ట్రంప్‌ను కలిసిన గావస్కర్‌ | Gavaskar Meets Donald Trump In New York | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ను కలిసిన గావస్కర్‌

Aug 23 2019 4:44 PM | Updated on Aug 23 2019 4:51 PM

Gavaskar Meets Donald Trump In New York - Sakshi

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను క్రికెట్‌ దిగ్గజ ఆటగాడు సునీల్‌ గావస్కర్‌ కలిశారు. ఓ చారిటీ ఫౌండేషన్‌ నిధుల సేకరణలో భాగంగా ట్రంప్‌తో గావస్కర్‌ సమావేశమయ్యారు. పుట్టుకతోనే గుండె సంబంధిత వ్యాధి బారిన పడ్డ చిన్నారులకు ఉచిత ఆపరేషన్లు ఏర్పాటు చేసేందుకు నిధులు సేకరణలో భాగంగా న్యూయార్క్‌లో ట్రంప్‌ను గావస్కర్‌ కలిశారు. ఈ మేరకు చారిటీ చేసే సేవలను ట్రంప్‌కు తెలిపారు.

ప్రస్తుతం వెస్టిండీస్‌-భారత జట్ల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో కామెంటేటర్‌గా వ్యవరిస్తున్న గావస్కర్‌.. తనకు దొరికిన ఖాళీ సమయాన్ని నిధుల సేకరించేందుకు వినియోగిస్తు‍న్నారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు ఉచిత ఆపరేషన్స్‌ చేసేందుకు గాను నేవీ ముంబైలోని ఖర్గర్‌లో శ్రీ సాయి సంజీవని ఆస్పత్రితో ఒప్పందం చేసుకున్నారు. ఇప్పటివరకూ న్యూజెర్సీ, అట్లాంటాలతో పాటు పలుచోట్ల గావస్కర్‌ సేకరించిన నిధులతో 230మందికి పైగా పిల్లలకు శస్త్ర చికిత్స చేసే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement