అర్జున్‌కు ఐదు... హర్షకు ఆరు... | Kolkata Open International Chess Tournament | Sakshi
Sakshi News home page

అర్జున్‌కు ఐదు... హర్షకు ఆరు...

May 23 2018 1:42 AM | Updated on May 23 2018 1:42 AM

Kolkata Open International Chess Tournament - Sakshi

అర్జున్‌,హర్ష

కోల్‌కతా: కోల్‌కతా ఓపెన్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడాకారులు ఎరిగైసి అర్జున్‌ ఐదో స్థానంలో, హర్ష భరతకోటి ఆరో స్థానంలో నిలిచారు. ఈ ప్రదర్శనతో అర్జున్‌ ఖాతాలో తొలి జీఎం నార్త్‌ చేరింది. నిర్ణీత 9 రౌండ్‌లు ముగిశాక అర్జున్, హర్ష మరో ఇద్దరితో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచారు.

అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ద్వారా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... అర్జున్‌కు ఐదో ర్యాంక్‌... హర్షకు ఆరో ర్యాంక్‌ లభించాయి. మంగళవారం జరిగిన చివరి రౌండ్‌లో హర్ష 52 ఎత్తుల్లో గ్రాండ్‌మాస్టర్‌ సందీపన్‌ చందాను ఓడించగా... ఇంగ్లండ్‌ గ్రాండ్‌మాస్టర్‌ నైజెల్‌ షార్ట్‌తో జరిగిన గేమ్‌ను అర్జున్‌ 39 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.  

Advertisement
 
Advertisement
Advertisement