాల నష్టం జరగకుండా కాపాడటమే గాక తొందరగా ఉడికిపోతాయి. పైగా ఆయా ఆహారపదార్థాలు త్వరగా జీర్ణమవుతాయి. అదీగాక ఇలా వంట చేయడం వల్ల ఆయా పదార్థాల ఆకృతిమారి, రుచికరంగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి కూడా. దీని వల్ల హానికరమైన సూక్ష్మజీవులు ప్రమాదం కూడా ఉండదని, ఆహారం కలుషితం కాదని ఐసీఎంఆర్ పేర్కొంది. మైక్రోవేవ్‌లో వంట మంచిదేనా..ఇక్కడ మైక్రోవేవ్ కూడా త్వరితగతిన వండేస్తుందని ఐసీఎంఆర్ తెలిపింది. ఎక్కువసేపు మంట మీద ఉడకించే పద్ధతులతో పోలిస్తే పోషకాలు విచ్ఛిన్నం కాకుండా తక్కవ టైంలోనే త్వరితగతిన వండేసే పద్ధతులు బెటర్ అని చెప్పకనే చెప్పింది. మైక్రోవేవ్‌లో తక్కువ టైంలోనే ఆహార పదార్థాలు ఉడికిపోతాయి కాబట్టి విటమిన్లు, ఇతర పోషకాలు నష్టపోకుండా చేయడంలో సహాయ పడుతుందని ఐసీఎంఆర్ మార్గదర్శకాల్లో పేర్కొంది.(చదవండి: రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్‌గా..! ఇంటర్ ఫెయిల్ అవ్వడమే..!)
రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్‌గా..!
ఓ సాధారణ రైతు కూతురు డిప్యూటీ కలెక్టర్ అయ్యి తన సొంత రాష్ట్రంలోనే విధులు నిర్వర్తిస్తుంటే ఆ ఆనందం మాటలకందనిది. చిన్నప్పుడూ అందరిలా సాధారణంగా చదివే అమ్మాయి అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందింది. ఇంటర్ ఫెయిల్ అవ్వడంతోనే ఆమె లైఫ్ టర్న్ తిరిగింది. ఆ ఓటమి ఆమెలో కసిని పెంచి ఈ స్థాయికి చేరుకునేలా చేసింది. ఆమె విజయగాథ ఏంటంటే..ఆమె పేరు ప్రియాల్ యాదవ్. ఇండోర్‌కి చెందిన వ్యవసాయం కుటుంబ నేపథ్యం. తండ్రి రైతు, తల్లి గృహిణి. ఆమె చిన్నప్పుడూ అందిదిలా సాధారణ విద్యార్థే. బాగా చదివే విద్యార్థి మాత్రం కాదు. ఏదో పరీక్షల ముందు చదివి పాసైపోయామా.. అన్నట్లుగానే చదివేది. అయితే ఇంటర్మీడియెట్‌లో దారుణంగా ఫెయిల్ అయిపోవడం ఆమెను బాగా డిప్రెషన్‌కు గురి చేసింది. అదే ఆమెను బాగా కష్టపడి చదివేలా చేసింది. ఆ వైఫల్యం ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్లీ పునరావృతం కాకూడదని గట్టిగా నియించుకుంది. గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చినా.. ప్రియాల్ తన తోటి వాళ్లందరూ డిగ్రీ వరకు చదవుకుని పెళ్లిళ్లు చేసేసుకుని వెళ్లిపోయినా..తాను మాత్రం బాగా చదివి ఆఫీసర్ స్థాయిలో ఉండే ఉద్యోగ్నాన్ని పొందాలని ప్రగాఢంగా కోరుకుంది.అందుకే మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ (ఎంపీపీఎస్సీ) పరీక్షలో ఒకటి, రెండుసార్లు కాదు ఏకంగా మూడుసార్లు పాసయ్యింది. 2019లో తొలిసారిగా మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్(ఎంపీపీఎస్సీ) రాసినప్పుడూ..జిల్లా రిజిస్ట్రార్‌గా ఉద్యోగం సంపాదించింది. ఆ తర్వాత 2020లో రెండో ప్రయత్నంలో 34వ ర్యాంక్‌ను సాధించి సహకార శాఖలో అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగానికి ఎంపికైంది. ఇక చివరి ప్రయత్నంలో తన ర్యాంకు మరింత మెరుగుపడింది. ఏకంగా ఆరో ర్యాంకు సాధించి.. తన సొంత రాష్ట్రానికే డిప్యూటి కలెక్టర్ నియమితురాలయ్యింది. తనను ఆ ఓటమి నీడలా వెంటాడి భయపెట్టిందని, అది మళ్లీ జీవితంలో అస్సలు రాకూడదన్న కసి ఈ స్థాయికి వచ్చేలా చేసిందని చెప్పుకొచ్చింది ప్రియాల్. అక్కడితో ఆమె విజయం ఆగిపోలేదు..ఐఏఎస్ కావలన్నది ఆమె తదుపరి లక్ష్యం. ప్రియాల్ యాదవ్ ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) పరీక్షలలో విజయం సాధించి ఐఏఎస్ అధికారి కావాలనే లక్ష్యంపై దృష్టిసారించింది. తాను డిప్యూటీ కలెక్టర్ పనిచేస్తూనే ఐఏఎస్ పరీక్షలకు సిద్ధమవుతానని అంటోంది ప్రియాల్. ప్రస్తుతం ఆమె ఇండోర్ జిల్లా రిజిస్ట్రార్‌గా విధులు నిర్వర్తిస్తుంది. విజయానికి ముగింపు లేదు అనడానికి ప్రియాల్ ఒక ఉదాహరణ కదూ. ఓటమితో కుంగిపోకుండా..దాన్నే తన కెరీర్‌ని మంచిగా నిర్మించుకోవడానికి పునిదిగా చేసుకుని సక్సెస్‌కి మారుపేరుగా నిలిచింది. అందరి చేత శెభాష్ ప్రియాల్ అని అనిపించుకుంది. (చదవండి: ప్రపంచంలో ఎన్ని రకాల బంగాళా దుంపలు ఉన్నాయో తెలుసా..!)
న్యూస్ పాడ్‌కాస్ట్
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం... 72 మందితో కొలువుదీరిన నూతన మంత్రివర్గం, ఆంధ్రప్రదేశ్‌కు 3, తెలంగాణకు 2 పదవులు.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రధానమంత్రిగా నేడే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం.. మంత్రివర్గం కూర్పుపై కొనసాగుతున్న కసరత్తుతి.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రధానమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ... నేడు ఎన్డీఏ ఎంపీల సమావేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవ ఎన్నిక.. శనివారం లేదా ఆదివారం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
లోక్‌సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించిన ఎన్డీయే.. బీజేపీకి కూటమికి 292 స్థానాలు, ఇండియా కూటమికి 234 స్థానాలు.. 240 సీట్లకే పరిమితమైన బీజేపీ, మెజారిటీ కంటే 32 స్థానాలు తక్కువ.. 99కి పెరిగిన కాంగ్రెస్ బలం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా ఈరోజే వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి, రీప్లేస్మెంట్ మనమే.. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్, 350 నుంచి 400 స్థానాలు ఖాయం, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ, ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం... ఎగ్జిట్ పోల్స్ అంచనా.. ఇంకా ఇతర అప్డేట్స్
సార్వత్రిక ఎన్నికల్లో నేడే ఆఖరి విడత పోలింగ్.. చండీగఢ్ సహా ఏడు రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాల్లో జరుగనున్న పోలింగ్.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
వేల్పూరు ఎస్సీ కాలనీవాసులపై టీడీపీ కార్యకర్తల దాడి
