రిక్షాలో ఉన్నదెవరో చెప్పుకోండి? | Rickshaw Puller Wraps Dog in Blanket, Gives it a Ride | Sakshi
Sakshi News home page

ఇదో మంచి ఫొటో..

Jan 2 2020 2:36 PM | Updated on Jan 3 2020 9:38 AM

Rickshaw Puller Wraps Dog in Blanket, Gives it a Ride - Sakshi

ఈరోజు ఇంటర్నెట్‌లో తాను చూసిన మంచి ఫొటో ఇదని ఇంకొరు ప్రశంసించారు. 

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ చలికి వణుకుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న చలితో హస్తిన వాసులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. చలి పులి మనుషులనే కాదు మూగ ప్రాణలను వణికిస్తోంది. వాటి బాధను అర్థం చేసుకున్న మంచి మనిషి ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. హయత్‌ అనే ట్విటర్‌ యూజర్‌ షేర్‌ చేసిన ఈ ఫొటో హృదయాలను కదిలిస్తోంది. రిక్షా నడిపే వ్యక్తి కుక్కను దుప్పటి చుట్టి తన రిక్షాలో కూర్చోబెట్టి తీసుకున్నపోతున్న దృశ్యం ఫొటోలో ఉంది. 

ఈ ఫొటోకు దాదాపు 4 వేల లైకులు వచ్చాయి. రిక్షా పుల్లర్‌ను ప్రశంసిస్తూ చాలా మంది ట్విటర్‌లో కామెంట్లు పెడుతున్నారు. వారిద్దరూ పరస్పర విశ్వాసం, నిజాయితీ, గౌరవం కలిగివున్నారడానికి ఈ ఫొటో అద్దం పడుతోందని ఒకరు పేర్కొన్నారు. భావోద్వేగ, స్ఫూర్తిదాయక చిత్రం అంటూ మరొకరు మెచ్చుకున్నారు. మౌలానా ఆజాద్‌ రోడ్‌లోని హోలీ ఆస్పత్రి సమీపంలోని ప్రతిరోజు రిక్షా పుల్లర్‌ కుక్కను ఇలాగే తన రిక్షాలో తీసుకెళతాడని, ఈ దృశ్యాన్ని చాలాసార్లు చూశానని అభిషేక్‌ షా అనే వ్యక్తి వెల్లడించారు. ఈరోజు ఇంటర్నెట్‌లో తాను చూసిన మంచి ఫొటో ఇదని ఇంకొందరు ప్రశంసించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement