న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ 50 ఓవర్లలో...
హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో శ్రీలంక 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ 50 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటయింది. మెకల్లమ్ (99 బంతుల్లో 117; 12 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ చేశాడు. శ్రీలంక జట్టు 47.4 ఓవర్లలో 4 వికెట్లకు 252 పరుగులు చేసి గెలిచింది. దిల్షాన్ (127 బంతుల్లో 116; 17 ఫోర్లు) సెంచరీ చేశాడు. 7వన్డేల సిరీ స్‌లో ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్నాయి.