సింధు విన్‌.. సైనా అవుట్‌ | Saina Nehwal loses, PV Sindhu advances in China Open Badminton | Sakshi
Sakshi News home page

సింధు విన్‌.. సైనా అవుట్‌

Nov 16 2016 1:37 PM | Updated on Sep 4 2017 8:15 PM

సింధు విన్‌.. సైనా అవుట్‌

సింధు విన్‌.. సైనా అవుట్‌

చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ లో భారత కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి.

ఫుజూ (చైనా): చైనా ఓపెన్‌ సూపర్‌ సిరీస్‌ ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ లో భారత కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. సైనా నెహ్వాల్‌ ఓడిపోగా, పీవీ సింధు శుభారంభం చేసింది. తొలి మ్యాచ్ లో పోర్న్‌టిప్‌ బురానాప్రాసెర్ట్‌సుక్‌ (థాయ్‌లాండ్‌)తో తలపడిన సైనా 16-21, 21-19, 14-21తో పరాజయం పాలైంది. మొదటి గేమ్‌ లో వెనుబడిన సైనా రెండో గేమ్‌ లో పుంజుకుంది. నిర్ణయాత్మక మూడో గేమ్‌ లో తడబడడంతో ఆమె పోరాటం ముగిసింది. దాదాపు గంటసేపు మ్యాచ్‌ జరిగింది. మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకొని కోలుకున్నాక సైనా ఆడిన తొలి టోర్నీ ఇదే.

మరో మ్యాచ్‌ లో చైనీస్‌ తైపీ క్రీడాకారిణి చియా సిన్‌ లీపై పీవీ సింధు విజయం సాధించింది. వరుస గేముల్లో సిన్‌ లీని 21-12, 21-16తో ఓడించి రెండో రౌండ్‌ లోకి దూసుకెళ్లింది. 34 నిమిషాల్లోనే మ్యాచ్‌ ముగించింది.

పురుషుల సింగిల్స్‌లో అజయ్‌ జయరాం, హెచ్‌ఎస్‌ ప్రణయ్ శుభారంభం చేశారు. జు సియాఉన్‌ (చైనా)పై జయరాం 21-19, 20-22, 21-17తో విజయం సాధించాడు. ఎన్జీ కా లాంగ్‌ అంగుస్‌ (హాంకాంగ్‌)తో తలపడిన ప్రణయ్‌ 21-13, 21-13తో గెలిచి రెండో రౌండ్‌ లోకి దూసుకెళ్లాడు.

Advertisement
 
Advertisement
Advertisement