చందమామ అందివచ్చిన రోజు

 51 Years Completed To Landed On The Moon By Neil Armstrong Team By Apollo 11 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గగనాంతర రోదసిలో గంధర్వలోక గతులు దాటేందుకు మనిషి వేసిన తొలి అడుగుకు నేటితో అక్షరాలా 51 ఏళ్లు!. అపోలో –11 మిషన్‌తో జాబిల్లిపై మనిషి తొలిసారి పాదం మోపింది 1969 జూలై 20న.. అంటే రేపటి రోజున!. ఆ తరువాతా బోలెడన్ని అంతరిక్ష ప్రయోగాలు జరిగాయి కానీ.. ఇంకో గ్రహంపై అడుగు వేసిన ఘట నలు మాత్రం లేవు. జాబిల్లిపై అప్పటి ఆసక్తి ఎందుకు? ఇప్పుడేం జరుగుతోంది! రేపు ఏం జరగబోతోంది అనేది పరిశీలిస్తే..

హ్యాపీమూన్‌  జర్నీ
జాన్‌ ఎఫ్‌ కెన్నడీ పేరు మనం వినే ఉంటాం. అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన ఈ పెద్దమనిషి 1962లో హ్యూస్టన్‌లోని రైస్‌ స్టేడియంలో చేసిన ఓ ప్రసంగం అంతరిక్ష ప్రయోగాలను మేలిమలుపు తిప్పింది. ‘‘జాబిల్లిపైకి వెళ్లేందుకు నిశ్చయించాం’’ అని ఆ ప్రసంగంలో కెన్నడీ ప్రకటించారు. పదేళ్లలోపే ఈ ఘనతను సాధిస్తామన్న కెన్నడీ సంకల్పం మూడేళ్లకే నెరవేరింది కూడా. 1969 జూలై 16న నింగికెగసిన అపోలో–11 నాలుగు రోజుల తరువాత అంటే జూలై 20న జాబిల్లిని చేరడం.. నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ జాబిల్లిపై తొలిసారి అడుగు మోపడం అన్నీ ఇప్పుడు చరిత్ర. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. అపోలో–11 తరువాత కూడా మొత్తం 6 ప్రయోగాలు జరగ్గా ఇందులో ఐదు జాబిల్లిపై ల్యాండ్‌ అయ్యాయి. బోలెడంత మంది వ్యోమగాములు జాబిల్లి వరకూ వెళ్లారు. కొందరు అంతరిక్ష నౌకల నుంచి చందమామను వీక్షించడానికి పరిమితమైతే.. మరికొందరు నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ మాదిరిగా అక్కడి నేలపై అడుగుపెట్టారు.

కచ్చితంగా చెప్పుకోవాలంటే ఇప్పటివరకు మొత్తం 24 మంది వ్యోమగాములు జాబిల్లి పరిసరాల్లోకి వెళ్లగలిగారు. ఇందులో 12 మంది మాత్రమే జాబిల్లిపై అడుగుపెట్టారు. మిగిలిన 12 మంది కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి వీక్షించేందుకే పరిమితమయ్యారు. 1972 డిసెంబర్‌లో ప్రయోగించిన అపోలో–17.. ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్‌ ఆల్డ్రిన్, మైకేల్‌ కోలిన్స్‌తో కూడిన అపోలో –11 రికార్డులను బద్దలుకొట్టింది. వ్యోమగాములు అతి ఎక్కువ సమయం జాబిల్లిపై గడిపిన, ఎక్కువ మొత్తంలో నమూనాలు సేకరించిన ప్రాజెక్టు కూడా అపోలో –17నే. ఈ ప్రయోగం తరువాత మళ్లీ మనిషి జాబిల్లిపై అడుగిడలేదు. అపోలో –11 బడ్జెట్‌ 2,000 కోట్ల డాలర్ల వరకు ఉండగా ఇప్పటికీ అంతరిక్ష ప్రయోగాల ఖర్చులు అంతే స్థాయిలో ఉండటం దీనికి కారణం.

