మున్సిపల్‌ ఎన్నికల విచారణ రేపటికి వాయిదా | Telangana High Court will Issue Verdict on Municipal Elections | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఎన్నికల విచారణ రేపటికి వాయిదా

Aug 13 2019 4:15 PM | Updated on Aug 13 2019 4:18 PM

Telangana High Court will Issue Verdict on Municipal Elections - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపల్ ఎన్నికలపై దాఖలైన అన్ని పిటిషన్లపై రేపు వాదనలు వింటామని హైకోర్టు తెలిపింది. ఈ రోజు విచారణ జరిపించాలన్నతెలంగాణ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇప్పటికే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేసిన ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కోర్టు పరిధిలో ఉన్న మున్సిపాలిటీ సమస్యలు కూడా పరిష్కరించామని చెప్పింది. అలాగే కోర్టు ఆదేశాలు ఇస్తే అన్ని మున్సిపాలిటీలకు ఒకేసారి ఎన్నికల నిర్వహిస్తామని ఎన్నికల సంఘం వివరించింది. ప్రభుత్వ వాదనను పరిగణలోకి తీసుకోని హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement