
అనిరుధ్ రవిచందర్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయం అక్కర్లేదేమో!

ఎందుకంటే ప్రస్తుతం మన దేశంలో టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఇతడు!

సినిమా చేస్తున్నాడంటే చాలు మూవీపై ఆటోమేటిక్‌గా పెరిగే అంచనాలు.

అంతెందుకు రీసెంట్గా 'దేవర' మూవీకి అనిరుధ్ మ్యూజిక్కే ఓ రకంగా ప్లస్

ఆ అనిరుధ్ పుట్టినరోజు నేడు (అక్టోబర్ 16). ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు

మద్రాసు(చెన్నై) పుట్టి పెరిగిన అనిరుధ్.. టీనేజీలోనే స్టార్ అయిపోయాడు

ఇతడి తాత 1930ల్లో సినిమా దర్శకుడిగా పలు సినిమాలు తీశారు

తండ్రి రవి రాఘవేంద్ర యాక్టర్, తల్లి లక్ష్మీ క్లాసికల్ డ్యాన్సర్

సూపర్‌స్టార్ రజినీకాంత్.. అనిరుధ్‌కి వరసకి మామయ్య అవుతాడు

రజినీకాంత్ భార్య లత.. అనిరుధ్ కుటుంబానికి రిలేషన్ ఉంది

2012లో '3' మూవీతో మ్యూజిక్ కంపోజర్‌గా కెరీర్ మొదలుపెట్టాడు

అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన 'వై దిస్ కొలవెరి' పాట సృష్టికర్త ఇతడే

అక్కడి నుంచి అనిరుధ్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిరాలేదు

చిన్న పెద్దా అనే తేడా లేదు. సినిమాకు మ్యూజిక్ ఇచ్చాడంటే ప్రాణం పెట్టేస్తాడు

సినిమా హిట్టా ఫ్లాఫా సంగతి పక్కనబెడితే అనిరుధ్ మ్యూజిక్ టాప్ క్లాస్ ఉంటుంది

కాపీ అనే ట్రోల్స్ వస్తాయి గానీ ఒక్కసారి వింటే అనిరుధ్ మ్యూజిక్‌కి అడిక్ట్ అయిపోతారు

ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటాడని టాక్ ఉంది

తెలుగు ప్రేక్షకులు 'బక్కోడు' అని పిలుచుకునే అనిరుధ్ విశేషాలు ఇవి