చెరిగిపోని ఆ ‘గురుతులు’ నిజమే!
అమెరికా అపోలో– 11 ప్రయోగం నిజమా? కాదా? అనే దానిపైనా బో లెడన్ని కథనాలు ప్రచారం లో ఉన్నాయి. 4 అంశాలను పరిశీలిస్తే మానవుడు పలుమార్లు అక్కడ అడుగుపెట్టాడనేది స్పష్టమవుతుందని నిపుణులు అంటున్నారు. మొద టిది మనిషి అడుగుల గురుతులు. భూమ్మీద ఇసుకపై అడుగుపెడితే ఆ గుర్తు కొంతకాలానికి చెరిగిపోతుంది. ఇక్కడ ‘వాతావరణం’ ఉంటుంది. నీళ్లు, గాలి కూడా ఇక్కడ మాత్ర మే ఉంటాయి. వీటన్నింటి కారణంగా అడుగుల గురుతులు కొంతకాలానికి చెరిగిపోతాయి.

జాబిల్లిపై ఇవేవీ ఉండవు కాబట్టి అక్కడ ఎప్పుడో 51 ఏళ్ల క్రితం నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ వేసిన అడుగు గుర్తు ఇప్పటికీ, ఎప్పటికీ  అలాగే చెక్కు చెదరకుండా ఉంటాయి. రెండో ది.. 12 అపోలో ప్రయోగాల ద్వారా నాసా తీసిన 8 వేల ఫొటోలు. వీటిని నాసా అందరికీ అందుబాటులో ఉంచింది. మూడవది.. అపోలో ప్రాజెక్టుతోపాటు ఇతర దేశాల అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా జాబిల్లిపై వదిలేసిన పలు శోధక నౌక లు, శాస్త్ర పరికరాలు. అపోలో –11, 12, 14, 15, 16ల ద్వారా జాబిల్లిపైకి చేర్చిన సెసిమోమీటర్స్‌ 1977 వరకు భూమికి అక్కడి ప్రకంపనల సమాచారాన్ని ప్రసారం చేశా యి. భూమి నుంచి జాబిల్లికి ఉన్న దూరాన్ని సెంటీమీటర్ల స్థాయి కచ్చితత్వంతో లెక్కిం చేందుకివి దోహదపడుతున్నాయి. చివరివి.. జాబిల్లిపై నుంచి తెచ్చుకున్న మట్టి, రాతి నమూనాలు. వీటన్నిటినీ పరిశీలించడం ద్వా రా శాస్త్రవేత్తలు జాబిల్లికి సంబంధించిన పలు అంశాలను అర్థం చేసుకోవడానికి, మరిన్ని పరిశోధనలకు వీలవుతోంది. 

ఇకపై మనిషి స్థానంలో రోబోలు?
మనిషి జాబిల్లిపై చివరిసారి అడుగుపెట్టి 48 ఏళ్లవుతోంది. ఇక, భవిష్యత్తులో మానవ ప్రయోగాలతోపాటు అంతరి క్షాన్ని శోధించడం మొదలు విలువైన వనరులను మైనింగ్‌ చేయడం వరకు అన్నింటికీ టెక్నాలజీ సాయం తీ సుకోవాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్ర పంచవ్యాప్తంగా 70 వరకు ప్రభుత్వ, ప్రైవేట్‌ కంపెనీలు అంతరిక్ష ప్రయోగాలు చేస్తుండ గా.. వీటిలో 13 సంస్థలకు అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించే సామర్థ్యం ఉంది. స్పేస్‌ ఎక్స్‌ బ్లూఆరిజన్, వర్జిన్‌ గలాక్టిక్‌ వంటి ప్రైవే ట్‌ సంస్థలు అంతరిక్ష ప్రయోగాలకు తోడు అంతరిక్ష పర్యాటకానికీ ప్రయత్నాలు చేస్తున్నాయి. 2030 నాటికల్లా అంతరిక్షానికి సంబంధించిన మార్కెట్‌ విలువ 30 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా.

రానున్న యాభై ఏళ్ల లో సౌర కుటుంబాన్ని మాత్రమే కాకుండా దానికి ఆవల ఉన్న అంతరిక్షాన్ని కూడా అర్థం చేసుకో వాలని ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఇతర గ్రహాలు, తోకచుక్కల్లోని విలువైన వనరులను తవ్వి భూమ్మీదకు తెచ్చేందుకు పలు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఎలన్‌ మస్క్‌ వంటి వాళ్లు ఇంకో అడుగు ముందుకేసి అంగారకుడిపై మానవులతో కూడిన కాలనీని కట్టేస్తానని చెబుతున్నారు. నాసా 2024 నాటికి మరోసారి మనిషిని జాబిల్లిపైకి పంపడం మాత్రమే కాకుండా.. 2028 నాటికి అక్కడ శాశ్వత స్థావరం ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. చైనా 2030 నాటికల్లా జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి వ్యోమగాములను దింపాలని ప్రయత్నిస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top