
న్యూఢిల్లీ: కీరోన్ పొలార్డ్-హార్దిక్ పాండ్యా.. ఇద్దరూ స్టార్ క్రికెటర్లే. ఒకరు విండీస్‌కు ప‍్రాతినిథ్య వహిస్తుంటే మరొకరు భారత్‌కు ఆడుతున్న క్రికెటర్. వీరిద్దరూ కలిసి ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్‌కు ఆడిన క్రికెటర్లు. ఈ క‍్రమంలోనే వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌లో భాగంగా గతంలో విండీస్ పర్యటనకు వెళ్లినప్పుడు తనను పొలార్డ్ అరెస్ట్ చేయించబోయాడని హార్దిక్ పాండ్యా తాజాగా వెల్లడించాడు. అది కూడా విండీస్‌లో స్వేచ్ఛంగా విహరిస్తున్న సమయంలో ఒక పోలీస్ ఆఫీసర్ చేత తనను అరెస్ట్ చేయించే యత‍్నం చేశాడన్నాడు.
'పొలార్డ్‌తో కలిసి వెళుతున్నా. సడన్‌గా ఒక పోలీస్ ఆఫీసర్ నిన్ను అరెస్ట్ చేస్తున్నామన్నాడు. దాంతో కాసేపు షాకయ్యా. కాకపోతే ఏమి కాదనే ధైర్యంతో కామ్‌గా ఉన్నా. నేను ఏమీ తప్పుచేయలేనప్పుడు అరెస్ట్ చేయడమే ఆలోచనలో పడ్డా. భారత జట్టు యాజమాన్యానికి ఫోన్ చెద్దామని అనుకున్నా. అప్పుడు పొలార్డ్ కూడా అలాగే చూస్తుండిపోయాడు. అదే క్రమంలో ఏమిటి సైలెంట్‌గా ఉన్నావ్ అంటూ పొలార్డ్ నుంచి ఒక ప్రశ్న ఎదురైంది. నీ సిటీలో నీ పక్కన ఉన్నప్పుడు ఏమి జరగదనే నమ్మకం నాకుందన్నా. కాకపోతే ఆ ఇద్దరూ కలిసి నన్ను భయపెట్టే యత్నం చేస్తున్నారని తరువాత కానీ అర్థం కాలేదు' హార్దిక్ గత జ్ఙాపకాల్ని గుర్తుచేసుకున్నాడు.