హైదరాబాద్‌లో మరో 9 స్వైన్‌ఫ్లూ కేసులు | Another 9 flu cases in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో మరో 9 స్వైన్‌ఫ్లూ కేసులు

Jan 13 2015 2:56 AM | Updated on Apr 3 2019 4:24 PM

నగరంలో సోమవారం మరో తొమ్మిది స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఏడేళ్లలోపు బాలురు ముగ్గురున్నారు.

సాక్షి, హైదరాబాద్: నగరంలో సోమవారం మరో తొమ్మిది స్వైన్‌ఫ్లూ కేసులు నమోదయ్యాయి. బాధితుల్లో ఏడేళ్లలోపు బాలురు ముగ్గురున్నారు. వీరిలో ఇద్దరు బంజారాహిల్స్ రెయిన్‌బో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా, మరొకరు ఆదిత్య ఆస్పత్రిలో చేరారు. నాంపల్లి కేర్ ఆస్పత్రిలో ఇద్దరు, ఉడ్‌లాండ్ ఆస్పత్రి, కాంటినెంటల్, గాంధీ, సికింద్రాబాద్ యశోద ఆస్పత్రుల్లో ఒకరు చొప్పున చికిత్స పొందుతున్నారు. వీరికి రక్త పరీక్షలు నిర్వహించగా స్వైన్‌ఫ్లూ పాజిటివ్ అని తేలింది.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement