విరాట్‌ కోహ్లి ‘స్పెషల్‌’ పోస్ట్‌ | Kohli Reflects On 11 Year International Cricket Journey | Sakshi
Sakshi News home page

విరాట్‌ కోహ్లి ‘స్పెషల్‌’ పోస్ట్‌

Aug 19 2019 12:21 PM | Updated on Aug 19 2019 12:35 PM

Kohli Reflects On 11 Year International Cricket Journey - Sakshi

కూలిడ్జ్‌: ప్రపంచ క్రికెట్‌లో పరుగుల మోత మోగిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి  తన 11 ఏళ్ల క్రికెట్‌ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆగస్టు 18, 2008లో శ్రీలంకతో దంబుల్లాలో జరిగిన వన్డే మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కోహ్లి.. ఇప్పటివరకూ మూడు ఫార్మాట్లలో కలిపి 20, 502 పరుగులు చేశాడు. ఇందులో 68 సెంచరీలు, 95 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో రికార్డులను కోహ్లి తిరగరాశాడు. మొత్తం 239 వన్డేలాడిన అతడు 77 టెస్టులు, 70 అంతర్జాతీ టీ20లు పూర్తి చేసుకున్నాడు. భారత్‌ తరఫున వన్డేల్లో అత్యధిక పరుగుల క్రికెటర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న మాజీ కెప్టెన్‌ సౌరబ్‌ గంగూలీ(11,363)ని ఇటీవలే కోహ్లి(11,520) వెనక్కి నెట్టాడు.  విండీస్‌పై వరుసగా రెండు సెంచరీలు సాధించి రెండో స్థానానికి ఎగబాకాడు. తొలిస్థానంలో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌(18,426) కొనసాగుతున్నాడు.( ఇక్కడ చదవండి: భారత క్రికెట్‌ జట్టుకు ఉగ్ర బెదిరింపు?)

అయితే తన 11 ఏళ్ల కెరీర్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న కోహ్లి తన ట్వీటర్‌ అకౌంట్‌ ఒక స్పెషల్‌ పోస్ట్‌ పెట్టాడు. ‘  పదకొండు ఏళ్ల క్రితం టీనేజర్‌గా క్రికెటర్‌ ఆరంభించాను. ఈ సుదీర్ఘ నా క్రికెట్‌ జర్నీ నన్ను మరింత ప్రతిబింబించేలా చేసింది. దేవుడు నాకు ఇంతటి ఆశీర్వాదం ఇస్తాడని ఎప్పుడూ కలగనలేదు. మీ కలల్ని సాకారం చేసుకోవడానికి సరైన మార్గాన్ని ఎంచుకోవాలని, అందుకు తగిన శక్తి సామర్థ్యాలను సొంతం చేసుకోవాలి’ అని కోహ్లి పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement