హంపిపై హారిక గెలుపు | Fide Women's Grand Prix chess tournament | Sakshi
Sakshi News home page

హంపిపై హారిక గెలుపు

Jul 10 2016 3:34 AM | Updated on Sep 4 2017 4:29 AM

‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్ ఏడో రౌండ్‌లో హారిక 74 ఎత్తుల్లో హంపిపై విజయం సాధించింది...

చెంగ్డూ (చైనా): ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్ ఏడో రౌండ్‌లో హారిక 74 ఎత్తుల్లో హంపిపై విజయం సాధించింది.  హంపిపై హారికకిదే తొలి విజయం కావడం విశేషం. తాజా గెలుపుతో హారిక ఈ టోర్నీలో 5 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ టోర్నీలో తొలి పరాజయం చవిచూసిన హంపి 4.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. హరికృష్ణ గేమ్ ‘డ్రా’: చైనాలోనే జరుగుతున్న డాన్‌జూ సూపర్ గ్రాండ్‌మాస్టర్స్ టోర్నీలో హరికృష్ణ తొలి ‘డ్రా’ నమోదు చేశాడు. వాసిలీ ఇవాన్‌చుక్ (ఉ క్రెయిన్)తో శనివారం జరిగిన రెండో రౌండ్ గేమ్‌ను హరికృష్ణ 93 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.

Advertisement
 
Advertisement
Advertisement