రోహిత్‌.. అది క్రికెట్‌ బాల్‌.. ఫుట్‌బాల్‌ కాదు! | Rohit Sharma Stops Ball With Leg to Not Get Stumped and Becomes Latest Meme online | Sakshi
Sakshi News home page

రోహిత్‌.. అది క్రికెట్‌ బాల్‌.. ఫుట్‌బాల్‌ కాదు!

Apr 14 2019 3:40 PM | Updated on Apr 14 2019 3:40 PM

Rohit Sharma Stops Ball With Leg to Not Get Stumped and Becomes Latest Meme online - Sakshi

మీ నాన్న ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ చేద్దామనుకున్నాడు.. మీ అమ్మ క్రికెటర్‌ చేద్దామనుకుంది. కానీ నీకేమో ..

ముంబై : ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌శర్మపై నెటిజన్లు కుళ్లు జోకులు పేల్చుతున్నారు. రాజస్తాన్‌ రాయల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ బ్యాటింగ్‌ చేస్తూ చేసిన ఓ సర్కస్‌ ఫీట్‌పై అభిమానులు ఫన్నీ మీమ్స్‌ ట్రెండ్‌ చేస్తున్నారు. ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోవడాని ఈ ముంబై కెప్టెన్‌ విన్నూత్న పద్ధతిని అవలంభించాడు. కృష్ణప్ప గౌతమ్‌ వేసిన 10వ ఓవర్‌ ఐదో బంతిని కాలితో అడ్డుకున్నాడు. ఆ బంతిని ముందుకొచ్చి(ఫ్రంట్‌ ఫుట్‌) ఆడటానికి రోహిత్‌ సిద్ధం కాగా, దాన్ని గమనించిన గౌతమ్‌ తెలివిగా లెగ్‌ సైడ్‌ వేశాడు.

అయితే రోహిత్‌ ఇక్కడ చాకచక్యంగా వ్యవహరిస్తూ.. బంతిని వికెట్‌ కీపర్‌ చేతుల్లోకి వెళ్లకుండా ప్యాడ్లతోనే బయటకు తన్నేశాడు. దీంతో రోహిత్‌ స్టంపింగ్‌ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే ఈ సరదా ఘటనతో మైదానంలో నవ్వులు పూసాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అభిమానులు ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు. ‘రోహిత్‌ బాగుందయ్యా.. అది పుట్‌ బాల్‌ అనుకుంటున్నావా?’ అని ఒకరు.. మరొకరేమో.. ‘ మీ నాన్న ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ చేద్దామనుకున్నాడు.. మీ అమ్మ క్రికెటర్‌ చేద్దామనుకుంది. కానీ నీకేమో డ్యాన్సర్‌ కావాలని ఉంది’ అంటూ సరదాగా ట్రోల్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement