హరికృష్ణకు రెండో విజయం 

Second victory for Harikrishna - Sakshi

న్యూఢిల్లీ: షెన్‌జెన్‌ మాస్టర్స్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ రెండో విజయం సాధించాడు. చైనాలో జరుగుతున్న ఈ టోర్నీలో శనివారం లిరెన్‌ డింగ్‌ (చైనా)తో జరిగిన నాలుగో రౌండ్‌ గేమ్‌లో హరికృష్ణ 79 ఎత్తుల్లో గెలుపొందాడు.

ఆరుగురు గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. నాలుగో రౌండ్‌ తర్వాత హరికృష్ణ 2.5 పాయింట్లతో అనీశ్‌ గిరి (నెదర్లాండ్స్‌)తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top