గంభీర్ ఫైర్ అయ్యాడు | Zaira Wasim row reeks of ‘sexual bias’, Gautam Gambhir’s Dangal with critics | Sakshi
Sakshi News home page

గంభీర్ ఫైర్ అయ్యాడు

Jan 17 2017 3:13 PM | Updated on Sep 5 2017 1:26 AM

గంభీర్ ఫైర్ అయ్యాడు

గంభీర్ ఫైర్ అయ్యాడు

‘దంగల్’ నటి జైరా వసీంకు టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ బాసటగా నిలిచాడు.

న్యూఢిల్లీ: ‘దంగల్’ నటి జైరా వసీంకు టీమిండియా క్రికెటర్ గౌతమ్ గంభీర్ బాసటగా నిలిచాడు. ఆమె చేసిన తప్పేంటని నిలదీశాడు. జైరాతో బలవంతంగా క్షమాపణ చెప్పించడం అవమానకరమని పేర్కొన్నాడు. ఈ వ్యవహారమంతా లింగ వివక్షతో కూడుకున్నట్టు కనబడుతోందని మండిపడ్డాడు.

‘దంగల్ సినిమాలో నటించడం లేదా కశ్మీర్ సీఎం ముఫ్తీని కలవడం ఇస్లాంకు విరుద్ధమని చెప్పడం దారుణమైన అణచివేత. ఆమెతో బలవంతంగా క్షమాపణ చెప్పించడం అవమానకరం. ఈ వ్యవహారంలో లింగ వివక్ష స్పష్టంగా కనబడుతోంది. జైరాను అడిగినట్టే ఆమిర్‌ ఖాన్, సల్మాన్‌ ఖాన్, షారూఖ్ ఖాన్ లను ప్రశ్నించగలరా?   అభద్రతా భావంతోనే జైరా వసీం లాంటి బాలికపై విమర్శలు చేస్తున్నార’ని గంభీర్‌ ట్వీట్‌ చేశాడు. జైరా వసీంకు రెజ్లర్స్ గీతా పొగట్, బబితా పొగట్ కూడా అండగా నిలిచారు. తామంతా ఆమె వెంటే ఉంటామని భరోసాయిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement