మను భాకర్, అనీశ్‌లకు స్వర్ణాలు | Manu Bhaker And Anish Bhanwala Win Gold Medals In Senior And Junior Air Pistol Events | Sakshi
Sakshi News home page

మను భాకర్, అనీశ్‌లకు స్వర్ణాలు

Dec 25 2019 1:27 AM | Updated on Dec 25 2019 1:27 AM

Manu Bhaker And Anish Bhanwala Win Gold Medals In Senior And  Junior Air Pistol Events - Sakshi

భోపాల్‌: యువ షూటర్‌ మను భాకర్‌ జాతీయ చాంపియన్ షిప్ లో మెరిసింది. సీనియర్, జూనియర్‌ రెండు విభాగాల్లోనూ కలిపి ఆమె మొత్తం నాలుగు స్వర్ణాలు గెలుచుకోవడం విశేషం. ఈ క్రీడల్లో ఆమె హరియాణాకు ప్రాతినిధ్యం వహించింది.  మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ సీనియర్‌ ఈవెంట్‌లో 17 ఏళ్ల మను 243 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. దివ్యాంశి ధామా (237.8), యశస్విని సింగ్‌ (217.7) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు. పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌లో హరియాణాకే చెందిన అనీశ్‌ భన్వాలా స్వర్ణం గెలుచుకున్నాడు. అనీశ్‌ 28 పాయింట్లు స్కోరు చేయగా... భవేశ్‌ షెఖావత్‌ (26), విజయవీర్‌ సిద్ధూ (22) తర్వాతి స్థానాల్లో నిలిచారు.   

Advertisement
 
Advertisement
Advertisement