వినుకొండ (నూజెండ్ల): మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు స్వగ్రామమైన శావల్యాపురం మండలం వేల్పూరులోని ఎస్సీ కాలనీ వాసులపై ఆదివారం టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. వైఎస్సార్సీపీకి ఓటు వేశారనే అక్కసుతో 50 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు దాడిచేసి నలుగురిని గాయపరిచారు. ఎన్నికల అనంతరం బూత్‌ల వారీగా ఓట్లు లెక్కేసుకున్న టీడీపీ నాయకులు ఎస్సీ కాలనీలో వైఎస్సార్సీపీకి ఎక్కువ ఓట్లు పడ్డాయని ఆ కాలనీ వాసులతో గొడవకు దిగారు. అదేమని ప్రశ్నించిన బీర్నీడి దినేష్ కుమార్, తిరుపతి, రోశయ్య, నాగమ్మపై దాడిచేసి కొట్టి గాయపరిచారు. గాయపడిన వారిని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతున్నారు. వినుకొండ రూరల్ సీఐ సుధాకర్, టౌన్ సీఐ సాంబశివరావు గ్రామానికి వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ముందస్తు జాగ్రత్తగా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.పెరికీడులో వైఎస్సార్సీపీ నేత ఇంటిపై రాళ్ల దాడి» రాళ్లదాడితో కిటికీ అద్దాలు ధ్వంసం»ఘటనపై హనుమాన్‌జంక్షన్ » పోలీసులకు బాధితుల ఫిర్యాదుహనుమాన్జంక్షన్ రూరల్ (గన్నవరం): కృష్ణాజిల్లా బాపులపాడు మండలం పెరికీడులో వైఎస్సార్సీపీకి చెందిన వైస్ ఎంపీపీ పండు రాణి, మాజీ ఉప సర్పంచ్ పండు నాగార్జున దంపతుల నివాసంపై ఆదివారం రాత్రి టీడీపీ కార్యకర్తలు దాడిచేసి బీభత్సం సృష్టించారు. ఇంటిపైకి రాళ్లు విసురుతూ దుర్భాషలాడారు. మద్యంతాగి బైక్‌లపై వచ్చిన టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణసంచా పేలుస్తూ భయానక వాతావరణం సృష్టించారు. బైక్‌లపై చక్కర్లు కొడుతూ ఇంట్లో ఉన్న పండు రాణి, వారి కుమార్తెను తీవ్ర భయాందోళనలకు గురిచేశారు. టీడీపీ కార్యకర్తల రాళ్లదాడితో కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. దాడి జరిగిన సమయంలో గ్రామాంతరం వెళ్లిన పండు నాగార్జున ఈ ఘటనపై హనుమాన్‌జంక్షన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో టీడీపీ కార్యకర్తలు వెళ్లిపోయారు. ఎస్ఐ–2 పి.ఆర్జమ్మ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని ఎస్ఐ తెలిపారు. వణుకూరులో టీడీపీ, జనసేన దాడి, బెదిరింపు పెనమలూరు: కృష్ణాజిల్లా పెనమలూరు మండలం వణుకూరులో వైఎస్సార్సీపీ అభిమానులపై టీడీపీ, జనసేన నేతలు దాడులు చేశారు. ఆలస్యంగా అందిన సమాచారం ప్రకారం.. వణుకూరులో తాపీమే్రస్తిగా పనిచేస్తూ మసీదు సమీపంలో నివాసం ఉంటున్న మైనార్టీ వ్యక్తి ఇంటిపై రెండురోజుల కిందట టీడీపీ నేతలు రాళ్లువేశారు. ఇంట్లో ఉన్న వారిని అంతుచూస్తామంటూ బెదిరించారు. ఇంటి బయట ఉన్న కారు అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే అంతుచూస్తామని హెచ్చరించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. వణుకూరు గ్రామంలో ఉంటున్న వైద్యుడి ఇంటికి జనసేన నేతలు వెళ్లి బెదిరించారు. మహిళలను అసభ్య పదజాలంతో దూషించారు. టీడీపీ, జనసేన నేతల వైఖరి పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై దాడిచిత్తూరు జిల్లా చిన్నరెడ్డిపల్లిలో ఎనిమిది మందికి గాయాలు యాదమరి (పూతలపట్టు): చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలంలోని చిన్నరెడ్డిపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై టీడీపీ కార్యకర్తలు ఆదివారం దాడికి పాల్పడ్డారు. చిన్నరెడ్డిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ సానుభూతిపరుడైన ఓ యువకుడు పనికి వెళుతుండగా అడ్డగించి టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. ఆ యువకుడి కుటుంబ సభ్యులు, బంధువులు కలిసి టీడీపీ కార్యకర్తలను ప్రశ్నించడంతో మరింత రెచ్చిపోయి కర్రలతో వారిని కూడా చితకబాదారు. ఈ ఘటనలో ఎనిమిదిమంది గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు యాదమరి పోలీసులు గ్రామానికి వచ్చి పరిశీలించారు. గాయపడిన యువకుడిని, అతని కుటుంబ సభ్యులను టీడీపీ కార్యకర్తలు కొన్నిరోజులుగా ఫోన్ చేసి బెదిరిస్తున్నట్లు తెలిసింది. కాగా, మంగళవారం ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామంలో దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు. మద్యం తాగి వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఇళ్లపై రాళ్లు విసరడం, ఇళ్లలోని వస్తువులు, బైక్‌లను ధ్వంసం చేయడం వంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారు. తమకు రక్షణ కల్పించాలని వైఎస్సార్సీపీ సానుభూతిపరులు కోరుతున్నారు.వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడికదిరి అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం కౌలేపల్లిలో ఆదివారం టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్సీపీ నాయకుడు హిదయతుల్లాపై దాడిచేసి గాయపరిచారు. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. హిదయతుల్లా ప్రెసిడెంట్‌గా ఉన్న కౌలేపల్లి దేవరచెరువు సొసైటీలో 40 మంది సభ్యులున్నారు. వీరంతా చెరువులో చేపలు వదిలి జీవనం సాగిస్తున్నారు. ఎన్నికల్లో టీడీపీ గెలవగానే గ్రామానికి చెందిన ఆ పార్టీ కార్యకర్తలు చంద్ర, అతడి అనుచరులు సాంబశివ, మధు, చిరంజీవి, నారాయణస్వామి తదితరులు చెరువులో వలలు తీసేయాలని హిదయతుల్లాను రెండు రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం చెరువు వద్దనున్న హిదయతుల్లా వద్దకు వీరంతా వెళ్లి టీడీపీ అధికారంలోకి వచ్చినందున చెరువు తమకే సొంతమని, ఇక్కడ మీరెవరూ చేపలు పట్టరాదని హెచ్చరించారు. పరుష పదజాలంతో దూషిస్తూ హిదయతుల్లాపై దాడిచేసి గాయపరిచారు. బాధితుడిని కుటుంబ సభ్యులు కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
‘పోలీస్’ హ్యాకర్..20 ఏళ్ల విద్యార్థి
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ పోలీస్‌యాప్‌లు హాక్ఐ, టీఎస్‌కాప్‌లను హ్యాక్ చేసిన నిందితుడిని ఢిల్లీలో శనివారం అరెస్టు చేశారు. నిందితుడు యూపీలోని ఝాన్సీకి చెందిన విద్యార్థి జతిన్‌కుమార్(20) అని డీజీపీ రవిగుప్తా ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. పోలీస్ యాప్‌ల హ్యాకింగ్‌తో ఏ వినియోగదారుడికి సంబంధించిన సున్నితమైన, ఆర్థిక పరమైన సమాచారం లీక్ కాలేదని డీజీపీ స్పష్టం చేశారు. నిందితుడిని ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలించినట్టు తెలిపారు. హాక్ఐ యాప్ హ్యాక్ అయినట్టు గుర్తించిన వెంటనే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రంగంలోకి దిగిందన్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశామని పేర్కొన్నారు. హ్యాకర్ పోలీస్ యాప్‌లలోని సమాచారాన్ని పబ్లిక్ ప్లాట్‌పారంలలో అమ్మకానికి పెట్టినట్టు ఉంచిన పోస్టులను ఆధారంగా చేసుకొని దర్యాప్తులో ముందుకు వెళ్లారని, పక్కా సమాచారంతో టీజీసీఎస్బీ అధికారులు ఢిల్లీకి వెళ్లి, అక్కడ హ్యాకర్ జతిన్‌కుమార్‌ను గుర్తించి అరెస్టు చేశారని డీజీపీ తెలిపారు. నిందితుడికి సైబర్ నేరచరిత్ర ఉందని, గతంలో ఇలాంటి హ్యాకింగ్ కేసులో ప్రమేయం ఉందన్నారు.న్యూఢిల్లీలోని స్పెషల్ సెల్ ద్వారక పోలీస్సే్టషన్‌లో క్రైం. నంబర్ 291/2023లో ఇంతకముందు అక్కడి పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. నిందితుడు ఆధార్ కార్డులకు సంబంధించిన డేటా, ఇతర ఏజెన్సీలకు సంబంధించిన క్లిష్టమైన సమాచారాన్ని కూడా లీక్ చేశారని డీజీపీ వెల్లడించారు. తెలంగాణ పోలీస్‌యాప్‌ల డేటా చోరీ కేసులో ప్రమేయమున్న అదనపు నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోందని డీజీపీ తెలిపారు. అత్యాధునిక టెక్నాలజీతో గుర్తింపు హ్యాకింగ్ సమాచారం అందిన వెంటనే టీజీసీఎస్బీ అధికారులు రంగంలోకి దిగారని, అధునాతన సాధనాలను ఉపయోగించి, హ్యాకర్ జాడను విజయవంతంగా తెలుసుకోగలిగారని డీజీపీ రవిగుప్తా తెలిపారు. హ్యాకర్ పోలీస్ యాప్‌ల నుంచి చోరీ చేసిన వివరాలను databreachforum.st లో పోస్ట్ చేశాడని, చోరీ చేసిన డేటాను ు150 డాలర్లకు అమ్మకానికి పెట్టాడని పేర్కొన్నారు. ఆసక్తిగల కొనుగోలుదారులు హాక్ ఐ ,టీఎస్‌కాప్ డేటాను కొనేందుకు తనను సంప్రదించవచ్చని టెలిగ్రామ్ ఐడీలు Adm1nfr1end , Adm1nfr1 ends ఇచ్చాడని తెలిపారు. సోషల్ ఇంజినీరింగ్ పద్ధతులను ఉపయోగించి నిందితుడి వివరాలు తెలుసుకున్నామన్నారు. పౌరుల సమాచారం సురక్షితం హాక్ఐ, టీఎస్‌కాప్ యాప్‌లు హ్యాకింగ్ గురైనా పౌరులందరి సమాచారం సురక్షితంగానే ఉందని, ఎలాంటి ఆందోళన వద్దని డీజీపీ రవిగుప్తా స్పష్టం చేశారు. డేటా లీక్ అయినట్టు మీడియాలో వచ్చిన వార్తలు వాస్తవం కాదని పేర్కొన్నారు. హాక్ఐ యాప్‌లో డేటా రిపోజిటరీలో భాగంగా మొబైల్ నంబర్లు, చిరునామాలు, ఈమెయిల్ ఐడీల వంటి వినియోగదారు సమాచారాన్ని మాత్రమే కలిగి ఉంటుందని డీజీపీ తెలిపారు. అయితే బలహీనమైన పాస్‌వర్డ్‌ల కారణంగా హ్యాకర్ హాక్ఐ డేటాలోకి యాక్సెస్ పొంది ఉండొచ్చని అనుమానిస్తున్నట్టు తెలిపారు.టీఎస్‌కాప్ యాప్ అనేది పూర్తిగా పోలీస్ విధుల్లో అంతర్గత పనుల కోసం వాడతామని తెలిపారు. ఇందులో సందర్శకులు, హోటళ్ల డేటా సేకరిస్తారన్నది అవాస్తవం అని డీజీపీ తెలిపారు. టీస్‌కాప్ ద్వారా థర్డ్‌పారీ్టలకు డేటా వెళ్లే ఆస్కారమే లేదన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ ఎస్ఎంస్ సర్వర్ యూఆర్ఎల్ విషయంలో, చొరబాటుదారుడి క్లెయిమ్‌లు పూర్తిగా అబద్ధమని, ఈ యూఆర్ఎల్ ఏప్రిల్ 2022 నుంచి పనిచేయలేదని స్పష్టం చేశారు. హ్యాక్ అయినట్టు చెబుతున్న యూఆర్ఎల్ను హైదరాబాద్ సిటీ పోలీసులు చాలా కాలం ముందు నిలిపివేశారని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా చర్యలు అన్ని పోలీసు అంతర్గత, బాహ్య నెట్‌వర్క్‌లు, వెబ్, మొబైల్ అప్లికేషన్లు, క్లౌడ్ , ఎండ్ పాయింట్లలో ఏవైనా సైబర్ సెక్యూరిటీ లోపాలు ఉంటే గుర్తించి పరిష్కరిస్తామని డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లకు తావులేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ విషయంలో ఎవరైనా తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే వారిపై పోలీస్‌శాఖ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని డీజీపీ హెచ్చరించారు. పోలీస్‌యాప్‌ల హ్యాకింగ్ కేసును టీజీసీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ పర్యవేక్షణలో రికార్డు సమయంలోనే అధికారులు ఛేదించారన్నారు. కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన ఎస్పీలు భాస్కరన్, విశ్వజిత్ కంపాటి, డీఎస్పీలు, కేవీఎం ప్రసాద్, ఏ.సంపత్, ఇన్స్పెక్టర్ ఆశిషిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ సురే‹Ùలను డీజీపీ రవిగుప్తా ప్రత్యేకంగా అభినందించారు.
15 నెలల చిన్నారిపై వీధి కుక్కల దాడి
దుండిగల్: వీధి కుక్కల దాడిలో 15 నెలల చిన్నారి గాయపడింది. దుండిగల్ మున్సిపాలిటీ డిపోచంపల్లి పరిధిలోని సత్యసాయి కాలనీలో మింటూసింగ్ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతడి కుమార్తె ఆరుషి (15 నెలలు) శనివారం ఇంటి ముందు ఆడుకుంటోంది. ఈ క్రమంలో వీధి కుక్కలు ఒక్కసారిగా చిన్నారిపై దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారి తల, చేతికి గాయాలయ్యాయి. సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రిలో బాలిక చికిత్స పొందుతోంది. మరో ఘటనలో 14 ఏళ్ల బాలుడిపై.. నిజాంపేట్: నిజాంపేట్‌లో 14 ఏళ్ల సాయిచరణ్ అనే బాలుడు నడుచుకుంటూ వెళ్తుండగా వీధి కుక్కల వెంటపడ్డాయి. వాటి బారి నుండి తప్పించుకునేందుకు యతి్నంచినా వెంబడించి గాయపరిచాయి. బాలుడి చేతులు, కాళ్లు, ఇతర శరీర భాగాల్లో కరిచాయి. దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు.
కలిసి బతకలేమని కడతేరిపోయారు!
జీడిమెట్ల, జగద్గిరిగుట్ట: వారిద్దరూ ప్రేమించుకున్నారు.. జీవితాంతం కలిసి ఉండాలని బాసచేసి పెళ్లి చేసుకున్నారు.. వీరి కాపురం కొన్నాళ్లు సాఫీగానే సాగింది. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఏం జరిగిందో ఏమో భార్య హెచ్‌ఏఎల్‌లోని తల్లి గారింట్లో, భర్త చింతల్ హెచ్ఎంటీలో ఒకేరోజు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల, జగద్గిరిగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీకి చెందిన కృష్ణమూర్తి చిన్న కుమారుడు మంచూరి రెశ్వంత్ (26), గాజులరామారం హెచ్ఏఎల్ కాలనీకి చెందిన సాయిశ్రేయ (22)ను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. అనంతరం గాజులరామారం ద్వారకా నగర్లో కాపురం పెట్టారు. రెశ్వంత్ బిగ్‌బాస్కెట్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. కొన్నాళ్లు దంపతులిద్దరూ బాగానే ఉన్నారు. ఇటీవల ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. శనివారం రెశ్వంత్ హెచ్ఎంటీ నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకు చున్నీతో ఉరి వేసుకుని మృతిచెందాడు. సాయిశ్రేయ హెచ్ఏఎల్ కాలనీలోని తల్లిగారింట్లో ఉరి వేసుకుని మృతిచెందింది. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.